సవాల్ విసిరిన జాహ్నవికి బెదిరింపులు
న్యూఢిల్లీ: జేఎన్యూ విద్యార్థి కన్హయ్య కుమార్తో బహిరంగ చర్చకు సిద్ధం అంటూ సవాలు విసిరిన లుథియానాకు చెందిన పదిహేనేళ్ల బాలిక, విద్యార్థిని జాహ్నవి బెహల్కు బెదిరింపులు వస్తున్నట్లు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నట్లు ఆమె మీడియాకు వెల్లడించింది.
దేశ ద్రోహం ఆరోపణల కింద కన్హయ్య కుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతను బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే, కన్హయ్య చేసింది దేశ వ్యతిరేక చర్య అని, ఆయనతో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమంటూ సవాలు విసిరింది. ఈ నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వస్తున్నట్లు తెలిసింది.