లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను యూకే నుంచి యూఎస్‌కు అప్పగించడానికి లండన్ హైకోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది. అసాంజే మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఆయన్ను అమెరికాకు అప్పగించకూడదని గతంలో కింద కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది.
హైకోర్టు తీర్పు న్యాయానికి తగిలిన విఘాతంగా అసాంజే భార్య స్టెల్లా మోరిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తామని చెప్పారు. 2010–11 కాలంలో పలు రహస్య మిలటరీ, ద్వైపాక్షిక డాక్యుమెంట్లను బహిర్గతం చేసినందుకు అమెరికా అసాంజేను వెంటాడుతోంది. అమెరికాలో ఆయనపై 17 గూఢచర్య కేసులున్నాయి.
ఇవి రుజువైతే ఆయనకు దాదాపు 175 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో అమెరికా నుంచి తప్పించుకున్న అసాంజే 2012 నుంచి యూకేలోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో శరణార్థ్ధిగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ కండీషన్లను ఉల్లంఘించారన్న ఆరోపణలపై 2019లో రాయబార కార్యాలయం నుంచి అసాంజేను అరెస్టు చేసి బెలమార్‡్ష జైల్లో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment