Nizam properties case
-
సీసీఎస్‌ను ఆశ్రయించిన ఏడో నిజాం మనవరాలు
సాక్షి, హైదరాబాద్: నిజాం ఆస్తులకు సంబంధించిన ఓ వివాదం హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్)కు చేరింది. తన పేరిట ముగ్గురు వ్యక్తులు నకిలీ జీపీఏ సృష్టించి కోర్టు ద్వారా వారసత్వ సర్టిఫికెట్ పొందారని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనవరాలు ఫాతిమా ఫౌజియా సీసీఎస్‌లో క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఏడో నిజాం రెండో కుమారుడైన వాలాషాన్ ప్రిన్సెస్ మౌజ్జమ్ ఝా బహదూర్ కుమార్తె ఆమె. తొలుత నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కేసు నమోదు చేయకపోవడంతో హైదరాబాద్‌లోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. స్పందించిన న్యాయస్థానం.. కేసు నమోదు చేయాలని సీసీఎస్‌ను ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారసత్వ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలి..: ‘బషీర్‌బాగ్‌కు చెందిన మిలాద్ అలీ ఖాన్, నాంపల్లికి చెందిన సాజిద్ అలీఖాన్, బంజారాహిల్స్‌కు చెందిన మీర్ మిర్జా అలీఖాన్ ఉమ్మడిగా ఏడో నిజాంకు సంబంధించిన ఆస్తులకు వారసులమని.. నా పేరిట నకిలీ జీపీఏతో 2016లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారా వారసత్వ సర్టిఫికెట్ పొందారు. అనంతరం నా ఆస్తిలోనూ వాటా ఉందంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అలాగే తమిళనాడులోని నీలగిరి, ఊటీల్లో ఉన్న దాదాపు రూ. 121 కోట్ల విలువైన ఏడో నిజాం ఎస్టేట్స్‌లో వాటా పంచాలని కోర్టుకెక్కారు. నా తండ్రి, సోదరుడి నుంచి నాకు సంక్రమించిన 36 శాతం ఆస్తుల వాటాను తక్కువగా చూపించడంతోపాటు పూర్తిగా ఎస్టేట్‌ను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారు’అని ఫాతిమా కోర్టులో వేసిన ప్రైవేటు ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు పొందిన వారసత్వ సరి్టఫికెట్ బోగస్ అని, దాన్ని రద్దు చేయాలని కోరారు. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీన సమయంలో లండన్‌కు తరలించిన నిజాం నిధి విషయమై ఏడవ నిజాం ముని మనవరాలు ప్రిన్సెస్ షఫియా సకినా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. నిజాం నిధిని ఇద్దరు వారసులకు మాత్రమే ఇచ్చేందుకు కేంద్రం అనుమతించడం చట్టవిరుద్ధమని, వారసులందరికీ ఆ నిధిని పంచేలా ఆదేశాలు జారీచేయాలంటూ సకినా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందుకు స్పందించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రిన్స్ ముకరంజా బహదూర్, ప్రిన్స్ ముఫకంజా బహదూర్‌లతోపాటు నిజాం ట్రస్ట్ కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావలి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: ఆ భూమి ప్రైవేటు వ్యక్తులదే: హైకోర్టు చదవండి: పిటిషనర్లకు షాకిచ్చిన హైకోర్టు.. రూ.10 వేల జరిమానా -
నిజాం నిధులపై పాక్‌కు చుక్కెదురు
లండన్: 1948 నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో డిపాజిట్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుకు చెందిన 35 మిలియన్ పౌండ్ల (రూ. 306.5 వందల కోట్లు)పై దశాబ్దాలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రస్తుతానికి భారత్‌కు అనుకూలంగా ముగిసింది. ఆ నిధులపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదని యూకే హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అవి భారత్‌కు, నిజాం వారసులకే చెందాలని స్పష్టం చేసింది. 1948లో ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్ (సుమారు ఒక మిలియన్ పౌండ్లు)లను బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోని పాకిస్తాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికి అవి దాదాపు 35 మిలియన్ పౌండ్లకు చేరాయి. ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్ చేసిన వాదనను జస్టిస్ మార్కస్ స్మిత్ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు. ‘ఈ వివాదం ప్రారంభమైనప్పుడు నా క్లయింట్లు చిన్నపిల్లలు.. ఇప్పుడు వారి వయస్సు 80 ఏళ్లకు పైగానే. ఇప్పటికైనా, వారి జీవిత కాలంలోనే ఈ తీర్పు రావడం, అదీ వారికి అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది’అని నిజాం వారసుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పాల్ హెవిట్ వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా పాక్ రెండు వాదనలు వినిపించింది. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలుకు సంబంధించిన డబ్బును లండన్ బ్యాంక్‌లో ఏడవ నిజాం జమ చేశారని, అందువల్ల ఆ నిధులు తమకే చెందుతాయన్నది ఒక వాదన. భారత్‌కు ఆ నిధులు చెందకూడదనే ఉద్దేశంతోనే లండన్ బ్యాంక్‌కు బదిలీ చేశారన్నది రెండవ వాదన. అలాగే, భారత ప్రభుత్వ ఆధీనంలోకి రాకముందు నిజాం రాజ్యం ప్రభుత్వ హోదాలో ఆ నిధుల బదిలీ చేసిందని కూడా పాక్ వాదించింది. హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కూడా చట్టవ్యతిరేక చర్య అని పేర్కొంది. ఈ వాదనలన్నింటిని కోర్టు తోసిపుచ్చింది. పాక్ నుంచి ఆయుధాల కొనుగోలు నిజమే అని నమ్ముతున్నప్పటికీ.. ఈ నిధులు వాటికి సంబంధించినవే అనేది నిర్ధారణ కాలేదని పేర్కొంది. భారత్‌కు చెందకూడదనే నిధుల బదిలీ జరిగిందని భావించినా.. దానర్థం ఆ నిధులు ఏదో ట్రస్ట్‌కు కాకుండా పాకిస్తాన్‌కే చెందాలనేందుకు ఆధారాలు లేవంది. హైదరాబాద్ రాజ్యం భారత్‌లో కలిసిన విషయం ఈ కేసుకు అప్రస్తుతమని స్పష్టం చేసింది. ఆ నిధులను తిరిగి తనకు ట్రాన్స్ఫర్ చేయాలని ఆ తరువాత నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ కోరిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం, నిజాం వారసులు గత సంవత్సరం ఒక రహస్య ఒప్పందానికి రావడంతో.. ఈ కేసు భారత్– పాక్‌ల మధ్య వ్యాజ్యంగా మారింది. తీర్పుపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. తీర్పును అధ్యయనం చేస్తున్నామని, న్యాయ సలహా తీసుకుని తదుపరి ఏం చేయాలనే విషయం నిర్ణయిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌ను భారత ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించిన విషయాన్ని కోర్టు విస్మరించిందని వ్యాఖ్యానించింది. ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ -
నిజాం ఆస్తుల కేసు : భారత్‌కు భారీ విజయం
లండన్ : అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మరో భారీ విజయం చేకూరింది. 35 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల (రూ 300 కోట్ల) విలువైన హైదరాబాద్ నిజాం ఆస్తులకు సంబంధించిన హక్కులపై భారత్ వాదనను బ్రిటన్ హైకోర్టు బుధవారం సమర్ధించింది. 70 ఏళ్ల కిందటి ఈ కేసులో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తేల్చిచెప్పింది. కోర్టు తీర్పుతో లండన్‌లోని నేషనల్ వెస్ట్‌మినిస్టర్ బ్యాంక్‌లో ఉన్న నిజాం నిధులపై తమకు హక్కుందని పాకిస్తాన్ పదేపదే చేస్తున్న వాదన పసలేనిదని తేలింది. దేశ విభజన సమయంలో అప్పటి హైదరాబాద్ నిజాం తనపై సైన్యం దండెత్తవచ్చనే భయంతో బ్రిటన్‌లో పాక్ హైకమిషనర్‌కు ఈ నిధులు పంపారు. ఈ నిధులు 1948 సెప్టెంబర్ నుంచి బ్రిటన్‌కు పాకిస్తాన్ హైకమిషనర్ ఖాతాలో ఉన్నాయి. వీటిపై తమకే హక్కులు ఉంటాయని పాకిస్తాన్ వాదిస్తుండగా, నిజాం వారసులు భారత్ ప్రభుత్వంతో కలిసి తమ వాదనలు వినిపించారు. ఈ నిధులు ఆయుధ నౌకలకు చెల్లింపుల కోసం ఉద్దేశించినవని, తమకు బహుమతిగా వచ్చినవని పాక్ వినిపించిన వాదనలను బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. భారత్‌కు ఈ నిధులు చెందుతాయని కోర్టు విస్పష్టంగా పేర్కొంది. ఈ నిధి లబ్ధిదారునిగా ఏడవ నిజాంను గుర్తిస్తూ ఆయన ఇద్దరు మునిమనవలకు ఇది వారసత్వంగా సంక్రమిస్తుందని తెలిపింది. నిజాం ఆస్తులపై బ్రిటన్ హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు అంతర్జాతీయ వేదికపై పాక్‌కు మరో చేదు అనుభవంగా మిగిలింది. -
నిజాం ఆస్తుల కేసులో... కోటిన్నర చెల్లించండి
పాకిస్తాన్‌కు యూకే కోర్టు ఆదేశం లండన్: ఏడవ నిజాం రాజుకు సంబంధించిన ‘హైదరాబాద్ ఫండ్స్ కేసు’ విషయంలో కోర్టు ఖర్చుల కోసం భారత్‌కు 1,50,000 పౌండ్స్(రూ.1.39 కోట్లు) చెల్లించాలని బ్రిటన్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్‌ను యూకే కోర్టు ఆదేశించింది. కేసులో పాక్ తీరు నిర్హేతుకమని, పాక్‌కు ఎలాంటి న్యాయ రక్షణా లేదని న్యాయమూర్తి అన్నారు. 1948లో హైదరాబాద్ రాజ్యం భారత్‌లో విలీనమైన 3 రోజులకు నిజాం ఏజెంట్ ఒకరు లక్ష పైచిలుకు పౌండ్లను బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ బ్యాంక్‌లో నాటి పాక్ హైకమిషనర్ రహమతుల్లా అకౌంట్‌కు బదలాయించారు. వారం తర్వాత (సెప్టెంబర్ 28) ఏడో నిజాం తన అనుమతి లేకుండా డబ్బులు బదలాయించారని, తిరిగి చెల్లించాల్సిందిగా బ్యాంకును కోరారు. కానీ, ఖాతాదారు అనుమతి లేకుండా ఇవ్వలేమని బ్యాంకు పేర్కొంది. అప్పటి నుంచి కేసు పెండింగ్‌లో ఉంది. ఈ నిధుల విలువ ప్రస్తుతం రూ.325.5 కోట్లు. ఇది నిజాం అస్తి కాదని, తమ ప్రభుత్వ నిధి అని భారత్ వాదిస్తోంది.