Steel prices
-
ఇక స్టీల్ ధరలు పైపైకే!
న్యూఢిల్లీ: ఉక్కు ధరలు పెరగనున్నాయి. తయారీ వ్యయం అధికం అయినందున స్టీల్ ధరలు జూలై నుండి పెరుగుతాయని భావిస్తున్నట్టు జిందాల్ స్టీల్, పవర్ ఎండీ వి.ఆర్.శర్మ తెలిపారు. ‘బొగ్గు ధర టన్నుకు రూ.17,000 ఉంది. ఒడిషాలో అతిపెద్ద సరఫరాదారుగా ఉన్న ఒడిషా మినరల్ కార్పొరేషన్ విక్రయిస్తున్న ఇనుము ధాతువు ధర ఇంకా అధికంగా ఉంది. ఇప్పటికే ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంకా తగ్గించే అవకాశం లేదు. జూలై నుంచి ప్రాథమిక కంపెనీల స్టీల్ ధరలు పైపైకి వెళ్లనున్నాయి. ద్వితీయ శ్రేణి కంపెనీలు ఇప్పటికే టన్నుకు రూ.2 వేలు పెంచడం ద్వారా ధర రూ.55 వేలకు చేరింది. ఇతర సమస్యలూ పరిశ్రమకు భారంగా ఉన్నాయి. బొగ్గు కొరత ఉంది. బొగ్గు సరఫరాకై రేక్స్ అందుబాటులో లేవు’ అని వివరించారు. -
సామాన్యులకు మరో కొత్త టెన్షన్.. ఇక మనం వాటిని కొనలేమా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి అన్నీ పెట్రోల్, బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా సరఫరాలో అంతరాయం వల్ల దేశీయ ఉక్కు తయారీదారులు హాట్-రోల్డ్ కాయిల్(హెచ్ఆర్సీ), టీఎంటీ బార్ల ధరలను టన్నుకు రూ.5,000 వరకు పెంచారు. పరిశ్రమ వర్గాల ప్రకారం.. రెండు దేశాల మధ్య సంక్షోభం తీవ్రతరం కావడంతో వల్ల రాబోయే వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ధరల సవరణ తర్వాత, ప్రస్తుతం ఒక టన్ను హెచ్ఆర్సీ ధర సుమారు 66,000 రూపాయలు లభిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి."రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో సరఫరా గొలుసును ప్రభావితం చేస్తోంది. దీంతో, అనేక వస్తువుల ధరల ఇన్ పుట్ ఖర్చులు పెరుగుతున్నాయి. కోకింగ్ బొగ్గు టన్నుకు 500 అమెరికన్ డాలర్లుగా ట్రేడవుతోంది" అని ఒక పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. కొన్ని వారాల క్రితం రేట్లతో పోలిస్తే కోకింగ్ బొగ్గు ధర సుమారు 20 శాతం పెరిగింది అని ఆయన అన్నారు. ఉక్కుతో సహా దేశీయ రంగాలపై ఈ రెండు దేశాల సంఘర్షణ ప్రభావం ఎంతో ఉంది అని అడిగినప్పుడు టాటా స్టీల్ సీఈఓ,ఎండి టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ.. "రష్యా, ఉక్రెయిన్ దేశాలు రెండూ బొగ్గు & సహజ వాయువుతో సహా ముడి పదార్థాల సరఫరాదారులుగా ఉండటమే కాకుండా ఉక్కు తయారు చేయడంతో పాటు ఎగుమతి కూడా చేస్తున్నట్లు" ఆయన పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సరఫరా-డిమాండ్ డైనమిక్స్, ఇన్పుట్ ఖర్చులతో సహ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఆటో, ఉపకరణాలు & నిర్మాణం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు ఉక్కు ముడిపదార్థం కాబట్టి, ఉక్కు ధరలు పెరగడం వల్ల ఇళ్లు, వాహనాలు, వినియోగ వస్తువుల ధరలు ప్రభావితం కావలసి ఉంటుందని ఒక నిపుణుడు తెలిపారు. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. పెట్టుబడి రూ.లక్ష లాభం రెండున్నర కోట్లు) -
రియల్టీ రంగానికి స్టీల్ షాక్
కోల్‌కతా, సాక్షి: కోవిడ్-19 నేపథ్యంలో గత కొద్ది నెలలుగా నీరసించిన దేశీ రియల్టీ రంగం తాజాగా స్టీల్ ధరలతో డీలా పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అన్‌లాక్ తదుపరి ఇటీవలే నెమ్మదిగా పుంజుకుంటున్న రియల్టీ రంగం ప్రస్తుతం స్టీల్ ధరల పెరుగుదల కారణంగా ఒత్తిడిలో పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా నిర్మాణ రంగంలో వినియోగించే స్టీల్ ధరలు ఇటీవల భారీగా పెరిగినట్లు తెలియజేశారు. అయితే హౌసింగ్ రంగానికి కేంద్ర ప్రభుత్వమిస్తున్న ప్రోత్సాహకాలు, తీసుకుంటున్న చర్యలకుతోడు.. చౌక వడ్డీ రేట్ల ఫలితంగా ఇటీవల రెసిడెన్షియల్ విభాగం నిలదొక్కుకుంటున్నట్లు వివరించారు. (రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్ ) రూ. 45,000కు కోవిడ్-19కు ముందు ధరలతో పోలిస్తే ఇటీవల స్టీల్ ప్రొడక్టుల ధరలు 30-40 శాతం పెరిగినట్లు రియల్టీ రంగ వర్గాలు వెల్లడించాయి. నిర్మాణ రంగంలో అత్యధికంగా వినియోగించే టీఎంటీ బార్స్ ధరలు కొన్ని మార్కెట్లలో టన్నుకి రూ. 45,000ను తాకినట్లు తెలియజేశాయి. దీంతో రియల్టీ రంగ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు బెంగాల్ పీర్లెస్ హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీ సీఈవో కేతన్ సేన్‌గుప్తా పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే రియల్టీ రంగం రికవరీ సాధిస్తున్నందున పెరిగిన వ్యయాలను కొనుగోలుదారులకు బదిలీ చేసేందుకు అవకాశంలేదని తెలియజేశారు. స్టీల్ ప్రొడక్టుల ధరల పెరుగుదల కారణంగా కంపెనీల స్థూల మార్జిన్లు 4-6 శాతం మధ్య క్షీణించే అవకాశమున్నట్లు క్రెడాయ్ బెంగాల్ అధ్యక్షుడు నందు బెలానీ అంచనా వేశారు. (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) హౌసింగ్ భేష్ ప్రస్తుతం హౌసింగ్ విభాగంలో మాత్రమే డిమాండ్ బలపడుతున్నట్లు నందు తెలియజేశారు. వాణిజ్య, పారిశ్రామిక రియల్టీ విభాగంలో పరిస్థితులింకా కుదుటపడలేదని పేర్కొన్నారు. అధిక వ్యయాల కారణంగా బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు వెనుకంజ వేసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ఎలాంటి కొత్త ప్రాజెక్టులకూ శ్రీకారం చుట్టలేదని సేన్‌గుప్తా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో పరిస్థితులను సమీక్షించాక ఒక నిర్ణయానికి రాగలమని తెలియజేశారు. -
వచ్చే ఏడాది మెరుగ్గా అమ్మకాలు
♦ 7.3 మిలియన్ టన్నులకు ఉత్పత్తి ♦ వైజాగ్ స్టీల్ సీఎండీ మధుసూదన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గణనీయంగా క్షీణించిన ఉక్కు ధరలు స్థిరపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అమ్మకాలు కొంత మెరుగవుతాయని, 2017-18లో మరింత పుంజుకుంటాయని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్) సీఎండీ పి.మధుసూదన్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1,450 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 1,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారాయన. వైజాగ్ స్టీల్ గత ఆర్థిక సంవత్సరం రూ.1,421 కోట్ల నష్టం నమోదు చేసింది. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును ప్రకటించేందుకు శనివారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయాలు చెప్పారు. ‘చైనా దిగుమతుల ప్రభావం గతేడాది ద్వితీయార్థంలో చాలా పడింది. అయితే, కనీస దిగుమతి ధర నిబంధనలతో దిగుమతులు సుమారు 30 % మేర తగ్గాయి. మేం అంతర్గత వ్య యాలు తగ్గించుకుని నిర్వహణ సామర్ధ్యాలు మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారిస్తున్నాం’ అని తెలిపారు. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యం 6.3 మిలియన్ టన్నుల మేర ఉండగా.. ప్లాంటు ఆధునికీకరణతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.3 మిలియన్ టన్నులకు చేరగలదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న హౌసింగ్, స్మార్ట్ సిటీలు వంటి ప్రాజెక్టులతో ఉక్కుకు మరింత డిమాండ్పెరుగుతుందన్నారు. విజయవాడ, అమరావ తి మొదలైన చోట్ల నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సమీపంగా ఉన్నందున వ్యాపార అవకాశాల రీత్యా తమకు లాభించగలదని చెప్పారు. జాతీయ స్థాయిలో విస్తరించే దిశగా యూపీలో రాయ్‌బరేలీలో రెండో యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు మధుసూదన్ వివరించారు. 2018 సెప్టెంబర్ నాటికి ఇది అందుబాటులోకి రాగలదని చెప్పారు. బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు .. ఈ కార్యక్రమంలో వైజాగ్ స్టీల్ తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా సింధును ప్రకటించారు. -
టన్నుకు స్టీల్ 750 తగ్గింది