త్వరలో వంద షోరూమ్‌లకు కల్యాణ్ జ్యుయెలర్స్ | Kalyan Jewellers invests Rs 200 crore in Chennai showroom | Sakshi
Sakshi News home page

త్వరలో వంద షోరూమ్‌లకు కల్యాణ్ జ్యుయెలర్స్

Published Thu, Apr 9 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

త్వరలో వంద షోరూమ్‌లకు కల్యాణ్ జ్యుయెలర్స్

త్వరలో వంద షోరూమ్‌లకు కల్యాణ్ జ్యుయెలర్స్

చెన్నై, సాక్షి ప్రతినిధి : బంగారు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యుయెలర్స్ షోరూమ్‌ల సంఖ్య త్వరలో వందకు చేరుకోనున్నాయి. చెన్నైలో ఈ నెల 17న 78వ షోరూమ్ ప్రారంభిస్తున్న సందర్భంగా బుధవారం మీడియా సమావేశంలో సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టీఎస్ కల్యాణరామన్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు రాజేష్, రమేష్ పై విషయం చెప్పారు. కల్యాణ్ జ్యుయెలర్స్ షోరూమ్‌లను పశ్చిమాసియా దేశాల్లో విస్తరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తమ టర్నోవర్ రూ.22వేల కోట్లకు చేరిందని, వందషోరూమ్‌ల ద్వారా రూ.30 వేల కోట్ల లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అలాగే ఏడాదికి 30 శాతం వ్యాపార ప్రగతి సాధిస్తున్నట్లు చెప్పారు. రూ.200 కోట్ల విలువైన బంగారు నగలను ఈ షోరూమ్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement