లండన్: భారత్‌లో మోసాలకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన నీరవ్ మోదీ బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. గతంలో మూడుసార్లు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ బ్రిటన్ హైకోర్టులో శుక్రవారం ఆయన మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ జూన్ 11వ తేదీన విచారణకు రానుందని భారత్ తరపున వాదనలు వినిపిస్తున్న క్రౌన్ ప్రోసెక్షన్ సర్వీస్ తెలిపింది.
గురువారం నీరవ్ కేసుపై విచారణ జరిపిన కోర్టు, ఆయన రిమాండ్‌ను జూన్ 27 వరకు పొడిగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14 వేల కోట్లు మోసం చేసి బ్రిటన్ పారిపోయిన నీరవ్‌ను ఇక్కడకు తీసుకురావడానికి భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 19న బ్రిటన్ పోలీసులు అరెస్టు చేసినప్పటినుంచి నీరవ్ మోదీ రిమాండ్‌లోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment