లండన్ : ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. వేలకోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ఎగవేసి లండన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త మాల్యాను భారత్‌కు రప్పించే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట కలిగింది. భారత్‌కు రప్పించే చర్యలకు వ్యతిరేకంగా మాల్యా అభ్యర్థనను లండన్ కోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో మాల్యాను త్వరలోనే దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది.
తనను భారత్‌కు అప్పగించే చర్యలను అడ్డుకోవాలని మాల్యా దాఖలు చేసిన పిటీషన్‌ను బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హై కోర్టును ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్‌నాట్ వ్యాఖ్యానిస్తూ...విజయ్ మాల్యా భారత న్యాయస్థానాలకు జవాబుదారీగా ఉండాలని సూచించింది. అతను చేసిన ఆర్థిక అవకతవకలకు భారతీయ న్యాయస్థానాల పరిధిలోనే విచారణ కొనసాగాలని సూచించింది.
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 9వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ బ్యాంకులకు ఎగవేసి, డీఫాల్టర్‌గా 2016 మార్చిలో దేశం లండన్‌కు పారిపోయాడు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసులో విజయ్ మాల్యాను తిరిగి దేశం రప్పించేందుకు కేంద్ర కసరత్తును తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను భారత్‌కు అప్పగించడానికి ఇంగ్లండ్ హోం మినిస్టర్ సాజిద్ జావిద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment