తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ | Tarun Tejpal bail plea hearing Wednesday | Sakshi
Sakshi News home page

తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

Published Wed, Jan 15 2014 9:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

లైంగిక వేధింపుల ఆరోపణలతో కటకటాల్లో ఉన్న తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై బుధవారం నాడు గోవా కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 45 రోజుల పాటు ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు.

గోవాలోని ఓ రిసార్టులో థింక్ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement