
న్యూఢిల్లీ: ఉక్కు ధరలు పెరగనున్నాయి. తయారీ వ్యయం అధికం అయినందున స్టీల్ ధరలు జూలై నుండి పెరుగుతాయని భావిస్తున్నట్టు జిందాల్ స్టీల్, పవర్ ఎండీ వి.ఆర్.శర్మ తెలిపారు. ‘బొగ్గు ధర టన్నుకు రూ.17,000 ఉంది. ఒడిషాలో అతిపెద్ద సరఫరాదారుగా ఉన్న ఒడిషా మినరల్ కార్పొరేషన్ విక్రయిస్తున్న ఇనుము ధాతువు ధర ఇంకా అధికంగా ఉంది.
ఇప్పటికే ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంకా తగ్గించే అవకాశం లేదు. జూలై నుంచి ప్రాథమిక కంపెనీల స్టీల్ ధరలు పైపైకి వెళ్లనున్నాయి. ద్వితీయ శ్రేణి కంపెనీలు ఇప్పటికే టన్నుకు రూ.2 వేలు పెంచడం ద్వారా ధర రూ.55 వేలకు చేరింది. ఇతర సమస్యలూ పరిశ్రమకు భారంగా ఉన్నాయి. బొగ్గు కొరత ఉంది. బొగ్గు సరఫరాకై రేక్స్ అందుబాటులో లేవు’ అని వివరించారు.