vijaya mallya
-
మాల్యా కేసు : సంచలన ట్విస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను, తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయత్నిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టులో కొన్ని ముఖ్యమైన పత్రాలు మాయం కావడం సంచలనంగా మారింది. జూలై 14, 2017 నాటి తీర్పుకు వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఈ ఉదంతం వెలుగు చూసింది. దీంతో ఈ కేసు విచారణను న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్ ఆగస్టు 20 కి వాయిదా వేశారు. (ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్ ఆఫర్ ) తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపులో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆయనపై లోగడ కోర్టు ధిక్కార కేసు నమోదైంది. తనను దోషిగా పేర్కొంటూ.. 2017 లో కోర్టు తీర్పును రివ్యూ చేయవలసిందిగా మాల్యా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్ లతో కూడిన బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ విచారణ సందర్భంగా కీలక పత్రాలు మాయం కావడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత మూడేళ్లుగా మాల్యా రివ్యూ పిటిషన్‌ని సంబంధిత కోర్టులో ఎందుకు లిస్ట్ చేయలేదో వివరించాల్సిందిగా రిజిస్ట్రీని జస్టిస్ లలిత్, భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ మూడు సంవత్సరాల్లో ఈ రివ్యూ పిటిషన్ కి సంబంధించిన ఫైల్‌ను ఏయే అధికారులు డీల్ చేశారో వారి పేర్లతో సహా అన్ని వివరాలను సమర్పించాలని వారు సూచించారు. కాగా ప్రభుత్వ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా.. తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదలాయించారని, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
మాల్యా అప్పగింత : మరో ఎత్తుగడ
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటున్న ఉద్దేశపూరక ఎగవేతదారుడు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించే ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. మాల్యా అప్పగింతకు ముందు చట్టపరమైన సమస్య పరిష్కరించాల్సి ఉందంటూ బ్రిటీష్ హైకమిషన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాజాగా మరో న్యాయపరమైన చిక్కు వచ్చినట్టు సమాచారం. ఇది పరిష్కారం అయ్యేంత వరకు మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రక్రియలో మరికొంత జాప్యం తప్పదు. మానవతా దృక్పథం ప్రాతిపదికన తనకు లండన్ లో ఆశ్రయం కల్పించాల్సిందిగా మాల్యా కోరినట్టు తెలుస్తోంది. యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్ఆర్) ఆర్టికల్ 3 ప్రకారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. మాల్యాకు యూకే ఆశ్రయం ఇస్తుందా లేదా అనేది చూడాలి. అయితే ఇలాటి దరఖాస్తులు ప్రాసెస్ కు కనీసం ఆరు నెలలు పడుతుందనీ, ఒకవేళ మాల్యా అభ్యర్ధనను తిరస్కరించి నప్పటికీ, దీనిపై మళ్లీ రివ్యూ కోరుకునే అవకాశం కూడా వుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాకు కొంత సమయం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. -
విజయ్ మాల్యాకు భారీ ఊరట
లండన్ : లిక్కర్ కింగ్, ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు భారీ ఉపశమనం లభించింది. మాల్యాను దివాలాదారుడిగా ప్రకటించాలంటూ భారత బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్ కోర్టు తోసి పుచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది. 114.5 కోట్ల పౌండ్ల రుణాలు విజయ్ మాల్యా ఎగ్గొట్టాడని, బకాయిల వసూలు నిమిత్తం మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాలని ఎస్బీఐ సారధ్యంలోని భారత బ్యాంకుల కన్సార్షియం అభ్యర్థించింది. దీన్ని విచారించిన జస్టిస్ మైకేల్ బ్రిగ్స్ భారత సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్లతో పాటు, కర్నాటక హైకోర్టులో మాల్యా పెట్టుకున్న చెల్లింపు ప్రతిపాదన తేలేవరకు మాల్యాకు సమయం ఇవ్వాలని తీర్పు చెప్పారు. బ్యాంకు రుణాలు పూర్తిగా చెల్లించే వరకు సమయం ఇవ్వాలంటూ దివాలా ఉత్తర్వులిచ్చేందుకు తిరస్కరించారు. ఈ సమయంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల బ్యాంకులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని జస్టిస్ బ్రిగ్స్ వ్యాఖ్యానించారు. కోవిడ్-19 వ్యాప్తి అనిశ్చితి కారంగా తేదీని నిర్ణయించడం కష్టమని పేర్కొన్న కోర్టు తరువాతి విచారణను జూన్ 1, 2020 నాటికి వాయిదా వేసింది. కాగా భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలను ఎగవేసి మాల్యా లండన్ కు పారిపోయారు. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలపై పలు కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐ మాల్యాకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. అలాగే మాల్యాను భారత్ కు అప్పగించే అంశంపై యుకె హైకోర్టు తీర్పు పెండింగ్‌లో ఉంది. మరోవైపు అప్పులను వంద శాతం చెల్లిస్తానని అనుమతి ఇవ్వాలంటూ పలుసార్లు బ్యాంకులకు విజ్ఙప్తి చేసిన మాల్యా, కరోనా సంక్షోభంలోనైనా తన అభ్యర్థనను మన్నించాలంటూ ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం కరోనా : భారత సంతతి వైద్యురాలు కీలక నిర్ణయం కరోనా : ఎన్పీఎస్ చందాదారులకు ఊరట -
కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి
కరోనా సంక్షోభ సమయంలోనైనా తన మొర ఆలకించాలని వేలకోట్ల రుణాలను ఎగవేసి, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా ప్రభుత్వాన్ని కోరారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు సంబంధించిన అప్పులను 100 శాతం తిరిగి చెల్లించాలన్న తన కోరికను మన్నించాలంటూ మాల్యా మంగళవారం ట్విటర్ ద్వారా వేడుకున్నారు. ఇక నైనా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తీసుకున్న రుణాలను మొత్తం తిరిగి చెల్లిస్తానని పదే పదే చెబుతూ వస్తున్నా.. అయినా బ్యాంకులు సిద్ధంగా లేవు. బ్యాంకుల ఆదేశాల మేరకు వారు చేసిన అటాచ్ మెంట్లను విడుదల చేయడానికి ఈడీ కూడా సిద్ధంగా లేదంటూ వరుస ట్వీట్లలో వాపోయారు. కరోనా మహమ్మారితో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలోనైనా జోక్యం చేసుకోవాలని ఆర్ధిక మంత్రిని కోరారు. అలాగే కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు విధించిన దేశ వ్యాప్త లాక్డౌన్ ను గౌరవిస్తున్నామని మాల్యా తెలిపారు. కింగ్ ఫిషర్ లో అన్ని కార్యకలాపాలను, తయారీని సమర్థవంతంగా నిలిపివేసినట్టు చెప్పారు. అయితే తమ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రభుత్వ సహాయాన్ని అర్థించారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇంటివద్దనే సురక్షితంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని కూడా విజయ్ మాల్యా సూచించారు. తాను కూడా అదే చేస్తున్నానని ట్వీట్ చేశారు. I have made repeated offers to pay 100 % of the amount borrowed by KFA to the Banks. Neither are Banks willing to take money and neither is the ED willing to release their attachments which they did at the behest of the Banks. I wish the FM would listen in this time of crisis. — Vijay Mallya (@TheVijayMallya) March 31, 2020 -
మాల్యాకు ముంబయ్ ఈడీ కోర్టు షాక్
-
మాల్యా పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా తాజా పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తన కుటుంబ సభ్యుల ఆధీనంలోని కంపెనీల ఆస్తులు జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలను ఆగస్టు13వ తేదీకి వాయిదా వేసింది. మాల్యా తరఫున సీనియర్ న్యాయవాది ఎఫ్ఎస్ నారిమన్ వేసిన పిటిషన్‌ను అనుమతించిన ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ దీనిపై ఆగస్టు 2వ తేదీన వాదనలు వింటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మినహా, ఇతర సంస్థలపై కేసులు లేనందున, వాటిని జప్తు చేయడం సరికాదన్నది మాల్యా వాదిస్తున్నాడు. -
భారత్‌కు మాల్యా : బిగ్ బ్రేక్
లండన్: భారత బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా (63) ను స్వదేశం రప్పించే ప్రయత్నంలో మరో బ్రేక్ పడింది. మాల్యాను భారత్ అప్పగించే ఉత్తర్వుకు వ్యతిరేకంగా యుకె హైకోర్టులో మాల్యా పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. 2020 ఫిబ్రవరి 11వ తేదీకి ఈ విచారణను వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 11 నుండి మూడు రోజులపాటు ఈ అంశంపై విచారణ చేపట్టనున్నామని లండన్ హైకోర్టు అధికారి ఒకరు తెలిపారు. కాగా సుమారు రూ. 9వేల కోట్లకు పైగా బ్యాంకులకు బకాయి పడిన కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాపై మనీలాండర్‌రింగ్ ఆరోపణలతో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. ఆర్థిక నేరగాడు మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి2, 2016న దేశంనుంచి పారిపోయిన మాల్యాను ఎట్టకేలకు 2017లో లండన్ పోలీసుల సాయంతో మాల్యాను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మాల్యా బెయిల్‌పై ఉన్నాడు. అయితే బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలు 100శాతం చెల్లించడానికి సిద్దంగా ఉన్నా బ్యాంకులు మాత్రం ఆ డబ్బు తీసుకోవడంలేదని మాల్యా వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
మాల్యాకు లండన్ కోర్టు భారీ షాక్
లండన్ : ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. వేలకోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ఎగవేసి లండన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త మాల్యాను భారత్‌కు రప్పించే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట కలిగింది. భారత్‌కు రప్పించే చర్యలకు వ్యతిరేకంగా మాల్యా అభ్యర్థనను లండన్ కోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో మాల్యాను త్వరలోనే దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. తనను భారత్‌కు అప్పగించే చర్యలను అడ్డుకోవాలని మాల్యా దాఖలు చేసిన పిటీషన్‌ను బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హై కోర్టును ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్నాట్ వ్యాఖ్యానిస్తూ...విజయ్ మాల్యా భారత న్యాయస్థానాలకు జవాబుదారీగా ఉండాలని సూచించింది. అతను చేసిన ఆర్థిక అవకతవకలకు భారతీయ న్యాయస్థానాల పరిధిలోనే విచారణ కొనసాగాలని సూచించింది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 9వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ బ్యాంకులకు ఎగవేసి, డీఫాల్టర్‌గా 2016 మార్చిలో దేశం లండన్‌కు పారిపోయాడు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసులో విజయ్ మాల్యాను తిరిగి దేశం రప్పించేందుకు కేంద్ర కసరత్తును తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను భారత్‌కు అప్పగించడానికి ఇంగ్లండ్ హోం మినిస్టర్ సాజిద్ జావిద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. -
మాల్యా లగ్జరీ కార్లకు రూ.1.40లక్షలే..
సాక్షి, బెంగళూరు: బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో దర్జాగా బతుకుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆస్తులు ఒక్కొక్కటి వేలానికి వస్తున్నాయి. వేలానికి వచ్చిన ఆయన రెండు లగ్జరీ కార్లను హుబ్లీకి చెందిన హనుమంతరెడ్డి అనే వ్యాపారవేత్త కారు చౌకగా సొంతం చేసుకున్నారు. దాదాపు 34 లక్షలు విలువ చేసే రెండు కార్లను ముంబై నుంచి ఆన్లైన్ నిర్వహించిన వేలంలో రూ.1.4 లక్షలకే హనుమంత రెడ్డి కొనుగోలు చేశారు. మాల్యా వాడిన హ్యుందాయ్ సోనాటో గోల్డ్, హోండా ఎకార్డ్లను తన సొంతం చేసుకున్నట్టు హనుమంతి రెడ్డి తెలిపారు. సోనాటో గోల్డ్‌ను రూ.40 వేలకు, ఎకార్డ్‌ను లక్షకే కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. 12.5శాతం వ్యాట్‌లతో కలిపి మొత్తంగా రూ.1.58 లక్షలను ఈ కార్లకు చెల్లించినట్టు ఈ వ్యాపారవేత్త చెప్పారు. ఏప్రిల్ నెలలోనే ఈ కార్లను తను పొందినట్టు కూడా తెలిపారు. సోనాటో గోల్డ్ మార్కెట్ ధర రూ. 13.15 లక్షలు. హోండా ఎకార్డ్ ధర రూ.21 లక్షలు. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఈ కార్లు మంచి కండీషన్లో ఉన్నాయని హనుమంత రెడ్డి తెలిపారు. సోనాటా 2002 మోడల్‌కు చెందినది కాగ, ఎకార్డ్ 2003కు చెందిన మోడల్. -
మాల్యా లగ్జరీ కార్లకు రూ.1.40లక్షలే..
-
మాల్యాను భారత్‌కు తేవడం సాధ్యమేనా?
న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ దిగ్గజం విజయమాల్యాను అరెస్ట్ చేసిన బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తుందా? లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. గతేడాది మార్చి నెలలో లండన్ పారిపోయిన మాల్యాను రప్పించేందుకు భారత్ ఇంతకాలం చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం వల్ల ఇలాంటి అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. రుణాల ఎగవేత, హవాలా, విదేశీ కరెన్సీ నిబంధనల ఉల్లంఘనలాంటి అనేక కేసుల్లో మాల్యా నిందితుడు. 2009నాటి నుంచి ఈ కేసుల్లో మాల్యా విచారణ ఎదుర్కొంటున్నారు. చివరకు అనేక నాన్‌బెయిల్ అరెస్ట్ వారెంట్లు జారీ అవడంతో 2016, మార్చి నెలలో మాల్యా లండన్ పారిపోయారు. అప్పట్లో ఆయన్ని పట్టి అప్పగించాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. అందుకు బ్రిటన్ నిరాకరించడంతో భారత ప్రభుత్వం మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసింది. ఆయన వద్ద బ్రిటన్ పాస్‌పోర్టు ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. తదనంతర చర్యల్లో భాగం గత నవంబర్ నెలలో ముంబై కోర్టు మాల్యాను పరారిలో ఉన్న నిందితుడుగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీన సీబీఐ కోర్టు మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత బ్రిటన్ పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (ఎంఎల్ఏటీ) కింద తమకు అప్పగించాల్సిందిగా కోరుతూ భారత విదేశాంగ శాఖ ఫిబ్రవరి 9వ తేదీన బ్రిటన్ విదేశాంగశాఖను కోరింది. ఈ మేరకు ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారుల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో కూడా ఓ అవగాహన కుదిరింది. తాము నేరుగా మాల్యాను పట్టుకొని అప్పగించలేమని, ఆయనపై తీవ్రమైన అభియోగాలు ఉన్నందున న్యాయ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపించేందుకు పూర్తిగా సహకరిస్తామని బ్రిటన్ విదేశాంగ శాఖ స్పష్టమైన హామీ ఇచ్చింది. అలాగే ఇతర కేసుల్లో నిందితులై లండన్‌లో తలదాచుకున్న లలిత్ మోదీ, టైగర్ మెమన్లను అప్పగించేందుకు కూడా సహకరిస్తామని బ్రిటన్ విదేశాంగ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. అయితే లండన్‌లో అరెస్టయిన మాల్యా స్థానిక కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన్ని భారతకు తీసుకరావడానికి ఇబ్బందులేమీ లేవని భారత న్యాయనిపుణులు చెబుతున్నారు.