UK court
-
ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఆస్తులు సున్నా అంటున్నాడు..
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు 'అనిల్ అంబానీ' గురించి దాదాపు అందరికి తెలుసు. ఒకప్పుడు ఆసియాలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన సంపాదన భారీగా పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆయన సంపాదన పడిపోయిందా..లేదా ? ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎన్ని అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. అనిల్ అంబానీ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కోర్టులో తన ప్రస్తుత నికర విలువ రూ.0 అని వెల్లడించాడు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ రెండో రౌండ్ బిడ్డింగ్ వేలంలో హిందుజా గ్రూప్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. దివాళా తీసిన కంపెనీని రూ. 9650 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసింది. ముఖేష్ అంబానీ మాదిరిగా అపర కుబేరుడుగా ప్రపంచంలో ఉన్న ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న అనిల్ అంబానీ 2020 ఫిబ్రవరిలో UK కోర్తులో హాజరైనప్పుడు తన నికర ఆస్తుల విలువ సున్నా అని చెప్పారు. నిజానికి ఆయన ఆస్తుల విలువ 13.7 బిలియన్ డాలర్లు అని నివేదికల ద్వారా తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1.12 లక్షల కోట్లకంటే ఎక్కువ. అనిల్ అంబానీ తన ఆస్తులు సున్నా రూపాయలు అని కోర్టులు చెప్పినప్పటికీ.. ముంబైలో 17 అంతస్థుల భవంతి, రూ. 20 కోట్ల విలువైన కార్లు, అత్యంత ఖరీదైన బోట్స్, ప్రైవేట్ జెట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. నికర ఆస్తుల విలువ భారీగా తగ్గినప్పటికీ, ప్రస్తుత ఆస్తులు రూ. 83 మిలియన్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: Matter Aera Electric Bike: ఈ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!) నిజానికి అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో ఒక శిఖరం, ఆసియాలో ఆరవ ధనవంతుగా ఎదిగాడు. కానీ కంపెనీ నిధులను స్వాహా చేసిన ఆరోపణలకు గానూ సెబీ మార్కెట్ నుంచి నిషేదించింది. ఆ తరువాత క్రమంగా ఆయన నికర ఆస్తులు పతనం కావడం ప్రారంభమైంది. -
నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన యూకే హైకోర్టు.. త్వరలో భారత్‌కు..
చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొనేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హైకోర్టులో చుక్కెదురైంది. దేశం నుంచి పరారీలో ఉన్న నీరవ్ మోదీని భారత్‌కి తిరిగి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ పిటీషన్ దాఖలైంది. అయితే నీరవ్ మోదీని అప్పగించడం అన్యాయం లేదా అణచివేత కాదని కోర్టు పేర్కొంటూ అతని పిటీషన్‌ను తిరస్కరించింది. దీంతో త్వరలో నీరవ్ భారత్‌కు రానున్నారు. ఈ అప్పీల్ విచారణకు అధ్యక్షత వహించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు. ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో కటకటాల వెనుక ఉన్న 51 ఏళ్ల వ్యాపారవేత్త, గత ఫిబ్రవరిలో భారత్‌కు అప్పగింతకు అనుకూలంగా జిల్లా జడ్జి సామ్ గూజీ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని రూ. 13,500 కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయాడు. అప్పటినుంచి భారత్‌కు తిరిగి రాకుండా తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నాడు. చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! -
జూలియన్ అసాంజే అప్పగింత తప్పదా?
సుదీర్ఘ చట్టపర తగాదా తర్వాత, లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు 2022 ఏప్రిల్ 20న, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేని అమెరికాకు అప్పగించాలని ఉత్తర్వు జారీచేసింది. బ్రిటన్ హోమ్ సెక్రెటరీ ప్రీతి పటేల్ అతన్ని అమెరికాకు అప్పజెప్పడానికి ‘స్టాంప్’ వేసే స్థితికి వచ్చారు. అమెరికాలో అసాంజేపై గూఢచర్య చట్టం కింద విచారణ జరుగుతుంది. గూఢచారికీ, సమాజ సంరక్షకునికీ మధ్య తేడాను ఈ చట్టంలో వివరించలేదు. చరిత్రలో మొదటిసారి ఈ చట్టాన్ని ఒక పాత్రికేయునికి వర్తింపజేశారు. అసాంజే పాత్రికేయుడు కాదని అమెరికా ప్రభుత్వ వకీలు వాదించారు. ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా పూర్వ కంప్యూటర్ ఇంటెలిజెన్స్ కన్సల్టెంట్. అమెరికా ప్రభుత్వం సొంత ప్రజల ఫోన్ కాల్స్, అంతర్జాల చర్యలు, వెబ్ కెమెరాలపై నిఘాను నిరూపించే రహస్య పత్రాలను బయట పెట్టారు. ఆయన మీద కూడా గూఢచర్య చట్టం కింద కేసు పెట్టారు. ‘‘అమెరికా న్యాయ శాఖ పాత్రికేయతపై యుద్ధం చేస్తోంది. ఈ కేసు అసాంజేపై కాదు, మీడియా భవిష్యత్తును నిర్ణయించేది’’ అని వ్యాఖ్యానిస్తూ పాత్రికేయునిపై ఈ చట్ట వర్తింపును స్నోడెన్ ఖండించారు. అసాంజేను వాక్ స్వాతంత్య్ర విజేతగా ఒకప్పుడు ప్రధాన స్రవంతి మీడియా ప్రశంసించింది. 2010లో ఆయన అమెరికా కుట్రల రహస్య సమాచారం బయట పెట్టగానే అదే మీడియా అసాంజేను వదిలేసింది. అసాంజే ఈ కోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేయగలిగినా, కోర్టులో నెగ్గే అవకాశం చాలా తక్కువ. అసాంజే ఆస్ట్రేలియా దేశానికి చెందిన సంపాదకుడు, ప్రచురణకర్త, సామాజిక కార్యకర్త. ఆస్ట్రేలియా అప్రజాస్వామిక ఆగడాలను భరించలేక పారదర్శక సమాజం ఉన్న స్వీడెన్‌లో స్థిరపడ్డారు. 2006లో వికీలీక్స్ స్థాపించాడు. 2010లో వికీలీక్స్ అమెరికా కుతంత్రాల రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసింది. వర్గీకరించిన వరుస దస్త్రాలనూ, దౌత్య సంబంధ తంత్రీ సమాచారాన్నీ పెద్ద మొత్తంలో ప్రచురించిన తర్వాత అమెరికా అసాంజేపై 18 నేరాలు మోపింది. ఇవి రుజువయితే వందేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అమెరికా ఇద్దరు స్వీడెన్ సెక్స్‌వర్కర్లతో అసాంజేపై అసమంజస అత్యాచార కేసులు పెట్టించింది. ఆ కేసుతో సహా గూఢచర్య విచారణను ఎత్తేయాలని స్వీడెన్ 2012లో నిర్ణయించి, 2017లో ఎత్తేసింది. స్వీడెన్ పార్లమెంటులో మితవాదం బలపడిన తర్వాత అసాంజేపై ఎత్తేసిన కేసులను 2019 మేలో తిరగదోడింది. కానీ నవంబర్‌లో విచారణను ఆపేసింది. అసాంజే 12 ఏళ్ల నుండి నిర్బంధంలో ఉన్నారు. ఆయనకు ఆరేళ్ళ క్రితం లండన్‌లోని ఈక్వడోరియన్ రాయబార కార్యాలయంలో ఆశ్రయ మిచ్చారు. అప్పటి నుండి జైలు జీవితం అనుభవిస్తు న్నారు. బయటికి పోతే లండన్ పోలీసులు అరెస్టు చేసి అమెరికాకు అప్పజెపుతారని భయం. ఈక్వడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో అసాంజేను అప్పజెప్పి అమెరికాను సంతోషపెట్టాలని నిర్ణయించినప్పటి నుండి ఆయన కష్టాలు పెరిగాయి. 12 ఏళ్ళు దాటినా అమెరికా అసాంజేను కంటిలో ముల్లుగా, పక్కలో బల్లెంలా చూస్తోంది. తమ రహస్య సమాచారాన్ని బయటపెట్టి తమ దేశం పరువు పోగొట్టాడని భావిస్తోంది. (క్లిక్: అసమ్మతి గళాలపై అసహనం) అసాంజే వికీలీక్స్ ఘటన తర్వాత అమెరికాను ముగ్గురు అధ్యక్షులు పాలించారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ‘రక్షణల’ నిజ స్వరూపం తెలిసింది. అమెరికా అంతర్జాతీయ సమాజ నియమాలు, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి, మానవ హక్కుల హననానికి పాల్పడుతున్న వైనాన్ని బయటపెట్టే ఎవరినైనా యునైటెడ్ కింగ్డమ్ వంటి తన సన్నిహిత దేశాల సహాయంతో జైలులో పెట్టవచ్చని అమెరికా భావిస్తోంది. తన స్వేచ్ఛా ముఖాన్ని ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించడానికే వాడుకుంటోంది. (క్లిక్: రెండూ సామాజిక విప్లవ సిద్ధాంతాలే!) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
అసాంజే తరలింపునకు యూకే కోర్టు అనుమతి
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను యూకే నుంచి యూఎస్‌కు అప్పగించడానికి లండన్ హైకోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది. అసాంజే మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఆయన్ను అమెరికాకు అప్పగించకూడదని గతంలో కింద కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పు న్యాయానికి తగిలిన విఘాతంగా అసాంజే భార్య స్టెల్లా మోరిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తామని చెప్పారు. 2010–11 కాలంలో పలు రహస్య మిలటరీ, ద్వైపాక్షిక డాక్యుమెంట్లను బహిర్గతం చేసినందుకు అమెరికా అసాంజేను వెంటాడుతోంది. అమెరికాలో ఆయనపై 17 గూఢచర్య కేసులున్నాయి. ఇవి రుజువైతే ఆయనకు దాదాపు 175 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో అమెరికా నుంచి తప్పించుకున్న అసాంజే 2012 నుంచి యూకేలోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో శరణార్థ్ధిగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ కండీషన్లను ఉల్లంఘించారన్న ఆరోపణలపై 2019లో రాయబార కార్యాలయం నుంచి అసాంజేను అరెస్టు చేసి బెలమార్‡్ష జైల్లో ఉంచారు. -
అప్పగింతపై నీరవ్ సవాల్‌కు లండన్ కోర్టు ఓకే
లండన్: మనీల్యాండరింగ్ ఆరోపణలపై భారత్‌కు తనను అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసే మరో అవకాశం వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి దక్కింది. తాను నిరాశ నిస్పృహలో ఉన్నానని, మానసిక ఆరోగ్యం సరిగాలేదని, ఆత్మహత్య చేసుకోవాలనేంతగా కుంగిపోయానని ఆయన పెట్టుకున్న అభ్యర్థనను లండన్‌లోని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. నీరవ్ తరఫు లాయర్లు తమ వాదనలను జడ్జికి వినిపించారు. ‘ బ్రిటన్‌లోని క్రిమినల్ జస్టిస్ యాక్ట్–2003,యూరప్‌లోని మానవ హక్కుల పరిరక్షణ, జీవించే హక్కులను పరిగణనలోకి తీసుకుని అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నా’ అని జడ్జి వ్యాఖ్యానించారు. -
లండన్ కోర్టు సంచలన తీర్పు: మాల్యాకు భారీ షాక్!
లండన్: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. మాల్యా అప్పగింత కేసును సోమవారం విచారించిన లండన్ హైకోర్టు విజయ్ మాల్యా దివాలా తీసినట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వుతో మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. ఈ మేరకు లండన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఏడాది ప్రారంభంలో, భారతదేశంలో మాల్యా ఆస్తులపై సెక్యూరిటీని వదులుకునేందుకు అనుకూలంగా వారి దివాలా పిటిషన్‌ను సవరించాలని ఎస్బిఐ నేతృత్వంలోని రుణదాత కన్సార్టియం ఇచ్చిన దరఖాస్తును యుకే కోర్టు సమర్థించింది. ఈ మేరకు లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసిసి) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. దీంతో గతకొన్నాళ్లుగా మ్యాలాపై సుదీర్ఘం పోరాటం చేస్తున్న భారత బ్యాంకులకు భారీ విజయం లభించినట్టైంది. అయితే దీనిపై మాల్యా అప్పీల్‌కు వెళ్లే అవకాశాలను కూడా కోర్టు తోసిపుచ్చింది. దివాలా ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి బ్రిగ్స్ నిరాకరించారు. ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా తీర్పునిచ్చిన లండన్ హైకోర్టు తాజాగా మాల్యా దివాలా తీసినట్టుగా ప్రకటించడం గమనార్హం. కాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు మంజూరు చేసిన 9వేల కోట్ల రూపాయల రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసినట్లు 13 భారతీయ బ్యాంకుల కన్సార్టియం ఆయనపై ఆరోపణలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
నీరవ్‌కు లండన్ హైకోర్టులో చుక్కెదురు
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ.13,500 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్‌లోని హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ నీరవ్ లండన్‌లోని హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతించాలంటూ సంబంధిత పత్రాలను సమర్పించారు. ఈ పత్రాలను పరిశీలించిన కోర్టు మంగళవారం తిరస్కరించింది. అయితే, మరో ఐదు రోజుల్లోపు నీరవ్ హైకోర్టులో మరోసారి అప్పీల్‌చేసుకునే అవకాశముంది. భారత్‌లో ఆర్థికనేరాల్లో నిందితుడైన కారణంగా నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలంటూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. నీరవ్ భారత్‌లో మనీ ల్యాండరింగ్, నమ్మకద్రోహం తదితర నేరాభియోగాలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్.. నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు సమ్మతి తెలుపుతూ ఏప్రిల్ 15న ఆదేశాలు జారీచేశారు. హోం మంత్రి నిర్ణయాన్ని, వెస్ట్‌మినిస్టర్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు అవకాశమివ్వాలంటూ నీరవ్ హైకోర్టులో దాఖలుచేసిన ‘అప్పీల్’ అనుమతి పత్రాలను కోర్టు మంగళవారం తిరస్కరించిందని హైకోర్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 50ఏళ్ల నీరవ్‌ను 2019 మార్చి 19న అరెస్ట్‌చేసిన యూకే పోలీసులు అతడిని నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంచారు. -
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(50)ని భారత్‌కు రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమయ్యింది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అప్పగింత ఉత్తర్వుపై యునైటెడ్ కింగ్డమ్ హోంశాఖ మంత్రి(సెక్రెటరీ) ప్రీతి పటేల్ సంతకం చేసినట్లు యూకేలోని భారత రాయబార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలకు సంబంధించి మోసం, మనీలాండరింగ్ కేసులు నీరవ్ మోదీపై నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. హోంశాఖ సెక్రెటరీ జారీ చేసిన తాజా ఉత్తర్వుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరడానికి నీరవ్ మోదీకి 14 రోజుల గడువు ఇచ్చారు. ఆధారాల పట్ల కోర్టు సంతృప్తి నీరవ్ మోదీ తన మామ మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు ఇండియాలో కేసులు నమోదయ్యాయని, అతడు ఇండియాలోని న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న స్పష్టం చేసింది. నీరవ్‌పై నమోదైన కేసుల విషయంలో ఇండియాలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. నీరవ్‌ను భారత్ అప్పగించే విషయంలో నిర్ణయాన్ని హోంశాఖకు వదిలేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇండియాలో అయితే సరైన వైద్యం అందదన్న నీరవ్ వాదనను న్యాయస్థానం కొట్టిపారేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడని చెప్పేందుకు ఉన్న ఆధారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మనీ లాండరింగ్, సాక్షులను బెదిరించడం, ఆధారాలను మాయం చేయడం తదితర అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడని స్పష్టంగా బయటపడుతోందని గుర్తుచేసింది. అందుకే బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తెలియజేసింది. యూకే అప్పగింత చట్టం–2003 ప్రకారం.. న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని హోంశాఖ సెక్రెటరీకి తెలియజేస్తారు. ఇండియా–యూకే మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని పర్యవేక్షించే అధికారం ఉన్న యూకే కేబినెట్ మంత్రి దీనిపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిప్రకారమే నీరవ్ మోదీ అప్పగింతకు హోంశాఖ మంత్రి ప్రీతి సుముఖత వ్యక్తం చేశారు. అప్పగింత ఎప్పుడు? నీరవ్ మోదీని వాండ్స్‌వర్త్ జైలు నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్న 12వ నంబర్ బ్యారక్‌కు తరలించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యూకే హోంమంత్రి ఉత్తర్వులను సవాలు చేస్తూ లండన్ హైకోర్టును ఆశ్రయించేందుకు నీరవ్ మోదీకి అవకాశం కల్పించారు. ఆయన ఒకవేళ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడే మరికొంత కాలం విచారణ జరుగనుంది. యూకే సుప్రీంకోర్టులో కూడా నీరవ్‌మోదీ అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుందని సమాచారం. అయితే, లండన్ హైకోర్టు అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది. తాజా పరిణామాలపై నీరవ్ మోదీ లీగల్ టీమ్ ఇంకా స్పందించలేదు. హైకోర్టుకు వెళ్తారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. యూకేలో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే నీరవ్ మోదీ భారత్‌కు చేరుకుంటారు. అసలేమిటి కేసు? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు మరికొందరు లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ను (ఎల్ఓయూ) దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ 2018 జనవరి 31న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసింది. ఎల్ఓయూ అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఎల్‌ఓయూతో నీరవ్ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్బీ బ్యాంక్ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ కేసులో సీబీఐ 2018 మే 14న నీరవ్‌తోసహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్ కోర్టులో దాఖలు చేసింది. 2019 డిసెంబర్ 20న 30 మందిపై రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్లో ఉన్నవారంతా రెండో చార్జిషీట్లోనూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్ మోదీ ముఠా దుబాయ్, హాంకాంగ్‌లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారిమళ్లించారు. నీరవ్ మోదీ 2018 జనవరి 1న ఇండియా నుంచి తప్పించుకున్నాడు. ట్రయల్ కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 జూన్‌లో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు, లండన్ హైకోర్టు కొట్టివేశాయి. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది. -
నీరవ్ మోదీకి భారీ షాక్: యూకే కోర్టు కీలక తీర్పు
-
నీరవ్ మోదీకి భారీ షాక్
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతడిని భారత్‌కు తీసుకువచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించింది. మనీలాండరింగ్ కేసులో భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు సరైనవేనన్న కోర్టు.. నీరవ్ మానసిక స్థితి సరిగా లేదన్న వాదనను కొట్టిపారేసింది. బ్యాంకుల ఉన్నతాధికారులతో లింక్‌ను ధ్రువీకరించిన న్యాయస్థానం... బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకులను అతడు మోసగించినట్టు నిరూపణ అయిందని పేర్కొంది. ఈ క్రమంలో.. నీరవ్ మోదీపై మనీ లాండరింగ్ అభియోగాలు రుజువు కావడంతో గురువారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అయితే తమ ఉత్తర్వులపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది. కాగా కోర్టు తీర్పుతో లండన్ ప్రభుత్వం అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ ఆర్థిక నేరగాడు స్వదేశానికి రానున్నాడు. కాగా బ్యాంకులకు రూ.13,700 కోట్లు టోకరా పెట్టి నీరవ్ మోదీ లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. చదవండి: ప్రైవేటు బ్యాంకులకు సై -
వికీలీక్స్ ఫౌండర్‌కు భారీ ఊరట
లండన్ : గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలీస్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె కేసులో అమెరికాకు ఎదురు దెబ్బ తగిలింది. అసాంజెనే అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్ కోర్టు ప్రతికూలంగా స్పందించింది. అసాంజేను అమెరికాకు అప్పగించలేమని సోమవారం తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి వెనెస్సా బరైట్సర్ సోమవారం తన తీర్పును ప్రకటించారు. క్లినికల్ డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్న వ్యక్తిగా అసాంజె ఆత్మహత్య చేసుకునే ప్రమాదం గణనీయంగా ఉందని తాను నమ్ముతున్నానని, అందుకే అతన్ని అప్పగించలేమని ఆమె వ్యాఖ్యానించారు. తాజా తీర్పుతో అసాంజే అభిమానులు భారీ సంబరాల్లో మునిగిపోయారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా హక్కుల సంఘాలు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశాయి. అయితే అమెరికాపై దీనిపై తిరిగి అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉందని, దీంతో అసాంజే జైల్లోనే ఉండే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఫ్రీడం ఆఫ్ ది ప్రెస్ ఫౌండేషన్ ట్వీట్ చేసింది. మరోవైపు న్యాయమూర్తి తీర్పును స్వాగతించిన పరిశోధనాత్మక పాత్రికేయుడు స్టెఫానియా మౌరిజి స్వేచ్ఛా ప్రసంగం, జర్నలిజానికి మించి అసాంజే పనిచేశాడన్న అమెరికా వాదనలపై న్యాయమూర్తి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా 2010-11లో అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారం, రహస్య పత్రాలను వికిలీక్స్ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాక్, అఫ్ఘనిస్థాన్ దేశాల్లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడిందని వికీలీక్స్ ఆధారాలతో బయటపెట్టడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపింది. ఈ కేసులో అసాంజె దోషిగా తేలినట్టయితే ఆయనకు 175 ఏండ్ల జైలుశిక్ష విధించే అవకాశముందని భావించారు. -
కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా: అంబానీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సోదరుడు,అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీ సంచలన విషయం ప్రకటించారు. అప్పులతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయంటూ తన దగ్గర ఏమీ లేదంటూ మరోసారి చేతులెత్తేశారు. కేవల ఒక కారుతో చాలాసాధారణ జీవితాన్ని గడుపుతున్నానని వాపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఖర్చులను సైతం తన భార్య, ఇతర కుటుంబ సభ్యులు భరిస్తున్నారని, తన వద్ద చిల్లి గవ్వ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు 2020 జనవరి-జూన్ మధ్య కాలంలో చట్టపరమైన ఖర్చుల కోసం 9.9 కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిపారు. మూడు చైనా బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూకే కోర్టు విచారణకు హాజరైన అనిల్ అంబానీ ఈ విషయం ప్రకటించారు. విచారణలో భాగంగా యుకె కోర్టు లగ్జరీకార్ల సముదాయం గురించి అంబానీని ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఒకకారును మాత్రమే ఉపయోగిస్తున్నానని,రోల్స్ రాయిస్ కారు లేనే లేదంటూ మీడియా ఊహాగానాలను అనిల్ తోసిపుచ్చారు. అంతేకాదు ఆదాయాలు లేక విలాస జీవితం గాకుండా ఒక సాధారణ మనిషిగా జీవిస్తున్నానని తెలిపారు. అలాగే తన భార్య నగలు అమ్మి కోర్టు ఖర్చులు భరిస్తున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. తన తల్లికి 500 కోట్ల రూపాయలు, కుమారుడు అన్మోల్కు 310 కోట్ల రూపాయలు బాకీ ఉన్నానన్నారు. టీనా అనిల్ అంబానీ కలెక్షన్ గురించి కూడా బ్యాంకుల తరపున వాదిస్తున్న కౌన్సిల్ ప్రశ్నించింది. అయితే అదంతా టీనాకు చెందిందే అని, కేవలం టీనా భర్తగా తన పేరు ఉందని చెప్పుకొచ్చారు. 110,000 డాలర్ల విలువైన ఆర్ట్ పీస్ మాత్రమే తనదని వెల్లడించారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 2019 , 2020 లో తనకు ఎలాంటి ఫీజులు రాలేదని ఆయన కోర్టుకు తెలిపారు. దక్షిణ ముంబైలోని తన ఇంటికి కరెంటు ఖర్చు గత ఎనిమిది నెలల్లో 60.6 లక్షలని ప్రకటించారు. ప్రైవేట్ హెలికాప్టర్, భార్యకు బహుమతిగా ఇచ్చిన ప్రైవేట్ లగ్జరీ యాచ్ట్ వినియోగం ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. దక్షిణ ముంబైలోని తన ఇంటిలో ఎనిమిది నెలల్లో 60.6 లక్షల రూపాయల విద్యుత్ ఖర్చులను అనిల్ అంబానీ ప్రకటించారు. మరోవైపు అనిల్ అంబానీ వాస్తవాలను దాచిపెడుతున్నారని బ్యాంకుల తరఫున హాజరైన బంకిమ్ థంకీ క్యూసీ ఆరోపించారు. తమకు రావాల్సిన రుణ బకాయిలను చట్టపరమైన మార్గాల ద్వారా పొంది తీరుతామని వ్యాఖ్యానించారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం, 2008 లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ఆరవ ధనవంతుడిగా అలరారిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. దీనికి 2012లో అనిల్ అంబానీ తన రిలయన్స్ టెలికామ్ వ్యాపారం విస్తరణ కోసం మూడు చైనా బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణానికి వ్యక్తిగత హామీ ఇచ్చారు. ప్రస్తుతం రిలయన్స్ టెలికామ్ కంపెనీ దివాలా తీసింది. దీంతో ఆ బ్యాంకులు అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించాయి. మూడు చైనా బ్యాంకులు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ ముంబై బ్రాంచ్, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా అనిల్ అంబానీపై 700 మిలియన్ డాలర్ల రుణం కోసం దావా వేసిన సంగతి తెలిసిందే. జూన్12 లోపు మూడు చైనా బ్యాంకులకు రూ .5,281 కోట్ల రుణాన్ని, రూ.7 కోట్లు చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని మే 22న ఆదేశించింది. కాని పక్షంలో తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను అఫిడవిట్ ద్వారా ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. ఈ చెల్లింపుల్లో అంబానీ విఫలం కావడంతో చైనా బ్యాంకులు మరోసారి బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించాయి. -
మాల్యా అప్పగింతకు తొలగిన మరో అడ్డంకి..
లండన్: భారత్‌కు తనను బ్రిటన్ అప్పగించడం చట్టబద్ధంగా తగదంటూ విజయ్‌మాల్యా దాఖలు చేసిన అప్పీల్‌ను బ్రిటన్ హైకోర్టు ఒకటి కొట్టివేసింది. దీనితో భారత్ బ్యాంకులను వేలాది కోట్ల రూపాయలమేర మోసం చేసి, బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను తిరిగి భారత్ అప్పగించడానికి మార్గం కొంత సుగమం అయ్యింది. అయితే తన తాజా తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి కోరేందుకు యూకే హైకోర్టు మాల్యాకు 14 రోజుల గడువు ఇచ్చింది. మాల్యా అప్పీల్చేస్తే, దీనిపై తుది తీర్పునకు బ్రిటన్ హోం కార్యాలయం నిరీక్షించాల్సి ఉంటుంది. లేదంటే భారత్–బ్రిటన్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద 28 రోజుల్లో భారత్‌కు బ్రిటన్ హోం శాఖ అప్పగిస్తుంది. తప్పుడు సమాచారం ఇవ్వడం, కుట్ర, అక్రమ ధనార్జనలకు సంబంధించి మాల్యా తప్పు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నట్లు లండన్‌లోని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. -
దుబాయ్ ప్రిన్సెస్ కిడ్నాప్ : కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన ఇద్దరు కుమార్తెలను అపహరించాలని ఆదేశించాడని బ్రిటన్ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. తమ ఇద్దరు పిల్లల నిర్బంధంపై పోరాటంలో మహ్మద్ మాజీ భార్య, యువరాణి హయా బింట్ అల్ హుస్సేన్ (45), జోర్డాన్ రాజు అబ్దుల్లా సోదరి చేసిన ఆరోపణలను లండన్ హైకోర్టులో వారు నిరూపించారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా దుబాయ్ పాలకుడి కుమార్తె ప్రిన్సెస్ లతీఫా కిడ్నాప్‌నకు సంబంధించి భారత్‌లో జరిగిన వ్యవహారాలపై బాధితుల ఆరోపణలతో బ్రిటన్ కోర్టు ఏకీభవించింది. రాయ్‌టర్స్ కథనం ప్రకారం ..దుబాయ్ పాలకుడి కుమార్తెలలో ఒకరైన ప్రిన్సెస్ లతీఫా దుబాయ్ నుండి తప్పించుకోవడానికి భారీ ప్రణాళిక రచించింది. చివరికి ఆ ప్రణాళిక ఒక సినిమా సన్నివేశాన్ని తలపించింది. (నా భార్యను తిరిగి దుబాయ్ పంపించండి) ప్రిన్సెస్ లతీఫా తన ఫిట్నెస్ ట్రైనర్, ఫ్రాన్స్‌కు చెందిన టినా జౌహియెనె సూచనతో ఎస్కేప్ ఫ్రం దుబాయ్ పుస్తక రయిత హార్వ్ జుబర్ట్ను సంప్రదించి ఈ ప్లాన్‌ను అమలుపరిచింది. 2018 ఫిబ్రవరి 24న లతీఫాను ఆమె డ్రైవర్ దుబాయ్ లోని ఒక కేఫ్ వద్ద వదిలివేసారు, అక్కడ ఆమె మరియు జౌహియెన్ అల్పాహారం కోసం క్రమం తప్పకుండా కలుస్తుంటారు. అక్కడి నుంచి ఈ జంట దుబాయ్ నుండి ఒమన్ మీదుగా మస్కట్‌కు చేరుకునన్నారు. అక్కడి నుంచి వారు భారత్‌లోని గోవాకు బయలుదేరారు. కానీ మార్చి 4 న గోవాలో భారత, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కమాండో యూనిట్లు వారిని అడ్డగించాయని జౌహియెన్ చెప్పారు. (బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించండి) చదవండి : దుబాయ్‌లో భారతీయ విద్యార్థికి కరోనా "మమ్మల్ని భారత కోస్ట్గోర్డు దళాలు, హెలికాప్టర్లు, విమానాలు చుట్టుముట్టాయి... పడవ మొత్తం పొగతో నిండిపోయింద’ని అని ఆమె చెప్పుకొచ్చారు. "వారు పడవను దోచుకుని సిబ్బందిని కొట్టారు. లతీఫాను తీవ్రంగా గాయపరిచి ఆమెతో సహా పడవలో అందరినీ కిడ్నాప్ చేసి యుఎఇకి తీసుకువెళ్లార’ని ఆమె చెప్పారు. తాను ఓడకు కెప్టెన్‌గా ఉన్నానని, ఈ దాడికి సాక్ష్యమిచ్చానని జాబర్ట్ చెప్పడం విశేషం. కాగా ఈ విషయాలన్నీ యువరాణి హయా ఈ బ్రిటిష్ న్యాయమూర్తికి వివరించారు. ఇక 35 ఏళ్ళ లతీఫాను దుబాయ్ పాలకులు అపహరించేందుకు సాయుధ భారత కమాండో బృందం సముద్రంలో సహకరించిందనే తన ఆరోపణలను కోర్టు సమర్థించినట్టు హయా పేర్కొందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. కాగా ఈ అంశాలపై వివరణ కోరేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతనిధి రవీష్ కుమార్‌ను సంప్రదించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారని రాయ్‌టర్స్ తెలిపింది. (ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!) -
జైల్లోనే నీరవ్ మోదీ
లండన్/ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు కుచ్చుటోపీ, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను యూకే కోర్టు గురువారం అయిదోసారి తిరస్కరించింది. గతేడాది మార్చిలో అరెస్టయినప్పటి నుంచి నీరవ్ నైరుతీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి బాకీ ఉన్న పన్నుల వసూలుకు గాను ఆ సంస్థ వజ్రాల వ్యాపారి, పీఎన్బీ స్కాంలో నిందితుడి నీరవ్ మోదీకి చెందిన 3 ఆస్తులను అటాచ్ చేసింది. నీరవ్ బీఎంసీకి రూ. 9.5 కోట్ల పన్ను చెల్లించాలని, ఇందుకుగాను అతని 4 ఆస్తుల్లో మూడింటిని అటాచ్ చేసినట్లు బీఎంసీ తెలిపింది. రుణాల ఎగవేతదారు నీరవ్ మోదీ ఆస్తులను వేలం వేయగా రూ. 51 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు వచ్చినట్లు అధికారులు గురువారం తెలిపారు. వేలం వేసిన వస్తువుల్లో రోల్స్ రాయిస్ కారు, పలు ప్రముఖ చిత్రలేఖనాలు, డిజైనర్ బ్యాగు సహా మొత్తం 40 వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
రూ.700 కోట్లు కట్టండి
లండన్: రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి సంబంధించి చైనా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గాను వ్యక్తిగత హామీ ఇచ్చిన ప్రమోటర్ అనిల్ అంబానీకి బ్రిటన్ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆరు వారాల్లో 100 మిలియన్ డాలర్లు (రూ.700 కోట్లు) కోర్టులో డిపాజిట్æ చేయాలని న్యాయమూర్తి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంకు ఆఫ్ చైనా ముంబై శాఖ, చైనా డెవలప్మెంట్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా అనిల్ అంబానీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లో కండీషనల్ ఆర్డర్లో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. -
నిజాం నిధుల్లో.. ఎవరికెంత!
సాక్షి, హైదరాబాద్: భారత్ సొంతమైన నిజాం నిధుల్లో ఎవరి వాటా ఎంత అన్నది ఆసక్తిగా మారింది. 1948లో అప్పటి నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్‌లోని బ్రిటీష్ హై కమిషనర్‌కు బదిలీ చేసిన రూ.3.5 కోట్లు భారత్, నిజాం వారసులవేనంటూ లండన్ హైకోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే. ఆ మొత్తం ప్రస్తుతం రూ.306 కోట్లకు చేరింది. ఉస్మాన్ అలీఖాన్ మనవడు, ఎనిమిదవ నిజాం ముకర్రంజా, ఆయన సోదరుడు ముఫకంజాతో పాటు భారత ప్రభుత్వానికి సైతం వాటా లభించనుంది. భారత ప్రభుత్వానికి 70 శాతం, నిజాం వారసులకు 30 శాతం నిధులు వచ్చేందుకు అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. లండన్ హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు పాకిస్తాన్‌కు 4 వారాల సమయం ఉంద. ఈ విషయమై నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి నజాఫ్ అలీఖాన్‌న్‌గురువారం మీడియాతో మాట్లాడుతూ, పాకిస్తాన్ అప్పీల్‌కు వెళితే సిద్ధంగా ఉన్నామని, లేనట్లయితే వచ్చే నిధుల్లో 4 భాగాలు చేయాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. -
నిజాం నిధులపై పాక్‌కు చుక్కెదురు
లండన్: 1948 నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో డిపాజిట్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుకు చెందిన 35 మిలియన్ పౌండ్ల (రూ. 306.5 వందల కోట్లు)పై దశాబ్దాలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రస్తుతానికి భారత్‌కు అనుకూలంగా ముగిసింది. ఆ నిధులపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదని యూకే హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అవి భారత్‌కు, నిజాం వారసులకే చెందాలని స్పష్టం చేసింది. 1948లో ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్ (సుమారు ఒక మిలియన్ పౌండ్లు)లను బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోని పాకిస్తాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికి అవి దాదాపు 35 మిలియన్ పౌండ్లకు చేరాయి. ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్ చేసిన వాదనను జస్టిస్ మార్కస్ స్మిత్ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు. ‘ఈ వివాదం ప్రారంభమైనప్పుడు నా క్లయింట్లు చిన్నపిల్లలు.. ఇప్పుడు వారి వయస్సు 80 ఏళ్లకు పైగానే. ఇప్పటికైనా, వారి జీవిత కాలంలోనే ఈ తీర్పు రావడం, అదీ వారికి అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది’అని నిజాం వారసుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పాల్ హెవిట్ వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా పాక్ రెండు వాదనలు వినిపించింది. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలుకు సంబంధించిన డబ్బును లండన్ బ్యాంక్‌లో ఏడవ నిజాం జమ చేశారని, అందువల్ల ఆ నిధులు తమకే చెందుతాయన్నది ఒక వాదన. భారత్‌కు ఆ నిధులు చెందకూడదనే ఉద్దేశంతోనే లండన్ బ్యాంక్‌కు బదిలీ చేశారన్నది రెండవ వాదన. అలాగే, భారత ప్రభుత్వ ఆధీనంలోకి రాకముందు నిజాం రాజ్యం ప్రభుత్వ హోదాలో ఆ నిధుల బదిలీ చేసిందని కూడా పాక్ వాదించింది. హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కూడా చట్టవ్యతిరేక చర్య అని పేర్కొంది. ఈ వాదనలన్నింటిని కోర్టు తోసిపుచ్చింది. పాక్ నుంచి ఆయుధాల కొనుగోలు నిజమే అని నమ్ముతున్నప్పటికీ.. ఈ నిధులు వాటికి సంబంధించినవే అనేది నిర్ధారణ కాలేదని పేర్కొంది. భారత్‌కు చెందకూడదనే నిధుల బదిలీ జరిగిందని భావించినా.. దానర్థం ఆ నిధులు ఏదో ట్రస్ట్‌కు కాకుండా పాకిస్తాన్‌కే చెందాలనేందుకు ఆధారాలు లేవంది. హైదరాబాద్ రాజ్యం భారత్‌లో కలిసిన విషయం ఈ కేసుకు అప్రస్తుతమని స్పష్టం చేసింది. ఆ నిధులను తిరిగి తనకు ట్రాన్స్ఫర్ చేయాలని ఆ తరువాత నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ కోరిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం, నిజాం వారసులు గత సంవత్సరం ఒక రహస్య ఒప్పందానికి రావడంతో.. ఈ కేసు భారత్– పాక్‌ల మధ్య వ్యాజ్యంగా మారింది. తీర్పుపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. తీర్పును అధ్యయనం చేస్తున్నామని, న్యాయ సలహా తీసుకుని తదుపరి ఏం చేయాలనే విషయం నిర్ణయిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌ను భారత ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించిన విషయాన్ని కోర్టు విస్మరించిందని వ్యాఖ్యానించింది. ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ -
భారత్‌కు మాల్యా : బిగ్ బ్రేక్
లండన్: భారత బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా (63) ను స్వదేశం రప్పించే ప్రయత్నంలో మరో బ్రేక్ పడింది. మాల్యాను భారత్ అప్పగించే ఉత్తర్వుకు వ్యతిరేకంగా యుకె హైకోర్టులో మాల్యా పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. 2020 ఫిబ్రవరి 11వ తేదీకి ఈ విచారణను వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 11 నుండి మూడు రోజులపాటు ఈ అంశంపై విచారణ చేపట్టనున్నామని లండన్ హైకోర్టు అధికారి ఒకరు తెలిపారు. కాగా సుమారు రూ. 9వేల కోట్లకు పైగా బ్యాంకులకు బకాయి పడిన కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాపై మనీలాండర్‌రింగ్ ఆరోపణలతో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. ఆర్థిక నేరగాడు మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి2, 2016న దేశంనుంచి పారిపోయిన మాల్యాను ఎట్టకేలకు 2017లో లండన్ పోలీసుల సాయంతో మాల్యాను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మాల్యా బెయిల్‌పై ఉన్నాడు. అయితే బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలు 100శాతం చెల్లించడానికి సిద్దంగా ఉన్నా బ్యాంకులు మాత్రం ఆ డబ్బు తీసుకోవడంలేదని మాల్యా వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ
లండన్ : పీఎన్బీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టులో బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను బ్రిటన్ కోర్టు తోసిపుచ్చింది. మోదీకి బెయిల్ మంజూరు చేస్తే ఆయన సాక్ష్యాలకు అవరోధం కల్పించవచ్చనేందుకు ఆధారాలున్నాయని కోర్టు పేర్కొంది. పీఎన్బీ స్కాంతో పాటు మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. మోదీ అప్పగింతపై విచారణ సాగుతున్న క్రమంలో దిగువ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నీరవ్ మోదీ బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా మోదీ బెయిల్ పిటిషన్‌ను బ్రిటన్ కోర్టు తిరస్కరించడం ఇది నాలుగవసారి కావడం గమనార్హం. నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీలు నకిలీ పత్రాలతో పీఎన్బీ నుంచి రూ 11,400 కోట్ల మేర రుణాలు పొంది తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
బెయిల్ కోసం మళ్లీ బ్రిటన్ కోర్టుకు నీరవ్ మోదీ
లండన్ : పీఎన్బీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ కోసం మరోసారి బ్రిటన్‌లో ఎగువ కోర్టును ఆశ్రయించారు. నీరవ్ మోదీకి గతంలో బెయిల్ ఇచ్చేందుకు దిగువ కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. మోదీ అప్పగింత కేసును విచారిస్తున్న వెస్ట్‌మినిస్టర్ మేజిస్ర్టేట్ కోర్టు ఇప్పటికే ఆయన బెయిల్ వినతిని మూడు సార్లు తోసిపుచ్చింది. కాగా మోదీని ఉంచిన వ్యాండ్స్‌వర్త్ జైలులో కనీస సౌకర్యాలు లేవని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు నివేదించినా బెయిల్ మంజూరుకు న్యాయస్ధానం అంగకరించలేదు. వ్యాండ్స్‌వర్త్ జైలుకు ప్రత్యామ్నాయంగా మోదీ లండన్‌లోని తన లగ్జరీ ఫ్లాట్‌లోనే 24 గంటల పాటు ఉండేందుకు అనుమతించాలన్న ఆయన న్యాయవాదుల అప్పీల్‌ను కోర్టు అంగీకరించలేదు. పీఎన్బీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న మోదీని భారత్‌కు అప్పగించడంపై బ్రిటన్ కోర్టులో వాదోపవాదాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నీరవ్ మోదీని ఈ ఏడాది మార్చి 20న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్‌చేశారు. నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీలు నకిలీ పత్రాలతో పీఎన్బీ నుంచి రూ 11,400 కోట్ల మేర రుణాలు పొంది తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
బిటన్ హైకోర్టులో నీరవ్ బెయిల్ పిటిషన్
లండన్: భారత్‌లో మోసాలకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన నీరవ్ మోదీ బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. గతంలో మూడుసార్లు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ బ్రిటన్ హైకోర్టులో శుక్రవారం ఆయన మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ జూన్ 11వ తేదీన విచారణకు రానుందని భారత్ తరపున వాదనలు వినిపిస్తున్న క్రౌన్ ప్రోసెక్షన్ సర్వీస్ తెలిపింది. గురువారం నీరవ్ కేసుపై విచారణ జరిపిన కోర్టు, ఆయన రిమాండ్‌ను జూన్ 27 వరకు పొడిగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14 వేల కోట్లు మోసం చేసి బ్రిటన్ పారిపోయిన నీరవ్‌ను ఇక్కడకు తీసుకురావడానికి భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 19న బ్రిటన్ పోలీసులు అరెస్టు చేసినప్పటినుంచి నీరవ్ మోదీ రిమాండ్‌లోనే ఉన్నారు. -
మాల్యాకు లండన్ కోర్టు భారీ షాక్
లండన్ : ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. వేలకోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ఎగవేసి లండన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త మాల్యాను భారత్‌కు రప్పించే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట కలిగింది. భారత్‌కు రప్పించే చర్యలకు వ్యతిరేకంగా మాల్యా అభ్యర్థనను లండన్ కోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో మాల్యాను త్వరలోనే దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. తనను భారత్‌కు అప్పగించే చర్యలను అడ్డుకోవాలని మాల్యా దాఖలు చేసిన పిటీషన్‌ను బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హై కోర్టును ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్నాట్ వ్యాఖ్యానిస్తూ...విజయ్ మాల్యా భారత న్యాయస్థానాలకు జవాబుదారీగా ఉండాలని సూచించింది. అతను చేసిన ఆర్థిక అవకతవకలకు భారతీయ న్యాయస్థానాల పరిధిలోనే విచారణ కొనసాగాలని సూచించింది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 9వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ బ్యాంకులకు ఎగవేసి, డీఫాల్టర్‌గా 2016 మార్చిలో దేశం లండన్‌కు పారిపోయాడు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసులో విజయ్ మాల్యాను తిరిగి దేశం రప్పించేందుకు కేంద్ర కసరత్తును తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను భారత్‌కు అప్పగించడానికి ఇంగ్లండ్ హోం మినిస్టర్ సాజిద్ జావిద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. -
మాల్యా వచ్చేదెపుడు?
బ్యాంకులకు చెల్లించాల్సిన రూ. 9,000 కోట్లకు పైగా బకాయిల్ని ఎగ్గొట్టి రెండేళ్లక్రితం దేశం విడిచి పరారైన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను తిరిగి రప్పించే ప్రయత్నంలో తొలి విజయం లభించింది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయన్ను తిరిగి భారత్‌కు అప్ప గించడం సబబేనని సోమవారం తీర్పునిచ్చింది. విజయ్ మాల్యా దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలతో, బడా నాయకులతో ఎలా చెట్టపట్టాలేసుకుని తిరిగేవాడో అందరికీ తెలుసు. అందుకే ఆయనకు సులభంగా అప్పు దొరికేది. ఒక్క మాల్యాకు మాత్రమే కాదు... దేశంలోని బడా పారి శ్రామికవేత్తలందరికీ బ్యాంకులు ఎప్పుడూ ఎర్ర తివాచీలు పరుస్తూనే ఉన్నాయి. వారిలో చాలా మంది ఎగ్గొట్టే అవకాశం ఉన్నదని తెలిసినా ఇదే వరస. రైతులకు బ్యాంకుల్లో అప్పు దొరకడమే అరుదు. దొరికినా వారు విధించే సవాలక్ష నిబంధనలు అందుకు ఆటంకంగా నిలుస్తాయి. పర్యవసానంగా వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటారు. కష్టాల సాగుతో ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు విజయ్ మాల్యా కేసును విచారించిన సందర్భంలో అక్కడి న్యాయస్థానం మన బ్యాంకులపై చేసిన వ్యాఖ్యలు గమనిం చదగ్గవి. రుణాలివ్వడానికి ముందు, తర్వాత కూడా భారతీయ బ్యాంకులు ఆయన మోసాన్ని గ్రహించడంలో విఫలమయ్యాయని న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్నాట్ విమర్శించారు. ఇది ఉద్దేశ పూర్వకమైన వైఫల్యమా, అమాయకత్వం వల్ల జరిగిందా అన్నది తేల్చడానికి అవసరమైన సాక్ష్యా ధారాలు తన ముందు లేవని వ్యాఖ్యానించారు. ఆమెకు మాల్యా కేసు ఒక్కటే రావడంవల్ల స్పష్టత వచ్చి ఉండదుగానీ... ఎగవేతదార్ల వివరాలు, వారికి సంబంధించిన పత్రాలన్నీ ఇస్తే మన దేశం లోని బ్యాంకింగ్ వ్యవస్థను చూసి ఎమ్మాకు కళ్లు తిరిగేవి. ఒకసారి ఒకరి దగ్గర మోసపోతే అమాయకులుగా జమకట్టొచ్చు. కానీ అది రివాజుగా మారినప్పుడు దాన్ని అమాయకత్వం అనరు. కుమ్మక్కు అంటారు. మన దేశంలో జరుగుతున్నది అదే. బ్యాంకుల్ని మోసగించే ప్రక్రియ భారీ యంత్రపరికరాలు దిగుమతి చేసుకోవడం దగ్గరనుంచి మొదలవుతుంది. వాటి వ్యయాన్ని అధికంగా చూపి, ఆ మేరకు అప్పు చేయడంతో మొదలై వివిధ దశల్లో కోట్లాది రూపాయల రుణం తీసుకుంటారు. ఇవన్నీ నిర్దిష్ట కాల వ్యవధిలో చెల్లిస్తుంటే పేచీ ఉండదు. కానీ వారి ఉద్దేశాలే వేరు. అప్పు తీసుకునేది తీర్చడానికి కాదు...ఎగ్గొట్టడానికి. తాము తీర్చకపోయినా ఎవరూ చడీ చప్పుడూ చేయరని, ఏళ్లూ పూళ్లూ గడిచాక వన్ టైమ్ సెటిల్మెంట్ కింద, వడ్డీ మాఫీ కింద స్వల్ప మొత్తాలు కట్టించుకుని తమను సులభంగా వదిలేస్తారన్నది వారి భరోసా. ఇలా ఉద్దేశపూర్వకంగా అప్పులు తీర్చకుండా మొహం చాటేస్తున్నవారి వివరాలు వెల్ల డించాలని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలని నాలుగు నెలలక్రితం కేంద్ర సమాచార హక్కు కమిషన్(సీఐసీ) కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖకు, రిజర్వ్‌బ్యాంకును ఆదేశించింది. రూ. 50 కోట్లకు మించి బకాయిపడ్డవారందరి వివరాలూ అందులో ఉండాలని స్పష్టం చేసింది. ఇందులో వైపరీత్యమేమీ లేదు. రైతులు బకాయిలు చెల్లించడంలో ఆలస్యమైతే వారు తనఖా పెట్టిన ఆస్తుల్ని వేలం వేస్తామని బ్యాంకు సిబ్బంది వారి ఇళ్లకెళ్లి బెదిరిస్తారు. నోటీసులు పంపుతారు. కొన్ని సందర్భాల్లో అలాంటి రైతుల ఫొటోలు ఆ బ్యాంకు శాఖల్లో ప్రదర్శిస్తారు. బకాయిలు చెల్లించని వారి చరాస్తుల స్వాధీనం ప్రక్రియలో ఆల స్యమేమీ ఉండదు. రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) చట్టం కింద చరాస్తులు స్వాధీనం చేసుకోవడం అత్యంత సులభం. దీన్ని అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఎంతో మంది ఉన్నారు. పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారుల విషయంలో కూడా ఇలాగే చేయాలని ఎవరూ పట్టుబట్టడం లేదు. కనీసం వారి పేర్లు బహిరంగపరచమని అడుగుతున్నారు. సీఐసీ కోరింది కూడా అదే. కానీ సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పినా కదలని కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్‌బ్యాంకు సీఐసీ ఆదేశిస్తే కదులుతాయా? వరసగా మూడు నెలలపాటు వడ్డీ చెల్లించని రుణాలుంటే వాటిని మొండి బకాయిలుగా పరిగణిస్తారు. వాటిని వసూలు చేసుకోవడం ఎలా అన్న ఆత్రుత అప్పటినుంచి మొదలవుతుంది. కానీ ఇలాంటి బకాయిల సంగతి బయటపెడితే ఖాతాదారుల్లో తమ విశ్వసనీయత దెబ్బ తింటుందన్న కారణంతో బ్యాంకులు ఏం జరగనట్టు ఉండిపోతాయి. అలాగని మరోసారి ఆ పరిస్థితి ఏర్పడకుండా చూడవు. ఎటూ మొండి బకాయిల సంగతి వెల్లడికాదన్న ధీమాతో, తమకేమీ జరగదన్న భరోసాతో ఇష్టానుసారం రుణాలివ్వడం కొనసాగిస్తున్నారు. విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ లాంటివారు ఈ ధోరణిని ఆసరాగా తీసుకునే వేల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారు. ఇలాంటివారు దేశం విడిచిపారిపోతుంటే అన్ని వ్యవస్థలూ సహకరిస్తున్నాయి. ఇప్పుడు బ్రిటన్ కోర్టు ఇచ్చిన అప్పగింత ఆదేశాలు తమ విజయమని కేంద్రం చెప్పుకుంటోంది. అయితే వీటివల్ల వల్ల ఇప్పటికిప్పుడు ఒరిగేదేమీ ఉండదు. ఆ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాలు చేస్తాడు. అక్కడ తీర్పు వెలువడటానికి మరికొంతకాలం పడుతుంది. ఆ తీర్పు తనకు అను కూలంగా లేకపోతే విజయ్‌మాల్యా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాడు. అక్కడ సైతం మాల్యాకు భంగపాటు ఎదురయ్యాక కాస్త ఆశ పెట్టుకోవచ్చు. అది కూడా గ్యారెంటీ లేదు. దావూద్ ఇబ్రహీం అనుచరుడు టైగర్ హనీఫ్ కేసులో అన్ని అవరోధాలూ అధిగమించి అయిదేళ్లు కావస్తున్నాఇంకా అతన్ని ఇక్కడకు రప్పించడం సాధ్యపడటం లేదు. విజయ్ మాల్యా వ్యవహారం సాధ్య మైనంత త్వరగా ముగిసేలా చూడటంతోపాటు ఎగవేతదార్ల జాబితా ప్రకటించటం, బకాయిల వసూళ్లకు గట్టిగా ప్రయత్నించటం, రుణాల మంజూరుకు పకడ్బందీ నిబంధనలు రూపొందించటం అత్యవసరం. -
బ్రిటన్ కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ
లండన్: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాను భారత్‌కు అప్పగించే విషయంలో సోమవారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. భారత ప్రభుత్వ వాదనను సమర్ధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు మాల్యాపై ఉన్నాయి. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించిన క్రమంలో 2016లో విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. మాల్యాపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఈడీలు అతన్ని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టును ఆశ్రయించాయి. భారత ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించారు. మరోవైపు తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసులు మోపారని, భారత జైళ్లలో దారుణ పరిస్థితులు ఉంటాయని మాల్యా వెస్ట్‌మినిస్టర్ కోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం భారత ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ.. నేడు తీర్పు వెలువరించింది. కాగా, మాల్యాకు ఈ తీర్పుపై 14 రోజుల్లోగా హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.