తేజ్ పాల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు
తేజ్ పాల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు
Published Wed, Dec 4 2013 1:24 PM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
పోలీస్ లాకప్ లో ఫ్యాన్ ఏర్పాటు చేయాలని తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ చేసిన విజ్క్షప్తిని గోవా కోర్టు తిరస్కరించింది. తేజ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన జుడిషియల్ మేజిస్ట్రేట్ క్షమా జోషి తిరస్కరించారు. లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్ పాల్ ను పానాజీ పోలీస్ కస్టడీలో ఉంచారు. మానవత దృక్పథంతో తన క్లయింట్ కు లాకప్ లో ఫ్యాన్ ఏర్పాటు చేయాలని తేజ్ పాల్ లాయర్ డిసెంబర్ 2 తేదిన పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తరుణ్ తేజ్ పాల్ కు బుధవారం రెండవసారి వైద్య పరీక్షలు జరిపించారు. డిసెంబర్ 2 తేదిన గోవా మెడికల్ కాలేజి, హస్పిటల్ లో వైదపరీక్షలతోపాటు, లైంగిక పటుత్వ పరీక్షలు జరిపిన సంగతి జరిపారు. శనివారం ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో తేజ్ పాల్ కు ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించారు. గోవాలో ఓ కార్యక్రమం సందర్భంగా సహ ఉద్యోగి, మహిళా జర్నలిస్ట్ ను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదైంది.
Advertisement
Advertisement