Ludhiana
-
Rajni Bector: ఓ విజేత ప్రస్థానం
రజనీ బెక్టార్... సమైక్య భారతంలోని కరాచీ నగరంలో 1940లో పుట్టారామె. తండ్రి అకౌంటెంట్ జనరల్. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం లాహోర్‌లో పెరిగారు. ఆమెకు ఏడేళ్లు నిండేలోపే దేశవిభజన జరిగింది. రజని కుటుంబం భారతదేశానికి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీలోని మిరిండా హౌస్‌లో చదువుకుందామె. కాలేజ్ చదువు పూర్తయ్యేలోపే లూథియానాలోని ఒక వ్యాపార కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది. ఆమె జీవితంలో కీలకమైన ఘట్టాలు జరిగాయి. గానీ అప్పటికి ఆమె వయసు పదిహేడే. చదువు పూర్తికాకముందే పెళ్లికి తలవంచాల్సి రావడంతో కలిగిన ఆ అసంతృప్తే ఆమెను ఇప్పుడు విజేతగా నిలిపింది. లూథియానాలో అడుగుపెట్టినప్పటి నుంచి పద్మశ్రీ అవార్డు అందుకునే వరకు సాగిన ఆమె విజయయాత్రను సంతోషంగా గుర్తు చేసుకుంటున్నారామె.ఓ కొత్త ప్రపంచం ‘‘నేను లూథియానాకి వచ్చేనాటికి అది చాలా చిన్న పట్టణం. ఢిల్లీ నుంచి వచ్చిన నాకు లూథియానాను పట్టణం అనడానికి కూడా మనసొప్పేది కాదు. పట్టణం మొత్తానికి నాలుగు కార్లుండేవి అంతే. మా అత్తగారింటివాళ్లు ఛాందసులు. మా పుట్టింట్లో అమ్మ వైపు, నాన్న వైపు వాళ్లందరూ ఉన్నత విద్యావంతులు, విశాల దృక్పథం కలిగిన వాళ్లు. అత్తగారిల్లు– పుట్టిల్లు ఒకదానికొకటి పూర్తిగా భిన్నం. దాంతో నేను కొత్త మనుషుల మధ్యకు మాత్రమే కాదు, ఏకంగా కొత్త ప్రపంచంలోకి వచ్చి పడ్డాననే చెప్పాలి. వంటతో స్నేహంనాకు రకరకాలు వండడం, కొత్త వంటలను ప్రయత్నించడం హాబీ. ఆ హాబీయే నాకు పెద్ద ఆలంబన అయింది. స్నేహితులను, బంధువులను ఇంటికి ఆహ్వానించడం వారికి చేసి పెట్టడం, వారు ప్రశంసిస్తుంటే పొంగిపోవడమే జీవితంగా మారిపోయాను. హీరో మోటార్ కార్పొరేషన్‌కు చెందిన బ్రిజ్మోహన్ ముంజాల్, ఎవన్ సైకిల్స్ కంపెనీకి చెందిన పహ్వాస్లు ‘లూథియానా ప్రజలకు మంచి వంటలను రుచి చూపిస్తున్నావ్’ అన్నారు. అప్పటి ఎమ్ఎల్ఏ ఒకరు తన మనుమరాలి పెళ్లికి కేటరింగ్ చేసి పెట్టమని అడిగారు. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. స్థాణువులా ఉండిపోయాను. ఎలాగో ధైర్యం చేసి అంగీకారంగా తలూపాను. ఇద్దరు అసిస్టెంట్ల సాయంతో రెండు వేల మందికి వంటలు చేయించాను. ఆ తర్వాత స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏ వేడుక జరిగినా నాకు కబురు వచ్చేది. అయితే అవేవీ కమర్షియల్ సర్వీస్‌లు కాదు, స్నేహపూర్వక సర్వీస్లే. కొంతకాలానికి ఇంట్లోనే కుకరీ క్లాసులు మొదలు పెట్టాను. అప్పుడు మా అత్తగారు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇంట్లో మగవాళ్లు వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నారు, నువ్వు క్లాసులు చెప్పి సంపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది’ అని కోప్పడ్డారు. మా వారు నాకు మద్దతుగా నిలవడంతో ఆ పెనుతుఫాను సమసిపోయింది. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జైన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సలహాతో అందులో ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్, బేకరీ కోర్సులో చేరాను. పిల్లలు కొంచెం పెద్దయి బోర్డింగ్ స్కూల్‌కెళ్లిన తర్వాత నేను కాలేజ్‌లో చేరడంతో ఇంట్లో నాకు ఎటువంటి ఇబ్బందీ రాలేదు. యూనివర్సిటీలో అడుగు పెట్టగానే నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. పెళ్లి కారణంగా చదువాపేసినప్పటి నుంచి మనసులో దాగి ఉన్న దిగులు ఒక్కసారిగా ఎగిరిపోయింది. కోర్సు పూర్తి కాగానే మా వారిచ్చిన ఇరవై వేలతో 1978లో క్రిమికా ఐస్‌క్రీమ్ యూనిట్ ప్రారంభించాను. ‘క్రీమ్ కా’ అనే అర్థంలో పెట్టానా పేరు. లూథియానాలో క్వాలిటీ ఐస్‌క్రీమ్ స్టాల్ పక్కన నేను స్టాల్ తెరిచాను కాని క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ను కాదని మా యూనిట్‌కి ఎవరైనా వస్తారా అనే భయం చాలా రోజులు వెంటాడింది. అయితే నేను స్టాల్లో కూర్చోవడం లూథియానాలో మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఇంట్లో మగ్గిపోకుండా బయటకు వచ్చి ఏదైనా సాధించాలనే తపన ఉన్న వాళ్లందరూ తమ ఇంట్లో వాళ్లను ఒప్పించడానికి నన్ను మోడల్‌గా చూపించేవారు. నా ఐస్‌క్రీమ్‌కి కూడా ఆదరణ పెరగసాగింది.ఐస్‌క్రీమ్‌తో మొదలు బిస్కట్ వరకు క్వాలిటీని కాదని మా స్టాల్‌కి రావాలంటే వాళ్లకంటే ఎక్కువగా చేయాలి. ఐస్‌క్రీమ్‌తోపాటు బ్రెడ్, బిస్కట్ వంటి బేకరీ ఫుడ్ చేయడం మొదలు పెట్టాను. మా స్టాల్‌ను విస్తరించి జీటీ రోడ్లోకి మార్చాం. అంతా గాడిలో పడిందనుకునే సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ మొదలైంది. పంజాబ్ అట్టుడికిపోయింది. అనంతరం దేశం మొత్తాన్ని కుదిపేసిన దుర్ఘటన ఇందిరాగాంధీ హత్య జరిగింది. అప్పటికి వందేళ్ల నుంచి మా కుటుంబం చేస్తున్న ధాన్యం, ఎరువుల వ్యాపారం స్తంభించిపోయింది. రైతులతో సంబంధాలు తెగిపోయాయి. బెదిరింపులు ఎక్కువయ్యాయి. మా పెద్దబ్బాయి మీద అపహరణ ప్రయత్నం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అంటే.. 1990 నుంచి నా ఫుడ్ బిజినెస్సే ఇంట్లో అందరికీ ఫుడ్ పెట్టింది. ఇంట్లో అందరమూ క్రిమికా కోసమే పని చేయడం మొదలుపెట్టాం. పదహారు గంటల పని ఇప్పుడు క్రిమికాకు సంబంధించిన రోజువారీ బాధ్యతలేవీ లేవు. కానీ కీలకమైన సమయాల్లో రోజుకు పదహారు గంటలు పనిచేశాను. ఆహారం మీద నాకున్న ప్రత్యేకమైన అభిరుచే నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. విజేతగా నిలబెట్టింది. నేను నా టేస్ట్బడ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. క్వాలిటీ చెక్‌లో భాగంగా ప్రతిదీ రుచి చూడాలి. కేవలం రుచి మాత్రమే చూడాలి. కడుపు నిండా తినకూడదు. కడుపు నిండితే రుచిని గ్రహించే శక్తిని కోల్పోతాం. ఆ నియమం పాటిస్తేనే విజయం మనదవుతుంది. ఈ దేశంలో జీవించాలని వచ్చాం. ఇక్కడే సవాళ్లనెదుర్కొన్నాం. జీవితాన్ని వెతుక్కున్నాం. మూడేళ్ల కిందట పద్మశ్రీ పురస్కారం అందుకున్నాను. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది’’ అన్నారు రజనీ బెక్టార్. మెక్‌డీ బర్గర్లో మా బన్నుమెక్ డొనాల్డ్ ఫుడ్ చైన్ మనదేశంలో అడుగుపెట్టింది. వాళ్లకు అవసరమైన బన్ కోసం బేకరీలన్నింటినీ సందర్శించారు. మా బేకరీని ఎంపిక చేసుకున్నారు. అయితే వారికి కావల్సిన నియమాలు, పరిమితులకు లోబడి తయారు చేసి ఇవ్వడానికి ఒక ఏడాదిపాటు ఎక్సర్సైజ్ చేశాం. మధ్యప్రదేశ్‌లో పండే నాణ్యమైన గోధుమల పిండితో చేసిన బన్ వారి ఆమోదం పొందింది. మొదట్లో కొంత నష్టం వచ్చినప్పటికీ క్వాలిటీ కంట్రోల్ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఇక మాకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత మెక్‌డీకి అవసరమైన సాస్ ΄్లాంట్ కూడా పెట్టాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు విదేశాల్లో కూడా వేగంగా విస్తరించగలిగాం. టర్నోవర్ ఏడు వేల కోట్లకు చేరింది. మా ముగ్గురబ్బాయిలు బాధ్యతలు పంచుకుని వ్యాపారాన్ని కొనసాగించారు. ఇప్పుడు మూడవ తరం అడుగుపెట్టింది. మా మనుమడు ఢిల్లీ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. -
జైలులో ఖైదీ బర్త్‌డే పార్టీ.. విచారణకు ఆదేశాలు!
పంజాబ్‌లోని లూథియానా సెంట్రల్ జైలులో కలకలం చెలరేగింది. ఖైదీలంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఆన్లైన్లో కనిపించడంతో, దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం లూథియానాలోని సెంట్రల్ జైలులోని ఖైదీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ క్లిప్‌లో కొందరు ఖైదీలు ఒక చేతితో గ్లాసులు పట్టుకుని, మరో చేతితో పకోడీలు తింటూ కనిపిస్తున్నారు. ఆ ఖైదీలు ‘నేడు మణి భాయ్ పుట్టినరోజు’ అని పాడటం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. జైలులోని ఖైదీలు అరుణ్ కుమార్ అలియాస్ మణి రాణా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో 2019లో జరిగిన దోపిడీ కేసులో మణి అండర్ ట్రయల్‌గా ఉన్నాడు. వీడియో రికార్డు చేసి, అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఆ ఫోన్ పగిలిపోయిందని, పూర్తి డేటా వెలువడలేదని వారు పేర్కొన్నారు. ఈ ఉదంతంలో 10 మంది ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఈ ఖైదీలపై జైలు చట్టంలోని సెక్షన్ 52ఏ (జైలు నిబంధనల ఉల్లంఘన) కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లూథియానా ఈస్ట్) గుర్దేవ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఇన్స్పెక్టర్ జనరల్ (జైలు) ఆర్కే అరోరా, పాటియాలా రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సురీందర్ సింగ్ సైనీ ఈ ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. ఇటువంటి ఉదంతాలతో పంజాబ్ జైళ్లు వార్తల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో జైళ్ల భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఇటీవల వ్యాఖ్యానించారు. -
ఎంత ఘోరం.. గాజు డోర్ మీద పడటంతో మూడేళ్ల చిన్నారి మృతి
లుధియానా: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్లాస్ డోర్‌తో ఆడుకొంటున్న చిన్నారికి ఆ తలుపే మృత్యువుగా మారింది. భారీ గాజు తలుపు మీద పడటంతో మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. లుధియానా ఘుమర్ మండి మార్కెట్లో ఈ దుర్ఘటన జరిగింది. ఊహించని ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. వివరాలు.. మూడేళ్ల చిన్నారితో కలిసి ఓ కుటుంబం వస్త్ర దుకాణంలో కొనుగోలు కోసం వచ్చారు. తల్లిదండ్రులు వారి పనిలో నిమగ్నమై ఉండగా.. చిన్నారి దుకాణం ఎంట్రన్స్ వద్ద ఉన్న తలుపు హ్యాండిల్‌ను పట్టుకొని అటు ఇటూ ఊగుతూ ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా గ్లాస్ డోర్ మొత్తం ఊడిపోయి అమాంతం ఆమెపై పడిపోయింది. బోల్టులు వదులుగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు, షోరూమ్ సిబ్బంది హుటాహుటిన బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అణ్యం పుణ్యం తెలియని చిన్నారిని, డోర్ బలితీసుకున్న దృశ్యాలు నెటిజన్ల హృదయాలను పిండేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై తల్లిదండ్రుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. చదవండి: Video: హెల్మెట్‌లో దూరిన పాము.. జస్ట్ మిస్ PUNJAB | A three-year-old girl died in Punjab's Ludhiana after a giant glass door at a showroom fell on top of her. The incident took place at the Ghumar Mandi Market in the city, and the girl was rushed to a hospital soon after, where she was declared dead. The incident was… pic.twitter.com/WSiUtpmEyx— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) November 28, 2023 -
లుధియానాలో రూ.7 కోట్ల దోపిడీ
లుధియానా: పంజాబ్‌లోని లుధియానాలో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకులకు సేవలందించే సీఎంఎస్ సెక్యూరిటీస్ కార్యాలయం నుంచి సుమారు రూ.7 కోట్ల నగదును ఆగంతకులు ఎత్తుకుపోయారు. న్యూ రాజ్‌గురు నగర్లో ఉన్న సంస్థ ఆఫీసులోకి శనివారం అర్ధరాత్రి దాటాక సుమారు 10 మంది ముసుగులు ధరించిన దుండగులు ప్రవేశించారు. భద్రతా సిబ్బందిని తుపాకీతో బెదిరించి, గదిలో బంధించారు. వారి సెల్ఫోన్లను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడ దొరికిన సుమారు రూ.7 కోట్ల నగదుతో సీఎంఎస్‌కు చెందిన వ్యానులోనే ఉడాయించారు. సీసీ టీవీ కెమెరాలను కూడా వెంట తీసుకెళ్లారు. చోరీ సమాచారం ఉదయం 7 గంటల సమయంలో పోలీసులకు అందింది. లుధియానా పోలీస్ కమిషనర్ మన్దీప్ సింగ్ సిద్ధు ఘటనాస్థలిని పరిశీలించారు. తీసుకెళ్లిన వ్యానును ముల్లన్పూర్ దాఖా వద్ద దొంగలు వదిలేసి వెళ్లారని, అందులో రెండు ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. ‘సీఎంఎస్ సంస్థ నిర్లక్ష్యం వల్లే దోపిడీ జరిగింది. లాకర్లలో భద్రపరచాల్సి ఉండగా నగదును వ్యానుల్లోనూ, కార్యాలయం గదిలోనూ అజాగ్రత్తగా వదిలేసినట్లు తేలింది. ఘటన సమయంలో సంస్థ సిబ్బందిలో ఇద్దరి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి. ఎంత నగదు పోయిందనే విషయంలో బాధిత సంస్థ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఘటనలో లోపలి వ్యక్తుల ప్రమేయం పైనా దర్యాప్తు జరుపుతున్నాం’అని తెలిపారు. కేసును ఛేదించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సాయం కూడా తీసుకుంటున్నామన్నారు. -
హమ్మయ్యా.. అమ్మ కల నెరవేరింది
ఇంటిపట్టున ఉండి పిల్లాడి ఆలనాపాలన చూడాలనేది ఆమె కల. అయితే ఆమెది రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. పొద్దున పని కోసం బయటికి వెళితే ఏ రాత్రో ఇంటికి వచ్చేది. సెలవంటూ లేని పని. పరీక్ష ఫీజు కట్టలేని సందర్భంలో పిల్లాడిని పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడి పిల్లాడిని చదివించింది. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఆ అబ్బాయి అయూష్ గోయల్ ఎకౌంటెంట్ అయ్యాడు. ఆ తరువాత ట్విట్టర్ కాపీరైటర్‌గా మంచి ఆదాయన్ని అర్జిస్తున్నాడు. అమ్మను పని మానిపించాడు. తాము ఉండే ఇరుకు గది నుంచి 2–బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌కు మారాడు. ‘ఇప్పుడు మా అమ్మ ఫుల్–టైమ్ మదర్’ అని తల్లి ఫొటోలను జత చేస్తూ ఆయూష్ గోయల్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందిని కదిలించింది. -
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. పలువురు మృతి
ఛండీఘర్: పంజాబ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గియాస్పురా ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ కంపెనీలో గ్యాస్ లీకేజీ కారణంగా ఎనిమిది మంది మరణించగా.. మరికొందరు అస్వస్థతకు గురుయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించింది. వివరాల ప్రకారం.. లూథియానాలోని గియాస్పురా ప్రాంతంలో సువా రోడ్‌లోని గోయల్ మిల్క్ ప్లాంట్ కూలింగ్ సిస్టమ్ పరిశ్రమ నుంచి ఆదివారం ఉదయం గ్యాస్ లీక్ అయ్యింది. ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఎనిమిది మంది మృతిచెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గుర్యయారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందం చేరుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. గ్యాస్ కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న వారిని అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించినట్టు లూథియానా అసిస్టెంట్ డీసీపీ సమీర్ వర్మ తెలిపారు. VIDEO | At least eight people killed in gas leak at a factory in Punjab's Ludhiana. NDRF team carrying out rescue operation. More details are awaited. pic.twitter.com/OHw8vD7LBu — Press Trust of India (@PTI_News) April 30, 2023 ఇక, ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. మృతుల వివరాలు ఇవే.. సౌరవ్ (35), వర్ష (35), ఆర్యన్ (10), చూలు (16), అభయ్ (13), కల్పేష్ (40), తెలియని మహిళ (40), తెలియని మహిళ (25), తెలియని పురుషుడు (25), నీతూ దేవి మరియు నవనీత్ కుమార్. ఇది కూడా చదవండి: సూడాన్ టూ భారత్.. ఆనందంలో బాధితులు.. -
ఎన్.ఆర్.ఐ భర్తల మోసం చెల్లదు
పంజాబ్‌లో‘హనీమూన్బ్రైడ్స్’ అనే మాట వినిపిస్తూ ఉంటుంది.అంటే పెళ్లి చేసుకున్న ఎన్.ఆర్.ఐలుకాపురానికి తీసుకెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగాకాపురం చేసి ఆ తర్వాత పెళ్లికూతుళ్లను పుట్టింటికి తరిమేస్తారు.సత్వీందర్ కౌర్ కూడా అలాంటి బాధితురాలే.కాని ఆమె ఊరికే ఉండలేదు.లూధియానాలో ఒక సంస్థ స్థాపించిఎన్ఆర్ఐ బాధితమహిళలకు న్యాయం జరిగేలా చూసింది.న్యాయం జరగాలంటే ఏం చేయాలో కూడా చెబుతోంది. పంజాబ్, హరియాణాలలో ఎన్.ఆర్.ఐ భర్తలు మోసం చేసిన భార్యల సంఖ్య ప్రస్తుతం ఎంత ఉంటుందో ఊహించండి. 32,000. పెళ్లి చేసుకుని ఉద్యోగాలు విదేశాలలో తెచ్చుకుని మాయమైన ఎన్.ఆర్.ఐలు కొందరైతే విదేశాల్లో ఉంటూ ఇక్కడకు వచ్చి పెళ్లి చేసుకొని కొన్నాళ్లు కాపురం చేసి ఆ తర్వాత ఉడాయించిన వాళ్లు కొందరు. వీరి గురించి ఆరా తీస్తూ, ఎదురు చూస్తూ, వారిని శిక్షించాలని ప్రయత్నిస్తూ పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే ఈ వివాహితులను అక్కడ ‘హనీమూన్ బ్రైడ్స్’ అంటూ ఉంటారు. విషాదం ఏమంటే వీరి సగటు వయసు 22 నుంచి 65 వరకూ ఉండటం. ముప్పై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని విదేశాలకు పా రిపోయిన భర్తల కోసం ఎదురు చూస్తున్న మహిళలు ఇంకా అక్కడ ఉన్నారు. వారందరికీ ఒక ఓదార్పు లూధియానాలో ‘అబ్ నహీ’ సంస్థను నడుపుతున్న 41 ఏళ్ల సత్వీందర్ సింగ్. స్వయంగా బాధితురాలు లూధియానాకు చెందిన సత్వీందర్ సింగ్ టీచర్‌గా పని చేసేది. టీచర్ సంబంధమే వస్తే 2009లో వివాహం చేసుకుంది. ఒక సంవత్సరం తర్వాత భర్త విదేశాలలో ఉద్యోగం వచ్చిందని జార్జియా వెళ్లాడు. అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్లాడు. సత్వీందర్ అత్తారింటిలోనే ఉండిపోయింది. ఐదేళ్ల తర్వాత 2015లో తిరిగి వచ్చిన భర్త ఆమెను అత్తారింటి నుంచి ఒక అద్దె ఇంటికి మార్చి ఒక నెల ఉండి మళ్లీ ఉక్రెయిన్‌కు వెళ్లిపోయాడు. త్వరలో వచ్చి తీసుకెళతాను అనే దొంగ హామీ మీద. కాని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతోటే ‘ఇక నీకూ నాకూ సంబంధం లేదు’ అని ఫోన్ చేసి చెప్పేశాడు. సత్వీందర్ వెంటనే అత్తామామల దగ్గరకు వెళితే వాళ్లు ముఖాన తలుపులు వేసేశారు. ఒక సంవత్సరం పా టు చేష్టలుడిగి ఉండిపోయిన సత్వీందర్ ఆ నిద్ర నుంచి మేల్కొని న్యాయం కోసం గట్టిగా పట్టుబట్టింది. భర్త మీద, అత్త మామల మీద సెక్షన్ 406, 498ల కింద కేసు పెట్టింది. కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేస్తే నెలకు 10 వేలు మంజూరయ్యాయి. 2018లో భర్త పా స్పోర్ట్ సీజ్ అయ్యేలా చూసింది. ఇవన్నీ చిన్న విజయాలు కావు. తనలాంటి వారి కోసం ఆ సమయంలో కోర్టు దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర తన లాంటి వివాహితలు మరికొంత మంది కనిపించేవారు సత్వీందర్‌కు. ‘ఇంతమంది ఉన్నారా... వీరందరి కోసం ఏదైనా చేయాలి’ అని ‘అబ్ నహీ’ సంస్థ స్ధాపించింది. చిన్న చిన్న సమావేశాలు పెట్టి ఇలాంటి బాధిత మహిళలను సమీకరించడం మొదలెట్టింది. ఈమె చేస్తున్న పని ఆ నోటా ఈ నోటా తెలిసి బాధితులు రావడం మొదలెట్టారు. అయితే ఇది అంత సులభం కాదు. పా రిపోయిన కుర్రాళ్ల కుటుంబాలు ఈమె చేసే నిరసన కార్యక్రమాలకు, పెడుతున్న కేసులకు ఆగ్రహించేవి. శాపనార్థాలు పెట్టేవి. తన్నబోయేవి. అయినా సత్వీందర్ జంకకుండా తన పోరాటాన్ని కొనసాగించింది. ఎన్.ఆర్.ఐ సెల్స్ ద్వారా మహిళా కమిషన్ ద్వారా బాధితులకు మద్దతు దొరికేలా చేసేది. అంతేకాదు, జాతీయ గురుద్వారా కమిటీ ద్వారా విదేశాలలో ఉన్న గురుద్వారాలకు ఇలా పా రిపోయిన వరుల వివరాలు తెలుపుతూ తాకీదులు అందేలా చేసింది. అంటే అక్కడ ఉన్న వారి గురించి కనీసం అక్కడ ఉన్న పంజాబీలకు తెలిసేలా చేయగలిగింది. కొందరు భర్తలు ఏ దేశాల్లో అయితే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడి లీగల్ సెల్స్‌కు అదే పనిగా ఈ మెయిల్స్ పంపి ఫిర్యాదు చేస్తుంది. విదేశాంగ శాఖకు పదే పదే వినతి చేయడం వల్ల ఆ శాఖ కూడా రంగంలో దిగి ఇలాంటి కేసులు నమోదైన భర్తల పా స్పోర్ట్ల వివరాలను సేకరించి అవసరమైతే సీజ్ చేసే చర్యలు చేస్తోంది. ఇప్పటికి 700 మంది సత్వీందర్ సింగ్ ఇప్పటికి 700 మంది వివాహితలకు ఏదో ఒక మేర న్యాయం అందేలా చేసింది. అలాగే భర్తలను విడిచిపెట్టి ఉడాయించిన భార్యల బాధితులైన 40 మంది భర్తలకు కూడా న్యాయం అందడానికి పోరాడుతూ ఉంది. ‘భార్యను విడిచి వెళ్లిపోయిన భర్తల కేసుల్లో ఇరుపక్షాలను కూచోబెట్టి సమస్య కనుక్కుంటే చాలా కేసులు విడిపోయే దాకా వెళ్లకుండా ఆపొచ్చు. కొన్నింటిలో మాత్రం మోసగాళ్లు ఉంటారు. వారికి శిక్ష పడేలా చేయాలి.’ అంటుంది సత్వీందర్. సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా బాధితులను గుర్తించి వారికి సహాయం అందేలా చేయడానికి ప్రయత్నిస్తోందామె. ‘మన పోలీసులు దేశంలో లేకుండా పోయిన వారంటే ఏమీ చేయలేము అన్నట్టు చూస్తుంటారు. కాని అలా విదేశాలకు పారిపోయిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది అనే విధంగా చర్యలు ఉంటే ఎన్.ఆర్.ఐల ఆగడాలు ఆగుతాయి’ అంటుంది సత్వీందర్. పంజాబ్, హరియాణాలలో అయితే సత్వీందర్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇలాంటి బాధితులు ఎందరు ఉన్నారో తెలియాల్సి ఉంది. వారి కోసం సత్వీందర్లాంటి వాళ్ల అవసరం తప్పక ఉంటుందని వేరే చెప్పాలా? -
అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని లూథియానా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సోమవారం పేర్కొంది. ఇద్దరు అఫ్గాన్లు సహా 16 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 60 కిలోల డ్రగ్స్, 31 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ‘‘ఈ ముఠాకు గతేడాది ఢిల్లీలోని షహీన్‌బాగ్, యూపీలోని ముజఫర్నగర్ల్లో పట్టుబడిన డ్రగ్స్‌తో సంబంధముంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉంది’’ అని ఎన్సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ చెప్పారు. -
నిద్రలో ఉండగానే కమ్ముకున్న మంటలు.. ఏడుగురు సజీవదహనం
చండీగఢ్: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. లుథియానాలోని తాజ్పూర్ రోడ్డు సమీపంలోని ఓ గుడిసెలో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులంతా గుడిసెలో నిద్ర పోతున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకుంటున్నాయి. మంటల్లో దంపతులతోపాటు అయిదుగురు చిన్నారులు (నలుగురు అమ్మాయిలు, రెండేళ్ల బాలుడు) సజీవ దహనమైయ్యారు. అదే కుటుంబానికి చెందిన రాజేష్(17) అనే యువకుడు వేరే చోట నిద్రిస్తుండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను సురేష్ షని(55) రానా దేవి(50), రాఖీ కుమారి(15), మనీషా కుమారి(10), చందా కుమారి(8), గీతా కుమారి(6), సన్నీ(2)గా గుర్తించారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా ఉపాధి కోసం లుథియానాకు వలస వచ్చిన కార్మికులని లుధియానా ఏసీపీ సురీందర్ సింగ్ తెలిపారు. టిబ్బా రోడ్‌లోని మునిసిపల్ చెత్త డంప్ యార్డ్‌కు సమీపంలో ఉన్న తమ గుడిసెలో నిద్రిస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం -
షైనింగ్ సైనీ: విధిని ఎదిరించింది అందాల పోటీలో నిలిచింది
ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి మిస్ వరల్డ్ కిరీటం ధరించాలన్న ఆశ. కానీ గుండె సరిగా కొట్టుకోదు, ఓ యాక్సిడెంట్లో ముఖం మొత్తం కాలిపోయింది. అయినా ఏమాత్రం దిగులు పడలేదు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ మిస్ వరల్డ్ రన్నరప్‌గా నిలిచింది శ్రీసైనీ. అమెరికాలోని ప్యూర్టోరికోలో జరిగిన మిస్‌వరల్డ్–2021 కాంపిటీషన్లో పోలాండ్‌కు చెందిన కరోలినా బిల్వస్కా మిస్‌వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. భారత్ తరపున పోటీపడిన మానస వారణాసి టాప్–6లోకి కూడా చేరుకోలేకపోయింది. కానీ భారత సంతతికి చెందిన 26 ఏళ్ల శ్రీసైనీ అమెరికా తరపున మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడి, మొదటి రన్నరప్‌గా నిలవడం విశేషం. పంజాబ్‌కు చెందిన సంజయ్ సైనీ, ఏక్తా సైనీ దంపతులకు 1996 జనవరి 6న లుథియాణలో శ్రీసైనీ పుట్టింది. ఈమెకు షహరోజ్ సైనీ అనే తమ్ముడు ఉన్నాడు. సంజయ్‌కు వాషింగ్టన్లో గ్యాస్ స్టేషన్ ఉండడంతో ఆమె కుటుంబం మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఐదేళ్ల వయసులో శ్రీసైనీ భారత్ వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే ఇండో అమెరికన్‌గా పెరిగింది. పన్నెండేళ్ల వరకు శ్రీ గుండె స్పందనలు సరిగా లేవు. నిమిషానికి డెభ్బై సార్లు కొట్టుకోవాల్సిన గుండె కేవలం ఇరవై సార్లు మాత్రమే కొట్టుకునేది. శ్రీని పరీక్షించిన డాక్టర్లు ఆమె గుండెలో పూడిక ఏర్పడిందని నిర్ధారించారు. ఇందుకోసం శాశ్వత పేస్‌మేకర్‌ను అమర్చి ఆమె గుండెను సాధారణంగా పనిచేసేలా చేశారు. మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్‌ను ఎంతో ఇష్టంగా చేసే శ్రీకి పేస్‌మేకర్ అమర్చిన తరువాత డ్యాన్స్ చేయకూడదని డాక్టర్లు సూచించారు. అయినా వెనక్కు తగ్గలేదు. తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రారంభంలో చిన్నగా డ్యాన్స్ ప్రారంభించి, తరువాత రోజుకి ఆరుగంటలపాటు డ్యాన్స్ చేసేది. ఇలా ఏళ్లపాటు డాన్స్ సాధన చేస్తూ తనలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది.బ్యాలే, జాజ్ డ్యాన్స్‌లు నేర్చుకుంది.అంతేగాక కాలేజీ హిప్అప్ టీమ్‌తో కలిసి డ్యాన్స్ చేసేది. ముఖం కాలిపోయినా.. చిన్నప్పటి నుంచి మిస్‌వరల్డ్ అవ్వాలనుకునే శ్రీసైనీ, ఆరేళ్లున్నప్పుడే మిస్ వరల్డ్‌గా తయారై బాగా మురిసిపోయేది. అప్పట్లో ఆమెకు మిస్‌వరల్డ్ అంటే సూపర్ హీరోలా కనిపించేది. దీంతో స్కూలు చదువు పూర్తయ్యాక.. వాషింగ్టన్ యూనివర్సిటీలో జర్నలిజం డిగ్రీ చేసింది. తరువాత మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. హార్వర్డ్ యూనివర్సిటీ, యాలే స్కూల్ ఆఫ్ డ్రామా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మోడలింగ్ కోర్సులు చేసింది. యూనివర్సిటీలో చదువుతోన్న రోజుల్లో అప్పుడు శ్రీకి పంతొమ్మిదేళ్లు ఉంటాయి. ఒకరోజు అనుకోకుండా కారు ప్రమాదం జరిగి ముఖం బాగా కాలిపోయింది. తన ముఖం తనే గుర్తుపట్టలేనంతగా మారింది. అయినా ఏమాత్రం దిగులుపడలేదు. ఎలాగైనా అందాల పోటీల్లో పాల్గొనాలన్న సంకల్పంతో ఏడాదిలోపే కోలుకుని, తన ముఖాన్ని పూర్వంలా అందంగా మార్చుకుంది. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తొలిసారి 2017లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకుంది. మరుసటి ఏడాది మిస్‌వరల్డ్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తరువాత 2019లో మిస్ వరల్డ్ అమెరికా కాంపిటీషన్లో పాల్గొన్నప్పటికీ తన హృదయ సంబంధ సమస్యతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ తరువాత 2020లో మిస్ వరల్డ్ అమెరికా కాంపిటీషన్లో పాల్గొని టాప్ ఇన్ఫ్లుయెన్సర్ నేషనల్ విన్నర్, ఏ పర్పస్ నేషనల్ అంబాసిడర్, పీపుల్స్ ఛాయిస్ నేషనల్ విన్నర్, టాలెంట్ ఆడియెన్స్ చాయిస్ నేషనల్ అవార్డు, బ్యూటీ విత్ పర్పస్ విన్నర్ అవార్డులను గెలుచుకుంది. 2021లో మిస్‌వరల్డ్ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ఈ కిరీటం గెలుచుకున్న తొలి భారతసంతతి వ్యక్తిగా పేరు పొందింది. ఇటీవల నిర్వహించిన 2021 మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొని టాప్–6 కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. కానీ వెంట్రుకవాసిలో కిరీటం తప్పిపోయి మొదటి రన్నరప్‌గా నిలిచింది. మోటివేషనల్ స్పీకర్‌గానూ.. పన్నెండేళ్ల వయసు నుంచి మానసిక భావోద్వేగాలపై ఆర్టికల్స్ రాసే అలవాటు ఉంది శ్రీకి. తను రాసిన చాలా ఆర్టికల్స్ అమెరికన్ మీడియాలో పబ్లిష్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆమె చేస్తోన్న సామాజిక సేవాకార్యక్రమాలను ప్రముఖులు ప్రశంసించేవారు. ఎనిమిది దేశాల్లోని వందకుపైగా నగరాల్లో తను ఎదుర్కొన్న అనేక మానసిక సంఘర్షణలను వివరిస్తూ ఎంతోమంది యువతీ యువకుల్లో స్ఫూర్తిని నింపుతోంది. అందాల రాణిగానేగాక మెంటల్, ఎమోషనల్ హెల్త్ యాక్టివిస్ట్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది శ్రీసైనీ. -
బాంబు పెట్టింది మాజీ హెడ్ కానిస్టేబుల్
చండీగఢ్: పంజాబ్‌లోని లూథియానా జిల్లా, సెషన్స్ కోర్టులో గురువారం బాంబు పేలుడు ఘటనలో మరణించిన వ్యక్తిని మాజీ హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. బాంబును అమర్చే క్రమంలో అతను మరణించాడని, అందుకు ఆధారాలు లభించాయని పోలీసులు చెప్పారు. మాదకద్రవ్యాల ముఠాతో సంబంధాలున్నాయని అతడిని 2019లో పోలీస్ విధుల నుంచి తప్పించారు. రెండేళ్ల కారాగార శిక్ష అనుభవించాక సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడని తెలుస్తోంది. గగన్దీప్ది పంజాబ్‌లోని ఖన్నా జిల్లా. బాంబు తయారీ పరిజ్ఞానాన్ని ఆన్లైన్లో నేర్చుకుని ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అనుమానిస్తున్నారు. -
ఆ ఆహ్వానం నచ్చింది... అందుకే ఈ రాత్రికి అక్కడికి వెళ్తా!!
ఛండీఘర్: సమాజంలో చాలా అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్లను సామాన్యులు తమ ఇంట్లో జరిగే ఫంక్షన్లకి లేదా పెళ్లిళ్లకి ఆహ్వానిస్తే వాళ్లురారని అనుకుంటాం. పైగా వాళ్లు చాలా బిజీగా ఉంటారని, అందువల్ల చాలా మటుకు వాళ్లురారు అనే భావిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా పంజాబ్ డ్రైవర్ ఆహ్వానాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మన్నించారు. అసలు విషయంలోకెళ్లితే...ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాబోయే శాసనసభ ఎన్నికల కోసం పంజాబ్ పర్యటన సందర్భంగా లూథియానాలో ఆటో రిక్షా డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అయితే ఆ పర్యటనలో ఒక ఆటో డ్రైవర్ తన ఇంటికి భోజనానికి రండి అంటూ కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తాడు. (చదవండి: హ్యాట్సాఫ్ సార్!... హీరోలా రక్షించారు!) దీంతో కేజ్రివాల్ అతని ఆహ్వానానికి ఎంతగానో మురిసిపోయి తప్పకుండా వస్తానని హామీ కూడా ఇచ్చారు. అంతేకాదు కేజ్రీవాల్‌తో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ భగవంత్ మాన్, ఎమ్మెల్యే హర్పాల్ సింగ్ చీమా కూడా ఆటో రిక్షా డ్రైవర్ ఇంటికి వెళ్లనున్నారు. ఈ మేరకు ఈ విషయంతో పాటు "ఈ రాత్రి డిన్నర్‌కి తప్పకుండా వెళతాం" అనే క్యాప్షన్‌ని జోడించి మరి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: జనరల్నాలెడ్జ్ ఉంటే చాలు... ఈ ఆటోలో ఫ్రీగా వెళ్లిపోగలం!!) -
200 కిలోల బెల్జియం చాక్లెట్ తో గణపతి
-
పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది.. అయినా కుంగిపోలేదు
లుథియానా జిల్లా టూసా గ్రామానికి చెందిన సత్విందర్ కౌర్‌కు... అందరి అమ్మాయిల్లానే వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. టీచర్‌గా పనిచేస్తోన్న మంచి వరుడు దొరకడంతో 2009 ఫిబ్రవరి 23న పెద్దల సమక్షంలో కోటి ఆశలతో పెళ్లి చేసుకుంది సత్విందర్. ఆ ఆశలన్నీ మూణ్ణాళ్ల ముచ్చటేనని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వివాహం అయిన కొద్దిరోజులకే భర్త విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2010లో జార్జియా వెళ్లి అక్కడ నుంచి ఉక్రెయిన్‌కు మారాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో విదేశీ విద్యార్థుల కో ఆర్డినేటర్‌గా పనిచేసేవాడు. అతను మాత్రమే వెళ్లి తనను ఎందుకు తీసుకెళ్లలేదో సత్విందర్‌కు అర్థం కాలేదు. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. 2015 జూలై 20 న ఇండియాకు భర్త తిరిగి వస్తున్నారని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసింది సత్విందర్. సంవత్సరాల తరువాత విదేశాల నుంచి వచ్చిన భర్త కుటుంబంతో అయిష్టంగా వ్యవహరిస్తూ.. మనం వేరే ఇంటికి అద్దెకు వెళ్దాం అని చెప్పి కిరాయికి ఇల్లు తీసుకుని అక్కడకు మకాం మార్చాడు. నెల తరువాత ‘‘నేను ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్తున్నాను. మూడు నెలల తరువాత నిన్ను తీసుకెళ్తాను’’ అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. కానీ చెప్పినట్లుగా సత్విందర్ను తీసుకెళ్లలేదు. తన భర్త తనని మోసం చేసాడని తెలుసుకున్న సత్విందర్ 2016లో ఎన్ఆర్ఐ సెల్లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆమె భర్త విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. దీంతో కొన్ని వాయిదాల తరువాత పదివేల రూపాయల జీవన భృతితో కోర్టు విడాకులు ఇస్తూ తీర్పు ఇచ్చింది. విడాకులు మంజూరు అయ్యేంత వరకూ సత్విందర్.. తనలాగా భర్తచేతిలో మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది అమ్మాయిల సాధక బాధలను దగ్గర నుంచి గమనించేది. చిన్న చిన్న అమ్మాయిల జీవితాలు రోడ్డున పడడం వారు న్యాయం కోసం సంవత్సరాలపాటు కోర్టుల చుట్టూ తిరగడం, సత్విందర్‌కు కూడా అటువంటి ప్రత్యక్ష అనుభవం ఉండడంతో తనలాంటి వారికి సాయపడాలనుకున్నారు. అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ.. భర్తల చేతిలో మోసపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలను ఆదుకోవాలని నిర్ణయించుకుని 2016లో ‘అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ పేరున స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మోసపోయిన అమ్మాయిలు, మహిళలకు సాయం చేయడం ప్రారంభించారు. కోర్టులు, పోలీసు స్టేషన్స్ దగ్గర తనకు ఎదురైన అమ్మాయిలను, ఇంకా ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా మరికొంతమంది బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకుని ఎన్ఆర్ఐ సెల్స్, జాతీయ మహిళ కమిషన్ నిర్వహించే సెమినార్స్‌కు వారిని ఆహ్వానించి అక్కడ వాళ్లకు న్యాయం ఎలా అందుతుందో వివరించేవారు. ప్రభుత్వ పెద్దలను సంప్రదించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా గురుద్వారాలను సంప్రదించి బాధిత మహిళ వివరాలు తెలుసుకుని వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా 700 మంది మహిళలకు సాయపడ్డారు. ఎన్జీవోని సంప్రదించిన 40 మంది పురుషులకు సత్విందర్ సాయపడడం విశేషం. ‘‘నా భర్త నన్ను మోసం చేసినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ కొన్నిరోజులకు నన్ను నేను తమాయించుకుని ధైర్యంగా పోరాడాలనుకున్నాను. ఈ క్రమంలోనే నాలా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిలో ధైర్యం నింపుతూ.. సాయం చేయాలనుకున్నాను. ఎన్జీవో స్థాపించి నేను చేయగలిగిన సాయం చేస్తున్నాను. సాయం కోసం నా దగ్గరకు వచ్చేవారిలో 65 ఏళ్ల లోపు మహిళలు 22 మంది ఉన్నారు. వీళ్లంతా దశాబ్దాలుగా తమ భర్తల కోసం ఎదురు చూస్తున్నారు. పంజాబ్, హర్యాణ రాష్ట్రాల్లోనే దాదాపు 32 వేల మంది బాధిత మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మందికి సరైన న్యాయం అందడం లేదు. కొన్ని సందర్భాల్లో మోసం చేసిన భర్తల పాస్‌పోర్టులు రద్దుచేయించడం, ప్రపంచ నలుమూలల్లో ఏదేశం లో ఉన్నా ఇండియాకు రప్పించి న్యాయం చేస్తున్నాం. ఇప్పటిదాక 20 జంటలను కౌన్సెలింగ్ ద్వారా కలిపాము’’ అని సత్విందర్ వివరించారు. -
నీ కూతురిని ఇంటికి తీసుకెళ్లు.. లేదంటే చంపేస్తాం!
వరకట్న వేధింపులకు మరో మహిళ బలైపోయింది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలిని దారుణంగా హతమార్చారు. డబ్బుపై మొహంతో కట్టుకున్న భర్త, అత్తమామలలే కాలయములై వివాహితను కొట్టి, సజీవ దహనం చేశారు. ఈ అమానుష ఘటన పంజాబ్ రాష్ట్రంలో మంగళరం వెలుగు చూసింది. లుధియానా జిల్లాలోని సమ్రాలా ప్రాంతంలో సురిందర్ పాల్ కుటుంబం నివాసముంటోంది. పాల్ తన కుమార్తె మణ్‌దీప్ కౌర్‌ను కాకోవాల్ మజ్రా గ్రామానికి చెందిన బలరాం సింగ్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరికి ఏడాది వయసున్న కూతురు ఉంది. పెళ్లైనప్పటి నుంచే మహిళపై అత్తాంటివారి వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల అదనపు కట్నం కావాలని మహిళపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో మంగళవారం వివాహిత ఒంటినిండా కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే తన కూతురిని అత్తింటివారే చంపారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. కూతురిని పుట్టింటికి తీసుకెళ్లకుంటే ఆమెను చంపేస్తామని అల్లుడు ముందుగానే హెచ్చరించాడని తెలిపాడు. ఒకవేళ తన కూతురిని ముందుగానే ఇంటికి తీసుకువచ్చినట్లయితే, ఆమె ఈ రోజు సజీవంగా ఉండేదని సురిందర్పాల్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘అల్లుడి తండ్రి కాల్ చేసి నా కూతురికి కాలిన గాయాలయ్యాని, ఆమెను సివిల్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. నేను వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. అక్కడి నుంచి నా కూతురిని రాజీంద్ర హస్మిటల్కు రిఫర్ చేశారు. అక్కడికి వెళ్తుండగానే మధ్యలోనే నా కూతురు చనిపోయింది. నేను చివరికి నా కూతురు శవాన్ని చూడాల్సి వచ్చింది. ఆమె తలపై గాయాలు చూసి షాకయ్యాను. శరీరమంతా కాలిన గాయాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన అప్పటినుంచి అత్తారింటివారు తన కూతురిని కట్నం వేధింపులకు గురిచేసేవారని బాధితురాలి తండ్రి వాపోయాడు. ఆమె భర్త బలరాం, వాళ్ల తల్లిదండ్రులు కూతురిపై దాడికి పాల్పడుతున్నారు. మేము ఈ విషయాన్ని గ్రామ పంచాయతీతో లేవనెత్తాము. గ్రామంలోని పంచాయతీ పెద్దలు సమస్యను పరిష్కరించారు. అయినా నా కుమార్తెకు అత్తమామల వేధింపులు తగ్గేలేదని మహిళ తండ్రి ఆరోపించారు. కాగా మన్దీప్ భర్త బలరాం సింగ్, బావ చంద్ సింగ్, అత్త రాజ్వంత్ కౌర్, బావ రాజ్వీందర్ కౌర్, బావమరిది కుల్బీర్ సింగ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. -
చేతిలో పైసా లేదు..భర్త కోసం 1400 కి.మీ. ప్రయాణం
లూథియానా:భార్య మీద అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది ఓ భార్య .దీనిలో విశేషం ఏముంది అనుకుంటున్నారా? అక్కడే అసలు విషయం దాగి ఉంది, దాదాపు 1400 కిలోమీటర్లు దూరంలో ఉన్న భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది.19 ఏళ్లు ఆమె చేతిలో చిల్లి గవ్వ లేకుండా పాట్నా నుంచి పంజాబ్ లోని లూథియానా వరకూ ప్రయాణించింది. ఆమెకు తెలిసిందల్లా ఒకటే..తన భర్త లూథియానాలోని సలేమ్ తబ్రీ ప్రాంతంలోని ఓ చోట పనిచేస్తున్నాడు. దీంతో తన ఇద్దరు పిల్లలను పాట్నాలో తెలిసినవారి వద్ద వదిలేసి లూథియానా వచ్చి భర్తను వెతికే పనిలో పడింది. భర్త కోసం పిచ్చిదానిలా వెతకటం ప్రారంభించింది. అలా వెతుకుతుండగా లూథియానాలో బుద్ దేవ్ అనే వ్యక్తి ఆమెకు కలిశాడు.ఈ ప్రాంతంలో కొత్తగా కనిపిస్తున్నావు,ఇలా ఎవరి కోసం వెతుతున్నావ్ అనిఅడిగాడు. దానికి ఆమె చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.తిండి పెట్టి ఆశ్రయం ఇచ్చాడు.తరువాత ఆమెను లూథియానా నగర అదనపు డీసీపీ ప్రగ్యా జైన్ వద్దకు తీసుకెళ్లాడు. కానీ ఆమె భర్త గురించి పూర్తి వివరాలు చెప్పలేకపోయింది.తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లైందని..నా భర్త పేరు జాన్. ఇద్దరు పిల్లలు పుట్టాక చిన్న గొడవ వల్ల తనను పిల్లలను వదిలి ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాడని తెలిపింది. తరువాత ఫోన్ చేసి నేను లూథియానాలో ఉన్నానని చెప్పాడని..కానీ రమ్మంటే నేను రాను అని చెప్పాడని వాపోయింది. డీసీపీ ప్రగ్యా జైన్ ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పలు రకాలుగా యత్నించినా ఆచూకీ లభించలేదు. అలా అతని ఫోన్ నంబర్ ఆధారంగా చివరకు ఆమె భర్త జాన్‌ను కనిపెట్టారు. మొదట ఈమె ఎవరో తెలీదని జాన్ అబద్దాలు ఆడాడు.కానీ పోలీసులు భయపెట్టటంతో ఆమె నా భార్య అని ఒప్పుకున్నాడు. పోలీసుల కౌన్సిలింగ్ తో ఆమెతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నాడు. త్వరలోనే బీహార్ నుంచి పిల్లలను తీసుకొచ్చి లూథియానాలోనే ఉంటామని చెప్పాడు. చదవండి:పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్ -
చావు అంచున డీఎస్పీ.. చచ్చాక పరిహారం ఎందుకంటూ వీడియో
పంజాబ్‌లో సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేసింది. నా ట్రీట్మెంట్ కోసం సాయం చేయండి. బతకడానికి నాకొక అవకాశం ఇవ్వండి. అంటూ ఓ డీఎస్పీ లెవెల్ అధికారి మాట్లాడిన వీడియో ఒకటి వాట్సాప్, ఫేస్బుక్లో వైరల్ అయ్యింది. చావు అంచున ఉన్న తనను కాపాడాలంటూ వేడుకున్న ఆయన వీడియో పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని పార్టీలు, ప్రజలు విమర్శించడంతో ఆ దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. ఛంఢీఘడ్: డిప్యూటీ జైలు సూపరిడెంట్‌గా పని చేస్తున్న 49 ఏళ్ల హర్జిందర్ సింగ్‌కు ఈ మధ్యే కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రకరకాల సమస్యలతో ఆయన లూథియానాలో ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే ఊపిరితిత్తులు చెడిపోవడంతో ఆయన పరిస్థితి రోజురోజూకీ దిగజారింది. లంగ్స్ మారిస్తే ఆయన బతుకుతాడని డాక్టర్లు ఆయన కుటుంబ సభ్యులతో చెప్పారు. ఇక ఆయనకు సాయం అందించే విషయంలో పంజాబ్ ప్రభుత్వం మూడువారాల పాటు అలసత్వం ప్రదర్శించింది. పరిస్థితి విషమిస్తుండడంతో.. చచ్చాక తన కుటుంబానికి నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే బదులు.. బతికేందుకు అవకాశం ఉన్న తనకు సాయం చేయాలని, తన కుటుంబాన్ని తానే పోషించుకుంటానని ఆయన దీనంగా వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్స్‌గ్రేషియాపై విమర్శలు డిప్యూటీ జైలు సూపరిడెంట్‌గా పని చేస్తున్న హర్జిందర్ సింగ్.. భార్య వదిలేసి పోవడంతో ముగ్గురు పిల్లలను ఆయనే పోషిస్తున్నారు. ఏప్రిల్ నెలలో కొవిడ్ బారినపడి కోలుకున్నారు. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం 80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అంత ఖర్చు ఇవ్వడానికి వీల్లేదు. చనిపోయాక యాభై లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కుటుంబానికి మాత్రమే అందిస్తారు. దీంతో సాయం గురించి ఉన్నతాధికారులు మూడు వారాలపాటు హర్జిందర్ సోదరుడిని తిప్పించుకున్నారు. ఈ తరుణంలో చనిపోయాక ఇచ్చే నష్టపరిహారం తనకొద్దని, బతికేందుకు తనకొక అవకాశం ఇవ్వమని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆయన వీడియో ద్వారా వేడుకున్నాడు. Grateful to Punjab CM @capt_amarinder for supporting the treatment of DSP Harjinder Singh, after his recovery from #COVID...1/2 — DGP Punjab Police (@DGPPunjabPolice) June 2, 2021 మూడువారాల తర్వాత.. ఇక ఈ వీడియోపై రాజకీయ దుమారం రేగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక సిన్సియర్ ఉన్నతాధికారి రక్షించుకోలేని చేతకాని ముఖ్యమంత్రి అంటూ.. అమరిందర్ సింగ్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. కొందరు నెటిజన్స్ ఈ విమర్శలకు మద్ధతు తెలపడంతో ప్రభుత్వం దిగొచ్చింది. డీఎస్పీ ట్రీట్మెంట్కు అవసరమయ్యే సాయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని డీజీపీ దిన్కర్ గుప్తా ట్వీట్ చేశారు. హర్జిందర్ సింగ్‌కు డిపార్ట్మెంట్ తరపున లూథియానాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించబోతున్నట్లు, ట్రాన్స్ఫ్లాంట్ కోసం హైదరాబాద్ గానీ, చెన్నై గానీ తరలిస్తామని సిటీ కమిషనర్ రాకేష్ అగర్వాల్ ప్రకటించారు. చదవండి: సీఎంని కదిలించిన పిల్లాడు -
పంజాబ్‌లో పోలీసులపై కాల్పులు..ఇద్దరు ఏఎస్ఐల మృతి
లూథియానా: గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి పోలీసులపై కాల్పులకు పాల్పడిన ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్లు మరణించారు. ఈ దుర్ఘటన జాగ్రాన్ టౌన్లో జరిగిందని డీఎస్పీ జీఎస్ బియాన్స్ శనివారం తెలిపారు. కాల్పులు జరిగాక ఏఎస్ఐ భగవాన్ అక్కడికక్కడే మరణించారని, మరో ఏఎస్ఐ దల్విందర్‌సింగ్ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని వెల్లడించారు. వీరిద్దరూ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (సీఐఏ)లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాల్పుల ఘటన గురించి తెలిసిన వెంటనే ఐజీపీ నౌ నిహాల్ సింగ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. డ్రగ్స్ స్మగ్లర్లు, గ్యాంగ్స్టర్స్, గతంలో వీరిద్దరు ఇంటరాగేట్ చేసిన వారిలో ఎవరైనా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో విచారణ జరుగుతోంది. (చదవండి: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు) -
దారుణం: ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు లక్షా 20 వేలు
ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. కరోనాను ఆసరాగా చేసుకుని బాధితుల నుంచి భారీగా దండుకుంటున్నారు. మానవత్వం మరచి కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కరోనా రోగిని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్ భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. 350 కిలో మీటర్ల దూరానికి రూ.లక్షా 20 వేలు వసూల్ చేశాడు. దానికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకు రా ఈ దోపిడీ..? మానవత్వం కొంచెమైనా ఉండాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరియాణాలోని గురుగ్రామ్ నుంచి కరోనా బాధితుడిని ఎక్కించుకుని పంజాబ్‌లోని లూదియానా వరకు (350 కిలోమీటర్లు) వెళ్లాలి. అంబులెన్స్‌ను మాట్లాడగా డ్రైవర్ రూ.లక్షా 40 వేలు ఇవ్వమని కోరాడు. ఎంత బతిమిలాడిన తగ్గలేదు. చివరకు ఆక్సిజన్ మా వద్ద ఉంది.. అని చెప్పడంతో రూ.20 వేలు తగ్గించుకున్నాడు. గురుగ్రామ్ నుంచి లూదియానాకు సోమవారం కరోనా బాధితుడిని అంబులెన్స్ డ్రైవర్ చేర్చాడు. అందుకు ఆయన తీసుకున్న మొత్తం రూ.లక్ష 20 వేలు. దానికి సంబంధించిన బిల్లు కుటుంబసభ్యులకు ఇచ్చాడు. ఐపీఎస్ అధికారి పంకజ్ నైన్ ఈ బిల్లును ట్వీట్ చేశారు. సిగ్గుండాలి అని పేర్కొఒంటూ ఆ బిల్లు ఫొటోను పంచుకున్నారు. ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అధిక మొత్తం ఛార్జీ చేసిన అంబులెన్స్ డ్రైవర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వాలు అంబులెన్స్ సేవలకు కూడా నిర్ధిష్ట ధరలు ప్రకటించింది. కానీ అంతకుమించి వసూల్ చేస్తుండడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. చదవండి: కర్ఫ్యూ ఫెయిల్: మే 24వరకు సంపూర్ణ లాక్డౌన్ చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ Gurgaon to Ludhiana Ambulance fare 1.20 lakhs !! Have some shame guys ! Fear God 🙏🙏 pic.twitter.com/6bzadERbHp — Pankaj Nain IPS (@ipspankajnain) May 6, 2021 -
పంజాబ్‌లో కిసాన్ మహా పంచాయత్
జాగ్రాన్(లూధియానా): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల్లోనే జరిగిన కిసాన్ మహా పంచాయత్‌కు తాజాగా పంజాబ్ వేదికగా మారింది. లూధియానా జిల్లాలోని జాగ్రాన్ మార్కెట్లో గురువారం నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌లో 40 రైతు సంఘాలు బలప్రదర్శన నిర్వహించాయి. 30 వేల మందికిపైగా రైతులు పాల్గొన్నారు. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై తరలివచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 40 రైతు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగాన్ని సర్వనాశనం చేస్తాయని భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్‌సింగ్ రాజేవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కిసాన్ మహా పంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. రైతన్నల పోరాటం గురించి ఆందోళన జీవులంటూ తేలికగా మాట్లాడిన ప్రధాని∙మోదీ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో మాట మార్చారని అన్నారు. రైతులది పవిత్ర పోరాటం అంటున్నారని గుర్తుచేశారు. ‘మోదీ పెద్ద అబద్ధాలకోరు, నాటకాల రాయుడు’ అని రాజేవాల్ మండిపడ్డారు. వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని వెల్లడించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై తప్పుడు చట్టాలు తెచ్చిందని దుయ్యబట్టారు. ఇది ప్రజా పోరాటం కొత్త సాగు చట్టాలతో కార్పొరేట్ వ్యాపారులకు లాభం తప్ప రైతులకు ఒరిగేదేమీ ఉండదని రాజేవాల్ విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, విజయం తప్పకుండా వరిస్తుందని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం మేరకు తదుపరి పోరాట కార్యాచరణను రాజేవాల్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి నివాళిగా ఈ నెల 14న దేశవ్యాప్తంగా కొవ్వొత్తులు/కాగడాల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సర్ చోటూరామ్‌ను స్మరించుకుంటూ ఈ నెల 16న కిసాన్/మజ్దూర్ దినం పాటిస్తామని వెల్లడించారు. 18న దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్ రోకో చేపడతామని వివరించారు. సుదీర్ఘపోరాటానికి సిద్ధం కావాలని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) అధ్యక్షుడు జోగీందర్ సింగ్ రైతులకు సూచించారు. కాంట్రాక్టు వ్యవసాయం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వంటివి తామెప్పుడూ ప్రభుత్వాన్ని కోరలేదని పేర్కొన్నారు. వాటిని తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. అవసరమైతే సవరణలు: మంత్రి రాజ్‌నాథ్ నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. ఈ చట్టాల్లో అవసరమైతే ప్రభుత్వం సవరణలు చేస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో పలు చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాక రాజ్‌నాథ్ మాట్లాడారు. ప్రభుత్వ చర్యలతో సాధారణ రైతన్నల్లో కొత్త విశ్వాసం, ఉత్సాహం వచ్చిందని చెప్పారు. -
వారి మధ్య పెళ్లి ఆమోదయోగ్యం కాదు:హైకోర్టు
చండీగఢ్: హిందూ వివాహ చట్టం ప్రకారం తోబుట్టుల మధ్య వివాహం చట్ట విరుద్దమని పంజాబ్ హర్యానా హైకోర్టు కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్లో అమ్మాయి మేజర్ అని తెలిపినప్పటికీ ఇది న్యాయ సమ్మతం కాదని కేసును విచారించిన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన పిటిషనర్ తనపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్), 366 ఏ(మైనర్ అమ్మాయిని అనుమతి లేకుండా తీసుకెళ్లడం) వంటి సెక్షన్లు ఖన్నాసిటిలోని రెండవ ఠాణాలో నమోదయ్యాయని, వాటిపై ముందస్తు బెయిల్ మంజూర్ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. జీవిత రక్షణ,స్వేచ్ఛ కోసం పిటిషనర్‌తో కలిసి బాలిక క్రిమినల్ రిట్ పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు అతని తరుపు న్యాయవాది అరవింద్ సింగ్ సాంగ్వాన్ కోర్టుకు నివేదించాడు. ఈ ముందస్తు బెయిల్‌ను ప్రభుత్వ తరుపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. వారిద్దరూ సొంత అన్నదమ్ముల బిడ్డలు కావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. పిటిషన్ పరీశీలించిన న్యాయమూర్తి వారిద్దరూ కలిసి ఉంటున్నారని అంటున్నారు, కానీ నివేదికనూ చూస్తే తనకు కేవలం 17 సంవత్సరాల మాత్రమే ఉన్నాయని అన్నారు. బాలిక పుట్టిన తేదీ 2003 ఆగస్ట్ అని,సెప్టెంబర్ 3,2020 నాటికీ 17 సంవత్సరాల 14 రోజులని న్యాయమూర్తి అన్నారు. కేవలం మగ సోదరులని మాత్రమే వాళ్ల తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారని, మైనర్ని వేధిస్తున్నారని బాలిక ఇచ్చిన నివేదికను సైతం పిటిషనర్ దీనికి జతపర్చాడు. అందుకోసం తనతో కలిసి జీవించాలని బాలిక నిర్ణయించుకుందని వాదించాడు. తన సొంత తల్లిదండ్రుల నుంచి ప్రాణానికి హాని ఉందన్నారు. తనను వేధించకుండా చూడాలని వేసిన పిటిషన్‌ని, కోర్టు సెప్టెంబర్ 7 న కొట్టివేసింది. ప్రభుత్వం ఇద్దరికి రక్షణ కల్పించాలని ఆదేశిందని న్యాయమూర్తి అన్నారు. ఏది ఏమైన చట్ట ఉల్లంఘన కోసం చట్టపరమైన చర్యల నుంచి రక్షించడానికి ఈ ఉత్తర్వూ ఇవ్వరాదని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్లో తాను బాలికకూ సోదరుడినవుతాననే విషయాన్ని వెల్లడించలేదని ,అందువల్ల 18 సంవత్సరాలు నిండిన తరువాత కూడా వారు చేసుకున్న పెళ్లి చట్ట సమ్మతం కాదని అంది." పిటిషనర్ హిందూ వివాహ చట్టం క్రింద నిషేధించబడిన 'సపిందా'లో (ఇద్దరు వ్యక్తుల మధ్య ఉమ్మడి పూర్వీకులు ఉంటే వారి మధ్య వివాహాన్ని నిషేధిస్తుంది) వస్తారని, ఒకరితో ఒకరు వివాహం చేసుకోలేరని అని ప్రభుత్వ న్యాయవాది" వాదనలతో కోర్టు ఏకీభవించింది., ఇది అనైతికం, సమాజంలో ఆమోద యోగ్యం కాదని పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. -
'తినడానికి తిండి లేదు.. నడిచేందుకు ఓపిక లేదు'
లుధియానా : కరోనా సమయంలో వలస కార్మికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో తమ గమ్యస్థానం చేరేందుకు కాలినడక కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కాలినడకలో వలస కార్మికుల కష్టాలు అన్నీఇన్ని కావు. ఆకలితో అలమటిస్తూ.. వేల కిలోమీటర్లు నడక సాగిస్తున్నారు. కొంతమంది వలస కార్మికుల బాధలు అయితే గుండెల్ని పిండేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలికి చెందిన ఓ కుటుంబం పంజాబ్‌లోని లుధియానాకు వెళ్లింది. లాక్డౌన్ కారణంగా వారికి ఉపాధి లేకపోవడంతో సొంతూరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ కుటుంబంలోని ఒక అబ్బాయికి మెడ భాగంలో గాయం కావడం.. నడవలేకపోవడంతో మంచంపై బాలుడిని పడుకోబెట్టి.. సుమారు 1300 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. (కరోనా : చైనాను దాటిన భారత్) లుధియానా నుంచి సింగ్రౌలికి వెళ్లేందుకు వారికి 15 రోజుల సమయం పట్టింది. చివరకు యూపీలోని కాన్పూర్ చెక్‌పోస్టు వద్ద ఆ కుటుంబం కష్టాలను చూసిన పోలీసులు చలించిపోయారు. వారికి ఓ వాహనం ఏర్పాటు చేసి సొంతూరికి పంపించారు. ఈ సందర్భంగా కుటుంబంలోని ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ' పిల్లలతో పాటు 17 మంది లుధియానా నుంచి సింగ్రౌలికి కాలినడకన బయల్దేరాం. అందులో ఒక అబ్బాయికి మెడ గాయంతో పాటు నడవలేడు. దీంతో ఒక స్ర్టెచ్చర్ తయారు చేసి దాదాపు పదిహేను రోజుల పాటు నడిచాం. తినడానికి తిండి లేక నడిచేందుకు ఓపిక లేక మా పరిస్థితి దయనీయంగా తయారైంది. చివరకు కాన్పూర్‌లో పోలీసులు తమను ఆదుకున్నారు. పదిహేను రోజుల సమయంలో ఏ ఒక్క రోజు కూడా కడుపు నిండా తిండి తినలేదు.. ఆకలితో అలమటించాం' అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు. -
దండేసి, దండం పెట్టిన పోలీసులు
చండీగఢ్ : ప్రపంచ దేశాలను తన గుప్పట్లో వశపరుచుకున్న కరోనాను కట్టటి చేసేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను కొందరు ఉల్లంఘిస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఏవేవో కారణాలు చెబతూ రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. అలా వచ్చిన వారిని పోలీసులు ఎన్ని విధాలుగా అడ్డుకున్న కొత్త కారణాలను వెతుక్కుంటున్నారే తప్ప బయటకు వచ్చే పనులను మాత్రం మానుకోవడం లేదు. ఈ క్రమంలో పంజాబ్‌లో నిబంధనలను అతిక్రమించిన వారికి వినూత్న రీతిలో గుణపాఠం చెప్పారు. రాష్ట్రంలోని లుథియానాలో శనివారం పోలీసులు అనవసరంగా రోడ్ల పైకి వచ్చిన వారికి మెడలో దండలు వేసి, దండాలు పెట్టారు. దయచేసి ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ వారికి విజ్ఞప్తి చేశారు. (ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ ) హెల్త్ బులిటెన్ ప్రకారం.. లూథియానా జిల్లాలో 76 కరోనా కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో 480 కరోనా పాజిటివ్ నమోదవ్వగా 19 మంది మరణించారు. ఇక, దేశంలో మొత్తం నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 37.336కు చేరింది. 1,218 మరణాలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల్లోనే 71 మంది మృత్యువాత పడగా.. 2,293 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా దేశంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడగిస్తున్నట్లు శుక్రవారం కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మే 17 వరకు లాక్డౌన్ అమలుకానుంది. అయితే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా విభజించి మే నాలుగు నుంచి కొన్ని సడలింపులు ఇవ్వనుంది. (లాక్డౌన్ పొడగింపు: యోగీ కీలక నిర్ణయం) -
కలకలం: కరోనాతో ఏసీపీ మృతి
చంఢీగడ్ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దానికి తోడు మృతుల సంఖ్య కూడా రెట్టింపు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా వైరస్ సోకి పంజాబ్‌లోని లూథియానా ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్)అనిల్ కోహ్లి మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇటీవల ఆయనకు వైరస్ లక్షణాలు కనిపించడంతో వైద్యుల పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే లూథియానాలోని ఎస్పీఎస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఈ మేరకు ఏసీపీ మృతిని స్థానిక అధికారులు ధృవీకరించారు. కాగా పంజాబ్ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 202కి చేరగా ఇప్పటి వరకు 14 మంది మరణించారు. Sad News ACP Anil Kohli passed away. Died of #COVIDー19 . Was admitted in SPS Hospital Ludhiana — DPRO LUDHIANA (@LudhianaDpro) April 18, 2020 -
నాదెళ్ల 'థ్యాంక్స్'
టెక్ దిగ్గజం, ‘మైక్రోసాఫ్ట్’ అధినేత సత్య నాదెళ్ల ఎవరికైనా థ్యాంక్స్ చెప్పారంటే.. వాళ్లెంత దిగ్గజాలు అయి ఉండాలి! అయితే ఆయన థ్యాంక్స్ చెప్పింది.. లూథియానాలో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక నమ్యా జోషికి! నాదెళ్ల, నమ్య మంగళవారం ఢిల్లీలోని ఒక వేదికపై కలుసుకున్నారు. ‘యంగ్ ఇన్నొవేటర్స్’ సదస్సు అది. మొత్తం 250 మంది చిన్నారి టెకీలు, విద్యావేత్తలు హాజరయ్యారు. చిన్నారులలో ఎవరి ప్రతిభ వారికి ఉన్నప్పటికీ నమ్యకు ఉన్న ప్రత్యేకతే నాదెళ్ల చేత ఆమెకు థ్యాంక్స్ చెప్పించింది. అర్థంచేసుకోడానికి కష్టమైన స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్), సైబర్ సెక్యూరిటీ పాఠాలను నమ్య మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్‌ను ఉపయోగించి విద్యార్థులకు, టీచర్లకు కూడా పాఠాలను బోధిస్తోంది. అది ఆశ్చర్యపరచింది నాదెళ్లను. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా టెక్ పాఠాల కోసం ‘స్కైప్’ నమ్యను సంప్రదిస్తున్నారని తెలిసి ముగ్ధులైపోయిన మైక్రోసాఫ్ట్ సీఈవో ఆమెను అభినందించారు. అందుకోసం నమ్య మైన్‌క్రాఫ్ట్‌ని వాడుతోందని తెలిసి థ్యాంక్స్ చెప్పారు. మైన్‌క్రాఫ్ట్.. మైక్రోసాఫ్ట్ వాళ్లదే. అదొక శాండ్బాక్స్ వీడియో గేమ్.