
పాట్నా : ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి చాలా కాలానికి పెళ్లి భాజాలు మోగుతున్నాయి. నేడు ఆయన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఆర్‌జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను నేడు(శనివారం) తేజ్ ప్రతాప్ మనువాడబోతున్నారు. దాణా కుంభకోణ కేసుల్లో ఇన్ని రోజులు జైలులో ఉన్న లాలూ, కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్‌పై బయటికి విడుదలయ్యారు. నిశ్చితార్థపు వేడుకలను మిస్ అయిన లాలూకు, ఆ లోటు లేకుండా పెళ్లికి ముందు జరిగే అన్ని వేడుకలను ఆ ఫ్యామిలీ ఘనంగా చేస్తోంది.
తేజ్‌కు పసుపు రాసే వేడుక నుంచి అన్ని వేడుకలను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది. తేజ్‌కు జరిగే అన్ని వేడుకలను తల్లి రబ్రీదేవీ దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. లాలూ సైతం ఈ వేడుకలను ఎంతో సంతోషంతో ఆస్వాదిస్తున్నారు. ఎంతో కాలానికి లాలూ ఇంట్లో ఈ పెళ్లి వేడుక జరుగుతుండటంతో, ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వరకే చాలామంది అతిథులు లాలూ ఇంటికి వచ్చేశారు. లాలూ ఇంటికి, పెళ్లి కూతురు ఐశ్వర్య రాయ్ బంగ్లాకు కేవలం 200 మీటర్ల దూరం మాత్రమే ఉండటంతో, ఆ మార్గమంతా పూలతో, గ్రీన్ చిల్లీస్, లెమన్లతో సర్వాంగ సుందరంగా అలకరించారు. అన్న పెళ్లి వేడుకల్లో భాగంగా తేజస్వి స్టెపులతో అదరగొట్టారు. పలు బాలీవుడ్ సాంగ్‌లకు డ్యాన్స్‌లు వేస్తూ దుమ్మురేపారు.
యాదవ్‌ల మాన్షన్‌లో జరుగబోతున్న ఈ పెళ్లికి అతిరథ మహారథులు వేంచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలకు, ప్రముఖులకు, మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్‌లు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20వేల మంది వరకు ఈ పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారని బిహార్ ఆర్‌జేడీ అధ్యక్షుడు రామ్ చంద్ర పూర్వే చెప్పారు. కాగ, పాట్నాలోని వెటిరినరీ కాలేజీ కాంపౌండ్‌లో వీరి వివాహం జరుగబోతోంది.
లాలూ ఇంట..ఘనంగా పెళ్లి సంబరాలు






Comments
Please login to add a commentAdd a comment