నిజాం ఆస్తుల కేసులో... కోటిన్నర చెల్లించండి | UK court asks Pak to pay 150000 pounds to India as legal fee | Sakshi
Sakshi News home page

నిజాం ఆస్తుల కేసులో... కోటిన్నర చెల్లించండి

Published Mon, Mar 23 2015 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

UK court asks Pak to pay 150000 pounds to India as legal fee

పాకిస్తాన్‌కు యూకే కోర్టు ఆదేశం
 లండన్: ఏడవ నిజాం రాజుకు సంబంధించిన ‘హైదరాబాద్ ఫండ్స్ కేసు’ విషయంలో కోర్టు ఖర్చుల కోసం భారత్‌కు 1,50,000 పౌండ్స్(రూ.1.39 కోట్లు) చెల్లించాలని బ్రిటన్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్‌ను యూకే కోర్టు ఆదేశించింది.  కేసులో పాక్ తీరు నిర్హేతుకమని,  పాక్‌కు ఎలాంటి న్యాయ రక్షణా లేదని న్యాయమూర్తి అన్నారు. 1948లో హైదరాబాద్ రాజ్యం భారత్‌లో విలీనమైన 3  రోజులకు నిజాం ఏజెంట్ ఒకరు లక్ష పైచిలుకు పౌండ్లను బ్రిటన్‌లోని  వెస్ట్‌మినిస్టర్ బ్యాంక్‌లో నాటి పాక్ హైకమిషనర్ రహమతుల్లా అకౌంట్‌కు బదలాయించారు.

వారం తర్వాత (సెప్టెంబర్ 28) ఏడో నిజాం  తన అనుమతి లేకుండా డబ్బులు బదలాయించారని, తిరిగి చెల్లించాల్సిందిగా బ్యాంకును కోరారు. కానీ, ఖాతాదారు అనుమతి లేకుండా ఇవ్వలేమని బ్యాంకు పేర్కొంది. అప్పటి నుంచి కేసు పెండింగ్‌లో ఉంది. ఈ నిధుల విలువ ప్రస్తుతం రూ.325.5 కోట్లు. ఇది నిజాం అస్తి కాదని, తమ ప్రభుత్వ నిధి అని భారత్ వాదిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement