![UK court orders Vijay Mallya to pay costs to Indian banks - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/16/Mallya.jpg.webp?itok=zTeRiGio)
లండన్: ప్రభుత్వ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి లండన్‌కు చెక్కేసిన రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టు భారీ షాకిచ్చింది. తమ రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు చేస్తున్న చట్టబద్దమైన పోరాట వ్యయాలకింద 13 భారతీయ బ్యాంకులకు కనీసం 2 లక్షల పౌండ్లు (రూ.1.80 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా ఆదేశించారు. మరోవైపు మాల్యా ఆస్తులను జప్తు చేసేందుకు సంబంధించిన ఆర్డర్‌ను ఆయన తిరస్కరించారు. అయితే, బ్యాంకులకు అవుతున్న ఖర్చును మాత్రం తప్పకుండా చెల్లించాల్సిందేనని ఆదేశించారు. మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు మాల్యాను పంపాల్సిందిగా కోరుతూ భారత్ వేసిన పిటిషన్‌పై వచ్చే నెల వెస్ట్‌మినిస్టర్ కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. కాగా స్టేట్ బ్యాంకు సహా దేశంలోని 13 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9 వేల కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా 2016లో లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment