తేజ్పాల్ బెయిల్పై విచారణ సాయంత్రానికి వాయిదా
లైంగిక వేధింపుల ఆరోపణలపై తెహెల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ శనివారం గోవా సెషన్ కోర్టులో హాజరయ్యారు. వాదనలు సాయంత్రం 4.30కి వాయిదా పడ్డాయి. తేజ్‌పాల్ తరపున న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. ఫిర్యాదు చేసిన జర్నలిస్టును తేజ్‌పాల్ బెదిరించే ప్రయత్నం చేయలేదన్నారు. తేజ్‌పాల్ దేశం విడిచిపెట్టి వెళ్లే ఆలోచన లేదని.. కనీసం ముంబై కూడా వెళ్లరని చెప్పారు. తేజ్‌పాల్‌పై అత్యాచారం కేసు పెట్టడం అన్యాయమని.. అది కూడా ఘటన జరిగిన 10 రోజులకు ఫిర్యాదు చేశారని.. గుర్తు చేశారు.
మరోవైపు తేజ్‌పాల్ నేరం చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ తరపు లాయర్ వాదించారు. బాధితురాలి స్టేట్‌మెంట్లలో నిలకడ ఉందన్న ఆయన.. రేప్‌కు యత్నించారన్న విషయాన్ని సీసీటీవీ దృశ్యాలు బలపరుస్తున్నాయన్నారు. గోవా పోలీసులకు తేజ్‌పాల్ అందుబాటులో లేరని... మధ్యంతర బెయిల్ రాగానే ఆయన బయటపడ్డారని ప్రాసిక్యూషన్ లాయర్ చెప్పారు. తేజ్‌పాల్‌ను కచ్చితంగా పోలీస్ కస్టడీకి అనుమతించాలని ఆయన కోర్టును కోరారు.