bail plea
-
అరెస్టు కక్ష సాధింపే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
-
వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె నిన్ననే బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోరిన కోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ ఉదయం పిటిషన్‌పై విచారణ కొనసాగగా.. షర్మిల కొట్టిందన్న వీడియోలను మాత్రమే పదే పదే చూపిస్తున్నారని, కానీ అంతకు ముందు ఆ తర్వాత ఏం జరిగిందనేది మాతంర చూపించడం లేదని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చివరకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్టీపీ తరపున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు షర్మిల పిలుపు ఇచ్చారు. షర్మిలను పరామర్శించిన విజయమ్మ చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ షర్మిలను.. వైఎస్ విజయమ్మ మంగళవారం పరామర్శించారు. విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని విజయమ్మ నిలదీశారు. ‘‘పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా షర్మిలకు లేదా? ప్రజల కోసమే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ ఆశయ సాధన కోసమే షర్మిల పోరాటం చేస్తోంది. ప్రభుత్వాలను ప్రశ్నించడమే మా తప్ప. ప్రశ్నించే వారిని ఇంకా ఎంతకాలం అణచివేస్తారు? అని విజయమ్మ పేర్కొన్నారు. ఇదీ చదవండి: నాకు స్వేచ్ఛ లేదా?.. వైఎస్ షర్మిల -
మనీశ్ సిసోడియాకు మళ్లీ షాక్.. కస్టడీ పొడిగింపు.. బెయిల్‌పై 12న విచారణ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 17వరకు పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మరికొన్ని రోజులు కస్టడీలో ఉండటం అనివార్యమైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసునకున్నప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే నెల రోజులకుపైగా కస్టడీలోనే ఉండటంతో ఏప్రిల్ 12న బెయిల్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. సిసోడియాపై మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆయన ఖాతాలోకి అక్రమంగా రాలేదని అతని తరఫు న్యాయవాది వాదించారు. ఇల్లు, కార్యాలయాలు, బ్యాంకు లాకర్లలో కూడా అధికారులు తనిఖీలు చేశారని, ఒక్క ఆధారం కూడా లభించలేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో దీనిపై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ.. -
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడు భాస్కర్‌కు చుక్కెదురు
సాక్షి, విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడు భాస్కర్‌కు చుక్కెదురైంది. భాస్కర్, ఆయన భార్య అపర్ణ బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. రెండు బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై ప్రత్యేక న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, ముందస్తు పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం సంతోషకరమన్నారు. ‘‘గత ప్రభుత్వంలో దోచుకో.. పంచుకో.. తినుకో స్కీములు ఎక్కువగా నడిచాయి. ప్రజాధనాన్ని దోచుకున్న వారు చట్టం నుండి తప్పించుకోలేరు. ఈ కేసులో చట్టం తన పని తాను చేస్తోంది. భాస్కర్, అతని భార్య అరుణ ఉపాధ్యాయ తప్పిదాల్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ కేసులో ఇంకా చాలా మంది ప్రమేయం ఉందని భావిస్తున్నాను. ఈ కేసును ఈడీ కూడా నిశితంగా పరిశీలిస్తుంది’’ అని పొన్నవోలు సుధాకర్ తెలిపారు. చదవండి: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని -
మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పెటిషన్‌పై విచారణను మార్చి 10కి వాయిదా వేసింది న్యాయస్థానం. అలాగే సీబీఐ కస్టడీని మరో మూడు రోజులు(మార్చి 6వరకు) పొడిగించింది. సిసోడియాకు కోర్టు గతంలో విధించిన ఐదు రోజుల సీబీఐ కస్టడీ నేటితో ముగిసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన్ను మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. విచారణకు మరింత సమయం కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మరోవైపు సిసోడియా అరెస్టుకు నిరసనగా ఆప్ కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయం ఎదట పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కట్టుదిట్టమైన భద్రత నడుమ సిసోడియాను కోర్టుకు తరలించారు. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పైనా కోర్టులో వాదనలు జరగనున్నాయి. తనను కస్టడీలో ఉంచితే ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ కేసుకు సంబంధించి సీబీఐ అన్నింటినీ స్వాధీనం చేసుకుందని చెప్పారు. అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి విచారణకు హాజరవుతానని సిసోడియా పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను ఆదివారం 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత రోజు కోర్టులో ప్రవేశపట్టి ఐదు రోజులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం సిసోడియా డిప్యూటీ సీఎం, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. చదవండి: 48 గంటల్లోనే హైవే కింద సొరంగం.. ఇది కదా మనకు కావాల్సింది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్.. -
సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే!.. సుప్రీంలో యోగి సర్కార్
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ హింసకు కారకుడు, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశిష్ మిశ్రాకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అలహాబాద్ హైకోర్టు ఇదివరకే అశిష్ బెయిల్‌ను తిరస్కరించగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించాడతను. అయితే.. గురువారం ఈ పిటిషన్లపై వాదన సందర్భంగా యోగి సర్కార్ తీవ్ర అభ్యంతరాలే బెంచ్ ముందు ఉంచింది. ఇది ఘోరమైన, క్రూరమైన నేరం. ఇలాంటి నేరానికి బెయిల్ ఇవ్వడం అంటే.. సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్(అదనపు) గరిమా ప్రసాద్.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదించారు. అంతకు ముందు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గల కారణాలేంటనే అభ్యంతరాలను వెల్లడించించాలని యూపీ సర్కార్‌ను కోరింది బెంచ్. ‘‘అతను ఈ కేసులో ఉన్నాడని మేం భావిస్తున్నాం. కానీ, ఇంత పెద్ద కేసులో ఆధారాలను నాశనం చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడా?’’ అని బెంచ్.. యూపీ సర్కార్‌కు ప్రశ్నించింది. ఇప్పటిదాకా అలాంటిదేం జరగలేదని గరిమా ప్రసాద్ తెలపగా, ఆవెంటనే బాధిత కుటుంబాల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే బెంచ్ ముందు తీవ్ర ఆరోపణలే చేశారు. ఇది కుట్రతో ఒక ప్రణాళిక ప్రకారంగా చేసిన హత్య. ఛార్జ్‌షీట్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు.. సంఘంలో అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. అంతే శక్తివంతమైన లాయర్లను ఈ కేసు కోసం నియమించుకున్నారంటూ దవే వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం ఒక భయంకర సందేశాన్ని పంపినట్లు అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఈ తరుణంలో.. మిశ్రా తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి.. దవే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఎవరు శక్తివంతమైన వాళ్లు? ఏం మాట్లాడుతున్నారు? ప్రతీ రోజూ మేం కోర్టులో వాదనలు వినిపిస్తున్నాం. బెయిల్ నిరాకరించడానికి ఇదొక కారణమేనా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన క్లయింట్ ఏడాది కంటే ఎక్కువ కాలం కస్టడీలో ఉన్నారని, విచారణ ఇలాగే కొనసాగితే ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టవచ్చని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన ఫిర్యాదుదారు అయిన జగ్జీత్ సింగ్ ప్రత్యక్ష సాక్షి ఏమాత్రం కాదని, కేవలం ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేశాడని ముకుల్ రోహత్గి కోర్టుకు అభ్యంతరాలను వెల్లడించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తన క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. అక్టోబర్ 3వ తేదీ 2021లో.. టికునియా లఖింపూర్ ఖేరీ వద్ద అప్పటి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో హింస చెలరేగి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ ఎస్యూవీ.. నలుగురు రైతుల మీద నుంచి వెళ్లిందని, ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మరో వాహనం డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను దాడి చేసి చంపారని పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ హింసలో ఓ జర్నలిస్ట్ కూడా మృత్యువాత పడ్డాడు. అశిశ్ మిశ్రాతో సహా 13 మందిని నిందితులుగా చేర్చారు యూపీ పోలీసులు. ఇంతకు ముందు అశిష్‌కు బెయిల్ దక్కినట్లే దక్కి.. మళ్లీ రద్దు అయ్యింది. గతేడాది డిసెంబర్ 12వ తేదీన సుప్రీంలో దాఖలైన బెయిల్ పిటిషన్‌పై యూపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. నిరసనలకారుల హింసకు సంబంధించిన అఫిడవిట్‌ను తమ ముందు ఉంచాలని యూపీ సర్కార్‌ను సుప్రీం బెంచ్ ఆదేశించింది. గురువారం జరిగిన వాదనల అనంతరం.. బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించింది సుప్రీం బెంచ్. -
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. జైన్‌తో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వైభవ్ జైన్, అంకుశ్ జైన్లకు కూడా బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్‌ను మే 30న అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయన జూన్‌లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. ఇప్పుడు రెండో సారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ కేసులో విచారణకు జైన్ సహకరించడం లేదని, దర్యాప్తు ముందుకుసాగకుండా తమను తప్పదోవ పట్టిస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో న్యాయస్థానం జైన్‌కు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. 2017 ఆగస్టు 24న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా జైన్‌ను ఈడీ అదికారులు మే 30న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. తిహాడ్ జైల్లో జైన్‌కు వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నాడనే ఆరోపణలతో ఆ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్ర ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
నా ఒకేఒక్క తప్పు.. మంత్రి కావడం!
ఢిల్లీ: మంత్రి కావడమే తాను చేసిన పెద్ద తప్పైపోయిందని, ఆ పదవే లేకుంటే తనపై ఆరోపణలు.. కేసు ఉండేవి కావని ఢిల్లీ ఆరోగ్య మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ అంటున్నారు. ఈ మేరకు మనీల్యాండరింగ్ కేసులో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన అభ్యర్థనలో ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధూల్ ఎదుట సత్యేందర్ తరపున సీనియర్ న్యాయవాది ఎన్ హరిహరణ్ శుక్రవారం వాదనలు వినిపించారు. విచారణ దశలో ఉండడంతో.. తొలి బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందని ఈ సందర్భంగా అడ్వొకేట్ హరిహరణ్ గుర్తు చేశారు. అయితే ఆరోపణల్లో పేర్కొన్నట్లు తన క్లయింట్ ఏ కంపెనీలోనూ డైరెక్టర్‌గా, షేర్‌హోల్డర్‌గా లేరనే విషయాన్ని ప్రస్తావించారు. మంత్రి పదవితో ప్రజా జీవితంలోకి రావడమే తన తప్పైందంటూ సత్యేందర్ తరపున ఆయన వాదించారు. ఒకవేళ పదవిలో లేకుంటే.. అసలు తనపై కేసే ఉండేది కాదని చెప్పారాయన. అంతేకాదు.. ఈడీ సమర్పించిన ఆధారాల్లో సదరు కంపెనీల్లో జైన్ వాటాలు కలిగి ఉన్నట్లు నిరూపితం కాలేదని హరిహరణ్ వాదించారు. ఇక సత్యేంద్ర జైన్ బెయిల్ అభ్యర్థన పిటిషన్‌పై నవంబర్ 5వ తేదీన ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి, ఈడీ వాదనలు విననున్నారు. మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్(57) మే నెలలో అరెస్ట్ అయ్యారు. ఇదీ చదవండి: సత్యేందర్ జైన్ హవాలా లింకులపై ప్రాథమిక సాక్ష్యాలు: కోర్టు -
Varavara Rao: శాశ్వత బెయిల్‌పై సుప్రీంకు వరవరరావు
సాక్షి, న్యూఢిల్లీ: బీమా కోరేగావ్ కేసులో నిందితుడు వరవరరావు శాశ్వత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 11న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రస్తుతం మెడికల్ బెయిల్‌పై ఉన్న వరవరరావు.. శాశ్వత బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను ఏప్రిల్ 13న బాంబే హైకోర్టు తిరస్కరించింది. విచారణ సమయంలో.. హైదరాబాద్‌లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలన్న పిటిషన్‌నూ తోసిపుచ్చింది. అయితే.. మూడు నెలల పాటు మెడికల్ బెయిల్ పొడిగించింది. ఈ తరుణంలో బాంబే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వరవరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాల వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. -
డ్రగ్స్ కొనడానికి ఆర్యన్ ఖాన్ దగ్గర డబ్బులు లేవు
ముంబై: నిషేధిత మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్న ఆర్యన్ ఖాన్‌కు బుధవారం కూడా బెయిల్ దొరకలేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రత్యేక కోర్టు అతడికి బెయిల్ నిరాకరించింది. తాజాగా ఈ రోజు కూడా బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఆర్యన్ ఖాన్ తరఫున లాయర్ అమిత్ దేశాయ్, ఆర్యన్‌కు వ్యతిరేకంగా అదనపు సొలిసిటరల్ జనరల్ అనిల్ సింగ్ పోటాపోటీగా వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అమిత్ దేశాయ్ గంటన్నర పాటు కోర్టులో వాదించారు. ‘డ్రగ్స్ కొనడానికి ఆర్యన్ దగ్గర డబ్బులు లేవు. విక్రయించడానికి కానీ సేవించడానికి కానీ అతడి దగ్గర డ్రగ్స్ లేవు. అలాంటప్పుడు అతడిని ఎందుకు ఇందులో ఇరికించారు? బెయిల్ పిటిషన్‌కు ఎన్సీబీ ఇచ్చిన సమాధానంలో కొత్తదనం ఏమీ లేదు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే నా క్లయింట్స్ మాదకద్రవ్యాల విక్రేతలు కాదు. ఇప్పటికే వారు తగినంత బాధ అనుభవించార’ని అమిత్ దేశాయ్ పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. దేశం మొత్తం నిషేధిత మాదకద్రవ్యాల వాడకం గురించి ఆందోళన చెందుతోంది. ఇది కేవలం ఒక వ్యక్తి సంబంధించిన విషయం కాదు. డ్రగ్స్ దందాను నడిపిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ఎన్సీబీ పనిచేస్తోంది. ఈ కేసులో నిందితులను విడుదల చేస్తే దర్యాప్తు కుంటుపడే అవకాశముంది. విదేశీయుడొకరితో వాణిజ్య పరిమాణంలో హార్డ్ డ్రగ్స్ గురించి ఆర్యన్ ఖాన్ చాట్ చేసినట్టు ఎన్సీబీ గుర్తించింది. ఈ సంభాషణలు ముంబై క్రూయిజ్ కేసుకు సంబంధించినవి కాదా అనేది గుర్తించాల్సి ఉంద’ని అనిల్ సింగ్ అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. రేపు వాదనలు కొనసాగనున్నాయి. బెయిల్ రాకపోవడంతో ఆర్యన్ ఖాన్ ఈరోజు కూడా జైలులో గడపాల్సి ఉంటుంది. కాగా, ఈనెల 2న అతడిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (ఆర్యన్ ఖాన్ కేసు నిరూపణ అయితే శిక్ష ఎన్నేళ్లంటే..?) -
స్వేచ్ఛను పొందే హక్కు యువకులకి ఉంది: ఆర్యన్ ఖాన్ లాయర్
ముంబై డ్రగ్స్ బస్ట్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఇప్పటి వరకు ఎన్సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్లో ఉంచాలని కోర్టు తెలిపింది. అయితే ఈ విచారణ సమయంలో యువకులు తమ స్వేచ్ఛను తిరిగి పొందేందుకు అర్హులని ఆర్యన్ ఖాన్ న్యాయవాది సతీష్ మానేషిండే మేజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. నటి రియా చక్రవర్తి ప్రమేయం ఉన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సహా ఇతర కేసుల్లోని తీర్పులను చదివి వినిపించారు. తక్కువ చిన్న పరిమాణం కలిగి ఉన్న వ్యక్తులతో చట్టం వ్యవహరించే తీరును గమనించాలని కోరినప్పటికీ బెయిల్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ విచారణ ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ 51వ పుట్టిన రోజున జరగడం యాదృచ్ఛికం. కాగా ఈ సందర్భంగా ఈ స్టార్‌కిడ్‌కి బెయిల్ మంజూరు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చదవండి: కష్టాల్లో సల్మాన్ తోడుగా ఉంటాడన్న షారుక్.. పాత వీడియో వైరల్ -
కోర్టులో ఆర్యన్‌కు చుక్కెదురు: రెండవసారి కూడా బెయిల్ నిరాకరణ
ముంబై డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ షాక్ మరోసారి నిరాశ ఎదురైంది. నిన్న ఈ కేసుని విచారించిన ముంబై కోర్టు అతన్ని14 ఎన్సీబీ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం కేసుని స్పెషల్ కోర్టుకు అప్పగించింది. అయితే శుక్రవారం కొనసాగిన విచారణలో ఆర్యన్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వచ్చే 3 నుంచి 5 రోజుల పాటు అతన్ని ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్లో ఉంచనున్నారు. అయితే ముంబై తీరంలో జరిగిన క్రూయిజ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని, గత వారం ఈ స్టార్ కిడ్తో కలిపి మొత్తం ఎనిమిదిని అరెస్టు చేసింది ఎన్సీబీ. గురువారం వరకూ ఎన్సీబీ ఆఫీస్‌లోనే ఉంచి విచారించగా, కోర్టు తీర్పుతో ఆర్థర్ రోడ్ జైలుకి తరలించనున్నారు. చదవండి: సోషల్ మీడియా ట్రెండిగ్‌లో #ReleaseAryanKhan -
వరవరరావు బెయిల్ మరోసారి పొడిగింపు
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ గడువు ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరవరరావు తన బెయిల్‌ను పొడగించాలని విజ్ఞప్తి చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ క్రమంలో వరవరరావు బెయిల్‌ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా వరవరరావు కోర్టు తనకు ఫిబ్రవరిలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని.. ఫలితంగా తాను కుంటుంబానికి దూరంగా ఉంటున్నానని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 84 ఏళ్ల వయసులో కుటుంబానికి దూరంగా ఉండటం కష్టంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్ట్ విధించిన ఏ ఒక్క షరతును తాను ఉల్లంగించలేదని వరవరరావు కోర్టుకు తెలిపారు. (చదవండి: ఒకరి భార్యకు ‘ఐ లవ్ యూ’ అని రాసి చిట్టి విసరడం నేరమే) ముంబై హాస్పిటల్స్‌లో చికిత్స చేయించుకోవాలంటే తన లాంటి వారికి చాలా కష్టం అవుతుందన్నారు. తన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే తన కుటుంబం దగ్గరికి వెల్లేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వరవరరావు వాదనలు విన్న కోర్టు ఈ నెల 25న ఆయనను సరెండర్ కావాలని ఆదేశించింది. ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు గత 4 సంవత్సరాలుగా ముంబైలోనే ఉంటున్నారు. చదవండి: భారతీయుడిగా విచారిస్తున్నా..వారిని జాతి ఎప్పటికీ క్షమించదు! -
‘బిడ్డను కనాలనుకుంటున్నాను నా భర్తకు బెయిలివ్వండి’
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు ముందుకు ఓ వింత పిటిషన్ వచ్చింది. ‘‘బిడ్డను కనాలనుకుంటున్నాను.. నా భర్తకు బెయిల్ ఇవ్వండి’’ అంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పైగా ఆమె భర్త జైల్లో ఉన్నది అత్యాచార ఆరోపణల మీద. భర్త ఇలాంటి పనులు చేసి జైలుకెళ్తే ఏ భార్య అయినా అతడి నుంచి విడిపోవాలని అనుకుంటుంది. కానీ నువ్వేంటి తల్లి.. ఏకంగా అతడితో బిడ్డను కనాలనుకుంటున్నావ్.. అసలు రాజ్యంగా ఖైదీలకు ఇలాంటి ఓ హక్కును కల్పించిందా అనే దాని గురించి పరిశోధించే పనిలో ఉన్నారు అధికారులు. ఆ వివారలు.. ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తి, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు సచిన్‌తో పాటు మిగిలిన దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇప్పటికి అతడు జైలుకెళ్లి ఏడు సంవత్సరాలు అవుతుంది. పెళ్లైన మూడు నెలలకే భర్త జైలుకెళ్లాడని.. తమకు కలిసి ఉండే అవకాశమే లభించలేదని తెలిపింది సచిన్ భార్య. ‘‘మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. కనుక నా భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వండి’’ అంటూ సచిన్ భార్య హైకోర్టును ఆశ్రయించిది. తనకు మాతృత్వంలోని మాధుర్యం అనుభవించాలని ఉందని, ఇది భార్యగా తన హక్కు అని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. తన భర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందని వేడుకుంది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాని న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మల ధర్మాసనం ఈ పిటిషన్‌ని విచారించింది. గతంలో ఎన్నడూ ఇలాంటి వింత పిటిషన్ రాలేదని విచారణ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం పలు అనుమానాలను లేవనేత్తింది. ఈ క్రమంలో తమకు సలహా ఇవ్వాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు వ్యక్తం చేసిన అనుమాలు ఇలా ఉన్నాయి.. ‘‘అత్యాచారం కేసులో దోషిగా నిరూపణై జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వొచ్చా?.. ఈమె ‘భార్యగా నా హక్కు’ అంటూ కోర్టుకెక్కింది. ఆమె హక్కులను గౌరవించి అతనికి బెయిల్ ఇస్తే వారికి కలిగే సంతానం కూడా వచ్చి ‘బిడ్డలుగా మా హక్కు’ అనే అవకాశం ఉంది కదా’’.. అని హైకోర్టు అభిప్రాయపడింది. పైగా తండ్రి లేని బిడ్డను తల్లి ఒక్కతే పోషించడం చాలా కష్టమైన విషయం, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు కనడం కోసమే నిందితుడికి బెయిల్ ఇవ్వడం సబబేనా అని కూడా ధర్మాసనం ఆలోచిస్తోందన్నారు. అలాగే తండ్రి లేకుండా పెరిగే బిడ్డల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని కోర్టు అభిప్రాయపడిది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తమకు సరిగా తెలియడం లేదని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఇలాంటి కేసులేమైనా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాల్లో నమోదయ్యాయా.. ఒకవేళ నమోదైతే అక్కడి కోర్టులు ఎలాంటి తీర్పులిచ్చాయి.. అన్న వివరాలతో తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తెలపాలని హైకోర్టు కోరింది. -
మాజీ ముఖ్యమంత్రికి మళ్లీ నిరాశ
రాంచీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే బెయిల్ కోసం రాష్ట్రపతికి ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 50 వేల పోస్టుకార్డులు రాసి ‘మానవత దృక్పథంతో నా తండ్రిని విడుదల చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. మళ్లీ రెండు నెలల వరకు లాలుకు బెయిల్ లభించే అవకాశం లేదు. దాణా కుంభకోణం కేసులో అరెస్టయిన లాలు ప్రసాద్ యాదవ్ 2017 డిసెంబర్ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శుక్రవారం ఆయన బెయిల్ పిటిషన్ రాగా హైకోర్టు నిరాకరించింది. రెండు నెలల తర్వాత బెయిల్ పిటిషన్ మళ్లీ వేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. ఈ బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నా విడుదల చేసేందుకు న్యాయస్థానం అంగీకరించడం లేదు. అయితే లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న లాలును రాంచీ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. కిడ్నీ 25 శాతం మాత్రమే పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానవతావాదంలో లాలును విడుదల చేయాలనే విజ్ఞప్తులు భారీగా వస్తున్నాయి. -
చిన్నమ్మకు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. తనను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె నాలుగేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకుని 2021 జనవరి చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత సహాయకురాలు శశికళ నటరాజన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తమిళనాడు చిన్నమ్మగా సుపరిచితరాలు. మంచి ప్రవర్తనను చూపుతూ ఆమె బెంగళూరు జైలు నుంచి ముందస్తు విడుదల కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ, కోర్టు పిటిషన్‌ను తిరస్కరించటంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందస్తు విడుదలకు కోర్టు అంగీకరిస్తుందనే ఆశతో.. రూ.10 కోట్ల జరిమానాను చిన్నమ్మ వర్గీయులు కోర్టుకు డిపాజిట్ చేసినట్లు సమాచారం. -
సుప్రీం కోర్టులో వరవరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్ విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వరవరరావు భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వరవరరావు భార్య హేమలత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ని విచారించిన జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం ముంబయి హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. వరవరరావుకు చికిత్స అందజేస్తున్న హాస్పిటల్లో సౌకర్యాలను కూడా ముంబై హై కోర్టే పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వరవరరావు బెయిల్ అప్పీల్‌ను సరైన సమయంలో విచారించాలని సుప్రీం కోర్టు, ముంబయి హైకోర్టుకు సూచించించింది. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు షాక్
బెంగళూరు: శాండల్‌వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు శనివారం బెయిల్ మీద బయటకు వస్తామని భావిస్తుండగా.. వారి ఆశ కాస్త నిరాశ అయ్యింది. వీరికి సంబంధించిన బెయిల్ విచారణ ఈ రోజు జరగాల్సి ఉండగా అది కాస్తా సెప్టెంబర్ 21 కి వాయిదా పడింది. సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) అధికారులు తమ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని కనుక బెయిల్ పిటిషన్ విచారణని వాయిదా వేయాలని కోరారు. వారి అభ్యర్థన మేరకు బెంగళూరులోని ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) ప్రత్యేక కోర్టు రాగిణి, సంజనా బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే సోమవారానికి(సెప్టెంబర్ 21) వాయిదా వేసింది. రాగిణి, సంజనలు ఇద్దరికి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని.. వారు పార్టీలలో మాదకద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లకు, పెడ్లర్లకు మధ్య జరిగిన మెసేజ్‌లను కూడా రిమాండ్ కాపీలో పొందు పర్చారు అధికారులు. (చదవండి: డ్రగ్స్‌కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు?) డ్రగ్స్ రాకెట్ కేసుకు సంబంధించి సీసీబీ రాగిణి ద్వివేదిని సెప్టెంబర్ 4 న అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్ 8 న సంజన గల్రానిని అరెస్టు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పరపన అగ్రహార జైలులో ప్రత్యేక సెల్లో ఉన్నారు. శాండల్‌వుడ్ డ్రగ్ రాకెట్‌కు సంబంధించి ఇప్పటికే 10 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల సెలబ్రిటీ జంట ఐంద్రితా రే, దిగంత్‌లను సీసీబీ విచారణకు పిలిచింది. ఒక రోజు ప్రశ్నించమే కాక వారి గాడ్జెట్లను స్వాధీనం చేసుకుని తరువాత పంపించింది. ఈ రోజు నటులు అకుల్ బాలాజీ, సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు యువరాజ్‌లను సీసీబీ విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. -
‘ఏ కూతురు ఇలాంటి ఆరోపణలు చేయదు’
ముంబై: సభ్య సమాజం సిగ్గుపడాల్సిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త చదివితే ఇలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడం కంటే అనాథలుగా బతకడం మేలనిపిస్తుంది. కుమార్తెలపై భర్త ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తండ్రి దారుణాల గురించి తల్లికి చెబితే.. ఆమె వారిన కొట్టి.. దీని గురించి ఎవరికి చెప్పవద్దని బెదిరించడం నిజంగా దారుణం. ఈ క్రమంలో కేసులో ప్రధాన నిందితురాలైన తల్లికి బాంబే కోర్టు బెయిల్ తిరస్కరించింది. జరిగిన దారుణం తమను తీవ్రంగా కలిచి వేసిందని.. నిజంగా ఇది ప్రకృతి విరుద్ధమైన ఘటన అని కోర్టు వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన కాజీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాలు.. హెడ్మాస్టర్గా పని చేస్తున్న నిందితుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 31న తన 20 ఏళ్ల పెద్ద కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో మిగతా ఇద్దరు కుమార్తెలు పెద్దగా ఏడుస్తూ గొడవ చేయడం ప్రారంభించారు. తల్లిందండ్రులు వారిని గదిలో వేసి దారుణంగా కొట్టారు. చివరకు ఎలాగో అలా తమ పరిస్థితి గురించి ఓ స్నేహితుడికి సమాచారం అందించారు. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు హెడ్మాస్టర్ ఇంటికి చేరుకోని బాధితులను విడిపించి కేసు నమోదు చేశారు. ఏళ్లుగా ఆ అమ్మాయిలు అనుభవించిన నరకం గురించి చెప్తుంటే పోలీసులకు కూడా కళ్లు చెమర్చాయి. (అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?) 2012 నుంచి తండ్రి తనపై అత్యాచారం చేయడం ప్రారంభించాడని పెద్ద కుమార్తె పోలీసులకు తెలిపింది. దీని గురించి తల్లికి చెబితే ఆమె తనను తీవ్రంగా కొట్టిందని వెల్లడించింది. అలానే తన 18 ఏళ్ల రెండో చెల్లిపై ఐదో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి అఘాయిత్యం చేశాడని తెలిపింది. అప్పుడు కూడా ఆ మహాతల్లి తండ్రి దారుణాల గురించి ఎవరికి చెప్పవద్దని పిల్లలను బెదిరించడం గమనార్హం. రెండేళ్ల క్రితం తన మూడో సోదరిపై కూడా తండ్రి అత్యాచారం చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఏళ్లుగా తండ్రి చేతుల్లోనే తాము నరకం అనుభవిస్తున్నామని.. తల్లి మౌనంగా చూస్తూ.. అతడికి మద్దతిస్తుందని వారు వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు హెడ్మాస్టర్ దంపతుల మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. (కిడ్నాప్, ప్రైవేటు భాగాలపై శానిటైజర్) ఈ క్రమంలో బాధితురాలి తల్లి.. పెద్ద కుమార్తె చెడు తిరుగుళ్లు తిరగడంతో తాము మందలించామని.. అందుకే తమ మీద ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తుందని కోర్టుకు తెలిపింది. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరింది. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి బెంచ్ సదరు మహిళ అభ్యర్థనను తోసి పుచ్చారు. ఆమె ప్రవర్తన ప్రృతికి విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాక ఏ కూమార్తె కూడా తల్లిదండ్రుల గురించి ఇలాంటి ఆరోపణలు, అబద్ధాలు చెప్పదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాక సదరు మహిళ మౌనంగా ఉంటూ భర్త అఘాయిత్యాలకు మద్దతు తెలిపిందని కోర్టు వెల్లడించింది. అంతేకాక పెద్ద కుమార్తె అబద్ధం చెప్తే.. మిగతా ఇద్దరు అందుకు మద్దతు తెలపరని కోర్టు స్పష్టం చేసింది. -
అమూల్యకు బెయిల్ నిరాకరణ
బెంగళూర్ : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజ్ విద్యార్థిని అమూల్య లినా బెయిల్ దరఖాస్తును బెంగళూర్ కోర్టు తోసిపుచ్చింది. ఆమెను విడుదల చేస్తే ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశంతో పాటు పారిపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 20న బెంగళూర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఆమె పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించారు. కాగా ఈ నినాదం చేసిన వెంటనే ఆమె వ్యాఖ్యలను ఓవైసీ ఖండించారు. తామంతా భారత్ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ నినాదం చేసిన వెంటనే ఆమెను పలువురు కిందకు తీసుకువెళుతుండగా, మైక్రోఫోన్‌ను లాక్కునే ముందు ఆమె హిందుస్తాన్ జిందాబాద్ అని, లాంగ్‌లివ్ ఇండియా అని నినదించారు.ర్యాలీలో అలజడి రేపిన అమూల్యపై బెంగళూర్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. కాగా ఆమె బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా అమూల్య ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు నివేదించారు. కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆమె బెయిల్ పిటిషన్లో జాప్యం నెలకొంది. చదవండి : మిస్డ్ కాల్‌తో పరిచయం ఆపై.. -
చిదంబరానికి స్వల్ప ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో జీవితం గడుపుతున్న కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర విచారణను కోరుతూ చిదంబరం న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు 47వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం కానీ, బుధవారం గానీ దీనిపై వాదనలను విననుంది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ కాంగ్రెస్ నేత బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో చిదంబరం బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన స్పెషల్ కోర్టు ఈ నెల 27 వరకు జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ లభించవచ్చునని ఆశించిన ఆయన కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. 2007లో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అందుకునేందుకు తన శాఖలోని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఆయన అనుమతి ఇప్పించారన్న ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 16న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అంతకు ముందే 2017 మే 15 న సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
బిటన్ హైకోర్టులో నీరవ్ బెయిల్ పిటిషన్
లండన్: భారత్‌లో మోసాలకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన నీరవ్ మోదీ బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. గతంలో మూడుసార్లు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ బ్రిటన్ హైకోర్టులో శుక్రవారం ఆయన మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ జూన్ 11వ తేదీన విచారణకు రానుందని భారత్ తరపున వాదనలు వినిపిస్తున్న క్రౌన్ ప్రోసెక్షన్ సర్వీస్ తెలిపింది. గురువారం నీరవ్ కేసుపై విచారణ జరిపిన కోర్టు, ఆయన రిమాండ్‌ను జూన్ 27 వరకు పొడిగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14 వేల కోట్లు మోసం చేసి బ్రిటన్ పారిపోయిన నీరవ్‌ను ఇక్కడకు తీసుకురావడానికి భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 19న బ్రిటన్ పోలీసులు అరెస్టు చేసినప్పటినుంచి నీరవ్ మోదీ రిమాండ్‌లోనే ఉన్నారు. -
నీరవ్ మోదీ కోసం లండన్‌కి సీబీఐ, ఈడీ
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ కేసు లండన్ కోర్టులో విచారణకు రానుండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం లండన్ బయలుదేరింది. ఈడీ–సీబీఐ నుంచి జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని బుధవారం లండన్ బయలుదేరారు. నీరవ్‌మోదీ భార్య అమీపై ఈడీ ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు కూడా తీసుకువెళ్లనున్నారు. భారతీయ అధికారులు ఆ దేశంలోని వివిధ అధికారులను, క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌ను కలిసి మోదీ, అతని కుటుంబ సభ్యులు, ఇతరులపై భారత్‌లో దాఖలైన కేసులకు సంబంధించిన వివరాలు, తాజా సాక్ష్యాలు గురించి వారికి తెలియజేస్తారు. నీరవ్‌మోదీ తన బంధువు మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణాలు తీసుకుని ఎగవేసినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. -
హనీప్రీత్‌కు బెయిల్ నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌ను దోషిగా తేల్చిన అనంతరం చెలరేగిన అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన హనీప్రీత్ ఇన్సాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు గురువారం తోసిపుచ్చింది. హనీప్రీత్ బెయిల్ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించిందని, అయితే ఉత్తర్వుల కాపీ తమకు ఇంకా అందలేదని ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ప్రియాంక తనేజా అలియాస్ హనీప్రీత్ లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ దత్తపుత్రికగా చెబుతారు. హింసను ప్రేరేపించారనడానికి ఆమెకు వ్యతిరేకంగా హర్యానా పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవంటూ హనీప్రీత్ బెయిల్‌ను కోరుతున్నారని న్యాయవాది తెలిపారు.గత ఏడాది పంచ్కులలో జరిగిన అల్లర్లకు సంబంధించి అరెస్ట్ అయిన 15 మందికి వేర్వేరు కోర్టుల్లో బెయిల్ లభించిందని డిఫెన్స్ న్యాయవాది పేర్కొనగా, ఆమె బెయిల్ అప్పీల్‌ను ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. గత ఏడాది ఆగస్ట్ 25న గుర్మీత్ సింగ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన అల్లర్లలో 41 మంది మరణించగా, పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన హనీప్రీత్ ఆరు నెలల నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. -
కొడుకు పెళ్లికి జైలులోనే లాలూ..?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం మాజీ మంత్రి చంద్రిక రాయ్ కూడా ఐశ్వర్య రాయ్ కూతురితో మే12న అంగరంగ వైభవంగా జరుగబోతోంది. పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్లో ఈ వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకకు కూడా లాలూ హాజరవుతారో లేదో ఇంకా క్లారిటీ లేదు. దాణా కుంభకోణ కేసులో ప్రస్తుతం రాంచి జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, కొడుకు నిశ్చితార్థానికి కూడా రాలేకపోయారు. డయాబెటీస్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో రాంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇటీవలే చికిత్స తీసుకున్న లాలూ... తక్షణ చికిత్స కోసం తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసుకున్నారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణను జార్ఖాండ్ హైకోర్టు మే 11కు వాయిదా వేసింది. మే 11నే తేజ్ ప్రతాప్ పెళ్లికి సంబంధించిన వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకవేళ మే 11న కోర్టు బెయిల్ మంజూరు చేసిన రాంచి నుంచి పాట్నాకు ఒక్క రోజులో రావడం కొంచెం కష్టమే అంటున్నారు సన్నిహిత వర్గాలు. లాలూ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నిన్ననే జార్ఖాండ్ హైకోర్టు విచారించాల్సి ఉంది. కానీ న్యాయవాదుల బంద్‌తో ఈ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేశారు. అయితే త్వరగా ఈ బెయిల్ పిటిషన్ విచారించాల్సిందిగా లాలూ వర్గాలు కోరుతున్నాయి. వచ్చే శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించాలని సీబీఐ వాదిస్తుందని, అయితే తమకు అనుకూలంగానే ఆదేశాలు వస్తాయని ఆర్జేడీ ఎంపీ, లాలూ సన్నిహితుడు జై ప్రకాశ్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న లాలూను రాజకీయ కుట్రతో సోమవారం రాంచి జైలుకు తరలించారని ఆరోపించారు. లాలూ అనారోగ్యంగా ఉండటంతో, తాము పెరోల్‌కు దరఖాస్తు చేయలేదని ఆర్జేడీ అధినేత న్యాయ వ్యవహారాలు చూసుకున్న వ్యక్తి చెప్పారు. తక్షణ చికిత్స కోసం బెయిల్‌ను కోరినట్టు తెలిపారు. సాధారణంగా పెరోల్‌ను పెళ్లి వేడుకలకు కానీ, అంత్యక్రియలకు కానీ దరఖాస్తు చేసుకుంటారు. 2014 తర్వాత లాలూ కుటుంబంలో జరుగబోయే అతిపెద్ద వేడుక తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లినే. ఆర్జేడీ చిన్న కూతురు రాజ్ లక్ష్మి పెళ్లి తర్వాత, ఇప్పుడు ఆ ఇంట్లో తేజ్ పెళ్లి జరుగుతోంది.