బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో దర్జాగా బతుకుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆస్తులు ఒక్కొక్కటి వేలానికి వస్తున్నాయి. వేలానికి వచ్చిన ఆయన రెండు లగ్జరీ కార్లను హుబ్లీకి చెందిన హనుమంతరెడ్డి అనే వ్యాపారవేత్త కారు చౌకగా సొంతం చేసుకున్నారు.