
ముంబై డ్రగ్స్ బస్ట్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఇప్పటి వరకు ఎన్‌సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్‌లో ఉంచాలని కోర్టు తెలిపింది.
అయితే ఈ విచారణ సమయంలో యువకులు తమ స్వేచ్ఛను తిరిగి పొందేందుకు అర్హులని ఆర్యన్ ఖాన్ న్యాయవాది సతీష్ మానేషిండే మేజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. నటి రియా చక్రవర్తి ప్రమేయం ఉన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సహా ఇతర కేసుల్లోని తీర్పులను చదివి వినిపించారు. తక్కువ చిన్న పరిమాణం కలిగి ఉన్న వ్యక్తులతో చట్టం వ్యవహరించే తీరును గమనించాలని కోరినప్పటికీ బెయిల్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ విచారణ ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ 51వ పుట్టిన రోజున జరగడం యాదృచ్ఛికం. కాగా ఈ సందర్భంగా ఈ స్టార్‌కిడ్‌కి బెయిల్ మంజూరు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
చదవండి: కష్టాల్లో సల్మాన్ తోడుగా ఉంటాడన్న షారుక్.. పాత వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment