చేతిలో డబ్బు ఉంటే.. కొందరు గోల్డ్ కొనుగోలు చేస్తారు. మరి కొందరు రియల్ ఎస్టేట్ మీద పెడతారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఇలా ఎన్నెన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నా.. చాలా మంది చూపు మాత్రం 'ఫిక్స్‌డ్ డిపాజిట్' (FD) వైపు వెళ్తుంది.
రిస్క్ లేకుండా వడ్డీ పొందాలంటే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉత్తమమైన మార్గం. వడ్డీ అనేది బ్యాంకులు రెండు విధాలుగా అందిస్తాయి. ఇందులో ఒకటి రెగ్యులర్, మరొకటి సీనియర్ సిటిజన్. రెగ్యులర్ కింద అందరికీ ఒకేరకమైన వడ్డీ లభిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్లకు కొంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. చాలా బ్యాంకులు కొంతవరకు దాదాపు ఒకే విధమైన వడ్డీ రేట్లను అందిస్తున్నప్పటికీ.. 40 - 50 బేసిస్ పాయింట్ల స్వల్ప వ్యత్యాసం కూడా మీ డబ్బును పెంచడంలో సహాయపడుతుంది. మీ డబ్బును పెంచుకోవడానికి లేదా ఎక్కువ వడ్డీ పొందటానికి ఎన్ని సంవత్సలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామన్నది సహాయపడుతుంది.
ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లు అందించే వడ్డీ రేట్లు
➤హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.5 శాతం
➤ఐసీఐసీఐ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.5 శాతం
➤యాక్సిస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం
➤యెస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7.25 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 8 శాతం
➤స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.5 శాతం
➤పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7 శాతం (ఈ వడ్డీ రేట్లు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి).
➤బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.8 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.4 శాతం (ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 14, 2024 నుంచి అమల్లో ఉన్నాయి).
ఇదీ చదవండి: పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్
బ్యాంకులలో ఫిక్స్‌డ్ చేయాలనుకునే ఎవరైనా.. ముందుగా మీరు ఏ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో, అక్కడ (బ్యాంకులో) వడ్డీ ఎంత ఇస్తున్నారనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ బ్యాంక్ ఇచ్చే వడ్డీని.. ఇతర బ్యాంకులతో కంపార్ చేసుకోవాలి. ఆ తరువాత మీకు నచ్చిన బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసివచ్చు.
Comments
Please login to add a commentAdd a comment