input
-
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్
కార్ల దిగ్గజం టాటా మోటార్స్ మరోసారి కస్టమర్లకు షాకిచ్చింది. ఇప్పటికే పలుమార్లు తన వాహనాల ధరలను పెంచిన సంస్థ తాజాగా మరోసారి ధరల పెంపును ప్రకటించింది. అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టుసోమవారం ప్రకటించింది. అన్ని మోడల్స్, వేరియంట్లపై సగటు 0.6శాతం ధరల భారం ఉంటుందని టాటా మోటార్స్ వెల్లడించింది. దీంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇన్పుట్ ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అన్ని కార్లు, ఎస్‌యూవీల జూలై 17 నుంచి వాహనాల ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది. ధరల భారం లేకుండా ఉండాలంటే ఈ తేదీలోపు కొనుగోలు చేయవచ్చు. అలాగే జులై 16 లోపు చేసుకునే బుకింగ్స్‌పై, 2023 జులై 31 వరకు అయ్యే డెలివరీలపై ధరల పెంపు భారం ఉండదన కూడా కంపనీ స్పష్టం చేసింది. టాటా నెక్సాన్, టాటా పంచ్, టాటా హారియర్, టాటా సఫారీ, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడల్స్ పాపులర్ మోడల్స్‌గా ఉన్నాయి. నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ అమ్మకాలతో ఈవీ సెగ్మెంట్లో టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా 2022-23 క్యూ1లో టాటా మోటార్స్ 2,31,248 యూనిట్లతో పోలిస్తే 2023-24 క్యూ1లో 2,26,245 వాహన విక్రయాలను నమోదు చేసింది. జూన్ 2023 నెల దేశీయ అమ్మకాల పరంగా, టాటా మోటార్స్ 80,383 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది జూన్ అమ్మకాల కంటే 79,606 వద్ద స్వల్పంగా ఎక్కువ. దేశీయ విపణిలో (EVలతో సహా) PVల పరంగా మొత్తం విక్రయాల పరంగా, జూన్ 2022లో 45,197 యూనిట్లతో పోలిస్తే జూన్ 2023లో టాటా మోటార్స్ 47,235 యూనిట్లను విక్రయించింది. -
ఇక స్టీల్ ధరలు పైపైకే!
న్యూఢిల్లీ: ఉక్కు ధరలు పెరగనున్నాయి. తయారీ వ్యయం అధికం అయినందున స్టీల్ ధరలు జూలై నుండి పెరుగుతాయని భావిస్తున్నట్టు జిందాల్ స్టీల్, పవర్ ఎండీ వి.ఆర్.శర్మ తెలిపారు. ‘బొగ్గు ధర టన్నుకు రూ.17,000 ఉంది. ఒడిషాలో అతిపెద్ద సరఫరాదారుగా ఉన్న ఒడిషా మినరల్ కార్పొరేషన్ విక్రయిస్తున్న ఇనుము ధాతువు ధర ఇంకా అధికంగా ఉంది. ఇప్పటికే ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంకా తగ్గించే అవకాశం లేదు. జూలై నుంచి ప్రాథమిక కంపెనీల స్టీల్ ధరలు పైపైకి వెళ్లనున్నాయి. ద్వితీయ శ్రేణి కంపెనీలు ఇప్పటికే టన్నుకు రూ.2 వేలు పెంచడం ద్వారా ధర రూ.55 వేలకు చేరింది. ఇతర సమస్యలూ పరిశ్రమకు భారంగా ఉన్నాయి. బొగ్గు కొరత ఉంది. బొగ్గు సరఫరాకై రేక్స్ అందుబాటులో లేవు’ అని వివరించారు. -
కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చిన టాటా మోటార్స్..!
ముంబై: ప్యాసింజర్ వాహన కొనుగోలుదారులకు టాటా మోటార్స్ మరోసారి షాక్ ఇచ్చింది. వచ్చేవారం నుంచి టాటా మోటార్స్‌కు చెందిన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని కంపెనీ చూస్తోంది. స్టీల్, ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగడంతో సేకరణ వ్యయాన్ని భారీగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ మార్కెట్లో టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి వంటి ప్యాసింజర్ వాహనాలను టాటా మోటర్స్ విక్రయిస్తుంది. టాటా మోటార్స్ ప్రెసిడెంట్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ...గత ఏడాది నుంచి స్టీల్, విలువైన లోహల ధరల్లో గణనీయమైన పెరుగుదలను చూశామన్నారు. గత ఏడాది కాలంలో కంపెనీ ఆదాయాలలో 8-8.5 శాతం వరకు వస్తుధరలు భారీగా పెరిగాయని తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని కంపెనీ ఎదుర్కోన్నట్లు పేర్కొన్నారు. కంపెనీ దృష్టిలో కేవలం 2.5 శాతం మాత్రమే ఇన్పుట్ ఖర్చులను పెంచగా, షోరూమ్ కోణంలో ఇది దాదాపు 3 శాతంగా ఉండనుందని పేర్కొన్నారు. కస్టమర్లకు పెద్ద మొత్తంలో ధరల పెంపును నివారించాలనుకుంటున్నందున వివిధ వ్యయ తగ్గింపు కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించగలిగామని చంద్ర పేర్కొన్నారు. ఇన్పుట్ వ్యయాల మధ్య ఇంకా అంతరం మిగిలి ఉండటంతో కచ్చితంగా వాహనాల ధరలను పెంచాల్సి వస్తోందని తెలిపారు. కంపెనీ పలు మోడళ్ల రివైజ్డ్ ధరలను రూపోందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను ఎదుర్కోవటానికి ఇతర మోడళ్ల హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్, సిఎన్జి వేరియంట్ల ధరలను సుమారు రూ .15 వేల వరకు పెంచింది. -
జనవరి నుంచి కార్ల ధరలు మోతే!
సాక్షి, ముంబై: వాహన ధరల మోతకు మరో కంపెనీ సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వివిధ మోడళ్లపై రూ.28 వేల వరకు ధరల్ని పెంచుతున్నట్లు శుక్రవారం రెనో కంపెనీ ప్రకటించింది. ఫలితంగా కంపెనీ తయారీ చేసే క్విడ్, డస్టర్, ట్రిబర్ మోడళ్ల ధరలు పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్, ఇతర ఖర్చుల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరగడంతో మోడళ్ల ధరలను పెంచాల్సివచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు) హీరో మోటో కూడా... ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ జనవరి నుంచి ధరలను పెంచనుంది. వాహన మోడళ్లను బట్టి రూ.1,500 వరకు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇన్పుట్ వ్యయం పెరగడం వల్లే ధరల పెంపునకు ప్రధాన కారణమని పేర్కొంది. స్టీల్, అల్యూమీనియం, ప్లాస్టిక్ వంటి అన్ని వస్తువుల వ్యయం క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. ముడిసరుకు, కమోడిటీ ధరలు, ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో ఇప్పటికే మారుతీ, ఫోర్డ్, మహీంద్రా కంపెనీలు జవవరి 1 నుంచి తమ వాహనాలపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రైతుకు అందని... పెట్టుబడి రాయితీ
- మూడు తుపాన్ల సొమ్ముల ప్రభుత్వం వద్దే - హెలిన్..భారీ వర్షాల పెట్టుబడి రాయితీ ఇవ్వనంటున్న బాబు సర్కార్ - రెండేళ్ల క్రితం తుపాను రాయితీ కూడా అందని తీరు - పెట్టుబడుల కోసం మళ్లీ బయట అప్పులే - కోనసీమలో రైతుల ఆందోళన అమలాపురం : ఒకటి కాదు.. రెండు కాదు.. వందల కోట్ల రూపాయిల పెట్టుబడి రాయితీ సొమ్ములు హామీలకే పరిమితమైంది. తుపాన్లు రావడం.. పంట నష్టపోవడం.. ఆనక కనీసం పెట్టుబడి రాయితీ సొమ్ములు కూడా రాకపోవడం రైతులకు పరిపాటిగా మారింది. పంట నష్టపోతే పరిహారం భరోసా లేకపోవడం వల్లే డెల్టాలో ముంపు ప్రాంత రైతులు ఖరీఫ్ సాగుకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో గడిచిన ఆరేళ్లలో మూడుసార్లు భారీ తుపాన్లు వచ్చి రైతులు రూ.వందల కోట్ల రూపాయిల పంటను కోల్పోయారు. ఆయా సందర్భాలలో సందర్భాలలో ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు సర్వేలు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో హెలెన్ తో పాటు భారీ వర్షాలు కారణంగా జిల్లాలో వరితోపాటు వాణిజ్య, కూరగాయ పంటలను రైతులు ఎక్కువగా నష్టపోయారు. హెలెన్‌కు సంబంధించి 1.23 లక్షల మంది రైతులకు రూ.53 కోట్లు, 2013లో భారీ వర్షాలకు సంబంధించి 1.50 లక్షల మంది రైతులకు రూ.71 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. అంతకుముందు నీలం పరిహారం 3.09 లక్షల మంది రైతులకు రూ.144 మంజూరైనా ఇప్పటికీ సుమారు 12 వేల మందికి రూ.ఆరు కోట్లు చెల్లించాల్సి ఉండడం గమనార్హం. వీటికి సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ రాష్ట్ర విభజన తరువాత ఎన్నికలు రావడంతో జీవో జారీ చేయలేదు. కొత్త రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ప్రచారంలో పెట్టుబడి రాయితీని అటకెక్కించింది. ఉమ్మడి రాష్ట్రంలో పరిహారం ఇప్పుడెలా ఇస్తామంటూ కొత్తపల్లవి అందుకుంది. ఇదే సమయంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత 2015–16 తుపాను పరిహారం రూ.162 కోట్లు వరకు జిల్లాకు పెట్టుబడి రాయితీ రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ పరిహారాన్ని జూన్ 20 నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. తీరా గత ఏడాది కరువు పరిహారం ఇస్తామని చెప్పి అంతకుముందు ఏటా తుపాను పరిహారాన్ని అటకెక్కించే యత్నం చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబు ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాయితీగా రైతులకు అందకపోవడం విశేషం. సాధారణం పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకూడదని, తరువాత పంటను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి రాయితీగా సొమ్ములు చెల్లిస్తారు. పంట తరువాత పంటకు అటుంచి ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా రైతులను గాలికి వదిలేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కనీసం పాత బకాయిలన్నా సాగు ఆరంభానికి ముందు ఇస్తే ఖరీఫ్‌కు కొంత వరకు పెట్టుబడి సొమ్ములు వస్తాయని ఆశించిన రైతులు ప్రభుత్వం మరోసారి నిరాశ పరిచింది. దీంతో వారు బయట అప్పులు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఉన్న రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వకూడదనే జీవో ఇచ్చి రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. రైతులు ఆందోళనలు... పెండింగ్‌లో ఉన్న పెట్టుబడి రాయితీలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రైతులు బుధవారం కోనసీమలో ఆందోళన చేపట్టారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంతోపాటు కోనసీమలోని 16 తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మీ, ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావులు నాయకత్వం వహించారు. పెట్టుబడి రాయితీలను తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను అడుగడుగునా మోసం చేస్తోందని విమర్శించారు. రైతు సంఘం నాయకులు అప్పారి చిన వెంకటరమణ, అడ్డాల గోపాలకృష్ణ, రేకపల్లి ప్రసాద్, అబ్బిరెడ్డి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. -
పైసల్లేవ్.. పత్రాలు పెట్టుకోండి..
ఇన్పుట్, ఇన్సూరెన్స్ పంపిణీపై గందరగోళం 19 నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పత్రాలు రుణమాఫీ మాదిరిగానే అవుతుందంటూ అన్నదాతల్లో ఆగ్రహావేశాలు వ్యవసాయ శాఖ అధికారుల్లో గుబులు అనంతపురం అగ్రికల్చర్ : ‘పైసల్లేవు.. ప్రస్తుతానికి పత్రాలు పెట్టుకోండి.. పరిహారం ఇచ్చినప్పుడు తీసుకోండి’ అంటూ రైతులను మరోసారి మోసపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన రుణ ఉపశమన పత్రాల మాదిరిగానే ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ), వాతావరణ బీమాకు కూడా పత్రాలు ఇవ్వనుంది. ‘పెట్టుబడి రాయితీ మంజూరు పత్రాల’ పేరుతో వీటిని ఈ నెల 19 నుంచి రైతులకు పంపిణీ చేయనుంది. చేతిలో చిల్లిగవ్వ లేక ఖరీఫ్ పంటల సాగుకు దిక్కులు చూస్తున్న రైతులు.. ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇన్‌పుట్‌పై గందరగోళం తీవ్ర వర్షాభావం కారణంగా 2016 ఖరీఫ్‌లో 6.73 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేసిన వేరుశనగతో పాటు ఇతర అన్ని రకాల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో పెట్టుబడి రాయితీ కింద 6,25,050 మంది రైతులకు రూ.1,032.42 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు ఈ నెల రెండు నుంచి పంపిణీ చేస్తామని మొదట తెలిపింది. ఆ తర్వాత 9వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి వేస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం 14 నుంచి పంపిణీ ఉంటుందని ఆశ పెట్టారు. ఇలా తేదీలన్నీ పోయినా పరిహారంపై ఏమీ తేల్చలేకపోయారు. ఈ నెల 9న రాయదుర్గంలో జరిగిన ఏరువాక పౌర్ణమి సభలో సీఎం చంద్రబాబు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన ‘మెగా చెక్కు’ విడుదల చేశారు. ఉన్నపళంగా ఇప్పుడు మంజూరు పత్రాలు ఇస్తామంటూ కొత్తపల్లవి అందుకోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇన్సూరెన్స్‌ను లాగేసుకుంటున్న ప్రభుత్వం హక్కుగా రావాల్సిన వాతావరణ బీమా పరిహారాన్ని రైతులకు నేరుగా ఇవ్వకుండా ప్రభుత్వం లాగేసుకుంటోంది. వేరుశనగ రైతులు గత ఏడాది పంట రుణాల రెన్యూవల్స్‌లో వాతావరణ బీమా పథకం కింద ప్రీమియం చెల్లించారు. తమ వాటాగా పంట రుణాల మొత్తంలో 2 శాతం ప్రీమియం అంటే మొత్తం రూ.56 కోట్లు చెల్లించారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా 8 శాతం జమ చేశాయి. అంటే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేసిన బజాజ్ అలయంజ్ కంపెనీకి ప్రీమియం రూపంలో రూ.280 కోట్ల వరకు జమ అయ్యింది. దెబ్బతిన్న పంటల విలువను బట్టి చూస్తే బీమా కింద రూ.2 వేల కోట్ల వరకు రావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ... నియమ నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా లెక్కకట్టిన బజాజ్ కంపెనీ అధికారులు 5.07 లక్షల మంది రైతులకు రూ.419 కోట్ల పరిహారం మంజూరు చేస్తున్నట్లు వారం రోజుల కిందట ప్రకటించారు. ఈ మొత్తమైనా ఇచ్చారా అంటే అదీ లేదు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని లాగేసుకుని ఇన్పుట్ సబ్సిడీకి లింకు పెట్టి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చేది రూ.60 కోట్లే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు లింకు పెట్టి వ్యవహారం నడుపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం, బజాజ్ కంపెనీ ఇచ్చేది పోనూ రాష్ట్ర ప్రభుత్వం భరించేది రూ.60 కోట్లకు మించి ఉండదంటున్నారు. ఇవన్నీ పక్కనపెట్టి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రూపంలో పెద్ద మొత్తంలో ఇచ్చి ఆదుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. నిధులు విడుదల చేయకుండానే పెట్టుబడి రాయితీ మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. -
ఇంకెన్నడు?
– నెలలు గడుస్తున్నా అతీగతీ లేని ఇన్పుట్, ఇన్సూరెన్స్ – పట్టించుకోని మంత్రులు, అధికార యంత్రాంగం – కష్టాల్లో రైతన్నలు అనంతపురం అగ్రికల్చర్ : గత అక్టోబర్‌తో ఖరీఫ్ పంట కాలం ముగిసిపోయింది. ఈ జనవరితో రబీ కూడా పూర్తయ్యింది. మునుపెన్నడూ లేని విధంగా నైరుతి, ఈశాన్య రుతుపవనాలు మొహం చాటేశాయి. దీంతో 495 మిల్లీమీటర్ల (మి.మీ) సాధారణ వర్షపాతానికి గాను 285 మి.మీ మాత్రమే నమోదైంది. అంటే 47 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. ఇవి కూడా అననుకూల సమయంలో అడపాదడపా తేలికపాటిగా పడ్డాయి. దీనివల్ల 7.53 లక్షల హెక్టార్ల ఖరీఫ్, 45 వేల హెక్టార్లలో రబీ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవల కేంద్ర కరువు బృందం కూడా జిల్లాలో పర్యటించి దుర్భిక్ష పరిస్థితులను కళ్లారా చూసెళ్లింది. జిల్లాకు తక్షణ సాయంగా రూ.2,168 కోట్లు ఇవ్వాలని కలెక్టర్ కోనశశిధర్ కేంద్ర బృందానికి నివేదిక సమర్పించి చేతులు దులిపేసుకున్నారు. పంట కాలం ముగిసిన రెండు, మూడు నెలల్లోగా ఇవ్వాల్సిన పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ), హక్కుగా రావాల్సిన వాతావరణ బీమా గురించి మంత్రులు గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. రూ.2,874 కోట్ల పంట నష్టం గత ఖరీఫ్‌లో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, కొర్ర, పెసర, అలసంద, ఉలవ, మినుము, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర 16 రకాల పంటలు 7.53 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. రూ.2,874 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను నష్టపోయినట్లు వ్యవసాయశాఖ నివేదిక తయారు చేసింది. ఈ క్రమంలో రూ.1,075.46 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి అధికారులు వేర్వేరుగా నివేదికలు అందజేశారు. ఆ తర్వాత మరోసారి గ్రామాల వారీగా పర్యటించి ఈ–క్రాప్ బుకింగ్‌లో నమోదైన పంట వివరాలతో పాటు ఈ–క్రాప్ బుకింగ్ చేసుకోని రైతుల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఆ వివరాలన్నీ క్రోడీకరించి తుది నివేదిక తయారు చేస్తున్నారు. మొక్కుబడిగా ఇన్సూరెన్స్ ఈసారి బజాజ్ అలయంజ్ అనే ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో వాతావరణ బీమా పథకం అమలు చేశారు. జిల్లాలో 5.50 లక్షల మంది రైతులు తమ వాటాగా రూ.52 కోట్ల వరకు ప్రీమియం చెల్లించారు. వర్షాలు కురవకపోవడం, పంటలు దారుణంగా దెబ్బతినడంతో వాతావరణ బీమా పరిహారం తగినంత వస్తుందని రైతులు ఆశించారు. కానీ.. రూ.367 కోట్ల పరిహారం మాత్రమే మంజూరైంది. దీన్ని రెండు నెలల కిందటే ప్రకటించారు. మండలాల వారీగా పంట విస్తీర్ణం, పరిహారం వర్తింపు, రైతుల సంఖ్య ప్రకటించకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం 63 మండలాల పరిధిలో 4.94 లక్షల మంది రైతులకు రూ.367 కోట్లు వర్తింపజేశారని తెలుస్తోంది. అధికారిక నివేదికల ప్రకారం 90 శాతానికి పైగా పంట దెబ్బతిన్నా, పంట కోత ప్రయోగాల్లో కూడా ఈ విషయమే తేలినా పరిహారం మాత్రం మొక్కుబడిగా మంజూరు కావడం గమనార్హం. ఖరీఫ్ పంట కాలంలో 18 వారాల్లో 13 వారాల పాటు తీవ్ర బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా అంతటా 180 వర్షపాత విరామాలు (డ్రై స్పెల్స్) నమోదయ్యాయి. ఎకరాకు 85 కిలోల వేరుశనగ మాత్రమే పండినట్లు అధికారులు నివేదిక తయారు చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీపట్టనట్లు వ్యవహరిస్తోంది. చివరకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు ముడిపెట్టి, అంతో ఇంతో పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం పంట నష్టం వివరాలిలా... ––––––––––––––––––––––––––––––––– జిల్లాలో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం : 7,53,132 హెక్టార్లు పంటల వారీగా నష్టం : రూ.2,874.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ప్రతిపాదనలు : రూ.1,075.46 కోట్లు నష్టపోయిన రైతుల సంఖ్య : 6,93,003 మంది –––––––––––––––––––––––––––––––– ఆరేళ్లుగా వాతావరణ బీమా పరిస్థితి ఇలా... ––––––––––––––––––––––––––––––––––––– సంవత్సరం పరిహారం(రూ.లలో) రైతులసంఖ్య ––––––––––––––––––––––––––––––––––––– 2011 98.28 కోట్లు 3,63,157 2012 181.82 ,, 3,08,131 2013 226.93 ,, 4,22,613 2014 25.61 ,, 47,627 2015 109.68 ,, 1,85,618 2016 367.00 ,, 4,94,069 ––––––––––––––––––––––––––––––––––– -
ఇన్పుట్ సబ్సిడీ వెంటనే మంజూరు చేయాలి
నడిగూడెం: 2014–15 సంవత్సరానికి సంబంధించిన ఈదురుగాలులు, వడగండ్లకు నష్టపోయిన రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏనుగుల వీరాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది వాతారణ బీమా పథకం కింద ప్రీమియం చెల్లించిన రైతులకు వెంటనే బీమా సౌకర్యం కల్పించాలన్నారు. నల్గొండలో బత్తాయి, నకిరేకల్‌లో నిమ్మ, సూర్యాపేటలో మామిడి మార్కెట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతులు ప్రకాష్‌రావు, లక్ష్మారెడ్డి, చక్రయ్య, జానిమియా, రామయ్య, కె.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సెగ్గం రాజేష్ కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సెగ్గెం రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలో పర్యటించి భూనిర్వాసితులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కింద భూమి పోతుందనే ఆవేదనతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చల్లా స్వరూప, పత్తిపంట నష్టంతో బలవన్మరణం చెందిన యువరైతు ప్రవీన్ కుటుంబాలను పరామర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు న్యాయమైన పరిహారం కోసం ఏకతాటిపై నిలవాలన్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సన్నచిన్నకారు రైతులకు సాగునీరందించేందుకు కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే... ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. భూనిర్వాసితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట మల్హర్ మండల అద్యక్షుడు సుంకె వెంకటి, నాయకులు కల్యాణ్, కుమార్ ఉన్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ జమ చేయరూ ..
అనంతపురం అర్బన్ : ‘‘ఇన్పుట్ సబ్సిడీ జాబితాలో పేర్లు ఉన్నాయని, వెళ్లి బ్యాంకులో డబ్బు అడగండని మండల వ్యవసాయాధికారి చెప్పారు. తీరా బ్యాంకుకు వెళితే డబ్బు జమకాలేదంటున్నారు. కొన్ని వారాలుగా తిరుగుతూనే ఉన్నా పట్టించుకోవడం లేదు.’’ అంటూ శింగనమల మండలం ఈస్ట్ నర్సాపురం రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఖాతాల్లో డబ్బు జమ చేసేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. తమ సమస్యను కలెక్టర్‌కు చెప్పుకుందామని సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే మీకోసం లేదని తెలిసి ఊసూరుమంటూ వెనుదిరిగారు. -
తుపాన్లతో పంటలకు తీవ్ర నష్టం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకు సీమ రైతాంగాన్ని ప్రతియేటా ప్రకృతి విపత్తులు దెబ్బతీస్తున్నాయి. 2011 ఏప్రిల్ మొదలుకుని కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఎనిమిది పర్యాయాలు వర్షాలు, వడగండ్ల వల్ల రైతులు కోట్లాది రూపాయల పంట నష్టపోయారు. ఈ యేడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఐదు పర్యాయాలు ప్రకృతి కన్నెర్ర చేయడంతో రూ.30 కోట్లకు పైగా పంట నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 22 నుంచి 26 తేదీ నడుమ పైలీన్ తుపాను సృష్టించిన నష్టం రూ.26 కోట్లకు పైనే ఉంటుందని వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిగ్గు తేల్చాయి. నష్టం జరిగిన ప్రతిసారి అధికార యంత్రాంగం వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తోంది. అయితే నష్టం అంచనాలో శాస్త్రీయత పాటించడం లేదని రైతులు మొత్తుకుంటున్నా అధికారులు నిబంధనలు సాకుగా చూపుతున్నారు. మండలంలో 50 శాతానికి పైగా పంట నష్టం జరిగితేనే పరిహారం చెల్లింపు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. నూర్పిళ్లు జరిగి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యానికి నష్టం జరిగినా పరిగణనలోకి తీసుకోవడం లేదు. క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే వ్యవసాయ, రెవెన్యూ యంత్రాంగాలు నివేదికలు రూపొందిస్తున్నట్లు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించడం లేదు. పైలీన్, హెలెన్ నష్టాన్ని మినహాయిస్తే 2011 ఏప్రిల్ నుంచి 2013 ఏప్రిల్ వరకు ఆరు పర్యాయాల్లో జరిగిన నష్టానికి రూ.11.48 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. పరిహారం కోసం రైతాంగం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా నయా పైసా విదల్చడం లేదు. అరకొర లెక్కలు... ఆత్మహత్యలు పైలీన్ తుపాను వల్ల జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల నష్టం జరిగిందని రైతు సంఘాల ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి లేఖ సమర్పించారు. అయితే ప్రభుత్వం రూ.2.60 కోట్లకు మించి పరిహారం విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయంలో ఎదురవుతున్న నష్టాలను భరించలేక మెదక్ జిల్లాలో ఈ యేడాది 93 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారులు మాత్రం కేవలం పది మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నట్లు నివేదికలు సిద్ధం చేశారు. నష్టపోయిన రైతులకు ఉదారంగా పరిహారం ఇస్తే తప్ప తిరిగి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.