
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా తాజా పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తన కుటుంబ సభ్యుల ఆధీనంలోని కంపెనీల ఆస్తులు జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలను ఆగస్టు13వ తేదీకి వాయిదా వేసింది. మాల్యా తరఫున సీనియర్ న్యాయవాది ఎఫ్‌ఎస్ నారిమన్ వేసిన పిటిషన్‌ను అనుమతించిన ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ దీనిపై ఆగస్టు 2వ తేదీన వాదనలు వింటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మినహా, ఇతర సంస్థలపై కేసులు లేనందున, వాటిని జప్తు చేయడం సరికాదన్నది మాల్యా వాదిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment