![నిధులొస్తాయి.. మరెందుకిలా? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/41480634481_625x300.jpg.webp?itok=SLMsuuwm)
నిధులొస్తాయి.. మరెందుకిలా?
పోలీస్ మీట్‌కు అయ్యే ఖర్చుకు ప్రజల ‘సహకారం’
గగ్గోలు పెడుతున్న వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు
లైవ్‌టెలికాస్ట్ చేస్తామంటేనే ఖర్చులు వెల్లడిస్తామన్న సీపీ
విశాఖపట్నం: నగరంలో ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించినా దానికయ్యే ఖర్చు భారాన్ని జనం నెత్తిన వేస్తోంది. తాజాగా పోలీస్‌మీట్ విషయంలో కూడా ఇదే జరుగుతోందని తెలుస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 2,500 మంది పోలీసులను తీసుకువచ్చి నగరంలో 65వ అఖిల భారత వాలీబాల్ క్లస్టర్ చాంపియన్ షిప్ నిర్వహిస్తున్నారు. దీని నిర్వహణకు అయ్యే ఖర్చులో అధిగ భాగం నగరంలోని విద్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచి వసూలు చేస్తున్నారని ఆయా రంగాల ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు.
పోలీస్ కంట్రోల్ బోర్డు నుంచి నిధులు వస్తారుు.. అరుునా: నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకూ నగరంలోని ఐదు స్టేడియాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వీటి నిర్వహణ కోసం పోలీసు విభాగం భారీగానే ఏర్పాట్లు చేసింది. కమిషనరేట్ పరిధిలోని డీసీపీ స్థారుు అధికారుల నుంచి హోంగార్డుల వరకూ అందరికీ ఈ ఐదు రోజులూ వేరే పనేమీ అప్పగించలేదు. అందరికీ ప్రత్యేక కమిటీలు వేయగా.. ఎవరికి వారు తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి శాయశక్తులా కష్టపడుతున్నారు. దానిలో భాగమే ఖర్చల నిర్వహణ కూడా. ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడమంటే సాధారణ విషయం కాదు. ఖర్చుతో కూడుకున్న పని. అరుుతే ఈ ఖర్చులకు ఆల్ ఇండియా పోలీస్ కంట్రోల్ బోర్డ్ నుంచి నిధులు సమకూర్చుతుంది. అరుునా నగర వాసులపై ఆధారపడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
నగర వాసులపై భారం ఇలా..
ఈవెంట్‌కు నిర్వహణ కోసం నగరంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, హోటళ్ల నిర్వాహకులు, విద్యా సంస్థల నుంచి అవసరమైన మేరకు సహకారం తీసుకుంటున్నట్లు సమాచారం. క్రీడాకారులు, అతిథులకు అవసరమైన వసతి, భోజనం కోసం నగరంలోని హోటళ్ల నుంచి సహకారం తీసుకున్నారని సంబంధిత వ్యక్తులు ‘సాక్షి’వద్ద వెల్లడించారు. రవాణా కోసం ఆర్టీసీ, విద్యాసంస్థల బస్సులు, పోలీసు వాహనాలు వినియోగిస్తున్నారు.
ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అరుుతే స్కూళ్లు, కళాశాలల బస్సులకు కూడా అద్దె చెల్లిస్తున్నారా అంటే నోరు మెదపడం లేదు. ఇక స్వాగత ప్లెక్సీలు, తాగునీటి సరఫరా, షామియానా..ఇలా అన్ని అవసరాలకు ఆయా వర్గాల నుంచి ‘సహకారం’అందుకుంటున్నారు. ఈ అంశంపై నగర పోలీస్ కమిషనర్ యోగానంద్‌ను వివరణ కోరగా.. ’ప్రతీదీ నెగటివ్‌గా చూస్తున్నారు.. లైవ్ టెలికాస్ట్ చేస్తామంటే అన్ని ఖర్చుల వివరాలు చెబుతాను. నేను ఇలా అన్నానని రాసుకోండి’అని చెప్పడం కొసమెరుపు.