Rs 200 crore
-
నెల కరెంట్ బిల్ రూ.200 కోట్లు: దెబ్బకు ఫ్యూజులు అవుట్
సాధారణంగా నెలకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మహా అయితే వేల రూపాయలోనే ఉంటుంది, కదా. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ వ్యక్తికి కరెంట్ బిల్ ఏకంగా రూ.200 కోట్ల కంటే ఎక్కువే వచ్చింది. కరెంట్ బిల్ ఏమిటి? రూ.200 కోట్లు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చదివేయాల్సిందే..హిమాచల్‌ప్రదేశ్‌లోని బెహెర్విన్ జట్టన్ గ్రామానికి చెందిన 'లలిత్ ధీమాన్' అనే వ్యాపారవేత్త.. తనకు వచ్చిన ఎలక్ట్రిక్ బిల్ చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన కరెంట్ బిల్ ఏకంగా రూ. 2,10,42,08,405. ఇప్పటి వరకు ఇంత కరెంట్ బిల్ బహుశా ఏ ఒక్కరికీ వచ్చి ఉండదు.రూ.2,10,42,08,405 కరెంట్ బిల్ రావడానికి ముందు నెలలో 'లలిత్ ధీమాన్'కు వచ్చిన బిల్లు రూ.2,500 మాత్రమే. భారీ మొత్తంతో కరెంట్ బిల్ రావడంతో అతడు ఫిర్యాదు చేసేందుకు విద్యుత్ బోర్డును సందర్శించాడు. సాంకేతిక లోపం వల్లనే ఈ బిల్లు వచ్చిందని.. విద్యుత్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత అతనికి సరైన కరెంట్ బిల్ ఇచ్చారు. నిజానికి అతనికి వచ్చిన కరెంట్ బిల్ రూ.4047 మాత్రమే.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!సాంకేతిక లోపాల వల్ల భారీ బిల్లులు రావడం ఇదే మొదటి సారి కాదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి 1,540 రూపాయల కరెంట్ బిల్ వస్తే.. విద్యుత్ శాఖ నుంచి 86 లక్షల రూపాయలకు పైగా బిల్లును స్వీకరించాడు. ఆ తరువాత జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించి ఆయనకు సరైన బిల్ ఇచ్చారు. -
ముఖేష్ అంబానీకి మరో మెయిల్! అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ..
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ'కి (Mukesh Ambani) గత 48 గంటల్లో రెండు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్ 27న పంపిన మెయిల్లో రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నిందితుడు.. అదే మెయిల్ నుంచి రూ. 200 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపుతామని బెదిరిస్తూ మెయిల్ చేసాడు. ఇండియాలో మాకు అత్యుత్తమ షూటర్లు ఉన్నారని, అడిగిన డబ్బు ఇవ్వకుంటే చంపుతామని మెయిల్లో నిందితుడు ప్రస్తావించారు. దీనిపైన యాంటిలియా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ దేవేంద్ర మున్షీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు యూరప్‌కు చెందిన ఈ-మెయిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉపయోగించాడని, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ద్వారా అతడిని గుర్తించాలని లేఖ రాశామని పోలీసు అధికారి తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 387, 506 (2) కింది గుర్తు తెలియని వ్యక్తి మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్.. ముఖేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబర్ 5న రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన ఒక హాస్పిటల్‌కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆసుపత్రిలో బాంబ్ పేల్చనున్నట్లు పేర్కొన్నాడు. ఆ తరువాత రోజే ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ వారసులు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులైన సందర్భంగా ఈ బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం. -
యదేచ్ఛగా కోళ్ల కత్తుల కోలాటం
-
200 కోట్లు కట్టు లేదా జైలుకు వెళ్లు!
న్యూఢిల్లీ: సహారా అధినేత సుబ్రతా రాయ్‌కి ఇచ్చిన పెరోల్ జూలై 11వ తేదీ వరకు సుప్రీంకోర్టు బుధవారం పొడిగించింది. జూలై 11లోగా రూ. 200 కోట్లు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబికి కట్టాలని, లేకపోతే మళ్లీ తీహార్ జైలుకు వెళ్లకతప్పదని ఆయనను కోర్టు స్పష్టం చేసింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి)కు రూ. 200 కోట్ల డిపాజిట్ చెల్లించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు అండర్ టేకింగ్ ఇవ్వాలని సుబ్రతా రాయ్, సహారా గ్రూప్ డైరెక్టర్ అశోక్ రాయ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిని చెల్లించడంలో వారు విఫలమైతే.. ఆ ఇద్దరు తిరిగి తీహార్ జైలు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2014 మార్చి 4 నుంచి సుబ్రతా రాయ్ తీహార్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన తల్లి చనిపోవడంతో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి సుబ్రతారాయ్‌కి సుప్రీంకోర్టు నాలుగువారాల పెరోల్ మంజూరు చేసింది. దీంతో మే 6న సుబ్రతా రాయ్, అశోక్ రాయ్ జైలు నుంచి విడుదలయ్యారు. 2008-2009 మధ్యకాలంలో సహారా గ్రూప్‌నకు చెందిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌజింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు చిన్న పెట్టుబడిదారుల నుంచి డిపాజిట్లు సేకరించాయి. ఈ డిపాజిట్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబికి గ్యారంటీ చెల్లించడంలో విఫలమవ్వడంతో సుబ్రతారాయ్, అశోక్ రాయ్ జైలు పాలయ్యారు. -
‘లైన్’లో పడ్డట్టేనా..!
కోటిపల్లి-నర్సాపురం ప్రాజెక్టుకు రూ.200 కోట్లు మెయిన్‌లైన్‌తో కాకినాడ అనుసంధానానికి రూ.50 కోట్లు రైల్వే బడ్జెట్లో మంత్రి జిల్లాపై చూపిన కరుణ అంతే.. కొత్త రైళ్లు, ప్రధాన రైళ్ల హాల్ట్‌ల ఊసే లేదు బడ్జెట్‌పై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయూలు సాక్షి ప్రతినిధి, కాకినాడ:జిల్లావాసుల చిరకాలపు ఆకాంక్షల్ని ప్రతి రైల్వేబడ్జెట్‌లో పరిహసిస్తున్న కేంద్రప్రభుత్వం.. ఈసారి కొంతలో కొంత పరిగణనలోకి తీసుకున్నట్టే ఉంది. దశాబ్దాలుగా కన్న తమ కలలు సాకారం కావడంలో ఇకనైనా సర్కార్లు చిత్తశుద్ధిని కనబరచాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. పచ్చని కోనసీమకు రైలుమార్గం యోగం కల్పించే సుమారు 60 కిలోమీటర్ల కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను పనులకు ఈ బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. దీనికి మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉంది. కాగా 1999-2000లోనే ఆమోదముద్ర పడినా, ముందుకు కదలని కాకినాడ-పిఠాపురం రైల్వే లైన్ పనులకు కూడా ఈ బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించారు. అంతేమొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేస్తే ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు సమకూరినట్లే. రెల్వే మంత్రి సురేష్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ రెండు లైన్లకు ఆ మేరకు నిధులు మంజూరు చేయడం తప్ప జిల్లాకు కొత్త రైళ్లను ప్రకటించలేదు. కాగా జిల్లాలోని రెండు లైన్లకు రూ.200 కోట్లు, రూ.50 కోట్ల చొప్పున నిధులు కేటాయించడంపై భిన్నాభిప్రాయూలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అరకొర కేటాయింపులనీ, జిల్లాకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ, వామపక్షాల నేతలు అంటుండగా.. టీడీపీ, బీజేపీ వారితో పాటు కోనసీమవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు రూ.345 కోట్లు.. ఇప్పుడు రూ.2 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందిస్తే కోటిపల్లి-నర్సాపురం లైన్ పనులకు ఈ ఏడాది రూ.400 కోట్లు సమకూరినట్లే. ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో అంచనా వ్యయం రూ.345 కోట్లే. 2002, నవంబరు 16న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ అమలాపురంలో దీనికి పునాదిరాయి వేశారు. కానీ గత బడ్జెట్లలో కేటాయించింది రూ.70 కోట్లు మాత్రమే. ఈ ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తే ప్రాథమిక పనులు పూర్తవుతాయి. ఈ లైను పనుల్లో అతి పెద్ద సవాలు గోదావరి పాయలైన గౌతమి, వైనతేయ, వశిష్ట నదులపై భారీ రైలు వంతెనలు నిర్మాణమే. వీటి పనులను త్వరితగతిన ప్రారంభిస్తే వచ్చే మూడేళ్లలో కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైను సాకారమవుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. రాష్ట్ర సర్కారూ నిధులిస్తేనే పనులు.. జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడను చెన్నై-హౌరా ప్రధాన రైలు మార్గంతో అనుసంధానం చేయడమే కాకినాడ-పిఠాపురం ప్రాజెక్టు లక్ష్యం. 21 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైను నిర్మాణానికి తొలుత అంచనా వ్యయం రూ.126 కోట్లు మాత్రమే. ప్రస్తుతం రూ.250 కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం కేటారుుంచిన రూ.50 కోట్లకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే నిధులు మంజూరు చేస్తే మొత్తం రూ.100 కోట్లతో ప్రాజెక్టులో చాలాపనులు పూర్తవుతాయని భావిస్తున్నారు. స్టేషన్ల అభివృద్ధికి ఎంపీల కృషే కీలకం.. జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడతో పాటు వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరం, పుణ్యక్షేత్రమైన అన్నవరం రైల్వే స్టేషన్లతో పాటు సామర్లకోట, తుని, పిఠాపురం, అనపర్తి స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకోసం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. కానీ స్టేషన్ల అభివృద్ధి కోసం వెచ్చించే నిధులు ఆయా స్టేషన్లకు దక్కేలా జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులే కృషి చేయాలి. మూడో ట్రాక్ వస్తే కొత్త రైళ్లు.. ప్రస్తుతం విస్తరణ జరుగుతున్న 216 నంబరు జాతీయ రహదారికి సమాంతరంగా కొత్తగా రైల్వే లైను నిర్మించాలని దీర్ఘకాలంగా డిమాండ్ ఉన్నా పెండింగ్ ప్రాజెక్టులకే రైల్వే మంత్రి ముందు ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ప్రతిపాదన కాస్తా తెరవెనుకకు పోయింది. అయితే చెన్నై-హౌరా ప్రధాన రైల్వే మార్గంలో దువ్వాడ (విశాఖపట్నం)-విజయవాడ, విజయవాడ-గూడూరుల మధ్య మూడో ట్రాక్ పనులకు వరుసగా రూ.50 కోట్లు, రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. దీంతో మూడో ట్రాక్ నిర్మాణపనులు పుంజుకుంటాయి. ఇది పూర్తయితే విశాఖ-విజయవాడ మధ్య కొత్త రైళ్ల ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుంది. ఈ లైనులో ఉన్న తుని, అన్నవరం, సామర్లకోట, అనపర్తి వంటి రెండో శ్రేణి రైల్వేస్టేషన్లలో ప్రధాన రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించవచ్చు. ఈ బడ్జెట్లో ప్రకటించిన విజయవాడ-విశాఖ డబుల్ డెకర్ రైలుకు రాజమండ్రితో పాటు సామర్లకోట, అన్నవరం, తుని వంటి ప్రధాన స్టేషన్లలో హాల్ట్ కల్పిస్తే జిల్లా ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. -
మోదీ సూట్ యజమాని దాతృత్వం
ఆగ్రా: సూరత్ వజ్రాల వ్యాపారి, ప్రైవేట్ ఎయిర్ లైన్ యజమాని లాల్జీభాయ్ పటేల్ పేరు వినే ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూట్‌ను వేలం వేయగా లాల్జీ భాయ్ 4 కోట్ల 31 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సూట్‌పై 'నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ' పేరు కనిపించేలా తయారు చేయడం దీని ప్రత్యేకత. కుబేరుడైన లాల్జీభాయ్ పటేల్ సాయం చేయడంలోనూ ఆయనది పెద్ద మనసు. దేశ వ్యాప్తంగా పేద అమ్మాయిలకు వివాహాలు చేయడం కోసం 200 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 10 వేలమంది బాలికల తల్లిదండ్రులను ఎంపిక చేసి, అమ్మాయిల వివాహాల కోసం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు లాల్జీభాయ్ చెప్పారు. వచ్చే మార్చి 13న సూరత్‌లో ఈ పథకం ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఓ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సాధ్వి రీతంబరను స్ఫూర్తిగా తీసుకుని పేద పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రచార కార్యక్రమం 'బేటీ బచావో, బేటీ పదావో'లో భాగంగా తన వంతు సాయం చేస్తున్నట్టు తెలిపారు. లాల్జీభాయ్ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎంతోమందికి సాయపడ్డారు. గతేడాది పేద ఆడపిల్లల కోసం ఓ పథకం ప్రవేశపెట్టారు. గుజరాత్లో పటేదార్ సామాజిక వర్గంలో జన్మించిన 5 వేల మంది బాలికలకు ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయల విలువైన బాండ్లు కానుకగా ఇచ్చారు. ఈ బాలికలు 21 ఏళ్ల వయసుకు వచ్చాక 2 లక్షల రూపాయలు తీసుకుంటారు. -
త్వరలో వంద షోరూమ్‌లకు కల్యాణ్ జ్యుయెలర్స్
చెన్నై, సాక్షి ప్రతినిధి : బంగారు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యుయెలర్స్ షోరూమ్‌ల సంఖ్య త్వరలో వందకు చేరుకోనున్నాయి. చెన్నైలో ఈ నెల 17న 78వ షోరూమ్ ప్రారంభిస్తున్న సందర్భంగా బుధవారం మీడియా సమావేశంలో సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టీఎస్ కల్యాణరామన్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు రాజేష్, రమేష్ పై విషయం చెప్పారు. కల్యాణ్ జ్యుయెలర్స్ షోరూమ్‌లను పశ్చిమాసియా దేశాల్లో విస్తరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తమ టర్నోవర్ రూ.22వేల కోట్లకు చేరిందని, వందషోరూమ్ల ద్వారా రూ.30 వేల కోట్ల లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అలాగే ఏడాదికి 30 శాతం వ్యాపార ప్రగతి సాధిస్తున్నట్లు చెప్పారు. రూ.200 కోట్ల విలువైన బంగారు నగలను ఈ షోరూమ్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. -
ఆన్ మిలటరీ డ్యూటీ ట్రక్ ... 200 కోట్ల హెరాయిన్
ఛండీగడ్: పంజాబ్‌లో మరోసారి భారీ ఎత్తున హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లూథియానా జిల్లాలోని ములాన్‌పూర్ వద్ద పోలీసులు శనివారం వాహన తనిఖీలు నిర్వహంచారు. ఈ సందర్భంగా 'ఆన్ మిలటరీ డ్యూటీ' అనే బోర్డు ఉన్న ట్రక్‌లో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 40 కేజీల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హెరాయిన్‌ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు అప్పగించారు. ఆ హెరాయిన్‌ను అధికారులు సీజ్ చేశారు. పోలీసులు, భద్రత సిబ్బంది దృష్టి మళ్లించేందుకు మిలటరీ బోర్డు వాహనానికి తగిలించారని అధికారులు వెల్లడించారు. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 200 కోట్లు వరకు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ నెల 15న హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఆ పక్క రాష్ట్రమైన పంజాబ్‌లో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. -
చోద్యం చూస్తున్న జిహెచ్ఎమ్సి అధికారులు...