Tehalka
-
‘తెహల్కా’లో జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: తెహెల్కా మ్యాగజైన్ ఫైనాన్సియర్స్‌పై విచారణలో జోక్యం చేసుకోవాలని 2004లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. తెహెల్కా పెట్టుబడిదారులపై రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు అనుసరిస్తున్న వైఖరి అన్యాయంగా ఉందని, ఈ అంశాన్ని పరిష్కరించాలని లేఖలో సోనియా కోరారు. తెహెల్కా.కామ్ ప్రధాన పెట్టుబడిదారైన ఫస్ట్ గ్లోబల్ డైరెక్టర్ పంపిన వివరాల్ని పరిశీలించాలని అప్పట్లో నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా కేబినెట్ మంత్రి హోదాలో సోనియా కోరారు. 4 రోజులకు యూపీఏ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేసింది. 6 రోజులకు ఫస్ట్ గ్లోబల్‌పై కేసును ఉపసంహరించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సోనియా గాంధీ లేఖపై చిదంబరం స్పందిస్తూ.. ‘ఆ లేఖను పరిశీలించిన విషయం వాస్తవం. సోనియా లేఖకు తాను ఇచ్చిన సమాధానాన్ని కేంద్రం బయటపెట్టాలి. రెండింటిని కలిపి చదివితే స్పష్టత వస్తుంది’ అని వివరణ ఇచ్చారు. అప్పట్లో తెహెల్కా పత్రిక బహిర్గతం చేసిన రక్షణ ఒప్పందాల అవినీతికి బాధ్యత వహిస్తూ వాజ్‌పేయ్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేశారు. డబ్బులు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ను అనంతరం కోర్టు దోషిగా నిర్ధారించింది. అత్యాచారం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న తరుణ్ తేజ్‌పాల్ అప్పట్లో తెహెల్కా ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ అవినీతి వెలుగులోకి వచ్చాక.. ఫస్ట్ గ్లోబల్ ప్రమోటర్లు దెవినా మెహ్ర, శంకర్ శర్మలపై వివిధ దర్యాప్తు సంస్థలు పలు కేసులు నమోదు చేశాయి. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చాక మెహ్ర, శర్మలు సోనియాకు లేఖ రాస్తూ దర్యాప్తు సంస్థల వేధింపులు కొనసాగుతున్నాయని, పరిష్కరించాలని కోరారు. -
జర్నలిస్ట్‌పై రేప్.. తరుణ్ తేజ్‌పాల్‌కు కోర్టు షాక్!
సాక్షి, గోవా: తెహల్కా మ్యాగజిన్ మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు గోవా కోర్టు షాక్ ఇచ్చింది. తోటి మహిళా జర్నలిస్ట్‌పై అత్యాచారం జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న తేజ్పాల్పై గోవా కోర్టు అభియోగాలను ఖరారు చేసింది. ఈ కేసులో బుధవారం కోర్టుకు హాజరైన తేజ్‌పాల్ .. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని, విచారణపై స్టే విధించాలని తేజ్‌పాల్ కోరారు. అయితే, ఆయనపై ప్రాసిక్యూషన్ నమోదుచేసిన అభియోగాలను ఖరారు చేసిన కోర్టు.. విచారణను కొనసాగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు తేజ్‌పాల్‌కు ఎదురుదెబ్బగా మారాయి. గతంలో తేజ్‌పాల్ ఈ కేసు విచారణపై స్టే విధించాలని బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కానీ కోర్టు నిరాకరించింది. 2013 నవంబర్‌లో గోవాలో జరిపిన పార్టీలో తేజ్‌పాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని తెహల్కా ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ తేజ్‌పాల్ మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేశారు. బీజేపీ ప్రభుత్వం తనపై కావాలనే కక్షపూరిత చర్యలకు పాల్పడుతొందన్నారు. -
‘13 ఏళ్ల క్రితమే తెహల్కా చెప్పింది’
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు తన ఆస్తులను ప్రకటించినా, ప్రకటించకపోయినా తెలుగు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల ప్రకటన అంతా బోగస్ అని కొట్టిపారేశారు. దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ‘తెహల్కా’ 13 ఏళ్ల క్రితమే ప్రకటించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆస్తుల ప్రకటన కంటే మరో పెద్ద జోక్ ఇంకోటి ఉండదని, ఆస్తుల ప్రకటన దిగజారుడు రాజకీయమని ఆయన విమర్శించారు. బాబు ఆస్తుల ప్రకటన చూస్తే అంబానీ, అదానీలు పేదవాళ్లం అని చెప్పుకున్నట్లు ఉందని భూమన వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతి సొమ్మును చూడటానికి ప్రజలకు రెండు కళ్లు చాలవని, ఆయన ఆస్తులు పెరిగితే ఏపీలో పేదరికం పెరిగినట్లేనని అన్నారు. చంద్రబాబు ఆస్తులు తగ్గినప్పుడే ప్రజలు సంతోషంగా ఉన్నారని భూమన అన్నారు. నారా లోకేశ్ చెప్పిన లెక్కల ప్రకారం చంద్రబాబు కుటుంబం పేదరికాన్ని చూసి రాష్ట్ర ప్రజలంతా జాలిపడి తలా రూ.వంద ఇచ్చి ఆదుకోవాలన్నారు. బాబు ఆస్తులపై ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో విచారణ జరిపించినా వాస్తవాలు తెలిసిపోతాయన్నారు. -
‘13 ఏళ్ల క్రితమే తెహల్కా చెప్పింది’
-
తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పనాజీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్ ను గోవా కోర్టు తిరస్కరించింది. కటకటాల్లో ఉన్న తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్ ను బుధవారం నాడు గోవా కోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తేజ్ పాల్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 45 రోజుల పాటు ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్‌ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్‌పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
తరుణ్ తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
లైంగిక వేధింపుల ఆరోపణలతో కటకటాల్లో ఉన్న తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం నాడు గోవా కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 45 రోజుల పాటు ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్‌ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్‌పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
తరుణ్ తేజ్‌పాల్‌కు బెయిల్ నిరాకరణ
మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గోవా కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన్ను ఆరెస్టు చేసేందుకు గోవా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇస్తారని, ముంబై కూడా వెళ్లబోరని ఆయన తరఫు న్యాయవాది తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ముందుగా శనివారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే తాత్కాలికంగా బెయిల్ ఇచ్చిన కోర్టు, శనివారం నాడు ఆయన దాఖలుచేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. విచారణ ముగిసిన అనంతరం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో తరుణ్ తేజ్పాల్ను విచారించేందుకు గోవా పోలీసులకు మార్గం సుగమమైంది. అంతకుముందు చాలా రోజుల నుంచి ఆయన పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. -
తేజ్‌పాల్ బెయిల్‌పై విచారణ సాయంత్రానికి వాయిదా
లైంగిక వేధింపుల ఆరోపణలపై తెహెల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ శనివారం గోవా సెషన్ కోర్టులో హాజరయ్యారు. వాదనలు సాయంత్రం 4.30కి వాయిదా పడ్డాయి. తేజ్‌పాల్ తరపున న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. ఫిర్యాదు చేసిన జర్నలిస్టును తేజ్‌పాల్ బెదిరించే ప్రయత్నం చేయలేదన్నారు. తేజ్‌పాల్ దేశం విడిచిపెట్టి వెళ్లే ఆలోచన లేదని.. కనీసం ముంబై కూడా వెళ్లరని చెప్పారు. తేజ్పాల్పై అత్యాచారం కేసు పెట్టడం అన్యాయమని.. అది కూడా ఘటన జరిగిన 10 రోజులకు ఫిర్యాదు చేశారని.. గుర్తు చేశారు. మరోవైపు తేజ్‌పాల్ నేరం చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ తరపు లాయర్ వాదించారు. బాధితురాలి స్టేట్మెంట్లలో నిలకడ ఉందన్న ఆయన.. రేప్‌కు యత్నించారన్న విషయాన్ని సీసీటీవీ దృశ్యాలు బలపరుస్తున్నాయన్నారు. గోవా పోలీసులకు తేజ్‌పాల్ అందుబాటులో లేరని... మధ్యంతర బెయిల్ రాగానే ఆయన బయటపడ్డారని ప్రాసిక్యూషన్ లాయర్ చెప్పారు. తేజ్పాల్ను కచ్చితంగా పోలీస్ కస్టడీకి అనుమతించాలని ఆయన కోర్టును కోరారు. -
తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
-
తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
పణజీ : తెహెల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై శనివారం గోవా కోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది. తెహెల్కా మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో ఆయనను శనివారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు అరెస్టు చేయకుండా స్థానిక కోర్టు మధ్యంతర రక్షణ కల్పించిన విషయం తెలిసిందే. కాగా వాస్తవానికి శుక్రవారం ఉదయం తేజ్‌పాల్ అరెస్టుకు జడ్జి నాన్ బెయిల్‌బుల్ వారంట్లు జారీ చేశారు. అయితే ఆయన తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో అరెస్టును మధ్యాహ్నం 2.30 వరకు వాయిదా వేశారు. ఉదయం నుంచి హైడ్రామా, యూక్షన్ నేపథ్యంలో ఎట్టకేలకు తరుణ్ తేజ్‌పాల్‌కు గోవా కోర్టులో ఊరట లభించింది. ఆయన్ని ఈరోజు ఉదయం పది గంటల వరకూ అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు తేజ్‌పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ నేపథ్యంలో గోవా కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు తరుణ్ తేజ్ పాల్ విచారణ నిమిత్తం గోవా క్రైమ్ బ్రాంచ్ అధికారుల ఎదుట హాజరయ్యారు. -
తేజ్‌పాల్‌కు ఊరట
-
తేజ్‌పాల్ అరెస్టు.. అంతలోనే కోర్టు నుంచి ఊరట
లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న తెహల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు వెంటవెంటనే రెండు విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. గోవాలో అడుగు పెట్టగానే ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, రేపు ఉదయం 10 గంటలకు తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉంటుందని, ఆ విచారణ పూర్తయ్యే వరకు ఆయనను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో తేజ్‌పాల్‌కు ఒక్క రోజుకు మాత్రం ఊరట దొరికినట్లు అయ్యింది. బెయిల్ ఇచ్చేదీ లేనిదీ తేలిపోతుంది కాబట్టి ఆ తర్వాత అరెస్టు విషయాన్ని కూడా చూసుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. అంతకుముందు వీలైనంత వరకు అరెస్టును తప్పించుకోడానికి శతవిధాలా ప్రయత్నించిన తేజ్‌పాల్.. చివరకు గోవాకు విమానంలో బయల్దేరక తప్పలేదు. దాంతో ఆయన విమానాశ్రయంలో దిగిన మరుక్షణమే అప్పటికే సిద్ధంగా ఉన్న గోవా పోలీసులు అరెస్టు చేశారు. మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించడంతో తేజ్‌పాల్ మీద కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, విచారణ సమయంలో తేజ్‌పాల్ తరఫున వాదిస్తున్న న్యాయవాది బాధితురాలి పేరును ఉదహరించారు. వెంటనే దీనిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నువ్వు న్యాయవాది ఎలా అయ్యావంటూ జడ్జి చీవాట్లు పెట్టారు. -
తప్పించుకు తిరుగుతున్న తరుణ్ తేజ్‌పాల్
-
తప్పించుకు తిరుగుతున్న తరుణ్ తేజ్‌పాల్
న్యూఢిల్లీ : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ను అరెస్టు చేసేందుకు గోవా పోలీసులు ఢిల్లీలోని తరుణ్ తేజ్‌పాల్ ఇంటిలో సోదాలు చేశారు. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన తేజ్‌పాల్ రాత్రి తన ఇంట్లో కాకుండా మరో చోటు మకాం వేశారు. తేజ్పాల్ను పట్టుకునేందుకు గోవా పోలీసులు తేజ్‌పాల్ బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయితే ఆయన అక్కడ లేకపోవటంతో వారు వెనుదిరిగారు. గోవా క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా సౌత్ ఢిల్లీలోని తరుణ్ తేజ్ పాల్ నివాసంలో సోదాలు జరిపారు. అనంతరం పోలీసులు మాట్లాడుతు తమ విచారణకు తరుణ్ తేజ్ పాల్ కుటుంబీకులు సహకరించటం లేదని, ఆయన ఎక్కడున్నారనే వివరాలు చెప్పేందుకు తరుణ్ తేజ్ పాల్ సతీమణి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా తమ ముందు విచారణకు హాజరుకావాలని గోవా పోలీసులు తేజ్‌పాల్‌కు విధించిన గడువు నిన్నటితో ముగిసింది. అయితే తనకు రెండు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ తరుణ్ తేజ్‌పాల్ పోలీసులకు లేఖ రాశారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసులు అరెస్టు చేయకుండా నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని హైకోర్టులో తరుణ్ తేజ్‌పాల్ పెట్టుకున్న పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. కోర్టు బెయిల్ ఇవ్వడాని కంటే ముందే అరెస్టు చేసి విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో గోవా పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఉద్దేశ్యంతోనే ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. గోవా పోలీసుల రాకను పసిగట్టిన తేజ్‌పాల్ వారికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈరోజు బెయిల్ రాకపోతే పోలీసులు ముందు తేజ్ పాల్ లొంగిపోయే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. చేతిలో నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో గోవా పోలీసులు ఢిల్లీలో చక్కర్లు కొడుతుంటే.... ఈరోజు ఎలాగైనా బెయిల్ వస్తుందన్న గంపెడు ఆశతో తేజ్‌పాల్ తప్పించుకు తిరుగుతున్నారు. -
షోమా చౌదరి ఇంటి ముందు బీజేపీ ఆందోళన
ఢిల్లీ: తెహల్కా మేనేజింగ్ మాజీ ఎడిటర్ షోమా చౌదరి ఇంటి ముందు గురువారం బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను షోమా చౌదరి కాపాడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఆమె ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఆమె మహిళ అయ్యి కూడా సాటి మహిళలకు అండగా నిలవకపోవడం చాలా బాధాకరమని ఆందోళనలో పాల్గొన్నబీజేపీ నేత విజయ్ జోలీ తెలిపారు. ఇది యావత్తు మహిళా లోకమే తలదించుకునేలా ఉందని జోలీ తెలిపారు. తేజ్ పాల్ కు అండగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తేజ్ పాల్ విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. దాంతో విచారణ అనంతరం తేజ్పాల్ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
రెండు రోజుల గడువు కోరిన తరుణ్ తేజ్‌పాల్
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్... గోవా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల గడువు కోరారు. ఈ మేరకు ఆయన గురువారం గోవా పోలీసులకు లేఖ రాశారు తరుణ్ తేజ్‌పాల్ తనకు రెండు రోజుల సమయం కావాలని ఓ లేఖ పంపినట్లు గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇనస్పెక్టర్ సునీతా సావంత్ వెల్లడించారు. ఆయన శనివారం మధ్యాహ్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. కాగా తరుణ్ తేజ్‌పాల్ ఈరోజు మధ్యాహ్నం లొంగిపోవాలని గోవా పోలీసులు ఇప్పటికే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని హైకోర్టును తేజ్‌పాల్ కోరారని ... ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తరుణ్ తేజ్‌పాల్ గోవా పోలీసులకు లేఖ రాశారు. అలాగే పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తాము సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని తరుణ్ తేజ్‌పాల్ తరపు న్యాయవాది సందీప్ కపూర్ తెలిపారు. మరోవైపు హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీ టీవీ పుటేజ్ కీలకంగా మారింది. మహిళతో కలిసి తేజ్‌పాల్ వెళ్లినట్లు సీసీ టీవీలో నమోదు అయినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ భుజాలపై తేజ్‌పాల్ చేతులు వేసి వెళ్తున్నట్లు అందులో ఉందని పోలీసులు తెలిపారు. దుస్తులు సవరించుకుంటూ ఓ మహిళ లిఫ్ట్ నుంచి బయటకొచ్చారని వారు చెబుతున్నారు. మరోవైపు... తేజ్పాల్ను రక్షించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి షోమాచౌదరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
తెహల్కాకు షోమాచౌదరి రాజీనామా
-
తెహల్కాకు షోమాచౌదరి రాజీనామా
న్యూఢిల్లీ: తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి షోమా చౌదరి రాజీనామా చేశారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణ్ తేజ్పాల్ను షోమా చౌదరి కాపాడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక తరుణ్ తేజ్‌పాల్‌కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురయింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని కోర్టును తేజ్‌పాల్ కోరారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. దాంతో విచారణ అనంతరం తేజ్పాల్ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోవాలోని ఓ హోటల్లోని లిఫ్ట్‌లో మహిళా జర్నలిస్టును తేజ్‌పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు ఈ నెల 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తేజ్పాల్పై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376(2)(కె)(అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడం), 354 (దౌర్జన్యం) కింద అభియోగాలు మోపారు. వీటిలో సెక్షన్ 376 కింద ఆరోపణలు రుజుమైతే దోషికి జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉంది. -
తరుణ్ తేజ్‌పాల్ అరెస్ట్ తప్పకపోవచ్చు: గోవా సీఎం
న్యూఢిల్లీ : తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ అరెస్టు తప్పేలా కనిపించడం లేదు. మహిళా జర్నలిస్ట్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను అరెస్టు తప్పకపోవచ్చని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ అన్నారు. తేజ్పాల్ను ఇరికించేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందన్న వాదనలో వాస్తవం లేదని పారీకర్ స్పష్టం చేశారు. కేసులో జోక్యం చేసుకునేంత సమయం తనకు లేదని ఆయన అన్నారు. బాధితురాలికి న్యాయం చేయడానికి తాము అన్ని విధాల కృషి చేస్తామని పారీకర్ తేల్చి చెప్పారు. కేసు త్వరితగతిన పూర్తి చేసేందుకు పాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు తరుణ్ తేజ్పాల్పై మంగళవారం గోవా పోలీసులు ‘ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్ అలర్ట్’ను జారీ చేశారు. తేజ్‌పాల్ దేశం విడిచి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు సమాచారం ఇచ్చారు. నిందితుడు దేశం విడిచి వెళ్లే యత్నాలు చేయకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నామని డీఐజీ ఓపీ మిశ్రా వెల్లడించారు. బాధితురాలు దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారని, అయితే ఆమె చెప్పే విషయాలను వెల్లడించలేనని తెలిపారు. దర్యాప్తులో రాజకీయ జోక్యం, ఒత్తిడి లేవన్నారు. మరోవైపు, తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిన్న నిరాకరించిన విషయం తెలిసిందే. -
తరుణ్ తేజ్పాల్ను తక్షణమే అరెస్ట్ చేయాలి
న్యూఢిల్లీ : తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను తక్షణం అరెస్ట్ చేయాల్సిందేనంటూ మహిళాసంఘాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా తేజ్పాల్పై నిరసనలు మిన్నంటుతున్నాయి. తేజ్పాల్ను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మంగళవారం మహిళా సంఘాలు భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బాధితురాలికి సంపూర్ణ న్యాయం దక్కేలా.. తేజ్పాల్పై దర్యాప్తు సాగాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. రెండురోజుల క్రితం బాధితురాలు తెహల్కాలో ఉద్యోగానికి రాజీనామా చేయగా.. తెహల్కా యాజమాన్యం వైఖరిపై.. కన్సల్టింగ్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, లిటరరీ ఎడిటర్ రాజీనామాలు చేశారంటూ వార్తలు పొక్కుతున్నాయి. మరోవైపు.. గోవా పోలీసుల పనితీరుపై తరుణ్ తేజ్‌పాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లైగింక వేధింపులు ఎదుర్కొన్న మహిళ జర్నలిస్ట్ నుంచి గోవా పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. -
మహిళ జర్నలిస్ట్ నుంచి స్టేట్మెంట్ రికార్డు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టు నుంచి గోవా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. మరోవైపు , కేసు విచారణకు సంబంధించి తెహల్కా యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఉద్యోగుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా అసోసియేట్ ఎడిటర్ రాణా కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇక సంస్థ కన్సల్టింగ్ ఎడిటర్ మజూందార్, అసిస్టెంట్ ఎడిటర్ రేవతి లాల్లు కూడా రాజీనామాలు సమర్పించినట్టు తెలిసింది. తెహల్కా లిటరరీ ఎడిటర్ షౌగత్ దాస్‌గుప్తా కూడా అదే బాటలో ఉన్నట్టు సమాచారం. కాగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో తెహల్కా యాజమాన్యం అంతర్గత విచారణ కమిటీని నియమించింది. అయితే పోలీసుల తీరుపై తేజ్‌పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే సిసి ఫుటేజ్‌ను పోలీసులు చూడటం లేదని ఆయన ఆరోపించారు. గోవా పోలీసుల విచారణపై తరుణ్ తేజ్‌పాల్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు తేజ్‌పాల్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. లైంగికదాడి బాధితురాలు, తెహల్కా మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ఓ వార్తాసంస్థకు తెలిపారు. బాధితురాలు తన రాజీనామాను రెండు రోజుల కిందటే కార్యాలయానికి పంపినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
మహిళా జర్నలిస్టు ఉద్యోగానికి రాజీనామా
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేసింది. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో పది రోజుల కిందట తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణ్ తేజ్ పాల్ సోమవారం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్ట్‌ను తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం ఆయన ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. తేజ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జీఎస్ సిస్తానీ ముందు ఆయన తరపు న్యాయవాదులు గీతా లుథ్రా, ప్రమోదు దూబేలు ఉంచారు. తేజ్ పాల్ ముందస్తు పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టనున్నారు. -
కోర్టుకు వెళ్లనున్న తరుణ్ తేజ్‌పాల్
తనపై విచారణ జరుగుతున్న కేసు విచారణ అంశంపై తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఈ కేసు విచారణను ఏదైనా స్వతంత్ర వ్యవస్థకు బదిలీ చేయాలని ఆయన కోరనున్నారు. గోవా పోలీసుల విచారణపై తరుణ్ తేజ్‌పాల్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు గోవా పోలీసులు ఎవరూ తమను ఇంతవరకు సంప్రదించనే లేదని, ఇలాగైతే నిష్పక్షపాతంగా విచారణ సాగుతుందని ఎలా నమ్మగలమని తేజ్‌పాల్ తరఫు న్యాయవాది తెలిపారు. అందుకే తాము కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. -
ఏ క్షణంలోనైనా తేజ్పాల్ను అరెస్ట్ చేసే అవకాశం
న్యూఢిల్లీ: తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ కేసు విషయంలో గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు ఢిల్లీ చేరుకున్నారు. ముగ్గురు సభ్యుల పోలీసుల బృందం తెహల్కా ఆఫీసుకు చేరుకుంది. తరణ్ తేజ్ పాల్, తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలను పరిశీలిస్తున్నారు. ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్, ఐప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏ క్షణంలోలైనా తరణ్ తేజ్ పాల్‌ను గోవా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. గోవా ముఖ్యమంత్రి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఘటనపై విచారణ ప్రారంభించారు. లైంగికదాడి జరిపి పత్రిక ఎడిటర్‌గా ఆరునెలలు తప్పుకోవడమే శిక్షగా పరిగణించాలంటే కుదరదని ఇప్పటికే రాజకీయ పక్షాలు స్పష్టం చేశాయి. తేజ్పాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, లైంగిక వేధింపుల ఆరోపణలపై తరుణ్ తేజ్పాల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ క్షణమైనా అతనిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. -
తరుణ్ తేజ్పాల్పై బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ : తెహల్కా మేగజైన్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక దాడి జరిపిన అంశంపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం ఆదేశించింది. గోవా పోలీసులకు లేఖ రాసిన మహిళా కమిషన్... వెంటనే తేజ్పాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని కోరింది. కేసును సుమెటోగా స్వీకరించాలని సూచించింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ...ఈరోజు ఉదయం బాధితురాలిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. కాగా గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో పది రోజుల కిందట తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే. హోటల్లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్‌పాల్ బుధవారం షోమాకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. అటు గోవా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటనపై విచారణ ప్రారంభించి వివరాలు సేకరించారు. లైంగికదాడి జరిపి పత్రిక ఎడిటర్‌గా ఆరునెలలు తప్పుకోవడమే శిక్షగా పరిగణించాలంటే కుదరదని ఇప్పటికే రాజకీయ పక్షాలు స్పష్టం చేశాయి. తేజ్పాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ప్రాధమిక విచారణలో తేజ్‌పాల్ లీలలు వెలుగుచూస్తుండటంతో ఏ క్షణానైనా ఆయన్ను అరెస్ట్ చేస్తారని భావిస్తున్నారు.