
పట్నా: విడాకుల విషయంలో కుటుంబసభ్యులు తన నిర్ణయానికి మద్దతు పలికే వరకు ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ తేల్చి చెప్పారు. శుక్రవారం తేజ్ ప్రతాప్ స్థానిక న్యూస్ చానెల్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ..తాను ప్రస్తుతం హరిద్వార్‌లో ఉన్నానని తెలిపారు. ఐశ్వర్య, తనకు మధ్య విభేధాలకు దగ్గర బంధువులూ కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోయే ఆస్కారమే లేదని..ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు పెళ్లికి ముందే చెప్పానని స్పష్టం చేశారు. అయితే వారు తన మాట విన లేదని చెప్పారు. తన మాటను అంగీకరించనప్పుడు ఇంటికి తిరిగి ఎలా వెళ్తానని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment