Goa court
-
ఏడున్నరేళ్ల పోరాటం: తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషి
పనాజీ: అత్యాచారం కేసులో తెహల్క మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషిగా బయటపడ్డాడు. అతడు నిర్దోషి అని గోవా కోర్టు తేల్చి చెప్పింది. 2013లో థింక్ ఇన్ గోవా సమావేశంలో తనను తరుణ్ తేజ్‌పాల్ లైంగికంగా వేధించాడంటూ ‘తెహల్క.కమ్’కు చెందిన మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ మొదలుపెట్టిన పోలీసులు అదే ఏడాది నవంబర్ 30వ తేదీన అరెస్ట్ చేశారు. దీనిపై గోవా కోర్టు విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలపై తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తప్పుడు ఆరోపణలని, ఈ కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. బెయిల్ కోసం కూడా విజ్ఞప్తి చేశారు. విచారణ చేసి 2014 జూలై 1వ తేదీన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదనంతరం తనపై ఆరోపణలను కొట్టివేయాలని.. కేసు రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో గోవా కోర్టులో విచారణ జరిగి చివరకు 2021 మే 21 శుక్రవారం నాడు తీర్పు వెలువడింది. తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషి అని పేర్కొంటూ పేర్కొంది. ఏడున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడడంతో తేజ్‌పాల్ కుమార్తె కారా తేజ్‌పాల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన న్యాయవాది దివంగత రాజీవ్ గోమొస్‌కు తేజ్‌పాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇటీవల కరోనాతో మృతిచెందాడు. -
తల్లిని చూసేందుకు తేజ్‌పాల్‌కు అనుమతి
పనాజీ: సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జైలుపాలైన తెహల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ తాత్కాలిక ఊరట లభించింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి శంకుతలను చూసేందుకు ఆయనకు గోవా కోర్టు అనుమతినిచ్చింది. మాపుసా పట్టణంలోని ఆస్పత్రిలో ఉన్న తన తల్లిని రేపు ఉదయం ఆయన కలుసుకోనున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శకుంతల ఐసీయూలో ఉన్నారు. కాగా, తేజ్‌పాల్ పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ తిరస్కరించింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. గతేడాది నవంబర్‌లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
ఫిబ్రవరి 5న తరుణ్ తేజ్పాల్పై ఛార్జ్‌షీట్
పనాజి : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై వచ్చేవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు గోవా పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి అయ్యిందని... ఫిబ్రవరి 5న ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్‌ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తరుణ్ తేజ్‌పాల్ ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్‌పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. మరోవైపు కటకటాల్లో ఉన్న తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌ను గోవా కోర్టు విచారించింది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. -
లైంగిక దాడి కేసులో షోమా చౌదరి స్టేట్మెంట్ రికార్డు
తెహల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి స్టేట్మెంట్ను గోవా కోర్టు శనివారం రికార్డు చేసింది. సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడి కేసులో షోమా చౌదరితో పాటు మరో ముగ్గురు ఉద్యోగుల వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసేందుకు గోవా పోలీసులు బుధవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టుకు హాజరయ్యేందుకు షోమా చౌదరి శుక్రవారం రాత్రే ఢిల్లీ నుంచి గోవా చేరుకున్నారు. లైంగిక దాడి సంఘటన తెలిసిన మొదటి వ్యక్తి షోమా కావడంతో ఆమె వాంగ్మూలం చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కస్టడీ ముగియటంతో తరుణ్ తేజ్పాల్ను పోలీసులు ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా మరో వారం పాటు తేజ్‌పాల్ కస్టడీ పొడిగించేందుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి కోరనున్నారు. సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గోవా పోలీసులు తేజ్పాల్ను అరెస్టు చేయడం తెలిసిందే. -
తేజ్ పాల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు
పోలీస్ లాకప్ లో ఫ్యాన్ ఏర్పాటు చేయాలని తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ చేసిన విజ్క్షప్తిని గోవా కోర్టు తిరస్కరించింది. తేజ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన జుడిషియల్ మేజిస్ట్రేట్ క్షమా జోషి తిరస్కరించారు. లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్ పాల్ ను పానాజీ పోలీస్ కస్టడీలో ఉంచారు. మానవత దృక్పథంతో తన క్లయింట్ కు లాకప్ లో ఫ్యాన్ ఏర్పాటు చేయాలని తేజ్ పాల్ లాయర్ డిసెంబర్ 2 తేదిన పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తరుణ్ తేజ్ పాల్ కు బుధవారం రెండవసారి వైద్య పరీక్షలు జరిపించారు. డిసెంబర్ 2 తేదిన గోవా మెడికల్ కాలేజి, హస్పిటల్ లో వైదపరీక్షలతోపాటు, లైంగిక పటుత్వ పరీక్షలు జరిపిన సంగతి జరిపారు. శనివారం ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో తేజ్ పాల్ కు ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించారు. గోవాలో ఓ కార్యక్రమం సందర్భంగా సహ ఉద్యోగి, మహిళా జర్నలిస్ట్ ను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదైంది. -
తేజ్‌పాల్‌కు 6 రోజుల కస్టడీ
పణజీ: తెహెల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను పణజీ కోర్టు ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు ఆదివారం జుడీషియల్ మేజిస్ట్రేట్ షామా జోషీ ఆదేశాలు జారీ చేశారు. ఆయన్ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫ్రాన్సెస్ తవేరా విజ్ఞప్తితోపాటు కేసు విచారణలో తేజ్‌పాల్ పోలీసులకు సహకరిస్తున్నందున కస్టడీ అవసరంలేదన్న డిఫెన్స్ న్యాయవాదుల వాదననూ తోసిపుచ్చారు. సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గోవా పోలీసులు తేజ్పాల్ను శనివారం రాత్రి అరెస్టు చేయడం తెలిసిందే. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు తేజ్పాల్ను క్రైం బ్రాంచి హెడ్‌క్వార్టర్స్‌కు తరలించి ఐదు గంటలకుపైగా ప్రశ్నించారు. రాత్రి 8 గంటలకు ఆయన్ను తిరిగి లాకప్‌కు తరలించారు. సోమవారం తిరిగి విచారణ కొనసాగించనున్నారు. శనివారం రాత్రి తేజ్పాల్ను అరెస్టు చేశాక పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం అర్ధరాత్రి 12.30 గంటలకు గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. పరీక్షలు ముగిశాక బయటకు వచ్చిన తేజ్‌పాల్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో తేజ్పాల్ను పోలీసు హెడ్‌క్వార్టర్స్ వద్దకు తీసుకొచ్చాక ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. అనంతరం పోలీసులు తేజ్పాల్ను ఇద్దరు హత్య కేసు నిందితులు సహా ముగ్గురిని ఉంచిన లాకప్‌లోకి పంపారు. కాగా, బాధితురాలు తనపై అత్యాచార అభియోగాలు మోపడం వెనక రాజకీయ కుట్ర ఉందంటూ అరెస్టుకు ముందు వరకూ ఆరోపించిన తేజ్‌పాల్... ముందస్తు బెయిల్ దరఖాస్తులో మాత్రం ఆ ఆరోపణలను ప్రస్తావించకపోవడం గమనార్హం. కేసులో జోక్యం చేసుకోం: షిండే తేజ్పాల్పై నమోదైన కేసులో కేంద్రం జోక్యం చేసుకోబోదని కేంద్ర హోంమంత్రి షిండే స్పష్టం చేశారు. దోషులెవరినీ తమ ప్రభుత్వం రక్షించదని...అదే సమయంలో వేరే రాష్ట్రానికి (గోవా) సంబంధించిన కేసులో జోక్యం చేసుకోబోదని ముంబై లో వ్యాఖ్యానించారు. మరోవైపు తెహెల్కా గ్రూపు డొల్ల కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు సాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రూ. 26 లక్షల సర్వీసు ట్యాక్స్‌ను తెహెల్కా చెల్లించలేదని ఆడిటర్ల తనిఖీల్లో తేలింది. -
తరుణ్ తేజ్ పాల్ కు బెయిలు నిరాకరించిన గోవా కోర్టు
-
తేజ్‌పాల్ బెయిల్‌పై విచారణ సాయంత్రానికి వాయిదా
లైంగిక వేధింపుల ఆరోపణలపై తెహెల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ శనివారం గోవా సెషన్ కోర్టులో హాజరయ్యారు. వాదనలు సాయంత్రం 4.30కి వాయిదా పడ్డాయి. తేజ్‌పాల్ తరపున న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. ఫిర్యాదు చేసిన జర్నలిస్టును తేజ్‌పాల్ బెదిరించే ప్రయత్నం చేయలేదన్నారు. తేజ్‌పాల్ దేశం విడిచిపెట్టి వెళ్లే ఆలోచన లేదని.. కనీసం ముంబై కూడా వెళ్లరని చెప్పారు. తేజ్పాల్పై అత్యాచారం కేసు పెట్టడం అన్యాయమని.. అది కూడా ఘటన జరిగిన 10 రోజులకు ఫిర్యాదు చేశారని.. గుర్తు చేశారు. మరోవైపు తేజ్‌పాల్ నేరం చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ తరపు లాయర్ వాదించారు. బాధితురాలి స్టేట్మెంట్లలో నిలకడ ఉందన్న ఆయన.. రేప్‌కు యత్నించారన్న విషయాన్ని సీసీటీవీ దృశ్యాలు బలపరుస్తున్నాయన్నారు. గోవా పోలీసులకు తేజ్‌పాల్ అందుబాటులో లేరని... మధ్యంతర బెయిల్ రాగానే ఆయన బయటపడ్డారని ప్రాసిక్యూషన్ లాయర్ చెప్పారు. తేజ్పాల్ను కచ్చితంగా పోలీస్ కస్టడీకి అనుమతించాలని ఆయన కోర్టును కోరారు. -
తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
-
తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
పణజీ : తెహెల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై శనివారం గోవా కోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది. తెహెల్కా మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో ఆయనను శనివారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు అరెస్టు చేయకుండా స్థానిక కోర్టు మధ్యంతర రక్షణ కల్పించిన విషయం తెలిసిందే. కాగా వాస్తవానికి శుక్రవారం ఉదయం తేజ్‌పాల్ అరెస్టుకు జడ్జి నాన్ బెయిల్‌బుల్ వారంట్లు జారీ చేశారు. అయితే ఆయన తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో అరెస్టును మధ్యాహ్నం 2.30 వరకు వాయిదా వేశారు. ఉదయం నుంచి హైడ్రామా, యూక్షన్ నేపథ్యంలో ఎట్టకేలకు తరుణ్ తేజ్‌పాల్‌కు గోవా కోర్టులో ఊరట లభించింది. ఆయన్ని ఈరోజు ఉదయం పది గంటల వరకూ అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు తేజ్‌పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ నేపథ్యంలో గోవా కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు తరుణ్ తేజ్ పాల్ విచారణ నిమిత్తం గోవా క్రైమ్ బ్రాంచ్ అధికారుల ఎదుట హాజరయ్యారు.