కన్హయ్యకు హైకోర్టు భరోసా | KanhaiyaKumar's bail plea hearing deferred to 29th February | Sakshi
Sakshi News home page

కన్హయ్యకు హైకోర్టు భరోసా

Published Wed, Feb 24 2016 11:08 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

కన్హయ్యకు హైకోర్టు భరోసా

కన్హయ్యకు హైకోర్టు భరోసా

న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు 29కి వాయిదా వేసింది. కన్హయ్య భద్రతకు ఉన్నత న్యాయస్థానం హామీయిచ్చింది. తన భద్రతపై కన్హయ్య ఆందోళన వ్యక్తంగా చేయగా... 'నీకు ఎటువంటి ప్రమాదం లేదు. వాళ్లు నిన్నేమీ చేయకుండా పటిష్ట భద్రత కల్పిస్తాం. చిన్న దెబ్బ కూడా పడనీయమ'ని హైకోర్టు భరోసాయిచ్చింది.

పటియాలా కోర్టు ఆవరణ కోర్టు ఆవరణలో కన్హయ్య కుమార్ పై లాయర్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. అతడిపై మళ్లీ దాడులు చేస్తామని కూడా న్యాయవాదులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కన్హయ్యకు పటిష్ట భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement