
స్టాక్స్ వ్యూ
హీరో మోటొకార్ప్
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.2,871
టార్గెట్ ధర: రూ.3,050
ఎందుకంటే: భారత టూవీలర్ల పరిశ్రమలో అగ్రస్థానంలో ఉంది. నెలకు సగటున 4 లక్షలకు పైగా టూవీలర్లను విక్రయిస్తోంది. జైపూర్ సమీపంలో ఇటీవలనే ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించింది. రూ.850 కోట్ల పెట్టుబడులతో నిర్మించిన ఈ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ(సీఐటీ) కారణంగా ఉత్పత్తుల పరిశోధనల్లో జాప్యం తగ్గి వ్యయాలు కలసివస్తాయి. రబీ, ఖరీఫ్ పంటలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల టూవీలర్ల పరిశ్రమ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ స్థాయిలోనే ఉండనున్నది. 100 సీసీ సెగ్మెంట్లో పోటీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను తేవడంతో పోటీ పెరిగి లాభాలు తగ్గాయి. ఇది హీరో మోటొకార్ప్ మార్జిన్లపై ఒత్తిడి పెంచుతోంది. గత రెండేళ్లలో ఒక్కటే కొత్త మోడల్‌ను తెచ్చిన ఈ కంపెనీ మూడేళ్లలో 35 కొత్త మోడళ్లను తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన మ్యాస్ట్రో ఎడ్జ్, డ్యుయట్ స్కూటర్లకు, స్ప్లెండర్ ఐ స్మార్ట్, తదితర మోడళ్లకు మంచి స్పందన లభిస్తోంది. ఎగుమతులకు అపార అవకాశాలున్నాయి. ఎగుమతిచేస్తున్న దేశాల సంఖ్యను ప్రస్తుతమున్న 20 నుంచి 40కు పెంచుకోవాలని యోచిస్తోంది. వ్యయ నియంత్రణ పద్ధతులను అమలు చేస్తోంది. గత మూడేళ్లలో అంతంత మాత్రం వృద్ధినే సాధించిన కంపెనీ అమ్మకాలు ఏడాది కాలంలో 11% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. అలాగే షేర్‌వారీ ఆర్జన 18% చొప్పున వృద్ధి సాధిస్తుందని అం చనా. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే ఉంటాయన్న అంచనాలు కంపెనీకి సానుకూలాంశం.
ఐఓసీ
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.2,871
టార్గెట్ ధర: రూ.3,050
ఎందుకంటే: భారత టూవీలర్ల పరిశ్రమలో అగ్రస్థానంలో ఉంది. నెలకు సగటున 4 లక్షలకు పైగా టూవీలర్లను విక్రయిస్తోంది. జైపూర్ సమీపంలో ఇటీవలనే ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించింది. రూ.850 కోట్ల పెట్టుబడులతో నిర్మించిన ఈ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ(సీఐటీ) కారణంగా ఉత్పత్తుల పరిశోధనల్లో జాప్యం తగ్గి వ్యయాలు కలసివస్తాయి. రబీ, ఖరీఫ్ పంటలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల టూవీలర్ల పరిశ్రమ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ స్థాయిలోనే ఉండనున్నది. 100 సీసీ సెగ్మెంట్లో పోటీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను తేవడంతో పోటీ పెరిగి లాభాలు తగ్గాయి. ఇది హీరో మోటొకార్ప్ మార్జిన్లపై ఒత్తిడి పెంచుతోంది. గత రెండేళ్లలో ఒక్కటే కొత్త మోడల్‌ను తెచ్చిన ఈ కంపెనీ మూడేళ్లలో 35 కొత్త మోడళ్లను తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన మ్యాస్ట్రో ఎడ్జ్, డ్యుయట్ స్కూటర్లకు, స్ప్లెండర్ ఐ స్మార్ట్, తదితర మోడళ్లకు మంచి స్పందన లభిస్తోంది. ఎగుమతులకు అపార అవకాశాలున్నాయి. ఎగుమతిచేస్తున్న దేశాల సంఖ్యను ప్రస్తుతమున్న 20 నుంచి 40కు పెంచుకోవాలని యోచిస్తోంది. వ్యయ నియంత్రణ పద్ధతులను అమలు చేస్తోంది. గత మూడేళ్లలో అంతంత మాత్రం వృద్ధినే సాధించిన కంపెనీ అమ్మకాలు ఏడాది కాలంలో 11% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. అలాగే షేర్‌వారీ ఆర్జన 18% చొప్పున వృద్ధి సాధిస్తుందని అం చనా. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే ఉంటాయన్న అంచనాలు కంపెనీకి సానుకూలాంశం.
ఐఓసీ
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్
ప్రస్తుత ధర: రూ.393
టార్గెట్ ధర: రూ.442
ఎందుకంటే: భారత్‌లో అతి పెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ వాటా 49 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 20వేల అవుట్‌లెట్లతో అతి పెద్ద రిటైల్ అవుట్‌లెట్ నెట్‌వర్క్ ఉన్న కంపెనీ ఇదేనని చెప్పవచ్చు. అంతేకాకుండా రెండో అతి పెద్ద రిఫైనింగ్ కెపాసిటీ ఉన్న కంపెనీ కూడా ఇదే. 15 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పారిదిప్ రిఫైనరీ త్వరలో అందుబాటులోకి రానున్నది. రిఫైనింగ్, మార్కెటింగ్ సెగ్మంట్లలలో ఒడిదుడుకులు వచ్చినా, పైప్‌లైన్ల ఆదాయం నిలక డగా ఉండడటం కంపెనీకి కలసివస్తోంది. జీడీపీ, జనాభా జోరుగా పెరుగుతుండటంతో తలసరి ఇంధన వినియోగం బాగా పెరగనున్నది. భారత ఇంధన రంగంలో చమురు ప్రాధాన్యత కనీసం మరో పాతికేళ్లు కొనసాగనున్నదని అంచనా. పారదీప్‌లోని రిఫైనరీ విస్తరణ తమ కంపెనీ సమర్థతను మరింత పెంచుతుందని ఐఓసీ భావిస్తోంది. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన వినియోగం బాగా పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా విస్తరించి ఉన్నందువల్ల ఇది తమకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.15,600 కోట్ల చమురు ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి. అయితే స్థూల రిఫైనరీ మార్జిన్లు బ్యారెల్‌కు 6.5 డాలర్లు పెరగడం కంపెనీకి కలసివచ్చింది. దీర్ఘకాలానికి రూ.442 టార్గెట్ ధరగా ఈ షేర్‌ను ప్రస్తుత ధరలో కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి క్షీణత,.. కీలకమైన ప్రతికూలాంశాలు.