న్యూఢిల్లీ: ఆభరణాల విక్రయంలో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ 250వ షోరూమ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మార్చిలోగా ప్రారంభించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 2023–24 నాల్గవ త్రైమాసికంలో కొత్తగా భారత్‌లో 15 కళ్యాణ్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో 2 కళ్యాణ్, 13 క్యాండీర్ స్టోర్లను తెరువనుంది.
2023 డిసెంబర్ 31 నాటికి సంస్థ ఖాతాలో మొత్తం 235 కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్–డిసెంబర్‌లో ప్రారంభించిన కంపెనీ యాజమాన్యంలోని కేంద్రాలను ఫ్రాంచైజీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్ (ఫోకో) విధానంలోకి మార్చనున్నట్టు కళ్యాణ్ జువెల్లర్స్ తెలిపింది. 2024–25లో కొత్తగా 80 ఔట్‌లెట్లు రానున్నాయి. ఇందుకు కావాల్సిన ఒప్పందాలు పూర్తి అయ్యాయి. ఎక్కువ దుకాణాలు ఫ్రాంచైజీ విధానంలో తెరుచుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment