Minister of Finance
-
Web Summit Lisbon: కలలను వదులుకోవద్దు...
ప్రపంచంలోనే అతిపెద్దదైన టెక్ కాన్ఫరెన్స్ వెబ్ సమ్మిట్ ఇటీవల పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగింది. ఈ వెబ్ సమ్మిట్‌కు 153 దేశాల నుండి 70 వేల మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. వారిలో 43 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో మహిళలు పాల్గొన్న ఈవెంట్‌గా ఈ సదస్సు వార్తల్లో నిలిచింది. గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని రీ డిజైన్ చేయడానికి ఒక ఈవెంట్‌గా వెబ్ సమ్మిట్‌ను పేర్కొంటారు. ఇందులో 2,608 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త టెక్నాలజీని అందుకోవడానికి, సార్టప్‌లను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఇందులో స్టార్టప్ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, క్రియేటివ్ బృందాలు, ఇన్వెస్టర్లు.. పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏమంటే ప్రతి మూడవ స్టార్టప్... మహిళ సృష్టించినదే అయి ఉండటం. వెబ్సమ్మిట్ సీఈవో కేథరీన్ మహర్ ఈవెంట్ ప్రారంభంలో ‘స్టార్టప్స్‌ని మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం’గా పేర్కొన్నారు. స్టార్టప్స్.. నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది తమ స్టార్టప్‌ల ద్వారా వెబ్ సమ్మిట్‌కు అప్లై చేసుకున్నారు. వాటిలో ఎంపిక చేసిన స్టార్టప్‌లను సమ్మిట్ ఆహ్వానించింది. కమ్యూనిటీ, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపే విధంగా పనిచేసే స్టార్టప్‌ల విభాగంలో 250 కంటే ఎక్కువ ఉన్నాయి. వంద మెంటార్ అవర్స్ సెషన్స్ ద్వారా 800 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఎక్స్పర్ట్స్ నుండి నైపుణ్యాలను నేర్చుకుంటారు. స్టార్టప్‌లలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమలలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, హెల్త్‌టెక్, వెల్నెస్, ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ, క్లీన్టెక్ .. వంటివి ఉన్నాయి. కార్యాలయాలలో వేధింపులు ఈవెంట్‌కు హాజరైన వారిలో మొత్తం 43 శాతం మంది మహిళలు ఉంటే, అత్యధికంగా 38 శాతం కంటే ఎక్కువ మంది మహిళా స్పీకర్లు ఉండటం విశేషం. అన్ని ఎగ్జిబిట్ స్టార్టప్ ఫౌండర్లలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే ఉన్నారు. ఈ సందర్భంగా వెబ్ సమ్మిట్ తన వార్షిక స్టేట్ ఆఫ్ జెండర్ ఈక్విటీ ఇన్ టెక్ నివేదికనూ విడుదల చేసింది. దాదాపు సగం మంది మహిళలు కార్యాలయంలో జెండర్ వివక్షను ఎదుర్కోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. 53.6 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ తమ ఆఫీసులలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. 63.1 శాతం మంది పెట్టుబడిదారులు కృత్రిమ మేధస్సు, యంత్రాలని నమ్మి తమ స్టారప్‌లలో వృద్ధిని సాధించినట్టు తెలియజేస్తే 43.2 శాతం మంది మాత్రం తమ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. అయినా, సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య గత ఏడాది కంటే 75 శాతం నుంచి 66.7 శాతానికి తగ్గినట్టు గుర్తించారు. ఈ సమ్మిట్... ప్రపంచంలో మహిళ స్థానం ఎలా ఉందో మరోసారి తెలియజేసింది. ప్రపంచానికి మహిళ పోర్చుగీస్ ఆర్థికమంత్రి ఆంటోనియా కోస్టా ఇ సిల్వా మాట్లాడుతూ ‘టెక్ ప్రపంచంలో ఎక్కువమంది మహిళలు అగ్రస్థానంలో ఉండాలి. వారి అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉంది. మీ కలలను వదులుకోవద్దు. మహిళలకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. సంక్షిష్టంగా ఉన్న ఈ ప్రపంచంలో మహిళల మల్టీ టాస్కింVŠ మైండ్ చాలా అవసరం’ అని పేర్కొన్నారు. ఆశలకు, స్నేహానికి, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, మన కాలపు సమస్యలను సవాల్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఒక చోట చేర్చడానికి వెబ్ సమ్మిట్ గొప్ప వేదిక’ అన్నారు. ఇలాంటి అత్యున్నత వేదికలు ప్రపంచ మహిళ స్థానాన్ని, నైపుణ్యాలను, ఇబ్బందులను అందరి ముందుకు తీసుకువస్తూనే ఉంటాయి. మహిళలు తమ ఉన్నతి కోసం అన్నింటా పోరాటం చేయక తప్పదనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంటాయి. -
బ్రిటన్ తదుపరి ప్రధాని మనోడేనా ?
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి భారత సంతతికి చెందిన వ్యక్తికి లభిస్తుందా? బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్ ప్రధాని రేసులో ముందున్నారా ? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన రిషి చరిత్ర సృష్టిస్తారా ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బ్రిటన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటన్‌లో కరోనా మొదటి వేవ్ లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు 2020 మేలో ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన మందు పార్టీ వివాదం ముదురుతోంది. కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ బోరిస్ జాన్సన్ ఇచ్చిన పార్టీ వీడియో ఒకటి ఇటీవల వెలుగులోకి రావడంతో విపక్ష లేబర్ పార్టీలో, సొంత పార్టీ కన్జర్వేటివ్‌లలో వ్యతిరేకత పెరుగుతోంది. బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు జరిగిన గత ఏడాది ఏప్రిల్ 17 ముందు రోజు రాత్రంతా డౌనింగ్ స్ట్రీట్‌లో 30 మంది మందులు, చిందులతో కాలం గడిపారన్న ఆరోపణలు తాజాగా వస్తున్నాయి. ఫిలిప్ భౌతిక కాయం ఉన్న సమయంలో అలాంటి పార్టీలు జరుపుకోవడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ‘పార్టీ గేట్’ వివాదంపై బోరిస్ జాన్సన్ బ్రిటన్ పార్లమెంటులో క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రధాని పీఠం దిగాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన స్థానంలో భారతీయ మూలాలున్న రిషి ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలను కొట్టి పారేయలేమని బ్రిటన్ మీడియాలో వార్తలొచ్చాయి. బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బోరిస్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో క్షమాపణ చెప్పే సమయంలో రిషి సభలో లేకపోవడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. ఆర్థిక మంత్రి అయినప్పట్నుంచే రిషి ప్రధాని పీఠంపై మక్కువ పెంచుకున్నారని, అందుకే ‘పార్టీగేట్’ వివాదానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో సభకు హాజరుకాలేదని బోరిస్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టిన రిషి తన శాఖకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండడం వల్లే సభకు హాజరు కాలేదంటూ ట్వీట్ చేశారు. కోవిడ్ విలయంతో తరచూ లాక్డౌన్లతో కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి పట్టాలెక్కించడానికి రిషి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన రిషి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. వీరికి కృష్ణ, అనుష్క అనే కుమార్తెలు ఉన్నారు. -
రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థికశాఖ నిర్మలాసీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులను ప్రైవేటుపరం చేయనున్నట్లు 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రకటించారు. ‘‘డిజిన్వెస్ట్మెంట్కు సంబంధించిన వివిధ అంశాల పరిశీలన, ఇందులో బ్యాంకు(ల) ఎంపిక అంశాలను క్యాబినెట్ కమిటీ పరిశీలిస్తుంది. క్యాబినెట్ కమిటీ ఈ విషయంలో (ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ) ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆమె తాజాగా లోక్‌సభకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణల ప్రక్రియ ద్వారా రూ.175 లక్షల కోట్ల సమీకరించాలని కేంద్ర బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
కథ..మళ్లీ మొదటికే..ఫిర్యాదుల వెల్లువ, ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నూతన ఈ ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలకు తెరపడలేదు. సెప్టెంబర్ 15 నాటికి సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటూ కేంద్రం ఇన్ఫోసిస్‌కు గడువు ఇచ్చింది. ఈ గడువు బుధవారంతో ముగిసింది. అయినా ఈ వెబ్సైట్లో ఇప్పటికీ పలు సాంకేతిక అవాంతరాలు దర్శమనిస్తున్నట్టు పన్ను నిపుణులు చెబుతున్నారు. దాఖలు చైసిన రిటర్నులను సరిదిద్దుకోలేకపోవడం (రెక్టిఫికేషన్).. రిఫండ్ ఏ దశలో ఉందో తెలుకోలేకపోవడం, 2013–14 అసెస్మెంట్ సంవత్సరానికి ముందు నాటి రిటర్నులను చూసే అవకాశం లేకపోవడం వీటిల్లో కొన్ని. ఈ ఏడాది జూన్ 7న కొత్త పోర్టల్ ప్రారంభమైంది. ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం తొలుత ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులను కోరింది. అయినా అవి పరిష్కారం కాలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ ఆగస్ట్ 23న ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరీఖ్‌కు సమన్లు ఇచ్చింది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులతో ఇన్ఫోసిస్ సీఈవో ఆధ్వర్యంలోని బృందం సమావేశమైంది. అందులో సమస్యల పట్ల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. సెప్టెంబర్ 15 నాటికి అన్నింటినీ పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యల కారణంగా ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుకు కేంద్రం పొడిగించింది. -
డిపాజిటర్లకు మరింత రక్షణ
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభాల్లో చిక్కుకున్న బ్యాంకు డిపాజిటర్లకు గరిష్టంగా రూ.5లక్షల వరకు బీమా సదుపాయం కల్పించే డీఐసీజీసీ సవరణ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 90 రోజుల్లోపు సంక్షోభాల్లోని బ్యాంకు డిపాజిటర్లకు చెల్లింపులు ప్రారంభమవుతాయి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టానికి చేసిన సవరణలను కేంద్ర సర్కారు సోమవారం నోటిఫై చేసింది. ఈ నెల మొదట్లో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు 2021కి పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటికే డిపాజిట్ల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) డిపాజిటర్లకు ఊరట లభించనుంది. ప్రస్తుతానికి బ్యాంకులు విఫలం అయితే డిపాజిట్లకు డీఐసీజీసీ కింద చెల్లింపులకు 8–10 ఏళ్ల సమయం తీసుకుంటోంది. బ్యాంకు డిపాజిటర్లకు గతంలో రూ.లక్ష వరకే బీమా సదుపాయం ఉండేది. పీఎంసీ బ్యాంకు, యస్ బ్యాంకు తదితర సంక్షోభాలతో బీమ సదుపాయాన్ని రూ.5లక్షలకు పెంచుతూ కేంద్ర సర్కారు గతేడాది నిర్ణయం తీసుకుంది. అంతేకాదు 2020 ఫిబ్రవరి 4 నుంచే పెంచిన కవరేజీ అమల్లోకి కూడా వచ్చింది. ఇందుకు సంబంధించి చట్టంలోనూ మార్పులను తీసుకొచ్చింది. ‘‘మొదటి 45 రోజుల సమయంలో బ్యాంకు అన్ని ఖాతాల వివరాలను తీసుకోవాలి. ఈ సమయంలోనే డిపాజిట్ దారులు క్లెయిమ్ చేసుకోవాలి. తర్వాత ఈ వివరాలను డీఐసీజీసీకి పంపుతారు. 90వ రోజు నుంచి డిపాజిట్లకు చెల్లింపులు మొదలువతాయి’’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. -
ఇంటికి ఇల్లాలే ఆర్థిక మంత్రి
ఆదాయం మూరెడు.. ఖర్చులు బారెడు చందంగా మారింది సగటు జీవి బతుకు. కొండెక్కి కూర్చున్న కూరగాయలు.. నింగిలోన నిత్యావసర సరుకులు.. చదువు‘కొన’లేని ధైన్యంతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. ఈ పరిస్థితిలో కాస్త ముందు చూపు.. చిన్నపాటి పొదుపు పాటించకపోతే ధరాఘాతం నుంచి గట్టెక్కడం గగనమే. పురుషుడు ఎంత సంపాదిస్తున్నాడన్నది ముఖ్యం కాదు. దేశానికి, రాష్ట్రానికి బడ్జెట్ రూపకల్పన చేసే ఆర్థిక మంత్రి ఎలా వ్యూహ రచన చేసి, వ్యవహరిస్తారో.. అలానే ఇంటి బడ్జెట్‌కు రూపకల్పన చేసే ‘హోమ్’ మినిస్టర్ మసులుకోవాల్సివుంది. ఈ విషయంలో ముందుచూపుతో నడుస్తున్న ఇంతుల మనోగతంపై ప్రత్యేక కథనం. పలమనేరు: ప్రస్తుతం సామాన్య మధ్య తరగతి ప్రజలు ధరాఘాతంతో తల్లడిల్లిపోతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయాలు ఒకటేమిటి అన్నీ వస్తువుల ధరలు నింగిలోని విహరిస్తున్నాయి. దీంతో మగవారు ఎంత సంపాదించినా సంసారం గడవడం లేదు. ఈ క్రమంలో ఇంట్లో పొదుపు పాటించి, కుటుంబాన్ని నడపడంలో ఇల్లాలి పాత్ర క్రియాశీలకం. అందుకే ఇల్లాలే ఇంటికి వెలుగు అంటారు. మగవారు ఎంత సంపాదించినా ఇంటి నెలవారీ బడ్జెట్ రూప కల్పన చేసేది ఆమె. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ కోత పెట్టాలో నిర్ణయించేది కూడా ఆమె. దేశానికి, రాష్ట్రానికి ఆర్థికమంత్రి ఎలాగో ఇంటికి కూడా ఇల్లాలు అంతే. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ ఖర్చులను తగ్గించుకోవడం మినహా మరో గత్యంతరం లేదు. అందుకే మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో డబ్బును పొదుపు చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయని వంటింటి మంత్రులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో అసంఘిటిత వ్యవసాయ కార్మికులు వ్యవసాయేతర కార్మికులు సుమారు16 లక్షల మంది ఉన్నారు. వీరి బతుకులకు పొదుపు చాలా అవసరం. పొదుపులో మహిళల పాత్ర కీలకం. మామూలుగా డబ్బును పొదుపు చేయడంతో మహిళల పాత్ర కీలకం. ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్లే సమయంలో నాలుగు వాటర్‌బాటిళ్ల నీటిని వెంటతీసుకెళ్లడం, ఓ పూట భోజనం ఇంటి నుంచే తీసుకెళ్లడం చేస్తే ఆ రోజు కనీసం రూ.200 ఆదా చేసినట్టే. ఇలా కొంత వరకు అనవసర ఖర్చులను తగ్గిస్తే పొదుపు పెరిగిట్టే. జిల్లాలో మొత్తం 66 మండలాలు, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీలులో కలిపి 80 వేల ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. మొత్తం 10.44 లక్షల మంది పొదుపుపై అవగాహనఉన్నవారే. వీరు కాకుండా సంఘాల్లో లేని మహిళలు నాలుగు లక్షల మంది ఉన్నారు. వీరు సైతం పొదుపు బాట పట్టాలి. పొదుపు సూత్రాలను పాటిస్తున్నా నా భర్త లారీ డ్రైవర్, నెలకు రూ.5 వేలు సంపాదిస్తారు. నేను ఆర్పీగా ఉంటూ రూ.2 వేలు సంపాదిస్తా. ఇక గ్రూపులో లోను తీసుకున్నా, పిల్లలను చదివిస్తూ, కుటుంబ ఖర్చులను తగ్గిస్తూ భవిష్యత్తులో ఇబ్బందులు లేకుం డా జాగ్రత్తపడుతున్నా. అందుకోసం ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేయడం, నెలవారి కుటుంబ బడ్జెట్ రాసుకుంటూ ముందుకెళుతున్నాను. -ప్యారీజాన్, గృహిణి, పలమనేరు పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టాలి నా భర్త బైక్ మెకానిక్, నెలకు ఆయన రూ.10 వేలు సంపాదిస్తారు, నేను చీరల వ్యాపారంలో కొంత సంపాదిస్తా. దీంతో పద్ధతి ప్రకారం ఖర్చు చేసి కొంత పొదుపు చేస్తున్నా. ప్రతి నెలా కనీస అవసరాలకు పోనూ ఎంతో కొంత పొదుపు చేసుకోవడం మనిషికి భవిష్యత్తులో ఓ ధైర్యాన్ని ఇస్తుంది. ఫలితంగా భరోసా లభిస్తుంది. -అన్నపూర్ణ,గృహిణి, పలమనేరు పొదుపు లేకుంటే కష్టాలు తప్పవు ప్రస్తుత పరిస్థితుల్లో పొదుపు చేయడం చాలా అవసరం. ప్రతినెలా కొంత పొదుపు చేసుకోకపోతే అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలు సామాన్యుని జీవితాన్ని పాతాళంలోకి నెట్టి వేస్తాయి. పిల్లల చదువు, వారి భవిష్యత్తుకు పొదుపు చేసుకోవడం ఉత్తమ మార్గం. -గురురాజారావు. రిటైర్డ్ద్యోగులసంఘ నాయకులు, పలమనేరు పొదుపుచేస్తే ఎంతో భరోసా నేను చిల్లరకొట్టు పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తు న్నా. గతంలో చాలా వరకు అప్పులు చేశాను. ఇంటి ఖర్చులు తగ్గించుకుని కొం త పొదుపు చేసుకుంటూ, మరికొంత అప్పులు తీర్చుతున్నా. ఇప్పుడు తెలిసొచ్చింది పొదుపు చేయకుంటే వచ్చే కష్టాలు. దీంతోనే నేను ఇంటి ఖర్చులకు సంబంధించి నెల ముందు గానే లెక్కలు వేసుకుని ఖర్చు చేస్తాను. - శాంతి, గాంధీనగర్, పలమనేరు పొదుపుతో ఎన్నో లాభాలు వచ్చేరాబడిలో ఖర్చులను తగ్గించుకుని కొంత ఆదా చేయడం నేర్చుకుంటే జీవి తం బంగారుమయం అవుతుంది. పొదుపు చేయాలనే ఆలోచన ఉంటే సరిపోదు, దాన్ని ఆచరిస్తేనే ఫలితం కనిపిస్తుంది. మనం ఎంత సంపాదిస్తున్నాం. అందులో ఎంత ఖర్చు పెట్టాలి. ఎంత మిగుల్చుకోవాలి అన్న దానిపైనే పొదుపు ఆ ధారపడి ఉంటుంది. -ఆర్వీ. నరసింహారావు, చీఫ్‌మేనేజర్, ఇండియన్‌బ్యాంకు -
వృద్ధికి ‘తయారీ’ జోష్..
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.4 శాతం జీడీపీ వృద్ధి రేటు ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాలో భారత్ తయారీ రంగం వృద్ధి రేటు 9.3 శాతం మైనింగ్, సేవా రంగాలూ ఊతం న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతున్నట్లు సోమవారం వెల్లడైన తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2015-16, జూలై-సెప్టెంబర్) భారత్ 7.4 శాతం ఆర్థికాభివృద్ధిని నమోదుచేసుకుంది. తయారీ, మైనింగ్, సేవా రంగాల చక్కని పనితీరు... మొత్తం ఫలితం పటిష్టతకు కారణమైంది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతం. కాగా గడచిన కొన్ని నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో (బ్యాంకులు తాము ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటు) రేటు కోత కూడా తాజా ఫలితానికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఆర్బీఐ ఐదవ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) తాజాగా విడుదల చేసిన గణాంకాలకు సంబంధించి ముఖ్యాంశాలు.. 2014-15 క్యూ 2తో పోల్చితే ప్రస్తుత రేటు తక్కువే. గత సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది. కాగా ఈ ఏడాది ఇదే కాలంలో చైనా వృద్ధి రేటు 6.9 శాతం. దీనితో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతున్నట్లయ్యింది. ఇదే కాలంలో వర్థమాన దేశాల్లో కీలకమైన రష్యాలో అసలు వృద్ధి లేకపోగా -4.1 క్షీణత నమోదయ్యింది. బ్రెజిల్ సైతం -4.2 శాతం క్షీణతలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటే... గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధిరేటు 7.5 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.1 శాతం నుంచి 8.5 శాతం వరకూ వృద్ధి నమోదవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నప్పటికీ, ఇప్పటికి గడిచిన రెండు త్రైమాసికాల్లో ఈ రేటు లక్ష్యానికి భారీ దూరంలో ఉన్న సంగతి గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం 7 శాతానికి పైగా వృద్ధిని నమోదుచేసుకున్న రంగాల్లో తయారీ, వాణిజ్యం, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఉన్నాయి. బ్రాడ్‌కాస్టింగ్, ఫైనాన్స్, బీమా, రియల్టీ, వృత్తిపరమైన సేవా రంగాలూ 7 శాతం పైగా వృద్ధిని సాధించాయి. తయారీ రంగం సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా 9.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రంగం వృద్ధి రేటు 7.9 శాతమే. మైనింగ్, క్వారీయింగ్ రంగాల వృద్ధి రేటు 1.4 శాతం నుంచి 3.2 శాతానికి ఎగసింది. ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్లతో సహా మొత్తం సేవా రంగాల వృద్ధి రేటు 8.9 శాతం నుంచి 10.6 శాతానికి ఎగసింది. కాగా ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సర్వీసుల్లో వృద్ధి మాత్రం 13.5 శాతం నుంచి 9.7 శాతానికి తగ్గింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల్లో వృద్ధి రేటు కూడా 8.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది. వ్యవసాయం, అనుసంధాన రంగాల్లో వృద్ధి రేటు స్వల్పంగా 2.1 శాతం నుంచి 2.2 శాతానికి పెరిగింది. నిర్మాణ రంగంలో వృద్ధిరేటు 8.7 శాతం నుంచి 2.6 శాతానికి పడింది. 2011-12 స్ధిర ధరల ప్రకారం... జీడీపీ విలువ రెండవ త్రైమాసికంలో రూ.27.57 లక్షల కోట్లుగా నమైదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 25.66 లక్షల కోట్లు. అంటే జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతమన్నమాట. మరింత మెరుగవుతుంది.. గత ఆర్థిక సంవత్సరం సాధించిన 7.3% వృద్ధిరేటుకన్నా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మంచి వృద్ధి నమోదవుతుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నా... తయారీ రంగం మంచి ఫలితాన్ని ఇవ్వడం గమనార్హం. మొత్తంగా ఈ గణాంకాలు సంతృప్తిని ఇస్తున్నాయి. మున్ముందు మరింత వృద్ధి ఖాయం. - అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి సానుకూల ధోరణి... దేశ ఆర్థిక రంగానికి సంబంధించి సానుకూల ధోరణి పటిష్టతకు తాజా గణాంకాలు దోహదపడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.5%గా నమోదవుతుందన్నది అభిప్రాయం. ఆర్థిక వ్యవస్థ ఊపందుకున్నదని సంకేతాలు అందుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వృద్ధికి మరింత ఊపునిస్తుంది. - శక్తికాంత దాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి వేగవంతమైన రికవరీ... ఆర్థిక వ్యవస్థలో రికవరీ వేగవంతమైందనడానికి తాజా గణాంకాలు నిదర్శనం. ఈ తరహా ధోరణి మేము ఊహించిందే. అయితే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు భారీగా పడిపోవడం ఆందోళనకరం. తయారీ, రియల్టీ, మౌలిక రంగాల్లో నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణపై తక్షణం విధానపరమైన దృష్టి పెట్టాలి. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ -
రాజధానికి నిధులు.. కేంద్రం ఇస్తుంది: యనమల
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమ, అభివృద్ధి కారకమైనదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఇది చిన్న బడ్జెట్ అని, ఇందులో వివిధ శాఖ లు, పథకాలకు చేసిన కేటాయింపులు తాత్కాలికమేనని, వాటిని తరువాత సవరిస్తామని తెలిపారు. పదేళ్ల తర్వాత ఆర్థిక మంత్రిగా బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టాక అసెంబ్లీ సెంట్రల్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి పథకానికి వంద శాతం నిధులు కేటాయించామని తాము చెప్పటంలేదన్నారు. నూతన రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చును కేంద్రం భరిస్తామన్నందునే తాము నిధులు కేటాయించలేదని చెప్పారు.