సాక్షి, హైదరాబాద్: భారత్ సొంతమైన నిజాం నిధుల్లో ఎవరి వాటా ఎంత అన్నది ఆసక్తిగా మారింది. 1948లో అప్పటి నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్‌లోని బ్రిటీష్ హై కమిషనర్‌కు బదిలీ చేసిన రూ.3.5 కోట్లు భారత్, నిజాం వారసులవేనంటూ లండన్ హైకోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే. ఆ మొత్తం ప్రస్తుతం రూ.306 కోట్లకు చేరింది. ఉస్మాన్ అలీఖాన్ మనవడు, ఎనిమిదవ నిజాం ముకర్రంజా, ఆయన సోదరుడు ముఫకంజాతో పాటు భారత ప్రభుత్వానికి సైతం వాటా లభించనుంది.
భారత ప్రభుత్వానికి 70 శాతం, నిజాం వారసులకు 30 శాతం నిధులు వచ్చేందుకు అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. లండన్ హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు పాకిస్తాన్‌కు 4 వారాల సమయం ఉంద. ఈ విషయమై నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి నజాఫ్ అలీఖాన్‌న్‌గురువారం మీడియాతో మాట్లాడుతూ, పాకిస్తాన్ అప్పీల్‌కు వెళితే సిద్ధంగా ఉన్నామని, లేనట్లయితే వచ్చే నిధుల్లో 4 భాగాలు చేయాలని తాము కోరుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment