ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం 'పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజిలీ యోజన'కు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి గరిష్ఠంగా రూ.78000 సబ్సిడీ అందిస్తోంది. ఈ కొత్త స్కీమ్ ద్వారా ప్రజలు నెలకు 300 యూనిట్ల కరెంటును ఉచితంగానే పొందవచ్చు. కేంద్రం ఈ కొత్త పధకం కోసం ఏకంగా రూ.75000 కోట్లు వెచ్చిస్తోంది.
సబ్సిడీ వివరాలు
కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్రీ విద్యుత్ పథకాన్ని పలు విధాలుగా విభజించి సబ్సిడీ అందిస్తోంది. దీని కింద ఒక కిలోవాట్ సిస్టమ్‌కు రూ. 30000, రెండు కిలోవాట్ల సిస్టమ్‌కు రూ. 60000, మూడు కిలోవాట్ల సిస్టమ్‌కు ఏకంగా రూ.78000 సబ్సిడీ అందిస్తోంది. రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి సుమారు రూ.1.45 ఖర్చు అవుతుంది. ఇందులో సగం వరకు రాయితీ లభిస్తుంది. రాయితీ కాకుండా మిగిలిన డబ్బు కూడా బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే అందిస్తాయి.
ఉదాహరణకు 3 కిలోవాట్ సిస్టమ్‌కు రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి రూ.1.45 ఖర్చు అయిందనుకున్నప్పుడు, అందులో రూ. 78000 రాయితీ లభిస్తుంది. కాబట్టి మిగిలిన రూ. 67000 కూడా బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకే పొందవచ్చు.
నెలకు 50 యూనిట్ల విద్యుత్ వాడే వారికి 1 కిలోవాట్ నుంచి 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే 150 యూనిట్ల నుంచి 300 యూనిట్లను ఉపయోగించుకునే వారికి 2 కిలోవాట్స్ నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిం రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజిలీ యోజనకు అప్లై చేసుకునే విధానం
👉స్టెప్-1
- అధికారిక వెబ్‌సైట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి.
- మీ రాష్ట్రం, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎంచుకోండి.
- ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్ (వినియోగదారు) నెంబర్, మొబైల్ నెంబర్ & ఈ-మెయిల్ వంటి వాటిని ఎంటర్ చేయండి.
👉స్టెప్-2
- వినియోగదారు నంబర్ & మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి.
- ఫామ్ ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోండి.
👉స్టెప్-3
- డిస్‌కమ్ నుంచి అనుమతి వచ్చిన తరువాత, రిజిస్టర్డ్ విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉స్టెప్-4
- ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోండి.
👉స్టెప్-5
- నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, డిస్‌కమ్ అధికారులు చెక్ చేసి, తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు.
👉స్టెప్-6
- కమిషనింగ్ సర్టిఫికెట్ పొందిన తరువాత బ్యాంక్ వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. ఇలా చేసిన 30 రోజుల లోపల సబ్సడీ అమౌట్ మీ అకౌంట్‌లోకి జమ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment