
సంగ్రూర్(పంజాబ్) : లూథియానాకు చెందిన ఓ బాలికపై అత్యాచారం చేయించిన ఘటనలో ముగ్గురు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన 13 ఏళ్ల బాలిక తన తల్లి స్నేహితురాలు సోనా వద్ద ఉండేందుకు సంగ్రూర్‌కు వచ్చారు. సోనా మరో ఇద్దరు మహిళతో కలిసి ఆ బాలికను ఉపయోగించుకుని డబ్బు సంపాదించాలని భావించారు. అందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు తిప్పుతూ.. బాలికపై పలువురి చేత అత్యాచారం చేయించారు. నాలుగు రోజుల పాటు బాలికను ఇలాగే హింసించారు. కాగా, బాలిక జూన్ 24న లూథియానాలోని తన తల్లికి ఫోన్ చేసి చెప్పటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో బాధితురాలి తల్లి వెంటనే సంగ్రూర్‌కు వెళ్లి సోనాను కలిశారు. కానీ ఈ విషయం ఎవరికి చెప్పదంటూ వారిని సోనా బెదిరించారు. దీంతో బాధితురాలి తల్లి సంగ్రూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సోనాతో పాటు ఆమె స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణం చేపట్టారు. అనంతరం బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘మేము ఏడాది క్రితం సంగ్రూర్‌లోనే ఉండేవాళ్లం. అప్పుడే నాకు సోనాతో పరిచయం ఏర్పడింది. వేసవి సెలవులు కావడంతో నా కూతురు 15 రోజుల క్రితం సోనా వాళ్ల ఇంటికి వెళ్లింది. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. పైగా సోనా నాపై బెదిరింపులకు దిగింది. నేను మాత్రం నా కూతురికి న్యాయం జరిగే వరకు పోరాడుతాన’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment