భారతీయ ఐటీ కంపెనీలకు మరో షాక్! | Indian IT companies to pay $4,000 more for every H-1B visa | Sakshi
Sakshi News home page

భారతీయ ఐటీ కంపెనీలకు మరో షాక్!

Published Fri, May 27 2016 2:06 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM

భారతీయ ఐటీ కంపెనీలకు మరో షాక్! - Sakshi

భారతీయ ఐటీ కంపెనీలకు మరో షాక్!

వాషింగ్టన్: భారతీయ ఐటీ కంపెనీలకు యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ కొత్త షాక్ ను ఇచ్చింది. ఐటీ కంపెనీలో పని చేయడానికి అమెరికాకు వెళ్లే ప్రతి ఉద్యోగికి అవసరమైన హెచ్-1బీ వీసాకు అదనంగా 4 వేల డాలర్లు (2,68,181 రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదే ఎల్-1 బీ వీసా కోసమైతే 4.5వేల డాలర్లు (3,01704 రూపాయలు) చెల్లించాలని వివరించింది. వీసాలకు ఈ ఫీజులు 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని చెప్పింది.

దీంతో భారతీయ ఐటీ కంపెనీలపై 400 మిలియన్ డాలర్ల పెనుభారం పడనుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నదని కంపెనీలు విమర్శించాయి. మరో వైపు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై అమెరికా పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఇందుకు సంబంధించిన వివరాలను తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. 50 మంది కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే ఏ భారతీయ కంపెనీ అయినా హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు ఈ నిబంధనలను వర్తిస్తాయని పోస్టులో వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement