సాధారణంగా నెలకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మహా అయితే వేల రూపాయలోనే ఉంటుంది, కదా. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ వ్యక్తికి కరెంట్ బిల్ ఏకంగా రూ.200 కోట్ల కంటే ఎక్కువే వచ్చింది. కరెంట్ బిల్ ఏమిటి? రూ.200 కోట్లు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చదివేయాల్సిందే..
హిమాచల్‌ప్రదేశ్‌లోని బెహెర్విన్ జట్టన్ గ్రామానికి చెందిన 'లలిత్ ధీమాన్' అనే వ్యాపారవేత్త.. తనకు వచ్చిన ఎలక్ట్రిక్ బిల్ చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన కరెంట్ బిల్ ఏకంగా రూ. 2,10,42,08,405. ఇప్పటి వరకు ఇంత కరెంట్ బిల్ బహుశా ఏ ఒక్కరికీ వచ్చి ఉండదు.
రూ.2,10,42,08,405 కరెంట్ బిల్ రావడానికి ముందు నెలలో 'లలిత్ ధీమాన్'కు వచ్చిన బిల్లు రూ.2,500 మాత్రమే. భారీ మొత్తంతో కరెంట్ బిల్ రావడంతో అతడు ఫిర్యాదు చేసేందుకు విద్యుత్ బోర్డును సందర్శించాడు. సాంకేతిక లోపం వల్లనే ఈ బిల్లు వచ్చిందని.. విద్యుత్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత అతనికి సరైన కరెంట్ బిల్ ఇచ్చారు. నిజానికి అతనికి వచ్చిన కరెంట్ బిల్ రూ.4047 మాత్రమే.
ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!
సాంకేతిక లోపాల వల్ల భారీ బిల్లులు రావడం ఇదే మొదటి సారి కాదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి 1,540 రూపాయల కరెంట్ బిల్ వస్తే.. విద్యుత్ శాఖ నుంచి 86 లక్షల రూపాయలకు పైగా బిల్లును స్వీకరించాడు. ఆ తరువాత జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించి ఆయనకు సరైన బిల్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment