ఇన్‌పుట్‌ సబ్సిడీ వెంటనే మంజూరు చేయాలి | must give input subcidy | Sakshi
Sakshi News home page

ఇన్‌పుట్‌ సబ్సిడీ వెంటనే మంజూరు చేయాలి

Published Thu, Sep 29 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

ఇన్‌పుట్‌ సబ్సిడీ వెంటనే మంజూరు చేయాలి

ఇన్‌పుట్‌ సబ్సిడీ వెంటనే మంజూరు చేయాలి

నడిగూడెం: 2014–15 సంవత్సరానికి సంబంధించిన ఈదురుగాలులు, వడగండ్లకు నష్టపోయిన  రైతులకు తక్షణమే ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేయాలని పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏనుగుల వీరాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది వాతారణ బీమా పథకం కింద ప్రీమియం చెల్లించిన రైతులకు వెంటనే బీమా సౌకర్యం కల్పించాలన్నారు. నల్గొండలో బత్తాయి, నకిరేకల్‌లో నిమ్మ, సూర్యాపేటలో మామిడి మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రైతులు ప్రకాష్‌రావు, లక్ష్మారెడ్డి, చక్రయ్య, జానిమియా, రామయ్య, కె.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement