costs
-
వైద్యం.. భారం
⇒ అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన లీలావతి కాన్పు కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి వెళ్లింది. అక్కడ ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు పడుకుని ఉండటంతో ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంకు వెళ్లింది. నార్మల్ డెలివరీ అయింది కానీ.. రూ.30 వేలు బిల్లు వేయడంతో ఆ కుటుంబం విస్తుపోయింది.⇒ అనంతపురం హౌసింగ్‌బోర్డుకు చెందిన రంగనాయకులు అనే 45 ఏళ్ల వ్యక్తి ఛాతిలో నొప్పి రావడంతో ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లారు. గుండె కవాటాలు మూసుకుపోయాయని, స్టంటు వేసి రూ.2.70 లక్షల బిల్లు వేయడంతో రంగనాయకులు హతాశులయ్యారు. ⇒ ఈ రెండు సమస్యలే కాదు క్యాన్సర్, ప్రమాద బాధితుల వైద్య ఖర్చులు కూడా భారీగా ఉండడంతో జనం హడలెత్తిపోతున్నారు.సాక్షి ప్రతినిధి, అనంతపురం: సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఆ నాలుగు రకాల జబ్బులకు భయపడిపోతున్నారు. వైద్యం ఖరీదుతో కూడుకుని ఉండటమే ఇందుకు కారణం. గుండె, క్యాన్సర్, కాన్పులు, ప్రమాద బాధితులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. సంపన్నులు ఎలాగోలా వైద్యం చేయించుకుంటున్నారు. పేదల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. రూ.5 లక్ష ల్లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందేవి. గడిచిన ఐదేళ్లూ ఉచిత వైద్యసేవలు సజావుగా అందాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వైద్య సేవల్లో ఒడుదుడుకులు మొదలయ్యాయి. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యమందించేందుకు నిరాకరిస్తున్నారు. ఇందుకు కారణం ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో రాకపోవడమేనని తెలుస్తోంది. విధిలేని పరిస్థితుల్లో అప్పోసప్పో చేసి ప్రైవేట్‌గా చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. గుండెజబ్బులతో దడ గుండె జబ్బులు సామాన్యులను భయపెడుతున్నాయి. ఏటా 20 వేల వరకు గుండెపోటు కేసులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోVýæ్యశ్రీ సేవలు లేవంటున్నారంటే ఇక దారుణ పరిస్థితులే. ఒక స్టంట్ వేస్తే రూ.2 లక్షల వరకు అవుతోంది. దీంతో జనం బెంబేలేత్తుతున్నారు.క్యాన్సర్ కేసులతో ఆందోళన ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ కేసులు ఏటికేటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఎక్కువ. చాలామంది హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. సర్జరీలు, కీమో థెరపీలకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రమాద బాధితులకు భరోసా లేదు అనంతపురం జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాద కేసులు నమోదవుతున్నాయి. పాలీ ట్రామా కేసుల చికిత్సకు భారీ వ్యయం అవుతుంది. సర్వజన ఆస్పత్రిలో లోడు పెరగడంతో చెయ్యలేకపోతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ఒక్కోసారి సర్కారు నుంచి నిధులు రావడం లేదని చేతులెత్తేస్తున్నాయి. దీంతో రోజురోజుకూ సామాన్యుల్లో ఆందోళన పెరుగుతోంది. ఖరీదైన జబ్బులకు చిక్కే క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు, గుండె ఆపరేషన్లు లాంటి ఖరీదైన వైద్యం చేయించుకోవాలంటే పేదలకు చిక్కులు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలందించడం లేదు. ఇటీవల మా బంధువుల అబ్బాయి రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసినప్పటికీ.. అదనపు ఖర్చుల కింద రూ.వేలల్లో డబ్బు వసూలు చేశారు. – లీలావతి, బీటీపీ, గుమ్మఘట్ట మండలంకాన్పు జరిగితే గండం గడిచినట్టేఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 55వేల వరకూ కాన్పులు (డెలివరీలు) జరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లు ఆరోగ్యశ్రీలో ఇబ్బంది లేకుండా నార్మల్, సిజేరియన్ డెలివరీలు జరిగాయి. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవు. ప్రైవేటు ఆస్పత్రులు నిధుల సమస్యతో కేసులు తీసుకోవడం లేదు. దీంతో నార్మల్ డెలివరీకి రూ.30 వేలు, సిజేరియన్‌కు రూ.50 వేలు చెల్లించుకోవాల్సి వస్తోంది. -
ఖర్చులు పెరుగుతున్నాయి!
సాక్షి, అమరావతి: దేశంలో జనాలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చే కొత్త అవసరాలకు పెట్టే ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయని కేంద్ర ఎన్ఎస్ఎస్ సర్వే రిపోర్టు నివేదిక వెల్లడించింది. రోజు రోజుకీ కొత్త కొత్త అలవాట్లకు ఆకర్షించబడడమే ఇందుకు కారణమని తెలిపింది. ఇంటిల్లపాది తిండి సహా పిల్లల చదువులు, దుస్తులు, కొత్త వస్తువుల కొనుగోలు, కారు, మోటర్ సైకిల్ వాహనాలు, వైద్య ఖర్చులు.. ఇలా ఒక్కో కుటుంబం ప్రతి నెలా పెట్టే మొత్తం ఖర్చులో గ్రామాల్లో అయితే 7.6 శాతం మేర ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే కొత్త ఖర్చులకే వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఈ తరహా ఖర్చులు సరాసరి 8.6 శాతం మేర ఉంటున్నాయి. కేంద్ర గణాంకాల శాఖ 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య దేశవ్యాప్తంగా కుటుంబాల వారీగా వినియోగ ఖర్చులపై నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వే నివేదికను ఈ ఏడాది ఆగస్టులో కేంద్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 8,723 గ్రామాల్లో 1,55,014 కుటుంబాల నుంచి, పట్టణ ప్రాంతాల్లో 6,115 మున్సిపల్ వార్డుల్లో 1,06,732 కుటుంబాల నుంచి వివరాలు సేకరించినట్లు కేంద్రం ఆ నివేదికలో వివరించింది.దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో పెట్టే మొత్తం ఖర్చులో 2009–10లో కేవలం 3.5 శాతం మాత్రమే ఈ తరహా కొత్తగా పుట్టుకొచ్చే ఖర్చులకు వినియోగించిన పరిస్థితి ఉండగా.. 2022–23 నాటికి ఆ తరహా ఖర్చులు రెట్టింపు స్థాయికి పెరిగి 7.6 శాతానికి చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ 2009–10లో 5.6 శాతంగా ఉన్న ఈ తరహా కొత్తగా పుట్టుకొచ్చే ఖర్చులు 2022–23 నాటికి 8.6 శాతానికి పెరిగాయి.దేశ సగటు కంటే ఏపీలో వినియోగ స్థాయి ఎక్కువ.. సర్వే నివేదిక ప్రకారం మన ఆంధ్రప్రదేశ్‌లో సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,871 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ. 6,782 చొప్పున ఖర్చు పెడుతున్నారు. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో సగటు సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో పెట్టే ఖర్చులు దేశ సగటుతో పోల్చితే దేశమంతటా పట్టణ ప్రాంత వ్యక్తుల సరాసరి వినియోగ స్థాయిలో గ్రామీణ ప్రాంత వ్యక్తుల వినియోగ స్థాయి సగం మేర ఉండగా... మన రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకు కాస్త దగ్గరగానే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వినియోగ స్థాయి ఉండడం గమనార్హం. దేశమంతటా గ్రామీణ ప్రాంత వ్యక్తుల 30 రోజుల వినియోగస్థాయి కంటే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత వ్యక్తుల వినియోగస్థాయి రూ.1,098 అదనంగా ఉండగా, అదే పట్టణ ప్రాంతాల్లో దేశ సగటు, రాష్ట్ర సగటు వ్యత్యాసం కేవలం రూ. 324గా ఉంది. » దేశంలో మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత ప్రజల వినియోగస్థాయిలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కన్నా మన రాష్ట్రం గ్రామీణ ప్రజల వినియోగస్థాయి అధికంగా ఉంది. » ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో వ్యక్తి 30 రోజుల సరాసరి తమ మొత్తం ఖర్చులో గ్రామీణ ప్రాంతాల్లో 44.13 శాతం చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 38.58 చొప్పున రకరకాల తిండి అవసరాలకు ఖర్చు పెడుతున్నారు. » రాష్ట్రంలో అప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే కొత్త అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి 7.83 శాతం , పట్టణ ప్రాంతాల్లో 8.37 శాతం చొప్పున ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువే..దేశమంతటా పట్టణ ప్రాంతాల్లో సరాసరిన ఒక్కో వ్యక్తి తిండి అవసరాలకు 39.17 శాతం, తిండేతర అవసరాలకు 60.83 శాతం ఖర్చు పెడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో తిండి అవసరాలకు 46.38 శాతం , తిండేతర అవసరాలకు 53.62 శాతం ఖర్చు పెడుతున్నారు.దేశమంతటా ఒక్కో వ్యక్తి సరాసరి 30 రోజుల్లో పెట్టే మొత్తం ఖర్చులో గ్రామీణ ప్రాంతాల్లో రూ.285 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ.383 చొప్పున కొత్తగా పుట్టుకొచ్చే అలవాట్లకే ఖర్చు పెడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ సర్వే నివేదిక ప్రకారం.. దేశంలో ఒక్కో వ్యక్తి సరాసరిన 30 రోజుల వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో తిండి, సంబంధిత ఖర్చులకు రూ. 2,529 చొప్పున, ఇతర అవసరాలకు రూ.3,929 చొప్పున మొత్తం రూ. 6,458 ఖర్చు పెడుతున్నట్లు నిర్ధారించారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి సరాసరిన తిండి సంబంధిత అవసరాలకు రూ.1,749 చొప్పున, ఇతర అవసరాలకు రూ.2,023 చొప్పున ఒక్కొక్కరు మొత్తం రూ. 3,773 ఖర్చు పెడుతున్నారు. -
అయ్యో దేవుడా! అంత్యక్రియలకు రూ. 30 లక్షలా?
మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కార్ల్‌మార్క్స్ చాలాకాలం క్రితమే తేల్చేశాడు కానీ.. ఈ సూత్రానికి మినహాయింపులూ చాలానే ఉన్నాయి. సమాజం మాట కాకపోయినా.. తల్లిదండ్రులు.. దగ్గరి బంధువులతో సంబంధాలను, డబ్బుతో ముడి పెట్టకుండా చూసుకునేవారు చాలామందే కనిపిస్తారిప్పుడు. అయితే.. కెనెడాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. దహన సంస్కారాలకు ఎక్కువ ఖర్చు అవుతోందన్న కారణంగా చాలామంది శవాలను మార్చురీల్లో కుళ్లిపోయేలా చేస్తున్నారని చెబుతున్న ఈ వార్తలు అయ్యో అనిపించేవి.అంత్యక్రియలు అనేది మరణించిన వారి గౌరవార్థం నిర్వహించే కర్మ. ఎవరి ఆచారానికి తగ్గట్టు, ఎవరి ఆర్థిక స్థోమతకు తగ్గట్టు అంత్యక్రియలు నిర్వహించడం పరిపాటి. కానీ కెనడాలోదారుణ పరిస్థితులునెలకొన్నాయి. ఒక్కో మృత దేహానికి నిర్వహించే అంత్యక్రియలు ఖర్చు రూ. 27 నుంచి 30లక్షల దాటి పోతుండటంతో ఏం ఏయాలో తోచక అయోమయంలో పడిపోతున్నారు జనం.ఒకవైపు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న దుఃఖం, మరోవైపు పరలోకానికి చేరిన తమ ఆత్మీయులకు కూడా అంత్యక్రియలు నిర్వహించలేక అనాథ శవాల్లా వదిలివేస్తున్న వైనం ఆందోళన కరంగా మారింది. ఎందుకంటే అక్కడ ఏరియాను బట్టి, అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ. 30 లక్షలకుపై మాటే.. అంతసొమ్ము భరించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పేరుకు పోతోందిట.దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కెనడాలో, స్థానాన్ని బట్టి శ్మశానవాటిక ప్లాట్ల ధరలలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. కెనడాలో అంత్యక్రియలకు సగటున 3 వేల డాలర్లకు పైనే అవుతోంది. మిడ్‌టౌన్ టొరంటోలో భారీగా ధర (రూ. 27 లక్షలు.) చెల్లించాల్సి వస్తోంది. ఇతర ఖర్చులు కలిపి మొత్తం వ్యయం రూ. 30 లక్షలు దాటేస్తోంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి అంటే 2023 ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. క్యూబెక్‌లో, 2013లో 66గా ఉన్న క్లెయిమ్ చేయని మృతదేహాల సంఖ్య 2023లో 183కి పెరిగింది. అల్బెర్టాలో, 2016లో 80 ఉన్న మృతదేహాల సంఖ్య 2023లో 200కి పెరిగింది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ, అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై ప్రతి పక్షాలు విచారం వ్యక్తం చేశాయి. -
పండుగ వేళ పాకిస్తానీలకు కొత్త కష్టాలు..
ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే పాకిస్తాన్లో కూరగాయలు, పాలు, పంచదార, వంటనూనెలు, నెయ్యి, మాంసం, గుడ్లు, పప్పుల ధరలు మూడు రెట్ల మేరకు పెరిగాయి. దీంతో బడుగు, మధ్య ఆదాయవర్గాల వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో కేజీ ఉల్లి ధర రూ. 150 (పాకిస్తానీ రూపాయిలు) నుండి 300 రూపాయలకు పెరిగింది. అయితే కొంతమంది విక్రేతలు తగ్గింపు ధరలో కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. బంగాళదుంప ధర కేజీ 50 పీకేఆర్ నుండి 80 రూపాయలకు పెరిగింది. క్యాబేజీ ధర కిలో 100 పీకేఆర్ నుండి 150 పీకేఆర్‌కు పెరిగింది. పచ్చిమిర్చి కిలో 200 పీకేఆర్‌ల నుంచి 320 రూపాయలకు పెరిగింది. క్యాప్సికం కూడా కిలో 400 పీకేఆర్‌లకు చేరింది. సాధారణంగా రంజాన్ మాసంలో పండ్ల విక్రయాలు పెరుగుతాయి. చిన్న సైజు అరటి పండ్ల ధర డజను 80 పీకేఆర్‌ల నుంచి 120 రూపాయలకు పెరిగింది. మంచి నాణ్యమైన పెద్ద అరటిపండ్లు డజన్‌కు 200 పీకేఆర్‌లకు విక్రయిస్తున్నారు. పుచ్చకాయ ధర కూడా 150 నుంచి 200 పీకేఆర్‌లకు అమ్ముతున్నారు. -
కరోనా తరువాత కామన్ మ్యాన్ కష్టాలు
-
ఆడంబరాలొద్దు.. ఆదా ముద్దు
సాక్షి, అమరావతి: మారుతున్న కాలంతో పాటు మనుషుల పద్ధతులు మారుతుంటాయి. ఒకప్పుడు రూపాయి ఖర్చు చేయాలంటే కూడా లెక్కలేసుకునేవారు. అవసరమైన వాటికే ఖర్చు చేసేవారు. ఆ తరువాత కొన్ని పరిణామాల వల్ల.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కొలువుల్లో ఊహించని వేతనాలు, అందుబాటులోకి వచ్చిన ఈ–కామర్స్ ఆన్లైన్ సైట్ల కారణంగా అవసరం లేనివాటిని కూడా విచ్చలవిడిగా కొనడం మొదలైంది. కాలచక్రం గిర్రున తిరుగుతున్నట్టే మళ్లీ పాత రోజులొస్తున్నాయి. ఇలాంటి వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ప్రజలు ప్రయత్ని స్తున్నారు. ఆన్లైన్ షాపింగ్‌లను కట్టడి చేసుకుంటూ.. వీధిచివర దుకాణానికి వెళ్లి మరీ పచారీ సరుకులు, వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అమెరికాకు చెందిన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) అనే సంస్థ భారత్‌లో గ్లోబల్ కన్స్యూమర్ ఇన్సైట్స్ పల్స్–2023 పేరుతో జరిపిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెరుగుతున్న ధరలు, ఆన్లైన్ డెలివరీలో అవకతవకలు, ఆలస్యం వంటి కారణాలు కొనుగోలుదారుల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. మన దేశంలో 74% మంది.. ప్రపంచవ్యాప్తంగా 50% మంది వినియోగదారులు జీవన వ్యయం, వ్యక్తిగత ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. 12 నగరాలు.. 25 ప్రాంతాలు విశాఖపట్నంతోపాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కొచ్చి, కోల్‌కతా, నాగ్‌పూర్, జలంధర్, హైదరాబాద్, మీరట్ రాజ్‌కోట్ మెట్రో నగరాల్లోని 25 ప్రాంతాల్లో 9,180 మంది వినియోగదారుల నుంచి సర్వే సంస్థ పీడబ్ల్యూసీ అభిప్రాయాలను సేకరించింది. వీరిలో 57 శాతం మంది పురుషులు కాగా.. 43 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 63 శాతం మంది అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటున్నామని వెల్లడించారు. 75 శాతం మంది వినియోగదారులు తమ జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా ఎల్రక్టానిక్స్, లగ్జరీ వస్తువులను కొనడం మానుకుంటున్నారు. లగ్జరీ, ప్రీమియం, డిజైనర్ ఉత్పత్తులు 38 శాతం, వర్చువల్ ఆన్లైన్ యాక్టివిటీస్ 32 శాతం, కన్స్యూమర్ ఎల్రక్టానిక్స్ 32 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులు (దుస్తులు, పాదరక్షలు) 31శాతం కొనుగోళ్లు పడిపోయాయి. 38 శాతం మంది ఇతరులు కొంటున్నారు కాబట్టి తామూ కొనాలని అనవసర ఖర్చు చేస్తున్నారు. అయితే.. 54 శాతం మంది మాత్రం వస్తువుల్లో నాణ్యత చూస్తున్నారు. ఆఫర్ ఉంటే చూద్దాంలే కొంతకాలం క్రితం ప్రతి వస్తువునూ ఇంటి వద్దకే తీసుకువచ్చి ఇస్తామనే ప్రకటనలు ఎక్కువగా వచ్చేవి. కూరగాయలు, ఆహారం, కిరాణా సరుకులు, పాలు, దుస్తులు, గృహోపకరణాలు ఇలా ఆన్లైన్లో ఏది ఆర్డర్ పెట్టినా ఇంటి వద్దకే చేరేవి. కానీ.. కొంతకాలంగా ఈ డెలివరీకి కూడా చార్జీలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఈ–కామర్స్ నిర్వాహకులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. నేరుగా డెలివరీ చార్జీలు తీసుకోకుండా కొంత మొత్తం నగదు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే డెలివరీ చార్జీలు ఉండవనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. లేదంటే ఆర్డర్ పెట్టిన సరుకు రావడానికి వారం పది రోజులు వేచి ఉండక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆన్లైన్ స్టోర్లకు బదులుగా ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోళ్లు జరపడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, 45 శాతం మంది మాత్రం ఈ–కామర్స్ సైట్లలో ప్రమోషన్, ప్రత్యేక రోజుల్లో ఆఫర్లు పెట్టినప్పుడు కొనుగోలు చేస్తున్నారు. 44 శాతం మంది నాణ్యత గల సరుకులను అందించే రిటైల్ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు. 38 శాతం మంది బ్రాండెడ్ వస్తువులకు బదులు చవకైనవి కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇందుకోసం బ్రాండెడ్ వస్తువుకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో లభించే అలాంటి వస్తువు కోసం వెబ్సైట్లను ఉపయోగిస్తున్నారు. సొంత బ్రాండ్లకు డిమాండ్ డబ్బును పొదుపు చేయడం కోసం రిటైలర్ల వ్యక్తిగత బ్రాండ్లను 33 శాతం మంది కొనుగోలు చేస్తున్నారు. అంటే రిలయన్స్, డీ మార్ట్, మోర్, విశాల్ మార్ట్, క్రోమా, ఫ్లిప్‌కార్ట్ వంటి కొన్ని భారీ దుకాణాల్లో వారి బ్రాండ్ పేరుతోనే వస్తువులు, దుస్తులు, సరుకులు లభిస్తుంటాయి. ఇవి మిగతా వాటితో పోలి్చతే కాస్త తక్కువకే దొరుకుతుంటాయి. అలాంటి వాటిని కొందరు కొంటున్నారు. మన దేశంలోని వినియోగదారులలో సగం మంది దుకాణంలో షాపింగ్ చేసేటప్పుడు ధరలు పెరిగిన విషయం తెలుసుకుని ఇబ్బందిగా భావిస్తున్నారు. దానికి తోడు భారీ దుకాణాల్లో రద్దీ, బిల్లింగ్ కోసం ఎక్కువ సేపు లైన్లలో నిలబడటం వంటి సమస్యలు 35 శాతం మందిని ఆ దుకాణాలకు దూరం చేస్తున్నాయి. ఇలాంటి రిటైల్ దుకాణాల్లో వచ్చే ఆరు నెలల్లో వినియోగదారులు తమ వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నారు. చిత్రంగా 88 శాతం కంటే ఎక్కువ మంది స్థానికంగా ఉత్పత్తి చేసిన వాటిని కొనాలనుకుంటున్నారు. పర్యావరణ అనుకూల పదార్థాలతో తయారైన వస్తువులను 87 శాతం మంది ఇష్టపడుతున్నారు. మరోవైపు ఆన్లైన్ షాపింగ్‌లో వినియోగదారులు డేటా గోప్యత విషయంలో ఆందోళన చెందుతున్నారు. వాటి నుంచి వచ్చే ప్రమోషనల్ కాల్స్‌తో ఎక్కువగా విసిగిపోతున్నారు. ఫలితంగా, 41 శాతం మంది వ్యక్తిగత డేటాను అంటే ఫోన్ నెంబర్‌ను బిల్లింగ్ సమయంలో ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. -
ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుకి కలత చెంది యువకుడు బలవన్మరణం
యువకుడు తన అనారోగ్యానికి అయ్యే ఖర్చు విషయమై కలత చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో ఆదర్శనగర్‌లోని ఓ హోటల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..నితేష్ అనే 25 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఐతే తన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు తల్లిదండ్రులు భరించగలిగేది కాకపోవడంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ మేరకు ఆదర్శనగర్‌లోని ఓ హోటల్ బుక్ చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే రూమ్ బుక్ చేసుకుని మరీ ఒక ప్లాస్టిక్ సంచితో ముఖాన్ని చుట్టి ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్‌ని అనుసంధానించాడు. దీంతో ఆ వ్యక్తి శరీరంలోకి చేరిని అధికమొత్తంలోని ఆక్సిజన్ ఒక్కసారిగా గుండె స్పందన రేటును పడిపోయేలా చేసి ప్రాణాంతకంగా మారి చనిపోయేలా చేస్తుంది. మృతుడిని నితేష్‌గా గుర్తించారు పోలీసులు. అతను సూసైడ్ నోట్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్సకు చాలా ఖర్చు అవుతుందని పేర్కొన్నాడు. దీని కోసం తాను తన తల్లిదండ్రులకు భారంగా మారకూడదని భావించే ఆ యువకుడు చనిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: కాంచీపురం: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురి సజీవదహనం!) -
యాప్ సాఫ్ట్వేర్లపై వ్యయాలు 15% అప్
న్యూఢిల్లీ: దేశీయంగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లపై కంపెనీలు చేసే వ్యయాలు 2023లో 14.9 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. ఇందులో అత్యధిక భాగం వాటా కస్టమర్ ఎక్స్పీరియన్స్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ల వ్యయాలదే ఉండనుంది. ప్రస్తుత ఏడాది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లపై వ్యయాలు 14.6 శాతం పెరిగి 4.15 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ ఒక నివేదికలో ఈ అంశాలు తెలిపింది. డిజిటల్ బాట పట్టే క్రమంలో దేశీ కంపెనీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై చేసే వ్యయాల్లో భాగంగా సాఫ్ట్‌వేర్‌పైనా గణనీయంగా వెచ్చించనున్నాయని గార్ట్నర్ వైస్ ప్రెసిడెంట్ నేహా గుప్తా పేర్కొన్నారు. వ్యాపారాల్లో అన్ని అంశాలను నిర్వహించుకునేందుకు కంపెనీలు..సాఫ్ట్వేర్లపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపారు. అయితే, 2021తో పోలిస్తే 2022లో సాఫ్ట్‌వేర్‌పై వ్యయాలు కొంత తగ్గవచ్చని నేహా వివరించారు. అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకు లోనవుతుండటంతో వ్యాపారాలకు అనిశ్చితి పెరగడం ఇందుకు కారణమని పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని అంశాలు.. ► కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) సాఫ్ట్‌వేర్‌పై వ్యయాలు 2022లో 18.1 శాతం పెరిగి 1.13 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. వచ్చే ఏడాది 18.5 శాతం పెరిగి 1.34 బిలియన్ డాలర్లకు చేరతాయి. ► 2023లో ఈమెయిల్, ఆథరింగ్ విభాగం 16.5 శాతం పెరిగి 768 మిలియన్ డాలర్లకు చేరుతుంది. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ 10.3 శాతం పెరిగి 566 మిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుంది. అనలిటిక్స్ ప్లాట్‌ఫాం 18.5 శాతం (495 మిలియన్ డాలర్లకు), కంటెంట్ సర్వీసులు 14.8 శాతం (366 మిలియన్ డాలర్లకు), సప్లై చెయిన్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్‌పై వ్యయాలు 11.4 శాతం (241 మిలియన్ డాలర్లకు) వృద్ధి చెందనున్నాయి. -
PULASA FISH: రేటు ఎంతైనా.. రుచి చూడాల్సిందే!
పెనుగొండ: ప్రతి ఏటా జూలై నెల వస్తే గోదావరి పరివాహక ప్రాంతంలో పులసలు సందడి చేస్తుంటాయి. ఆస్ట్రేలియా తీర ప్రాంతం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించే పులసలంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్.. పుస్తెలు అమ్మైనా పులస తినాలనే నానుడిని నిజం చేస్తూ ధరలోనూ అధరహో అనిపిస్తాయి. ఏడాదికి రెండు మూడు నెలలు మాత్రమే లభించే పులసలను వేలు ఖర్చు చేసి కొంటారు చేపల ప్రియులు. గోదావరికి వరద నీరు వచ్చినప్పటి నుంచి ఇంచుమించుగా జూలై నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకూ పులసలు దొరుకుతుంటాయి. సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, గౌతమి నదిలో జొన్నాడ, ఆలమూరు, చెముడులంక, కేదారిలంక ప్రాంతాల్లో అధికంగా జాలర్లకు పులసలు చిక్కుతుంటాయి. సాధారణంగా బ్రతికి ఉన్న పులసలు దొరకడం కష్టం. వలకు చిక్కగానే పులసలు చనిపోతుంటాయి. గోదావరి తీరం జాతీయ రహదారిలో ఉండడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా అమ్మకాలు సాగిస్తుంటారు. వారం రోజులుగా అందుబాటులోకి.. గోదావరికి వరదనీరు పోటెత్తడంతో పులసలు దొరకడం ప్రారంభమయ్యాయి. అరకొరగా దొరుకుతున్న పులసల ధరలు అధికంగానే ఉన్నాయి. సామాన్య కుటుంబాలు పులస కొనాలంటే కష్టమే. కేజీ పులసలు రూ.2000 నుంచి రూ.6000 వరకూ అమ్ముతున్నారు. సాధారణంగా పులస దొరకాలంటే కష్టమైనే పనే. దీంతో ఇలసల్ని అమ్మేస్తుంటారు. తెలియని వారు వీటినే పులసలుగా భావించి కొంటుంటారు. గోదావరికి వరద నీరు ముందుగానే రావడంతో ఈ ఏడాది పులసలు ఎక్కువ కాలం దొరికే అవకాశం ఉందని జాలర్లు అంటున్నారు. ఇలసలనే పులసలుగా అమ్మకం ఒడిశా సముద్ర తీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరకు తీసుకొచ్చి పులసలుగా అమ్ముతుంటారు. వీటి మధ్య తేడాను గుర్తించడం కష్టసాధ్యం. నిజమైన పులస ఎర్రనీటి ప్రయాణం చేయడంతో.. శరీరంపై ఎర్రటి చాయలు వెండి రంగు ధగధగలు ఉంటాయి. ఇలసలు తెలుపుగా కనిపిస్తాయి. సంతానోత్పత్తి కోసం వచ్చి... ఆ్రస్టేలియా, థాయ్‌లాండ్ సముద్ర ప్రాంతాల్లో హిల్షా ఇలీషాగా పిలిచే ఈ చేప సంతానోత్పత్తి కోసం సుదూర ప్రాంతాల నుంచి ఈదుకొని బంగాళాఖాతం చేరుకుంటుంది. గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకొని ఎర్రనీటిలో ప్రయాణిస్తూ గుడ్లను పెడుతుంది. గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించినప్పుడు పులసగా పిలుస్తారు. పులసలను ఉన్నతాధికారులకు, బాస్‌లకు గిఫ్ట్‌లుగా పంపుతారు. గోదావరి పరిసర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని పంపుతుంటారు. వండడం కూడా ప్రత్యేకమే పులస పులుసు తయారీ కూడా ప్రత్యేకమే. ఇతర చేపల్లాగా వండకూడదు. మట్టి కుండలో పులసను వండాలి. ముళ్లు అధికంగా ఉండడంతో ప్రత్యేకంగా వీటిని వండుతుంటారు. ముందుగా చేపముక్కలకు వెన్న, ఆముదం పూసి కొంత సమయం పాటు ఉంచి వీటిని పిడకలు, లేదా కట్టెల పొయ్యి పై తక్కువ మంటపై ఎక్కువ సమయం వండాలి. ఆవకాయ ఊట, వంకాయ, బెండకాయ వంటి వాటిని వేసి వండుతారు. మర్నాడు తింటే దీని రుచి అమోఘంగా ఉంటుందని చేప ప్రియుల చెబుతుంటారు. -
ఇక స్టీల్ ధరలు పైపైకే!
న్యూఢిల్లీ: ఉక్కు ధరలు పెరగనున్నాయి. తయారీ వ్యయం అధికం అయినందున స్టీల్ ధరలు జూలై నుండి పెరుగుతాయని భావిస్తున్నట్టు జిందాల్ స్టీల్, పవర్ ఎండీ వి.ఆర్.శర్మ తెలిపారు. ‘బొగ్గు ధర టన్నుకు రూ.17,000 ఉంది. ఒడిషాలో అతిపెద్ద సరఫరాదారుగా ఉన్న ఒడిషా మినరల్ కార్పొరేషన్ విక్రయిస్తున్న ఇనుము ధాతువు ధర ఇంకా అధికంగా ఉంది. ఇప్పటికే ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంకా తగ్గించే అవకాశం లేదు. జూలై నుంచి ప్రాథమిక కంపెనీల స్టీల్ ధరలు పైపైకి వెళ్లనున్నాయి. ద్వితీయ శ్రేణి కంపెనీలు ఇప్పటికే టన్నుకు రూ.2 వేలు పెంచడం ద్వారా ధర రూ.55 వేలకు చేరింది. ఇతర సమస్యలూ పరిశ్రమకు భారంగా ఉన్నాయి. బొగ్గు కొరత ఉంది. బొగ్గు సరఫరాకై రేక్స్ అందుబాటులో లేవు’ అని వివరించారు. -
జనవరి నుంచి కార్ల ధరలు మోతే!
సాక్షి, ముంబై: వాహన ధరల మోతకు మరో కంపెనీ సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వివిధ మోడళ్లపై రూ.28 వేల వరకు ధరల్ని పెంచుతున్నట్లు శుక్రవారం రెనో కంపెనీ ప్రకటించింది. ఫలితంగా కంపెనీ తయారీ చేసే క్విడ్, డస్టర్, ట్రిబర్ మోడళ్ల ధరలు పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్, ఇతర ఖర్చుల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరగడంతో మోడళ్ల ధరలను పెంచాల్సివచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు) హీరో మోటో కూడా... ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ జనవరి నుంచి ధరలను పెంచనుంది. వాహన మోడళ్లను బట్టి రూ.1,500 వరకు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇన్పుట్ వ్యయం పెరగడం వల్లే ధరల పెంపునకు ప్రధాన కారణమని పేర్కొంది. స్టీల్, అల్యూమీనియం, ప్లాస్టిక్ వంటి అన్ని వస్తువుల వ్యయం క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. ముడిసరుకు, కమోడిటీ ధరలు, ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో ఇప్పటికే మారుతీ, ఫోర్డ్, మహీంద్రా కంపెనీలు జవవరి 1 నుంచి తమ వాహనాలపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వంట నూనెకు డిమాండ్ జోరు
ముంబై: దేశంలో వంట నూనెల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. 2017లో 23 మిలియన్లుగా ఉన్న వినియోగం 2030 నాటికి 34 మిలియన్ టన్నులకు పెరగనుంది. ‘దేశంలో భవిష్యత్ వంట నూనెల పరిశ్రమ: 2030 నాటికి మరింత డిమాండ్ పెరగడానికి కారణాలు’’ అన్న శీర్షికన రెబో రీసెర్చ్ సంస్థ ఒక నివేదికను రూపొందించింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... జనాభా పెరుగుదల, ఆర్థికాభివృద్ధి, ఆదాయాలు ఇందుకు అనుగుణంగా వ్యయాలు పెరగడం. పట్టణీకరణ, ఆహార అలవాట్లు మారడం, ప్రాసెస్డ్ ఫుడ్ తినేవారి సంఖ్యలో గణనీయ పెరుగుదల వంటి అంశాలు వంట నూనె వినియోగం దూసుకుపోవడానికి కారణం. 2017లో దేశ వంట నూనెల వినియోగం 23 మిలియన్ టన్నులయితే వార్షికంగా 7 శాతం పెరుగుతూ, 2030 నాటికి 34 మిలియన్ టన్నులకు చేరుతుంది. దేశీయ వంట నూనెల సరఫరా ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా లేదు. దీనితో వచ్చే దశాబ్ద కాలంలో దిగుమతుల పరిమాణం పెరిగే వీలుంది. దేశీయ నూనెల పరిశ్రమ వృద్ధి నేపథ్యంలో ప్యాకేజ్డ్ వంట నూనెల మార్కెట్ విస్తరిస్తుంది. ఈ పరిస్థితుల్లో పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ భవిష్యత్‌లో ప్రాంతీయ మార్కెట్లలోకి మరింత చొచ్చుకుపోయే అవకాశం ఉంది. దేశీయ నూనె గింజల ఉత్పత్తి వృద్ధి డిమాండ్‌కు అనుగుణంగా పెరగడం లేదు. పెరుగుతున్న వంట నూనెల డిమాండ్ – దేశీయ వంట నూనెల సరఫరా మధ్య వ్యత్యాసం గడచిన దశాబ్ద కాలంలో 6.5 మిలియన్ టన్నులు– 8.5 మిలియన్ టన్నుల శ్రేణిలో ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో 2030 నాటికి వంట నూనెల దిగుమతుల పరిమాణం 25 మిలియన్ టన్నులకు చేరే వీలుంది. 2017లో దిగుమతులు 15.5 మిలియన్ టన్నులు. మొత్తం వంట నూనెల దిగుమతుల్లో 98 శాతం పామాయిల్, సోయా ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ఆక్రమించనున్నాయి. 2030 నాటికి మొత్తం వంట నూనెల దిగుమతుల్లో 60 శాతంతో సింహభాగంలో పామాయిల్ ఉంటుంది. మలేషియా, ఇండోనేషియాల నుంచి ప్రధానంగా ఈ దిగుమతులు ఉంటాయి. దక్షిణ అమెరికా సోయా ఆయిల్ దిగుమతుల శాతం 24. నల్ల సముద్రం ప్రాంతం నుంచి సన్ ప్లవర్ అయిల్ దిగుమతులు 14 శాతంగా ఉంటాయి. పామాయిల్‌తో పోల్చితే సోయాబీన్, సన్‌ఫ్లవర్ ధర అధికమే. అయినా భారత్‌కు సోయాబీన్, సన్‌ఫ్లవర్ చమురు దిగుమతుల పరిమాణం వార్షికంగా ఐదు శాతం పెరుగుతుంది. నాణ్యతకు వినియోగదారుల ప్రాధాన్యత దీనికి కారణం. అయితే మొత్తంగా చూస్తే, దిగుమతయ్యే వంట నూనెల్లో పామాయిల్‌దే సింహభాగం. దిగువ స్థాయి ఆదాయ వర్గం అధికంగా ఉండడమే దీనికి కారణం. మొత్తం వంట నూనెల వినియోగాన్ని చూస్తే– రిటైల్ రంగంలో ప్యాకేజ్డ్ విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. మొత్తం వినియోగంలో ప్యాకేజ్డ్ విక్రయాల వాటా 40 శాతం. వచ్చే ఐదేళ్లలో ఈ విక్రయాలు వార్షికంగా 6 నుంచి 8 శాతం పెరుగుతాయి. -
మాల్యాకు బ్రిటన్ కోర్టు షాక్
లండన్: ప్రభుత్వ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి లండన్‌కు చెక్కేసిన రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టు భారీ షాకిచ్చింది. తమ రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు చేస్తున్న చట్టబద్దమైన పోరాట వ్యయాలకింద 13 భారతీయ బ్యాంకులకు కనీసం 2 లక్షల పౌండ్లు (రూ.1.80 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా ఆదేశించారు. మరోవైపు మాల్యా ఆస్తులను జప్తు చేసేందుకు సంబంధించిన ఆర్డర్‌ను ఆయన తిరస్కరించారు. అయితే, బ్యాంకులకు అవుతున్న ఖర్చును మాత్రం తప్పకుండా చెల్లించాల్సిందేనని ఆదేశించారు. మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు మాల్యాను పంపాల్సిందిగా కోరుతూ భారత్ వేసిన పిటిషన్‌పై వచ్చే నెల వెస్ట్‌మినిస్టర్ కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. కాగా స్టేట్ బ్యాంకు సహా దేశంలోని 13 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9 వేల కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా 2016లో లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే. -
నిధులొస్తాయి.. మరెందుకిలా?
పోలీస్ మీట్‌కు అయ్యే ఖర్చుకు ప్రజల ‘సహకారం’ గగ్గోలు పెడుతున్న వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు లైవ్‌టెలికాస్ట్ చేస్తామంటేనే ఖర్చులు వెల్లడిస్తామన్న సీపీ విశాఖపట్నం: నగరంలో ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించినా దానికయ్యే ఖర్చు భారాన్ని జనం నెత్తిన వేస్తోంది. తాజాగా పోలీస్మీట్ విషయంలో కూడా ఇదే జరుగుతోందని తెలుస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 2,500 మంది పోలీసులను తీసుకువచ్చి నగరంలో 65వ అఖిల భారత వాలీబాల్ క్లస్టర్ చాంపియన్ షిప్ నిర్వహిస్తున్నారు. దీని నిర్వహణకు అయ్యే ఖర్చులో అధిగ భాగం నగరంలోని విద్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచి వసూలు చేస్తున్నారని ఆయా రంగాల ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. పోలీస్ కంట్రోల్ బోర్డు నుంచి నిధులు వస్తారుు.. అరుునా: నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకూ నగరంలోని ఐదు స్టేడియాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వీటి నిర్వహణ కోసం పోలీసు విభాగం భారీగానే ఏర్పాట్లు చేసింది. కమిషనరేట్ పరిధిలోని డీసీపీ స్థారుు అధికారుల నుంచి హోంగార్డుల వరకూ అందరికీ ఈ ఐదు రోజులూ వేరే పనేమీ అప్పగించలేదు. అందరికీ ప్రత్యేక కమిటీలు వేయగా.. ఎవరికి వారు తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి శాయశక్తులా కష్టపడుతున్నారు. దానిలో భాగమే ఖర్చల నిర్వహణ కూడా. ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడమంటే సాధారణ విషయం కాదు. ఖర్చుతో కూడుకున్న పని. అరుుతే ఈ ఖర్చులకు ఆల్ ఇండియా పోలీస్ కంట్రోల్ బోర్డ్ నుంచి నిధులు సమకూర్చుతుంది. అరుునా నగర వాసులపై ఆధారపడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. నగర వాసులపై భారం ఇలా.. ఈవెంట్‌కు నిర్వహణ కోసం నగరంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, హోటళ్ల నిర్వాహకులు, విద్యా సంస్థల నుంచి అవసరమైన మేరకు సహకారం తీసుకుంటున్నట్లు సమాచారం. క్రీడాకారులు, అతిథులకు అవసరమైన వసతి, భోజనం కోసం నగరంలోని హోటళ్ల నుంచి సహకారం తీసుకున్నారని సంబంధిత వ్యక్తులు ‘సాక్షి’వద్ద వెల్లడించారు. రవాణా కోసం ఆర్టీసీ, విద్యాసంస్థల బస్సులు, పోలీసు వాహనాలు వినియోగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అరుుతే స్కూళ్లు, కళాశాలల బస్సులకు కూడా అద్దె చెల్లిస్తున్నారా అంటే నోరు మెదపడం లేదు. ఇక స్వాగత ప్లెక్సీలు, తాగునీటి సరఫరా, షామియానా..ఇలా అన్ని అవసరాలకు ఆయా వర్గాల నుంచి ‘సహకారం’అందుకుంటున్నారు. ఈ అంశంపై నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ను వివరణ కోరగా.. ’ప్రతీదీ నెగటివ్‌గా చూస్తున్నారు.. లైవ్ టెలికాస్ట్ చేస్తామంటే అన్ని ఖర్చుల వివరాలు చెబుతాను. నేను ఇలా అన్నానని రాసుకోండి’అని చెప్పడం కొసమెరుపు. -
ఇంటికి ఇల్లాలే ఆర్థిక మంత్రి
ఆదాయం మూరెడు.. ఖర్చులు బారెడు చందంగా మారింది సగటు జీవి బతుకు. కొండెక్కి కూర్చున్న కూరగాయలు.. నింగిలోన నిత్యావసర సరుకులు.. చదువు‘కొన’లేని ధైన్యంతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. ఈ పరిస్థితిలో కాస్త ముందు చూపు.. చిన్నపాటి పొదుపు పాటించకపోతే ధరాఘాతం నుంచి గట్టెక్కడం గగనమే. పురుషుడు ఎంత సంపాదిస్తున్నాడన్నది ముఖ్యం కాదు. దేశానికి, రాష్ట్రానికి బడ్జెట్ రూపకల్పన చేసే ఆర్థిక మంత్రి ఎలా వ్యూహ రచన చేసి, వ్యవహరిస్తారో.. అలానే ఇంటి బడ్జెట్‌కు రూపకల్పన చేసే ‘హోమ్’ మినిస్టర్ మసులుకోవాల్సివుంది. ఈ విషయంలో ముందుచూపుతో నడుస్తున్న ఇంతుల మనోగతంపై ప్రత్యేక కథనం. పలమనేరు: ప్రస్తుతం సామాన్య మధ్య తరగతి ప్రజలు ధరాఘాతంతో తల్లడిల్లిపోతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయాలు ఒకటేమిటి అన్నీ వస్తువుల ధరలు నింగిలోని విహరిస్తున్నాయి. దీంతో మగవారు ఎంత సంపాదించినా సంసారం గడవడం లేదు. ఈ క్రమంలో ఇంట్లో పొదుపు పాటించి, కుటుంబాన్ని నడపడంలో ఇల్లాలి పాత్ర క్రియాశీలకం. అందుకే ఇల్లాలే ఇంటికి వెలుగు అంటారు. మగవారు ఎంత సంపాదించినా ఇంటి నెలవారీ బడ్జెట్ రూప కల్పన చేసేది ఆమె. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ కోత పెట్టాలో నిర్ణయించేది కూడా ఆమె. దేశానికి, రాష్ట్రానికి ఆర్థికమంత్రి ఎలాగో ఇంటికి కూడా ఇల్లాలు అంతే. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ ఖర్చులను తగ్గించుకోవడం మినహా మరో గత్యంతరం లేదు. అందుకే మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో డబ్బును పొదుపు చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయని వంటింటి మంత్రులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో అసంఘిటిత వ్యవసాయ కార్మికులు వ్యవసాయేతర కార్మికులు సుమారు16 లక్షల మంది ఉన్నారు. వీరి బతుకులకు పొదుపు చాలా అవసరం. పొదుపులో మహిళల పాత్ర కీలకం. మామూలుగా డబ్బును పొదుపు చేయడంతో మహిళల పాత్ర కీలకం. ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్లే సమయంలో నాలుగు వాటర్‌బాటిళ్ల నీటిని వెంటతీసుకెళ్లడం, ఓ పూట భోజనం ఇంటి నుంచే తీసుకెళ్లడం చేస్తే ఆ రోజు కనీసం రూ.200 ఆదా చేసినట్టే. ఇలా కొంత వరకు అనవసర ఖర్చులను తగ్గిస్తే పొదుపు పెరిగిట్టే. జిల్లాలో మొత్తం 66 మండలాలు, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీలులో కలిపి 80 వేల ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. మొత్తం 10.44 లక్షల మంది పొదుపుపై అవగాహనఉన్నవారే. వీరు కాకుండా సంఘాల్లో లేని మహిళలు నాలుగు లక్షల మంది ఉన్నారు. వీరు సైతం పొదుపు బాట పట్టాలి. పొదుపు సూత్రాలను పాటిస్తున్నా నా భర్త లారీ డ్రైవర్, నెలకు రూ.5 వేలు సంపాదిస్తారు. నేను ఆర్పీగా ఉంటూ రూ.2 వేలు సంపాదిస్తా. ఇక గ్రూపులో లోను తీసుకున్నా, పిల్లలను చదివిస్తూ, కుటుంబ ఖర్చులను తగ్గిస్తూ భవిష్యత్తులో ఇబ్బందులు లేకుం డా జాగ్రత్తపడుతున్నా. అందుకోసం ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేయడం, నెలవారి కుటుంబ బడ్జెట్ రాసుకుంటూ ముందుకెళుతున్నాను. -ప్యారీజాన్, గృహిణి, పలమనేరు పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టాలి నా భర్త బైక్ మెకానిక్, నెలకు ఆయన రూ.10 వేలు సంపాదిస్తారు, నేను చీరల వ్యాపారంలో కొంత సంపాదిస్తా. దీంతో పద్ధతి ప్రకారం ఖర్చు చేసి కొంత పొదుపు చేస్తున్నా. ప్రతి నెలా కనీస అవసరాలకు పోనూ ఎంతో కొంత పొదుపు చేసుకోవడం మనిషికి భవిష్యత్తులో ఓ ధైర్యాన్ని ఇస్తుంది. ఫలితంగా భరోసా లభిస్తుంది. -అన్నపూర్ణ,గృహిణి, పలమనేరు పొదుపు లేకుంటే కష్టాలు తప్పవు ప్రస్తుత పరిస్థితుల్లో పొదుపు చేయడం చాలా అవసరం. ప్రతినెలా కొంత పొదుపు చేసుకోకపోతే అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలు సామాన్యుని జీవితాన్ని పాతాళంలోకి నెట్టి వేస్తాయి. పిల్లల చదువు, వారి భవిష్యత్తుకు పొదుపు చేసుకోవడం ఉత్తమ మార్గం. -గురురాజారావు. రిటైర్డ్ద్యోగులసంఘ నాయకులు, పలమనేరు పొదుపుచేస్తే ఎంతో భరోసా నేను చిల్లరకొట్టు పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తు న్నా. గతంలో చాలా వరకు అప్పులు చేశాను. ఇంటి ఖర్చులు తగ్గించుకుని కొం త పొదుపు చేసుకుంటూ, మరికొంత అప్పులు తీర్చుతున్నా. ఇప్పుడు తెలిసొచ్చింది పొదుపు చేయకుంటే వచ్చే కష్టాలు. దీంతోనే నేను ఇంటి ఖర్చులకు సంబంధించి నెల ముందు గానే లెక్కలు వేసుకుని ఖర్చు చేస్తాను. - శాంతి, గాంధీనగర్, పలమనేరు పొదుపుతో ఎన్నో లాభాలు వచ్చేరాబడిలో ఖర్చులను తగ్గించుకుని కొంత ఆదా చేయడం నేర్చుకుంటే జీవి తం బంగారుమయం అవుతుంది. పొదుపు చేయాలనే ఆలోచన ఉంటే సరిపోదు, దాన్ని ఆచరిస్తేనే ఫలితం కనిపిస్తుంది. మనం ఎంత సంపాదిస్తున్నాం. అందులో ఎంత ఖర్చు పెట్టాలి. ఎంత మిగుల్చుకోవాలి అన్న దానిపైనే పొదుపు ఆ ధారపడి ఉంటుంది. -ఆర్వీ. నరసింహారావు, చీఫ్‌మేనేజర్, ఇండియన్‌బ్యాంకు -
హీరో మహేష్‌బాబును కలిపిస్తామని టోకరా
బంజారాహిల్స్ ఠాణాలో బాధితుడి ఫిర్యాదు బంజారాహిల్స్: సినీ హీరో మహేష్‌బాబును కలిపిస్తానని నమ్మించి మోసం చేసిన అపరిచితుడిపై ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన ప్రేమ్‌రాజ్ రైతు. మూడు నెలల క్రితం ఆయనకు గుండెకు రంధ్రంతో కూతురు పుట్టింది. చికిత్స నిమిత్తం నగరంలోని స్టార్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సినిమా కథలు, పాటులు రాసే అలవాటున్న ప్రేమ్‌రాజ్ తాను నగరంలోనే ఉండటంతో హీరో మహేష్‌బాబుకు తన పాటలు, కథలు వినిపిద్దామనుకున్నాడు. ఆయనను కలవడానికి ఉన్న మార్గాలపై గూగుల్ సెర్చ్ చేయగా... అందులో మహేశ్‌ను కలిపిస్తామని ఒక ఫోన్ నెంబర్ కనిపించింది. ఆ నెంబర్‌కు ఫోన్‌కు చేయగా.. రూ. 10 వేలు ఖర్చు అవుతుందని, అడ్వాన్స్ కింద రూ. 5 వేలు తన ఖాతాలో వేయాలని సదరు వ్యక్తి ప్రేమ్‌రాజ్‌కు చెప్పాడు. మహేశ్‌కు కథ వినిపించే అవకాశమే కల్పించడమే కాకుండా ఆయనతో నీ కూతురి వైద్యానికి ఖర్చులు కూడా ఇప్పిస్తానని నమ్మబలి కాడు. దీంతో ప్రేమ్‌రాజ్ గతనెల 30న ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో రూ. 5 వేలు జమ చేశాడు. తీరా ఈనెల 1న ఆ వ్వక్తికి మళ్లీ ఫోన్‌చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. మూడు రోజులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఐపీసీ 120 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారతీయ ఐటీ కంపెనీలకు మరో షాక్!
వాషింగ్టన్: భారతీయ ఐటీ కంపెనీలకు యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ కొత్త షాక్ ను ఇచ్చింది. ఐటీ కంపెనీలో పని చేయడానికి అమెరికాకు వెళ్లే ప్రతి ఉద్యోగికి అవసరమైన హెచ్-1బీ వీసాకు అదనంగా 4 వేల డాలర్లు (2,68,181 రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదే ఎల్-1 బీ వీసా కోసమైతే 4.5వేల డాలర్లు (3,01704 రూపాయలు) చెల్లించాలని వివరించింది. వీసాలకు ఈ ఫీజులు 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని చెప్పింది. దీంతో భారతీయ ఐటీ కంపెనీలపై 400 మిలియన్ డాలర్ల పెనుభారం పడనుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నదని కంపెనీలు విమర్శించాయి. మరో వైపు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై అమెరికా పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఇందుకు సంబంధించిన వివరాలను తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. 50 మంది కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే ఏ భారతీయ కంపెనీ అయినా హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు ఈ నిబంధనలను వర్తిస్తాయని పోస్టులో వివరించింది. -
స్టాక్స్ వ్యూ
హీరో మోటొకార్ప్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.2,871 టార్గెట్ ధర: రూ.3,050 ఎందుకంటే: భారత టూవీలర్ల పరిశ్రమలో అగ్రస్థానంలో ఉంది. నెలకు సగటున 4 లక్షలకు పైగా టూవీలర్లను విక్రయిస్తోంది. జైపూర్ సమీపంలో ఇటీవలనే ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించింది. రూ.850 కోట్ల పెట్టుబడులతో నిర్మించిన ఈ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ(సీఐటీ) కారణంగా ఉత్పత్తుల పరిశోధనల్లో జాప్యం తగ్గి వ్యయాలు కలసివస్తాయి. రబీ, ఖరీఫ్ పంటలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల టూవీలర్ల పరిశ్రమ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ స్థాయిలోనే ఉండనున్నది. 100 సీసీ సెగ్మెంట్లో పోటీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను తేవడంతో పోటీ పెరిగి లాభాలు తగ్గాయి. ఇది హీరో మోటొకార్ప్ మార్జిన్లపై ఒత్తిడి పెంచుతోంది. గత రెండేళ్లలో ఒక్కటే కొత్త మోడల్‌ను తెచ్చిన ఈ కంపెనీ మూడేళ్లలో 35 కొత్త మోడళ్లను తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన మ్యాస్ట్రో ఎడ్జ్, డ్యుయట్ స్కూటర్లకు, స్ప్లెండర్ ఐ స్మార్ట్, తదితర మోడళ్లకు మంచి స్పందన లభిస్తోంది. ఎగుమతులకు అపార అవకాశాలున్నాయి. ఎగుమతిచేస్తున్న దేశాల సంఖ్యను ప్రస్తుతమున్న 20 నుంచి 40కు పెంచుకోవాలని యోచిస్తోంది. వ్యయ నియంత్రణ పద్ధతులను అమలు చేస్తోంది. గత మూడేళ్లలో అంతంత మాత్రం వృద్ధినే సాధించిన కంపెనీ అమ్మకాలు ఏడాది కాలంలో 11% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. అలాగే షేర్‌వారీ ఆర్జన 18% చొప్పున వృద్ధి సాధిస్తుందని అం చనా. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే ఉంటాయన్న అంచనాలు కంపెనీకి సానుకూలాంశం. ఐఓసీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.2,871 టార్గెట్ ధర: రూ.3,050 ఎందుకంటే: భారత టూవీలర్ల పరిశ్రమలో అగ్రస్థానంలో ఉంది. నెలకు సగటున 4 లక్షలకు పైగా టూవీలర్లను విక్రయిస్తోంది. జైపూర్ సమీపంలో ఇటీవలనే ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించింది. రూ.850 కోట్ల పెట్టుబడులతో నిర్మించిన ఈ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ(సీఐటీ) కారణంగా ఉత్పత్తుల పరిశోధనల్లో జాప్యం తగ్గి వ్యయాలు కలసివస్తాయి. రబీ, ఖరీఫ్ పంటలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల టూవీలర్ల పరిశ్రమ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ స్థాయిలోనే ఉండనున్నది. 100 సీసీ సెగ్మెంట్లో పోటీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను తేవడంతో పోటీ పెరిగి లాభాలు తగ్గాయి. ఇది హీరో మోటొకార్ప్ మార్జిన్లపై ఒత్తిడి పెంచుతోంది. గత రెండేళ్లలో ఒక్కటే కొత్త మోడల్‌ను తెచ్చిన ఈ కంపెనీ మూడేళ్లలో 35 కొత్త మోడళ్లను తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన మ్యాస్ట్రో ఎడ్జ్, డ్యుయట్ స్కూటర్లకు, స్ప్లెండర్ ఐ స్మార్ట్, తదితర మోడళ్లకు మంచి స్పందన లభిస్తోంది. ఎగుమతులకు అపార అవకాశాలున్నాయి. ఎగుమతిచేస్తున్న దేశాల సంఖ్యను ప్రస్తుతమున్న 20 నుంచి 40కు పెంచుకోవాలని యోచిస్తోంది. వ్యయ నియంత్రణ పద్ధతులను అమలు చేస్తోంది. గత మూడేళ్లలో అంతంత మాత్రం వృద్ధినే సాధించిన కంపెనీ అమ్మకాలు ఏడాది కాలంలో 11% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. అలాగే షేర్‌వారీ ఆర్జన 18% చొప్పున వృద్ధి సాధిస్తుందని అం చనా. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే ఉంటాయన్న అంచనాలు కంపెనీకి సానుకూలాంశం. ఐఓసీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్ ప్రస్తుత ధర: రూ.393 టార్గెట్ ధర: రూ.442 ఎందుకంటే: భారత్‌లో అతి పెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ వాటా 49 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 20వేల అవుట్లెట్లతో అతి పెద్ద రిటైల్ అవుట్లెట్ నెట్వర్క్ ఉన్న కంపెనీ ఇదేనని చెప్పవచ్చు. అంతేకాకుండా రెండో అతి పెద్ద రిఫైనింగ్ కెపాసిటీ ఉన్న కంపెనీ కూడా ఇదే. 15 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పారిదిప్ రిఫైనరీ త్వరలో అందుబాటులోకి రానున్నది. రిఫైనింగ్, మార్కెటింగ్ సెగ్మంట్లలలో ఒడిదుడుకులు వచ్చినా, పైప్లైన్ల ఆదాయం నిలక డగా ఉండడటం కంపెనీకి కలసివస్తోంది. జీడీపీ, జనాభా జోరుగా పెరుగుతుండటంతో తలసరి ఇంధన వినియోగం బాగా పెరగనున్నది. భారత ఇంధన రంగంలో చమురు ప్రాధాన్యత కనీసం మరో పాతికేళ్లు కొనసాగనున్నదని అంచనా. పారదీప్‌లోని రిఫైనరీ విస్తరణ తమ కంపెనీ సమర్థతను మరింత పెంచుతుందని ఐఓసీ భావిస్తోంది. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన వినియోగం బాగా పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా విస్తరించి ఉన్నందువల్ల ఇది తమకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.15,600 కోట్ల చమురు ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి. అయితే స్థూల రిఫైనరీ మార్జిన్లు బ్యారెల్‌కు 6.5 డాలర్లు పెరగడం కంపెనీకి కలసివచ్చింది. దీర్ఘకాలానికి రూ.442 టార్గెట్ ధరగా ఈ షేర్‌ను ప్రస్తుత ధరలో కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి క్షీణత,.. కీలకమైన ప్రతికూలాంశాలు. -
ఆ ఖర్చు కూడా పెట్టుబడే
పొదుపు పెట్టుబడులే ఆదాయానికి మార్గం కాదు ఏటేటా ఆదాయం పెంచుకోవాలంటే ఉద్యోగాలు మారాలా? పొదుపు పెట్టుబడులు పెట్టాలా? అయితే కాసేపు ఈ రెండింటి సంగతి పక్కన పెడితే.. కొన్నిసార్లు ఖర్చు పెట్టినది పెట్టుబడి కిందికే వస్తాయి. ఉదాహరణకు ఆరోగ్యం మీద పెట్టుబడి. అంటే వ్యాయామం చేసేందుకు జిమ్‌కు వెళ్లటం.. లేదా జిమ్ సామగ్రిని కొనుగోలు చేయడం వంటివి. వీటి కొనుగోలుకు మొదట్లో కాస్త డబ్బు ఖర్చయినా.. దాంతో వచ్చే శారీరక, మానసిక ఆరోగ్యం మనల్ని అనారోగ్యాలకు దూరం చేస్తుంది. దీంతో ఆసుపత్రులు, వైద్య ఖర్చులంటూ అనవసర ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఓ రకంగా ఆదాయాన్ని ఆదా చేసినట్టేగా! ఖర్చు కూడా పెట్టుబడి కిందే లెక్కే కదా!! ఇలా మన ఆదాయాన్ని రెట్టింపు ఎలా చేసుకోవాలో నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో మీరే చదవండి మరి. మీ మీద మీరే పెట్టుబడి * మీ మీద మీరే పెట్టుబడి పెట్టుకోండి. అంటే క్వాలిటీ లైఫ్ స్టయిల్ కోసమని దానర్థం. దీంతో మీరే కాదు మీ కుటుంబ సభ్యులూ ఆరోగ్యంగా ఉంటారు. రోజురోజుకూ మార్కెట్లోకి వస్తున్న సరికొత్త ట్రెండ్స్, స్కిల్స్, లాంగ్వేజ్‌లను నేర్చుకోండి. సమయం దొరికితే ఉపయుక్తమైన, స్ఫూర్తిదాయకమైన బ్లాగులు, ఆర్టికల్స్‌ను చదవండి. * మీ ఆలోచనలు, సృజనాత్మకతకు పదును పెట్టండి. మీకు నచ్చిన.. వచ్చిన క్రియేటివ్ ఆలోచనలను కార్యరూపమివ్వండి. వీటి మీద మీరు పెట్టే ప్రతి పైసా భవిష్యత్తులో ఉపయుక్తమే. సృజనాత్మక ఆలోచనలతో వ్యక్తిగతంగానే కాకుండా వ్యవస్థాగతంగానూ గుర్తింపు పొందుతారు. మీకు మీరే రీచార్జ్ అవుతారు. * దీంతో ఆదాయం ఎలా పెరుగుతుందంటే.. సృజనాత్మకత.. నైపుణ్యం, విస్తృతమైన పరిజ్ఞానం ఉన్నవారికి మార్కెట్లో బోలెడన్నీ ఆదాయ మార్గాలు, అవకాశాలుంటాయి. దీర్ఘకాలమే బెటర్ * మనలో చాలామంది స్వల్పకాలిక అవసరాలపైనే ఎక్కువగా దృష్టిపెడతారు.. ఉదాహరణకు పదవీ విరమణ తర్వాత జీవితం కోసం పెట్టుబడి పెట్టకపోవడం, ఇల్లు కొనుగోలులాంటివి. ఈ కోవలోకే వస్తాయి. వీటికోసం ఆర్జన మొదలు పెట్టినప్పటి నుంచే ప్రణాళిక వేసుకోవాలి. నెలనెలా కొంత మొత్తాన్ని మదుపు చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. మనసులో పెద్ద లక్ష్యాలను నిర్ణయించుకున్నప్పుడు అనవసర వ్యయాలు చేయడానికి మనసొప్పదు. ఈక్విటీల వంటివాటిలో పెట్టుబడులకైతే కనీసం ఐదేళ్ల కంటే ఎక్కువుండేలా చూసుకోవాలి. అదే రుణ సంబంధిత పెట్టుబడులైతే సాధ్యమైనంత వరకూ ఐదేళ్ల కంటే తక్కువుండేలా చూసుకోవటం మంచిది. * దీనికీ ఆదాయ ఆర్జనకేంటీ సంబంధం అంటే.. తెలివిగా మనం పెట్టే ప్రతిపైసకూ లాభాలొస్తాయి. అంతేగానీ తొందరపాటుతో క్షణికావసరాల మీద పెట్టుబడులు పెట్టొద్దు. ఆరోగ్యం మీద పెట్టుబడి * నిజమైన ఆదాయమంటే ఆరోగ్యమే. అందుకే పెట్టుబడుల్లో కొంతలో కొంతైనా శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యాలపై పెట్టడం మేలు. * శారీరక, మానసిక ఆరోగ్యమంటే.. ఓ సర్వే ప్రకారం పట్టణాల్లో ఉండే చాలా మంది ఉద్యోగులు మానసిక రుగ్మతలకు లోనవుతున్నారట. పని ఒత్తిడి, రక్తపోటు, ఆగ్రహావేశాలు ఇందుకు కారణమట. దీంతో ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతాం. అందుకే నిత్యం వ్యాయామం, యోగా, ప్రాణామాయం వంటివి చేయాలి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అనారోగ్య ఖర్చులు తగ్గుతాయి. సాధ్యమైనంత వరకు ఇంటి తిండి తిన డమే బెటర్. * సామాజిక ఆరోగ్యమంటే.. మనమే కాదు మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ఆరోగ్యకరంగా ఉంచితేనే మనం ఆరోగ్యంగా ఉంటా. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు, పర్యావరణం పచ్చగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన ఆలోచనలు రెట్టింపు ఉత్సాహంతో సాగుతాయి. మీరు వ్యక్తిగతంగానే కాదు.. సామాజికంగానూ పురోగమిస్తారు. కెరీర్ మీద దృష్టి.. కెరీర్ మీద పెట్టుబడులు.. అదీ దీర్ఘకాలికంగా ఉపయోగపడే కెరీర్ మీద పెట్టడం మంచిది. అప్పుడే వృత్తిలోను, ప్రవృత్తిలోనూ వేగంగా ముందుకెళతారు. ఉదాహరణకు.. మన వృత్తిపరమైన అవసరాలేంటో గుర్తించి వాటి మీద పెట్టుబడులు పెట్టాలి. అంటే వృత్తిపరంగా మన బలం, బలహీనతలేంటో గుర్తించాలి. అందుకు తగ్గ శిక్షణ తీసుకోవాలి. సరికొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. అప్పుడే సుశిక్షితులైన ఉద్యోగిగా.. ప్రొఫెషనల్‌గా గుర్తించబడి మరింత మెరుగైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. దీంతో మీ సామర్థ్యానికి సరైన వృత్తిలో రెట్టింపు ఆదాయాన్ని ఆర్జిస్తారు. బీమా కూడా పెట్టుబడే ప్రమాదాలను ఎదుర్కొవడానికి తీసుకునే బీమా కవరేజ్‌లు కూడా మనల్ని కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్తాయి కూడా. వ్యక్తిగత బీమానే కాదు.. వాహన, గృహ బీమాలూ అలాంటివన్నమాట. ఎందుకంటే ప్రమాదాలు ఎదురైతే వ్యక్తిగత బీమా ఉంటే ఆసుపత్రి, వైద్య ఖర్చులకు ఎలాగైతే బీమా ఉంటుందో.. అలాగే వాహన, గృహ ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటికీ బీమా వర్తిస్తుంది. దీంతో అకస్మాత్తుగా వచ్చే పెద్ద ఖర్చుల నుంచి బయటపడతాం. అంటే జేబులోని చిల్లిగవ్వ ఖర్చు కాకుండా వాటిని తిరిగి పొందుతామన్నమాట. ఇదీ ఓ రకంగా ఆదాయాన్ని ఆదా చేసినట్టేగా. -
డీఎల్ఎఫ్ లాభం 132 కోట్లు
వ్యయాలు తగ్గడంతో పెరిగిన లాభం న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 21 శాతం వృద్ధి చెంది రూ.132 కోట్లకు పెరిగింది. అమ్మకాలు తగ్గినా, తక్కువ వ్యయాల కారణంగా నికర లాభం పెరిగిందని డీఎల్ఎఫ్ తెలిపింది. గత క్యూ2లో రూ.109 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. అయితే గత క్యూ2లో రూ.2,013 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం మాత్రం ఈ క్యూ2లో 7 శాతం క్షీణించి రూ.1,865 కోట్లకు తగ్గిందని వివరించింది. అలాగే మొత్తం ఆదాయం రూ.2,136 కోట్ల నుంచి 6 శాతం క్షీణించి రూ.1,997 కోట్లకు తగ్గిందని కంపెనీ సీఎఫ్ఓ అశోక్ త్యాగి చెప్పారు. మొత్తం వ్యయాలు రూ.1,357 కోట్ల నుంచి రూ.1,071 కోట్ల కు తగ్గాయన్నారు. వడ్డీ వ్యయాలు రూ.603 కోట్ల నుంచి రూ.706 కోట్లకు పెరిగాయని, పన్ను భారంరూ.43 కోట్ల నుంచి రూ.78 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిధులు తగినంతగా లభ్యంకాకపోవడం, దీంతో పలు ప్రాజెక్టులు సగం సగం మాత్రమే పూర్తికావడం, వినియోగదారుల్లో కొనగోళ్ల ఆసక్తి లేకపోవడం, మౌలిక రంగ సమస్యలు, వివిధ అనుమతులు పొందడంలో జాప్యం, పెట్టుబడులపై వడ్డీ భారం.. ఈ అంశాలన్నీ రియల్టీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. డీఎల్ఎఫ్కు 30 కోట్ల చదరపుటడుగుల ల్యాండ్ బ్యాంక్ ఉంది. దీంట్లో 5 కోట్ల చదరపుటడుగుల భూమి వివిధ ప్రాజెక్టుల కింద నిర్మాణంలో ఉంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేరు బీఎస్ఈలో 1.2 శాతం వృద్ధితో రూ.120 వద్ద ముగిసింది. -
మెట్రోరైల్ మరింత ఆలస్యం
-
జలహారం
రూ.3 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ చైనా ప్రతినిధుల ముందుకుప్రతిపాదనలు యాదాద్రికి కేశవాపూర్ నీరు 1440 కి.మీ. పరిధిలో నీటి సరఫరా నెట్వర్క్ రెండు భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ జలహారానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. సుమారు రూ.3 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ సమగ్ర నీటి సరఫరా వ్యవస్థకు చైనా ఆర్థిక సాయం అందించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టనున్న అభివృద్ధి పథకాలకు ఆర్థిక సాయానికి చైనా బృందం సుముఖత వ్యక్తం చేయడంతో ఈ ప్రతిపాదనలకు మోక్షం కలిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదే అంశంపై సోమవారం చైనా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా గ్రేటర్లో 158 కి.మీ. మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ జలహారం ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఓఆర్ఆర్ లోపల సుమారు 1440 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీలు, గ్రామ పంచాయతీల్లో మంచినీటి సరఫరాకు అవసరమైన ప్రధాన, పంపిణీ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీనివల్ల ఔటర్ చుట్టూ కొరత ఉన్న ప్రాంతాలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మంచినీటిని తరలించే అవకాశం ఉంటుంది. నల్లగొండ జిల్లా దేవులమ్మ నాగారం, రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలోని కేశవాపూర్‌లో భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించనున్నారు. కృష్ణ, గోదావరి, మంజీర, సింగూరు, జంట జలాశయాల నీటిని మహా నగరం నలుమూలలకు సరఫరా చేయనున్నారు. ఆదిబట్ల, ఘట్కేసర్ ప్రాంతాల్లో విస్తరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్) పరిధికి మంచినీటిని సరఫరా చేయనున్నారు. కేశవాపూర్ రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాలోని యాదాద్రి దేవస్థానానికి తాగునీటిని అందించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రూ.1500 కోట్లతో దేవులమ్మ నాగారం రిజర్వాయర్ ... నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం, మల్కాపూర్ సరిహద్దుల్లో రూ.1500 కోట్ల అంచనాతో భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరం-మిడ్ మానేరు-కొమురెల్లి మల్లన్న సాగర్ (మెదక్) మీదుగా కేశవాపూర్‌కు నీటిని తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన రెండు వేల ఎకరాలు ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ జలాశయాన్ని కాంక్రీట్‌తో భూ మట్టానికి 70-80 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారు. పాలమూరు ఎత్తిపోతల, డిండి పథకం ద్వారా కొంతమార్గంలో పంపింగ్.... మరి కొంత మార్గంలో గ్రావిటీ ద్వారా 20 టీఎంసీల జలాలను తరలించి దీనిని నింపనున్నారు. వర్షాకాలంలో నీటి లభ్యత అధికంగా ఉన్నప్పుడే ఈ భారీ జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపే అవకాశం ఉంటుం దని నిపుణులు చెబుతున్నారు. రూ.1200 కోట్లతో కేశవాపురం రిజర్వాయర్ రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 15 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. దీనికి అవసరమైన 3600 ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ భూములు అందుబాటులో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీన్ని భూ మట్టం నుంచి 60 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. గోదావరి మంచినీటి పథకం మొద టి, రెండు, మూడో దశల్లో తరలించనున్న నీటితో ఈ జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గోదావరిలో సమృద్ధిగా వరద ప్రవాహం ఉన్నప్పుడే ఈ రిజర్వాయర్ పూర్తి స్థాయి జలకళ సంతరించుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ జలాశయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న యాదాద్రి దేవస్థానానికి మంచినీటిని అందించవచ్చని తెలిపారు. -
ప్రొటోకాల్ కష్టాలు
మంత్రులు, వీఐపీల ఖర్చులు తడిసిమోపెడు కీలక శాఖల అధికారులపైనే భారం జనం నుంచి వసూళ్లకుపాల్పడుతున్న వైనం నెలకు రూ.20లక్షలపైనే అనధికారిక ఖర్చు మంత్రులు, వీఐపీల ప్రొటోకాల్ ఖర్చులు పెనుభారంగా పరిణమిస్తున్నాయి. ఇటీవల నగరానికి వీఐపీల తాకిడి పెరగడంతో నెలకు రూ.20లక్షల పైనే అనధికారికంగా ఖర్చవుతోంది. ఒక్కో మంత్రికి రోజుకు రూ.10వేల పైబడే ఖర్చు చేస్తున్నారు. విజయవాడ : నగరానికి ప్రొటోకాల్ తాకిడి ఎక్కువైంది. ముఖ్యమంత్రి మొదలుకుని రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారుల వరకు అందరూ నగరంలోనే ఎక్కువగా ఉండటంతో ప్రొటోకాల్ ఖర్చులు పెనుభారంగా పరిణమిస్తున్నాయి. ఉన్నతాధికారుల సూచనలతో రెవెన్యూ విభాగంలోని అధికారులు ప్రొటోకాల్‌ను విభజించి సంబంధిత శాఖల అధికారులకే ఆ బాధ్యతలు, ఖర్చులు అప్పగిస్తున్నారు. ఏ శాఖతో సంబంధం లేని కొందరు వీఐపీల ఖర్చును ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. దీంతో జిల్లాలో నెలకు ప్రొటోకాల్ పేరిట సుమారు రూ.20లక్షలపైనే ఖర్చవుతోంది. ఆయా శాఖలపైనే భారం వ్యక్తిగత పర్యటనల నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం వరకూ వివిధ కార్యక్రమాల నిమిత్తం నెలకు సగటున 50 మందికి పైగా వీఐపీలు నగరానికి వస్తున్నారు. ఇవికాకుండా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రోజూ మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు వస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రొటోకాల్ ఖర్చు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. వివిధ శాఖల మంత్రులు వస్తే హోటల్ బస నుంచి రవాణా సౌకర్యం వరకు అన్నీ ఆయా శాఖల అధికారులే చూసుకుంటారు. ఒక్కో మంత్రికి రోజుకు రూ.10వేల ఖర్చు ప్రొటోకాల్ బాధ్యతలు రెవెన్యూ సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. పూర్తి బాధ్యతలన్నీ తహశీల్దార్వే. అమాత్యులు, వారి బంధువుల బస, భోజన, ఫలహారాలను రోజుకు రూ.10వేల వరకు ఖర్చవుతోంది. ఇలా నెలకు ఒక్కో డిపార్టుమెంట్‌కు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. మరి.. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోందంటే.. జనంపైనే భారం ప్రొటోకాల్ ఖర్చులంటూ కొన్ని శాఖల్లో అధికారులు, సిబ్బంది.. జనాన్ని బాదేస్తున్నారు. అమాత్యుల ఖర్చులకు రెవెన్యూ, ఎక్సైజ్, విజిలెన్స్, రవాణా, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తమ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి నుంచి ఈ సొమ్ము వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది ప్రొటోకాల్ ఖర్చులంటూ ప్రతి కాగితానికీ డబ్బు వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ అధికారులు కొరడా ఝళిపించి మరీ వసూలు చేస్తున్నట్లు వ్యాపారులు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీస్, రవాణా శాఖ అధికారులు కూడా లారీ యజమానులు, వాహనచోదకుల నుంచి వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వంతులవారీగా తమకు వచ్చే లంచాల నుంచి ఖర్చు చేస్తున్నారు. సమాచార పౌరసంబంధాలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఉద్యానవన తదితర శాఖల్లో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది బడ్జెట్ లేక అప్పులుచేసి ఖర్చు చేస్తున్నారు. -
దుమ్ముగూడెం ప్రాజెక్టుకు మంగళం!
హైడల్ ప్రాజెక్టు రద్దుకు నీటిపారుదల, విద్యుత్‌శాఖల సూత్రప్రాయ నిర్ణయం డ్యామ్‌కు అయ్యే ఖర్చు రూ.2 వేల కోట్లు భరించేందుకు వెనుకడుగు సాగుభూమిలేని ప్రాజెక్టుకు నిధులు ఖర్చు చేయలేమన్న నీటిపారుదల శాఖ అంత వ్యయం భరించలేమని చేతులెత్తేసిన విద్యుత్ శాఖ హైదరాబాద్: దుమ్ముగూడెం జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం స్వస్తి పలికింది! ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారం కానుండడం, దీనిని భరించేందుకు నీటిపారుదల శాఖ, ఇంధన శాఖలు చేతులెత్తేయడంతో ఈ నిర్ణయానికి వచ్చింది. నీటిపారుదల శాఖ, ఇంధన శాఖలు నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణానికి మంగళం పాడాలని నిర్ణయించింది. తెలంగాణలో గోదావరి నదిపై కంతనపల్లి, దుమ్ముగూడెం వద్ద జల విద్యుత్ కేంద్రాలు నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్దకాలంగా ఉంది. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం దుమ్ముగూడెం వద్ద జలాశయంతోపాటు, విద్యుత్ కేంద్రం నిర్మాణంపై బుధవారం రాష్ట్ర నీటిపారుదల, ఇంధన శాఖలు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిలతో పాటు ఇరు శాఖల కార్యదర్శులు ఎస్కే జోషీ, అరవింద కుమార్, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు పాల్గొని ప్రాజెక్టు నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చించారు. దుమ్ముగూడెం జలాశయంతోపాటు, విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రూ.2,458 కోట్లు వ్యయం అవుతుందని 2010-11లో జెన్కో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించింది. డ్యాంకు రూ.1,423 కోట్లు, విద్యుత్ కేంద్రానికి రూ.720 కోట్లు, పెట్టుబడి రుణాలపై నిర్మాణ కాల వడ్డీ(ఐడీసీ)లకు రూ.315 కోట్లు వెచ్చించాలి ఉంటుందని పేర్కొంది. 2015-16 ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) ప్రకారం ఈ అంచనాలు రూ.3 వేల కోట్లు దాటుతుందని, అందులో డ్యామ్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు, విద్యుత్ కేంద్రానికి రూ.వెయ్యి కోట్ల ఖర్చు కానుందని జెన్కో ఈ సమావేశంలో నివేదించింది. చేతులెత్తేసిన రెండు శాఖలు దుమ్ముగూడెం, కంతనపల్లి జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయాన్ని నీటిపారుదల శాఖే భరించాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, వ్యయం భరించేందుకు ఆ శాఖ విముఖత వ్యక్తం చేసింది. కనీసం డ్యాం నిర్మాణం వ్యయాన్ని భరించినా... విద్యుత్ కేంద్రాన్ని తామే నిర్మించుకుంటామని జెన్కో మరో ప్రతిపాదన చేసినా నీటిపారుదల శాఖ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ప్రతిపాదిత దుమ్ముగూడెం డ్యాం కింద ఎకరా ఆయకట్టు లేనందున ఈ ప్రాజెక్టుపై పెట్టుబడి పెట్టలేమని తేల్చి చెప్పింది. 320 (8ఁ40) మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు కోసం రూ.3 వేల కోట్లను వెచ్చించడం తమ వల్ల కాదని, ఒకవేళ నిర్మించినా విద్యుత్పత్తి వ్యయం తడిసి మోపెడవుతుందని జెన్కో అభిప్రాయపడింది. ఇంత వ్యయంతో విద్యుత్కేంద్రం నిర్మించేందుకు కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) సైతం అనుమతి ఇవ్వదని తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. దీనిపై త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. ఆ తర్వాత అధికారిక నిర్ణయం వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఎయిర్ ఇండియా ఖర్చులు తగ్గించుకోవాలి
పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు ఆదేశం న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా తన నిర్వహణ పద్దులకు సంబంధించిన వ్యయాలను కనీసం 10% తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పని తీరును మెరుగుపరచుకోవాలని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఎయిర్ ఇండియా అధికారులను ఆదేశించారు. ఎయిర్ ఇండియా పనితీరుపై ఎయిర్ ఇండియా అధికారులు ఇచ్చిన ప్రజంటేషన్ అనంతరం ఈయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ ఇండియా సీఎండీ రోహిత్ నందన్, ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రజంటేషన్ను ఇచ్చారు. త్వరితంగా టర్న్ అరౌండ్ ఎయిర్ ఇండియా గత ఆరునెలల పనితీరును అశోక్ గజపతి రాజు సమీక్షించారు. ఈ ఆరు నెలల కాలంలో కంపెనీ మార్కెట్ వాటా, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులను నడపాలని, జాప్యాన్ని నివారించాలని, విమాన సర్వీసులు ఆలస్యమైతే, ఆ వివరాలను సకాలంలో ప్రయాణికులకు అందించాలని పేర్కొన్నారు. ఏదైనా సంక్షోభం ఉత్పన్నమైతే, ఎదుర్కొనేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. త్వరితంగా టర్న్ అరౌండ్ సాధించేందుకు విమానయాన ఇంధనం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో లాభదాయకత మెరుగుపరుచుకునేందుకు వేగవంతమైన చర్యలను తీసుకోవాలని, వీలైనంత త్వరగా టర్న్ అరౌండ్ సాధించాలని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.5,400 కోట్ల నష్టాలు వచ్చాయి.