కార్ల దిగ్గజం టాటా మోటార్స్ మరోసారి కస్టమర్లకు షాకిచ్చింది. ఇప్పటికే పలుమార్లు తన వాహనాల ధరలను పెంచిన సంస్థ తాజాగా మరోసారి ధరల పెంపును ప్రకటించింది. అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టుసోమవారం ప్రకటించింది. అన్ని మోడల్స్, వేరియంట్లపై సగటు 0.6శాతం ధరల భారం ఉంటుందని టాటా మోటార్స్ వెల్లడించింది. దీంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
అన్ని కార్లు, ఎస్‌యూవీల జూలై 17 నుంచి వాహనాల ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది. ధరల భారం లేకుండా ఉండాలంటే ఈ తేదీలోపు కొనుగోలు చేయవచ్చు. అలాగే జులై 16 లోపు చేసుకునే బుకింగ్స్‌పై, 2023 జులై 31 వరకు అయ్యే డెలివరీలపై ధరల పెంపు భారం ఉండదన కూడా కంపనీ స్పష్టం చేసింది. టాటా నెక్సాన్, టాటా పంచ్, టాటా హారియర్, టాటా సఫారీ, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడల్స్ పాపులర్ మోడల్స్‌గా ఉన్నాయి. నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ అమ్మకాలతో ఈవీ సెగ్మెంట్‌లో టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
కాగా 2022-23 క్యూ1లో టాటా మోటార్స్ 2,31,248 యూనిట్లతో పోలిస్తే 2023-24 క్యూ1లో 2,26,245 వాహన విక్రయాలను నమోదు చేసింది. జూన్ 2023 నెల దేశీయ అమ్మకాల పరంగా, టాటా మోటార్స్ 80,383 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది జూన్ అమ్మకాల కంటే 79,606 వద్ద స్వల్పంగా ఎక్కువ. దేశీయ విపణిలో (EVలతో సహా) PVల పరంగా మొత్తం విక్రయాల పరంగా, జూన్ 2022లో 45,197 యూనిట్లతో పోలిస్తే జూన్ 2023లో టాటా మోటార్స్ 47,235 యూనిట్లను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment