సాక్షి, విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిందితుడు భాస్కర్‌కు చుక్కెదురైంది. భాస్కర్, ఆయన భార్య అపర్ణ బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. రెండు బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై ప్రత్యేక న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది.
సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, ముందస్తు పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం సంతోషకరమన్నారు. ‘‘గత ప్రభుత్వంలో దోచుకో.. పంచుకో.. తినుకో స్కీములు ఎక్కువగా నడిచాయి. ప్రజాధనాన్ని దోచుకున్న వారు చట్టం నుండి తప్పించుకోలేరు.
ఈ కేసులో చట్టం తన పని తాను చేస్తోంది. భాస్కర్, అతని భార్య అరుణ ఉపాధ్యాయ తప్పిదాల్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ కేసులో ఇంకా చాలా మంది ప్రమేయం ఉందని భావిస్తున్నాను. ఈ కేసును ఈడీ కూడా నిశితంగా పరిశీలిస్తుంది’’ అని పొన్నవోలు సుధాకర్ తెలిపారు.
చదవండి: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని
Comments
Please login to add a commentAdd a comment