go up
-
ఇక స్టీల్ ధరలు పైపైకే!
న్యూఢిల్లీ: ఉక్కు ధరలు పెరగనున్నాయి. తయారీ వ్యయం అధికం అయినందున స్టీల్ ధరలు జూలై నుండి పెరుగుతాయని భావిస్తున్నట్టు జిందాల్ స్టీల్, పవర్ ఎండీ వి.ఆర్.శర్మ తెలిపారు. ‘బొగ్గు ధర టన్నుకు రూ.17,000 ఉంది. ఒడిషాలో అతిపెద్ద సరఫరాదారుగా ఉన్న ఒడిషా మినరల్ కార్పొరేషన్ విక్రయిస్తున్న ఇనుము ధాతువు ధర ఇంకా అధికంగా ఉంది. ఇప్పటికే ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంకా తగ్గించే అవకాశం లేదు. జూలై నుంచి ప్రాథమిక కంపెనీల స్టీల్ ధరలు పైపైకి వెళ్లనున్నాయి. ద్వితీయ శ్రేణి కంపెనీలు ఇప్పటికే టన్నుకు రూ.2 వేలు పెంచడం ద్వారా ధర రూ.55 వేలకు చేరింది. ఇతర సమస్యలూ పరిశ్రమకు భారంగా ఉన్నాయి. బొగ్గు కొరత ఉంది. బొగ్గు సరఫరాకై రేక్స్ అందుబాటులో లేవు’ అని వివరించారు. -
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?
-
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?
ముంబై: ఆయిల్ ధరలు పుంజుకోవడంతో దేశంలో మరోసారి పెట్రో వడ్డనే తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు గణనీయంగా పెరగడంతో పెట్రోల్ ధరలు పెరగొచ్చనే అంచనా మార్కెట్ వర్గాల్లో నెలకొంది. ఈ మాసాంతంలో జరిగే సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ భారీగానే పెంచే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఈ ఏడాది గరిష్ఠ స్థాయిని తాకడం, ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ఇటీవల ప్రధాన ఆయిల్ ఉత్పత్తిదారులు అల్జీరియా అంగీకారం నేపథ్యంలో ఈ అంచనాలు నెలకొన్నాయి. అటు చమురు ధరల క్షీణతను నిలువరించే ప్రయత్నంలో భాగంగా ఉత్పత్తిని తగ్గించే దిశగా నాన్ ఒపెక్ దేశాలు కూడా సంకేతాలు ఇవ్వడంతో బ్రెంట్ నార్త్ సీ క్రూడాయిల్ బ్యారెల్ ధర సోమవారం 53.45 డాలర్లను తాకింది. సాధారణంగా రెండు వారాలకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం రంగ ఇంధనసంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ దేశంలోని పెట్రోల్,డీజిల్ ధరలను సమీక్షిస్తాయి. వివిధ ప్రభుత్వ సుంకాలు ,అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి విలువ, చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు ఆధారంగా ఇది ఉంటుంది. కాగా గతరెండేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడిన ఆయిల్ ధరలు ఒపెక్ దేశాల సంచలన నిర్ణయంతో భారీగా పుంజుకున్నాయి. గత ఎనిమిదేళ్లో మొదటి సారి గత నెలలో జరిగిన ఒప్పందంతో చమురు ధరలు దాదాపు 15 శాతం పెరిగాయి. ఫిబ్రవరి బ్యారెల్30 డాలర్లకు దిగజారి 12 ఏళ్ల కనిష్టాన్ని నమోదుచేసిన ధరలు కీలక మద్దతు స్థాయిని 50 డాలర్లను అధిగమించాయి. మరోవైపు ఇస్తాంబుల్‌లో నిర్వహించిన వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తాము కూడా ఉత్పత్తిని తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇప్పుడున్న స్థాయిలోనే ఉంటే భవిష్యత్తులో ఆ రంగానికి నిధులు అందించడం కష్టతరమన్న ఆయన ఇతర ఒపెక్ దేశాలు కూడా ఈ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. పెట్రోలియం ఎగుమతి దేశాల తదుపరం సమావేశం నవంబర్ 30 న వియన్నా లో జరగనుంది. -
ఐఫోన్ ధరలకు మళ్లీ రెక్కలు
భారత్‌లో ఐఫోన్ ధరలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయట. గరిష్ట రిటైల్ ధరకు(ఎంఆర్పీకి) చేరువలో ఐఫోన్ ధరలను కొనసాగించాలని రిటైలర్లను యాపిల్ ఆదేశిస్తున్న నేపథ్యంలో ఐఫోన్ ధరలు మళ్లీ పెరుగుతాయని ఫోన్ ర్యాడర్ రిపోర్టు పేర్కొంటోంది. ఆగస్టు 1 నుంచి ఐఫోన్ ధరలు భారత్‌లో పెరగొచ్చంటూ ఈ రిపోర్టు వెల్లడించింది. అయితే ఈ ధరలు పెరుగుదల నిజానికి ధరలు పెంపు కాదని, ఎంఆర్పీ ధరలను అమలుచేయాలని యాపిల్ భావిస్తుండటంతో, ఈ ధరలు ఎంఆర్పీకి చేరువ కాబోతున్నాయని తెలిపింది. భారత్‌లో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఐఫోన్లు ఆవిష్కరించిన కొన్ని నెలలకే ఆ ఫోన్లపై డిస్కౌంట్లను రిటైలర్లు ఆఫర్ చేశారు.దీంతో ఎంఆర్పీ ధరలకంటే తక్కువ స్థాయిలో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఐఫోన్ ధరలను ఎంఆర్పీకి చేరువ చేయాలని యాపిల్ ఆదేశిస్తుండటంతో, రిటైలర్లు ఈ ధరలను పెంచుతున్నారని తెలుస్తోంది. గత ఏప్రిల్ లో కూడా రిటైలర్లు ఐఫోన్ ధరలను 29శాతం పెంచారు. ఫ్లిప్ కార్ట్‌లో ప్రస్తుతం రూ.46,499గా ఉన్న ఐఫోన్ 6ఎస్ 16జీబీ ధర, రాబోయే రోజుల్లో ఎంఆర్పీ ధర రూ.62,000లకు ఆ ఫోన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అదేవిధంగా ఐఫోన్ 6ఎస్ ప్లస్ ధరలు పెరుగుతాయని రిపోర్టు పేర్కొంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ 16జీబీ వెర్షెన్ ధర ప్రస్తుతం రూ.48,499గా ఉంది. అయితే పెరగబోయే ధరలు రూ.72,000లకు చేరుతాయని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ ఐఫోన్ 5ఎస్ ఒక్క ఫోన్‌కే ధరల పెంపుకు సంబంధించి యాపిల్ నుంచి అధికారికంగా ఆదేశాలు వెలువడ్డాయి. గతంలో ఈ ఫోన్ 20వేలకు అందుబాటులో ఉండేది. పెరిగిన ధరలతో ప్రస్తుతం 23వేలగా ఉంది. ఈ ఫోన్ ధరలను మరో రెండు వేల పెంపుతో 25వేల రూపాయలకు అమ్మాలని రిటైలర్లను యాపిల్ ఆదేశించినట్టు ఈ రిపోర్టు వెల్లడించింది.