ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం మాజీ మంత్రి చంద్రిక రాయ్ కూడా ఐశ్వర్య రాయ్ కూతురితో మే12న అంగరంగ వైభవంగా జరుగబోతోంది. పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్‌లో ఈ వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకకు కూడా లాలూ హాజరవుతారో లేదో ఇంకా క్లారిటీ లేదు. దాణా కుంభకోణ కేసులో ప్రస్తుతం రాంచి జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, కొడుకు నిశ్చితార్థానికి కూడా రాలేకపోయారు.
డయాబెటీస్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో రాంచి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇటీవలే చికిత్స తీసుకున్న లాలూ... తక్షణ చికిత్స కోసం తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసుకున్నారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణను జార్ఖాండ్ హైకోర్టు మే 11కు వాయిదా వేసింది. మే 11నే తేజ్ ప్రతాప్ పెళ్లికి సంబంధించిన వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకవేళ మే 11న కోర్టు బెయిల్ మంజూరు చేసిన రాంచి నుంచి పాట్నాకు ఒక్క రోజులో రావడం కొంచెం కష్టమే అంటున్నారు సన్నిహిత వర్గాలు.
లాలూ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నిన్ననే జార్ఖాండ్ హైకోర్టు విచారించాల్సి ఉంది. కానీ న్యాయవాదుల బంద్‌తో ఈ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేశారు. అయితే త్వరగా ఈ బెయిల్ పిటిషన్ విచారించాల్సిందిగా లాలూ వర్గాలు కోరుతున్నాయి. వచ్చే శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించాలని సీబీఐ వాదిస్తుందని, అయితే తమకు అనుకూలంగానే ఆదేశాలు వస్తాయని ఆర్‌జేడీ ఎంపీ, లాలూ సన్నిహితుడు జై ప్రకాశ్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న లాలూను రాజకీయ కుట్రతో సోమవారం రాంచి జైలుకు తరలించారని ఆరోపించారు. లాలూ అనారోగ్యంగా ఉండటంతో, తాము పెరోల్‌కు దరఖాస్తు చేయలేదని ఆర్‌జేడీ అధినేత న్యాయ వ్యవహారాలు చూసుకున్న వ్యక్తి చెప్పారు. తక్షణ చికిత్స కోసం బెయిల్‌ను కోరినట్టు తెలిపారు. సాధారణంగా పెరోల్‌ను పెళ్లి వేడుకలకు కానీ, అంత్యక్రియలకు కానీ దరఖాస్తు చేసుకుంటారు. 2014 తర్వాత లాలూ కుటుంబంలో జరుగబోయే అతిపెద్ద వేడుక తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లినే. ఆర్‌జేడీ చిన్న కూతురు రాజ్ లక్ష్మి పెళ్లి తర్వాత, ఇప్పుడు ఆ ఇంట్లో తేజ్ పెళ్లి జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment