ఆన్ మిలటరీ డ్యూటీ ట్రక్ ... 200 కోట్ల హెరాయిన్
ఛండీగడ్: పంజాబ్లో మరోసారి భారీ ఎత్తున హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లూథియానా జిల్లాలోని ములాన్పూర్ వద్ద పోలీసులు శనివారం వాహన తనిఖీలు నిర్వహంచారు. ఈ సందర్భంగా 'ఆన్ మిలటరీ డ్యూటీ' అనే బోర్డు ఉన్న ట్రక్లో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 40 కేజీల హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హెరాయిన్ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు అప్పగించారు. ఆ హెరాయిన్ను అధికారులు సీజ్ చేశారు.
పోలీసులు, భద్రత సిబ్బంది దృష్టి మళ్లించేందుకు మిలటరీ బోర్డు వాహనానికి తగిలించారని అధికారులు వెల్లడించారు. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 200 కోట్లు వరకు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ నెల 15న హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఆ పక్క రాష్ట్రమైన పంజాబ్లో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు.