ఇంటికి ఇల్లాలే ఆర్థిక మంత్రి | every lady finance minister at her home | Sakshi
Sakshi News home page

ఇంటికి ఇల్లాలే ఆర్థిక మంత్రి

Published Thu, Jul 7 2016 1:08 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

every lady finance minister at her  home

ఆదాయం మూరెడు.. ఖర్చులు బారెడు చందంగా మారింది సగటు జీవి బతుకు. కొండెక్కి కూర్చున్న కూరగాయలు.. నింగిలోన నిత్యావసర సరుకులు.. చదువు‘కొన’లేని ధైన్యంతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. ఈ పరిస్థితిలో  కాస్త ముందు చూపు.. చిన్నపాటి పొదుపు పాటించకపోతే ధరాఘాతం నుంచి గట్టెక్కడం గగనమే. పురుషుడు ఎంత సంపాదిస్తున్నాడన్నది ముఖ్యం కాదు. దేశానికి, రాష్ట్రానికి బడ్జెట్ రూపకల్పన చేసే ఆర్థిక మంత్రి ఎలా వ్యూహ రచన చేసి, వ్యవహరిస్తారో.. అలానే ఇంటి బడ్జెట్‌కు రూపకల్పన చేసే ‘హోమ్’ మినిస్టర్ మసులుకోవాల్సివుంది. ఈ విషయంలో ముందుచూపుతో నడుస్తున్న ఇంతుల మనోగతంపై ప్రత్యేక కథనం.
 
పలమనేరు:  ప్రస్తుతం సామాన్య మధ్య తరగతి ప్రజలు ధరాఘాతంతో తల్లడిల్లిపోతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయాలు ఒకటేమిటి అన్నీ వస్తువుల ధరలు నింగిలోని విహరిస్తున్నాయి. దీంతో మగవారు ఎంత సంపాదించినా సంసారం గడవడం లేదు. ఈ క్రమంలో ఇంట్లో పొదుపు పాటించి, కుటుంబాన్ని నడపడంలో ఇల్లాలి పాత్ర క్రియాశీలకం. అందుకే ఇల్లాలే ఇంటికి వెలుగు అంటారు. మగవారు ఎంత సంపాదించినా ఇంటి నెలవారీ బడ్జెట్ రూప కల్పన చేసేది ఆమె.  దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ కోత పెట్టాలో నిర్ణయించేది కూడా ఆమె. దేశానికి, రాష్ట్రానికి ఆర్థికమంత్రి ఎలాగో ఇంటికి కూడా ఇల్లాలు అంతే. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ ఖర్చులను తగ్గించుకోవడం మినహా మరో గత్యంతరం లేదు. అందుకే మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో డబ్బును పొదుపు చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయని వంటింటి మంత్రులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో అసంఘిటిత వ్యవసాయ కార్మికులు వ్యవసాయేతర కార్మికులు సుమారు16 లక్షల మంది ఉన్నారు. వీరి బతుకులకు పొదుపు చాలా అవసరం.
 
పొదుపులో మహిళల పాత్ర కీలకం.
మామూలుగా డబ్బును పొదుపు చేయడంతో మహిళల పాత్ర కీలకం. ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్లే సమయంలో నాలుగు వాటర్‌బాటిళ్ల నీటిని వెంటతీసుకెళ్లడం, ఓ పూట భోజనం ఇంటి నుంచే తీసుకెళ్లడం చేస్తే ఆ రోజు కనీసం రూ.200 ఆదా చేసినట్టే.  ఇలా కొంత వరకు అనవసర ఖర్చులను తగ్గిస్తే పొదుపు పెరిగిట్టే. జిల్లాలో మొత్తం 66 మండలాలు, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్‌లు, ఆరు మున్సిపాలిటీలులో కలిపి 80 వేల ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. మొత్తం 10.44 లక్షల మంది పొదుపుపై అవగాహనఉన్నవారే. వీరు కాకుండా సంఘాల్లో లేని మహిళలు నాలుగు లక్షల మంది ఉన్నారు. వీరు సైతం పొదుపు బాట పట్టాలి.
 
 
పొదుపు సూత్రాలను పాటిస్తున్నా
నా భర్త లారీ డ్రైవర్, నెలకు రూ.5 వేలు సంపాదిస్తారు. నేను ఆర్‌పీగా ఉంటూ రూ.2 వేలు సంపాదిస్తా. ఇక గ్రూపులో లోను తీసుకున్నా, పిల్లలను చదివిస్తూ, కుటుంబ ఖర్చులను తగ్గిస్తూ భవిష్యత్తులో ఇబ్బందులు లేకుం డా జాగ్రత్తపడుతున్నా. అందుకోసం ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేయడం, నెలవారి కుటుంబ బడ్జెట్ రాసుకుంటూ ముందుకెళుతున్నాను.      -ప్యారీజాన్, గృహిణి, పలమనేరు

పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టాలి
నా భర్త బైక్ మెకానిక్, నెలకు ఆయన రూ.10 వేలు సంపాదిస్తారు, నేను చీరల వ్యాపారంలో కొంత సంపాదిస్తా. దీంతో పద్ధతి ప్రకారం ఖర్చు చేసి కొంత పొదుపు చేస్తున్నా. ప్రతి నెలా కనీస అవసరాలకు పోనూ ఎంతో కొంత పొదుపు చేసుకోవడం మనిషికి భవిష్యత్తులో ఓ ధైర్యాన్ని ఇస్తుంది. ఫలితంగా భరోసా లభిస్తుంది.    -అన్నపూర్ణ,గృహిణి, పలమనేరు

పొదుపు లేకుంటే కష్టాలు తప్పవు
ప్రస్తుత పరిస్థితుల్లో పొదుపు చేయడం చాలా అవసరం. ప్రతినెలా కొంత పొదుపు చేసుకోకపోతే అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలు సామాన్యుని జీవితాన్ని పాతాళంలోకి నెట్టి వేస్తాయి. పిల్లల చదువు, వారి భవిష్యత్తుకు పొదుపు చేసుకోవడం ఉత్తమ మార్గం.
 -గురురాజారావు. రిటైర్డ్‌ద్యోగులసంఘ నాయకులు, పలమనేరు
 
పొదుపుచేస్తే ఎంతో భరోసా
నేను చిల్లరకొట్టు పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తు న్నా. గతంలో చాలా వరకు అప్పులు చేశాను. ఇంటి ఖర్చులు తగ్గించుకుని కొం త పొదుపు చేసుకుంటూ, మరికొంత అప్పులు తీర్చుతున్నా. ఇప్పుడు తెలిసొచ్చింది పొదుపు చేయకుంటే వచ్చే కష్టాలు.  దీంతోనే నేను ఇంటి ఖర్చులకు సంబంధించి నెల ముందు గానే లెక్కలు వేసుకుని ఖర్చు చేస్తాను.  - శాంతి, గాంధీనగర్, పలమనేరు
 
పొదుపుతో ఎన్నో లాభాలు

వచ్చేరాబడిలో ఖర్చులను తగ్గించుకుని కొంత ఆదా చేయడం నేర్చుకుంటే జీవి తం బంగారుమయం అవుతుంది. పొదుపు చేయాలనే ఆలోచన ఉంటే సరిపోదు, దాన్ని ఆచరిస్తేనే ఫలితం కనిపిస్తుంది. మనం ఎంత సంపాదిస్తున్నాం. అందులో ఎంత ఖర్చు పెట్టాలి. ఎంత మిగుల్చుకోవాలి అన్న దానిపైనే పొదుపు ఆ ధారపడి ఉంటుంది. -ఆర్‌వీ. నరసింహారావు,   చీఫ్‌మేనేజర్, ఇండియన్‌బ్యాంకు
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement