KanhaiyaKumar
-
సవాల్ విసిరిన జాహ్నవికి బెదిరింపులు
న్యూఢిల్లీ: జేఎన్యూ విద్యార్థి కన్హయ్య కుమార్తో బహిరంగ చర్చకు సిద్ధం అంటూ సవాలు విసిరిన లుథియానాకు చెందిన పదిహేనేళ్ల బాలిక, విద్యార్థిని జాహ్నవి బెహల్కు బెదిరింపులు వస్తున్నట్లు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నట్లు ఆమె మీడియాకు వెల్లడించింది. దేశ ద్రోహం ఆరోపణల కింద కన్హయ్య కుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతను బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే, కన్హయ్య చేసింది దేశ వ్యతిరేక చర్య అని, ఆయనతో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమంటూ సవాలు విసిరింది. ఈ నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వస్తున్నట్లు తెలిసింది. -
ఆ బీజేపీ నేతపై ఆరేళ్ల బహిష్కరణ వేటు!
బద్వాన్ (ఉత్తరప్రదేశ్): జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ నాలుకను కోసేస్తే.. రూ. 5 లక్షలు ఇస్తానని ఆఫర్ చేసిన బీజేపీ యువమోర్చా నాయకుడిపై వేటు పడింది. పార్టీని ఇబ్బందుల్లో పడేసేలా కన్హయ్యకుమార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి యువమోర్చా నాయకుడు కుల్దీప్ వార్ష్నేపై యూపీ బద్వాన్ జిల్లా బీజేపీ యూనిట్ చర్యలు తీసుకుంది. అతడిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడైన కుల్దీప్ కన్హయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. దీంతో అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, అతని వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరిశ్ శాక్య తెలిపారు. -
కన్హయ్యకు హైకోర్టు భరోసా
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు 29కి వాయిదా వేసింది. కన్హయ్య భద్రతకు ఉన్నత న్యాయస్థానం హామీయిచ్చింది. తన భద్రతపై కన్హయ్య ఆందోళన వ్యక్తంగా చేయగా... 'నీకు ఎటువంటి ప్రమాదం లేదు. వాళ్లు నిన్నేమీ చేయకుండా పటిష్ట భద్రత కల్పిస్తాం. చిన్న దెబ్బ కూడా పడనీయమ'ని హైకోర్టు భరోసాయిచ్చింది. పటియాలా కోర్టు ఆవరణ కోర్టు ఆవరణలో కన్హయ్య కుమార్ పై లాయర్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. అతడిపై మళ్లీ దాడులు చేస్తామని కూడా న్యాయవాదులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కన్హయ్యకు పటిష్ట భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.