Kalyan Jewellers
-
అనంతపురంలో జ్యువెలరీ షాప్ ప్రారంభించిన అక్కినేని నాగార్జున (ఫొటోలు)
-
దసరా సంబరాల్లో పాల్గొన్న చిరంజీవి, నాగార్జున (ఫొటోలు)
-
కల్యాణ్ జ్యువెలర్స్‌లో వార్బర్గ్ 6.45% వాటా విక్రయం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం వార్బర్గ్ పింకస్ తాజాగా కల్యాణ్ జ్యుయలర్స్‌లో 6.45 శాతం వాటాను విక్రయించింది. స్టాక్ ఎక్సే్చంజీల్లో నిర్వహించిన ఈ ఓపెన్ మార్కెట్ లావాదేవీ విలువ సుమారు రూ. 3,584 కోట్లు. డేటా ప్రకారం వార్బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ హైడెల్ ఇన్వెస్ట్మెంట్ 6.65 కోట్ల షేర్లను సగటున ఒక్కో షేరును రూ. 539.10 రేటు చొప్పున విక్రయించింది.వీటిని ఫిడిలిటీ, నోమురా తదితర సంస్థలు కొనుగోలు చేశాయి. హైడెల్ ఇన్వెస్ట్మెంట్ షేరు ఒక్కింటికి రూ. 535 రేటు చొప్పున ఇంకో 2.36% వాటాను కంపెనీ ప్రమోటర్, ఎండీ టీఎస్ కల్యాణరామన్‌కి రూ. 1,300 కోట్లకు విక్రయించనుంది. ఇందుకోసం ప్రమోటరు, హైడెల్ ఇన్వెస్ట్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
అయోధ్యలో కళ్యాణ్ జువెల్లర్స్ స్టోర్
న్యూఢిల్లీ: ఆభరణాల విక్రయంలో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ 250వ షోరూమ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మార్చిలోగా ప్రారంభించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 2023–24 నాల్గవ త్రైమాసికంలో కొత్తగా భారత్‌లో 15 కళ్యాణ్ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో 2 కళ్యాణ్, 13 క్యాండీర్ స్టోర్లను తెరువనుంది. 2023 డిసెంబర్ 31 నాటికి సంస్థ ఖాతాలో మొత్తం 235 కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్–డిసెంబర్లో ప్రారంభించిన కంపెనీ యాజమాన్యంలోని కేంద్రాలను ఫ్రాంచైజీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్ (ఫోకో) విధానంలోకి మార్చనున్నట్టు కళ్యాణ్ జువెల్లర్స్ తెలిపింది. 2024–25లో కొత్తగా 80 ఔట్లెట్లు రానున్నాయి. ఇందుకు కావాల్సిన ఒప్పందాలు పూర్తి అయ్యాయి. ఎక్కువ దుకాణాలు ఫ్రాంచైజీ విధానంలో తెరుచుకోనున్నాయి. -
విస్తరణ బాటలో కల్యాణ్ జ్యుయలర్స్
న్యూఢిల్లీ: దక్షిణాదియేతర మార్కెట్లలో కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తున్నట్లు కల్యాణ్ జ్యుయలర్స్ వెల్లడించింది. దీపావళిలోగా కొత్తగా 20 షోరూమ్‌లను ప్రారంభించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. అలాగే తమ తొలి ఎఫ్‌వోసీవో (ఫ్రాంచైజీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్) షోరూమ్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మధ్యప్రాచ్యంలో ప్రారంభించనున్నట్లు సంస్థ వివరించింది. అలాగే వచ్చే ఆరు నెలల్లో తమ ఆన్లైన్ జ్యుయలరీ ప్లాట్‌ఫాం క్యాండియర్‌కి సంబంధించి 20 ఫిజికల్ షోరూమ్‌లను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి దేశ విదేశాల్లో కంపెనీ మొత్తం షోరూమ్‌ల సంఖ్య 194కి చేరింది. -
కళ్యాణ్ జువెల్లర్స్‌లో హైడెల్ వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఆభరణాల విక్రయ సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్‌లో వార్బర్గ్ పింకస్‌కు చెందిన హైడెల్ ఇన్వెస్ట్మెంట్ 2.26 శాతం వాటాను ఓపెన్ మార్కెట్లో రూ.256.6 కోట్లకు విక్రయించింది. ఎన్ఎస్ఈలో బల్క్ డీల్ సమాచారం ప్రకారం ఒక్కొక్కటి రూ.110.04 చొప్పున 2,33,25,686 షేర్లను హైడెల్ విక్రయించింది. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? డిసెంబర్ త్రైమాసికంలో కళ్యాణ్ జువెల్లర్స్‌లో హైడెల్‌కు 26.36 శాతం వాటా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఎన్ఎస్ఈలో కళ్యాణ్ జువెల్లర్స్ షేరు ధర మంగళవారం 9.06 శాతం పడిపోయి రూ.107.90 వద్ద స్థిరపడింది. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు -
కల్యాణ్ జువెల్లర్స్ చైర్మన్‌గా మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్
న్యూఢిల్లీ: మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ తమ సంస్థ చైర్మన్, స్వతంత్ర నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితులైనట్లు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ ఇండియా వెల్లడించింది. నియంత్రణ సంస్థ, షేర్‌హోల్డర్ల ఆమోదానికి లోబడి ఈ నియామకం ఉంటుందని పేర్కొంది. టీఎస్ కల్యాణరామన్ ఇకపైనా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని వివరించింది. పారదర్శకమైన వ్యాపార విధానాలు, కార్పొరేట్ గవర్నెన్స్‌తో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్న కల్యాణ్ జువెల్లర్స్‌తో కలిసి పనిచేయనుండటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వినోద్ రాయ్ తెలిపారు. వివిధ అంశాల్లో రాయ్ అపార అనుభవం తమ సంస్థ పురోగతికి తోడ్పడగలదని కల్యాణరామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఎక్స్టర్నల్ ఆడిటర్ల కమిటీకి చైర్మన్‌గా కూడా రాయ్ గతంలో వ్యవహరించారు. అలాగే కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాల్లోనూ వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశీయంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల కోసం ఏర్పాటైన బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. దేశానికి అందించిన సేవలకు గాను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. (చదవండి: అంతర్జాతీయ మార్కెట్లలో జోరు.. దేశీ స్టాక్ మార్కెట్లలో లాభాల హోరు) -
కాగ్ వినోద్‌రాయ్.. ఇప్పుడు కళ్యాణ్ జ్యూయల్లర్స్లో
కాగ్ (కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా) మాజీ అధికారి వినోద్రాయ్కి కీలక బాధ్యలు అప్పగించింది కళ్యాణ్ జ్యూయల్లర్స్ యాజమాన్యం. కంపెనీ బోర్డులో చైర్మన్, ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి షేర్ హోల్డర్లు, రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. కాగ్ ఆడిటర్ జనరల్ పని చేయడంతో పాటు యూనెటైడ్ నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్‌కి, బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో తదితర సంస్థలకు కూడా గతంలో చైర్మన్‌గా వినోద్‌రాయ్ వ్యవహరించారు. కేంద్ర, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక సంస్కరణల్లో వినోద్ రాయ్ కీలకంగా వ్యవహరించారు. కాగా మార్కెట్లో దూకుడుగా వెళ్తున్న కళ్యాణ్ జ్యూయల్లర్స్.. తాజాగా వినోద్‌రాయ్ వంటి సమర్థుడికి అనుభవజ్ఞుడికి బోర్డులో చోటు కల్పించింది. -
తళుక్కున మెరిసిన కల్యాణ్ జ్యువెలర్స్..! కోవిడ్-19 ముందుస్థాయికి మించి..
ముంబై: ఆభరణాల విక్రేత కల్యాణ్ జ్యువెలర్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 16 శాతంపైగా బలపడి దాదాపు రూ. 135 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 115.5 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 3,435 కోట్లను అధిగమించింది. షోరూముల రీలొకేషన్, సిబ్బందికి బోనస్ నేపథ్యంలో రూ. 8 కోట్లమేర ఒకేసారి వ్యయాలు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. మధ్యప్రాచ్యం నుంచి ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 515 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. కోవిడ్–19 తదుపరి అత్యధిక శాతం షోరూముల్లో అమ్మకాలు కరోనా మహమ్మారి ముందుస్థాయికి మించి నమోదైనట్లు వెల్లడించింది. ఈకామర్స్ విభాగం క్యాండీర్ విక్రయాలు 40 శాతం ఎగసి రూ. 47 కోట్లను తాకాయి. ప్రస్తుతం కంపెనీ దేశీయంగా 21 రాష్ట్రాలు, మధ్యప్రాచ్యంలోని నాలుగు దేశాలతో కలిపి మొత్తం 151 స్టోర్లు నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం క్షీణించి రూ. 68 వద్ద ముగిసింది. -
కల్యాణ్ జువెల్లర్స్ ‘బంగార్రాజు’ ఆభరణాలు
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల బ్రాండ్ కల్యాణ్ జువెల్లర్స్ ’బంగార్రాజు’ పేరుతో పురుషుల జ్యువెలరీ ప్రత్యేక కలెక్షన్‌ను ప్రారంభించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఒక భాగస్వామ్యం కుదుర్చుకుంది. అక్కినేని నాగార్జున, నాగచైతన్యలు నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి విడుదల నేపథ్యంలో కల్యాణ్ జువెల్లర్స్ ఈ ప్రత్యేక కలెక్షను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా చిత్ర కథానాయకుడు బంగార్రాజు ధరించిన నవరత్న, పులిగోరు తరహా నెక్లేస్ డిజైన్ ఆభరణాలకు కల్యాణ్ జువెల్లర్స్ షోరూమ్‌లలో ఆర్డర్ ఇవ్వవచ్చని తెలిపింది. -
వరల్డ్ టాప్–100 లగ్జరీ బ్రాండ్లు.. చోటు దక్కించుకున్న ఇండియన్ బ్రాండ్స్ ఇవే
న్యూఢిల్లీ: ప్రపంచంలో విలాసవంతమైన టాప్–100 బ్రాండ్లలో భారత్ నుంచి ఐదింటికి చోటు లభించింది. టైటాన్ మూడు స్థానాలు పైకి ఎగిసి 22వ ర్యాంకులోకి వచ్చింది. అంతేకాదు అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న అగ్రగామి 20 లగ్జరీ ఉత్పత్తుల కంపెనీల్లోనూ చోటు సంపాదించుకుంది. జెమ్స్ అండ్ జ్యుయల్లరీ టాప్–100 విలాసవంత ఉత్పత్తుల్లో భారత్ నుంచి కల్యాణ్ జ్యుయలర్స్, జోయలుక్కాస్, పీసీ జ్యుయలర్స్, త్రిభువన్దాస్ భీమ్జీ జవేరీ ఉన్నాయి. ఇవన్నీ జ్యుయలరీ కంపెనీలే కావడం గమనార్హం. భారత్‌కు సంబంధించి ధోరణి గతేడాది మాదిరే ఉందని, జెమ్స్ అండ్ జ్యుయలరీ విభాగం తాజా ఎడిషన్‌లో ఆధిపత్యం ప్రదర్శించినట్టు.. ఈ నివేదికను రూపొందించిన డెలాయిట్ తెలిపింది. తొలిసారి త్రిభువన్దాస్.. టాప్ –100 లగ్జరీ ఉత్పత్తుల జాబితాలోకి త్రిభువన్దాస్ భీమ్జీ జవేరి తొలిసారిగా చోటు సంపాదించుకుంది. టాప్–10 బ్రాండ్లు యూరోప్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతం (ఈఎంఈఏ) నుంచే ఉన్నాయి. టాప్–100లో 80కు పైగా కంపెనీల విక్రయాలు 2019–20లో (2020వ సంవత్సరం) తక్కువగా ఉన్నాయని.. కరోనా ప్రబావం వీటిపై పడినట్టు డెలాయిట్ తెలిపింది. అయినప్పటికీ సగానికి పైగా కంపెనీలు లాభాలను నమోదు చేశాయని పేర్కొంది. చదవండి: ఆదిత్య బిర్లా చేతికి రీబాక్! నెక్ట్స్ ఏం జరగబోతుంది? -
కానరాని ‘అక్షయ’ మెరుపులు.. టన్ను బంగారం కూడా అమ్మలేదు..
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం షాపుల ముందు కస్టమర్ల క్యూలు.. వినియోగదార్లతో కిటకిటలాడే దుకాణాలు. అక్షయ తృతీయ అనగానే సాధారణంగా ఇవే గుర్తొస్తాయి. ఇదంతా గతం. కోవిడ్–19 మహమ్మారి ఒక్కసారిగా మార్కెట్‌ను తారుమారు చేసింది. వరుసగా రెండవ ఏడాదీ పరిశ్రమను దెబ్బతీసింది. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో జువెల్లరీ షాపులు మూతపడ్డాయి. పాక్షిక లాక్డౌన్ కొనసాగుతున్న రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని దుకాణాలే తెరుచుకున్నాయి. వీటిలోకూడా వినియోగదార్లు లేక వెలవెలబోయాయి. వైరస్ భయంతో కస్టమర్లు బయటకు రాలేదు. పుత్తడి కొనాలన్న సెంటిమెంటూ లేకపోవడంతో శుక్రవారం అక్షయ తృతీయ మెరుపులు కానరాలేదు. మరోవైపు పరిమిత సమయం దుకాణాలు తెరిచే అవకాశం ఉన్నా చాలాచోట్ల వర్తకులు ఆసక్తి చూపలేదు. ఒక టన్ను కూడా అమ్మలేదు.. సాధారణంగా అక్షయ తృతీయ రోజు దేశవ్యాప్తంగా సుమారు 30 టన్నుల పుత్తడి అమ్ముడవుతుంది. ఈసారి ఒక టన్ను కూడా విక్రయం కాలేదని పరిశ్రమ వర్గాలు సమాచారం. ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, పుణేతోపాటు పుత్తడి అధికంగా విక్రయమయ్యే కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో ఆఫ్‌లైన్ సేల్స్‌పై తీవ్ర ప్రభావం పడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ఆన్లైన్ విక్రయాలను వర్తకులు ప్రోత్సహించారని చెప్పారు. ‘90 శాతం రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉంది. ఈ రాష్ట్రాల్లో అమ్మకాలు నిల్. జరిగిన కొద్ది విక్రయాలు కూడా ఫోన్, డిజిటల్ మాధ్యమం ద్వారా జరిగాయి. గతేడాది 2.5 టన్నులు విక్రయమైతే, ఈ ఏడాది 3–4 టన్నులు కస్టమర్ల చేతుల్లోకి వెళ్తుందని భావించారు. షాపులు తెరిచినచోట 10–15 శాతం సేల్స్ జరిగే అవకాశం ఉందని వర్తకులు అంచనా వేస్తున్నారు’ అని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పేథీ తెలిపారు. ఈ ఏడాది అక్షయకు 1 నుంచి 1.5 టన్నుల మధ్య సేల్స్ ఉండే అవకాశం ఉందని ఇండియా బులియన్, జువెల్లర్స్ అసోసియేషన్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ వెల్లడించారు. సానుకూలంగా లేదు.. గతేడాదితో పోలిస్తే 2021 అక్షయ తృతీయ భిన్నమైనదని కళ్యాణ్ జువెల్లర్స్ ఈడీ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. సంస్థకు చెందిన 20 శాతం షోరూంలు మాత్రమే తెరుచుకున్నాయని, అది కూడా పరిమిత సమయమేనని చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కస్టమర్లు ఇష్టపడడం లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో సెంటిమెంట్ సానుకూలంగా లేదని పేర్కొన్నారు. ‘అక్షయ తృతీయ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు లాక్డౌన్లో ఉన్నాయి. రెండు మూడు రాష్ట్రాల్లో రిటైల్ షాపులు ఉదయం 6 నుంచి 10 వరకే తెరిచేందుకు అనుమతి ఉంది. ఇది కస్టమర్లకు అసాధారణ సమయం’ అని వివరించారు. కరోనాకు భయపడి వినియోగదార్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదని హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్ వ్యాపారి గుల్లపూడి నాగకిరణ్ కుమార్ తెలిపారు. షాపింగ్‌కు తక్కువ సమయం ఉండడం, పుత్తడి కొనాలన్న ఆలోచన కూడా కస్టమర్లలో లేదని అన్నారు. కోవిడ్–19 ముందస్తుతో పోలిస్తే అమ్మకాలు స్వల్పమని సిరివర్ణిక జువెల్లర్స్ ఫౌండర్ వడ్డేపల్లి ప్రియమాధవి చెప్పారు. -
ఐపీవోకి కల్యాణ్ జ్యుయలర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ తాజాగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 1,175 కోట్లు సమీకరించనుంది. షేరు ధరల శ్రేణిని రూ. 86-87గా నిర్ణయించారు. లాట్ సైజు 172 షేర్లుగా ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మార్చి 16న ప్రారంభమయ్యే ఇష్యూ 18న ముగుస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు టీఎస్ కల్యాణరామన్ వివరించారు. యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ మార్చి 15నే ప్రారంభమవుతుంది. ఐపీవోలో భాగంగా కొత్తగా రూ.800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు రూ. 375 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రమోటరు టీఎస్ కల్యాణరామన్ రూ. 125 కోట్ల విలువ చేసే షేర్లు, కంపెనీలో ఇన్వెస్టరయిన వార్బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ హైడెల్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ దాదాపు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నాయి. ఈ ఏడాది మార్చి 9 నాటికి సంస్థలో ప్రమోటరు, ప్రమోటరు గ్రూప్‌నకు 67.99 శాతం వాటాలున్నాయి. నిర్వహణ మూలధన అవసరాలకు... ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్, కంపెనీకి సంబంధించిన ఇతరత్రా అవసరాల కోసం వినియోగించనున్నట్లు కల్యాణరామన్ పేర్కొన్నారు. ఇష్యూలో సగభాగాన్ని అర్హత పొందిన సంస్థాగత కొనుగోలుదారులకు, 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం భాగాన్ని సంస్థాగతయేతర బిడ్డర్లకు కేటాయించారు. దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే షేర్లను తమ ఉద్యోగులకు కల్యాణ్ జ్యుయలర్స్ కేటాయించింది. గతేడాది ఆగస్టులోనే ఐపీవోకి సంబంధించిన పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కంపెనీ దాఖలు చేయగా, అక్టోబర్‌లో అనుమతులు లభించాయి. యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థలు ఈ ఐపీవోకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 1993లో ప్రారంభమైన కల్యాణ్ జ్యుయలర్స్‌కి.. 2020 ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 107 షోరూమ్‌లు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో 30 స్టోర్స్ ఉన్నాయి. -
ఫెఫ్సీకి కల్యాణి జ్యువెలర్స్, సోనీ టీవీ రూ. 12 కోట్ల విరాళం
తమిళనాడు: కరోనా మహమ్మారి కారణంగా సినీ కార్మికులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు వారికి సాయం అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఈనేపథ్యంలో కల్యాణి జ్యువెలర్స్, సోనీ టీవీ సంస్థలు సంయుక్తంగా కలిసి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఫెఫ్సీ) సభ్యులను ఆదుకునే విధంగా రూ. 12 కోట్లను విరాళంగా అందించారు. ఈ విషయాన్ని ఫెఫ్సీ జాయింట్ సెక్రెటరీ శ్రీధర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఖుషీతో, నటుడు ప్రభు సహకారంతో సోనీ టీవీ, కల్యాణి జువెలర్స్ సంస్థలు ఫెఫ్సీకి రూ. 12 కోట్లను విరాళంగా అందించినట్లు తెలిపారు. ఈ మొత్తంలో రూ. 2 కోట్ల 70 లక్షలను సినీ కార్మికుల కోసం కేటాయించినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని సంఘ సభ్యులు 1800 మందికి తలా రూ. 1,500 విలువ చేసే బిగ్ బజార్ కూపన్‌ను అందించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత సినీ కార్మికుల సమాఖ్య కార్యదర్శి, దర్శకుడు ఉన్నికృష్ణన్‌కు కల్యాణి జువెలర్స్, సోనీ టీవీ సంస్థలకు కృజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. -
కత్రినా పెళ్లి.. తల్లిదండ్రులుగా బిగ్‌బీ దంపతులు!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు తల్లిదండ్రుగా మారి ఆమె వివాహాం జరిపించారు బాలీవుడ్ బిగ్‌బీ దంపతులు అమితాబ్ బచ్చన్, జయబచ్చన్లు. ఈ వివాహా మహోత్సవానికి తెలుగు, తమిళ, కన్నడ అగ్రకథానాయకులు నాగార్జున, ప్రభు, శివరాజ్‌లు హజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటి కత్రినా పెళ్లి జరిగిందా! ఎవరితో.. అది కూడా బిగ్‌బీ దంపతులు తల్లిదండ్రులుగా ఆమెకు వివాహాం జరిపించడమేంటి అని షాక్ అవుతున్నారా. అయితే ఇదంతా జరిగింది రీల్లో రీయల్గా కాదు. అసలు విషయం ఎంటంటే కత్రినా ప్రముఖ కళ్యాణ్ జ్యూవెల్లర్స్ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ నగల దుకాణం ప్రమోషన్లో భాగంగా ఓ యాడ్‌ను చిత్రికరిస్తున్నారు. ఇందులో కత్రినా పెళ్లి కూతిరిగా కనిపించగా ఆమెకు తల్లిదండ్రులుగా బిగ్‌బీ, ఆయన సతిమణి జయ బచ్చన్లు కనిపించనున్నారు. ఈ పెళ్లిలో నాగార్జున, ప్రభు గణేషన్, శివ రాజ్కూమార్లు ముఖ్య అతిథులుగా హాజరై పెళ్లి జరిపించారు. కాగా కళ్యాణ్ జ్యూవెల్లర్స్‌కు తెలుగులో అంబాసిడర్‌గా నాగార్జున వ్యవహిరించగా తమిళంలో ప్రభు గణేషన్, కన్నడలో శివరాజ్ కుమార్‌లు అంబాసిడర్లుగా వ్యవహిరస్తున్నారు. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ అంబాసిడర్లుగా ఉన్నారు. T 3419 - - Historic moment for Jaya and me .. 3 superstar sons of 3 Iconic Legends of Indian Film Industry , work together with us .. what honour .. Nagarjun - son Akkineni Nageshwara Rao, Telugu Shivraj Kumar - son Dr Raaj Kumar, Kannada Prabhu - son Shivaji Ganesan, Tamil pic.twitter.com/Plvtd372ZH — Amitabh Bachchan (@SrBachchan) 24 January 2020 కాగా ఈ యాడ్‌కు సంబంధించిన షూటింగ్ ఫొటోలను బిగ్ బీ తన ట్విటర్ షేర్ చేస్తూ.. ‘జయకు నాకు ఇది ఎంతో గౌరవకారణమైనది. దీన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. సీనీ పరిశ్రమలోని ముగ్గురూ లెజెండరి సూపరస్టార్ కుమారులతో కలిసి నటించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. తెలుగు అగ్రకథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున, తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేషన్ తనయుడు ప్రభు గణేషన్, కన్నడ స్టార్ రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్ కుమార్‌లతో కలిసి నటించాము’ అంటూ షేర్ చేశారు. తమ అభిమాన సూపర్ స్టార్లను ఒకే వేధికపై చూసిన ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా ఉండదు. అలాంటిది ఒకే తెరపై కలిసి నటిస్తూ అది కూడా వివాహా వేడుకల్లో చూస్తే ఇంకా అభిమానులకు ఎంతటి కనుల పండగగా ఉంటుందో మీరే ఊహించుకోండి. -
కర్నూలు కల్యాణ్ జ్యూవెలర్స్‌లో చోరీ
-
నాగార్జున యాడ్‌ను తొలగించేశారు
న్యూఢిల్లీ : తాజాగా కల్యాణ్ జువెలర్స్ రూపొందించిన యాడ్ అందరికీ తెలిసే ఉంటుంది. ‘నిజాయితీ ఎక్కడో నమ్మకమూ అక్కడే’ అనే కాన్సెప్ట్‌తో.. ప్రతి రోజూ బుల్లితెరపై ఇది మారుమోగిపోయింది. ఇంత హల్చల్ చేసిన ఈ యాడ్ ఇక నుంచి టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో కనిపించదట. ఈ యాడ్‌ను అన్ని ప్రసార మాధ్యమాల నుంచి తొలగిస్తున్నట్టు కల్యాణ్ జువెలర్స్ నిర్వాహకులు ప్రకటించారు. తెలుగులో నాగార్జున, హిందీలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమార్తె శ్వేతా బచ్చన్ లతో రూపొందించిన ఈ వ్యాపార ప్రకటన బ్యాంకులపై నమ్మకం కోల్పోయేలా ఉందంటూ ఏఐబీవోసీ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, ఆ యాడ్ ను తీసేస్తున్నట్టు కల్యాణ్ జువెలర్స్ తెలిపింది. ఈ యాడ్‌ను తాము కేవలం ప్రచారం కోసమే రూపొందించామని, కానీ ఈ యాడ్ వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని కల్యాణ్ జువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్యాణ్ రామన్ అన్నారు. తమ సంస్థ వ్యాపారంలో బ్యాంకింగ్ వ్యవస్థది కీలక పాత్రని, దేశంలోని బ్యాంకులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తూ, ఈ యాడ్ ను తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకులకు నష్టం కలిగించే చర్యలను తామెన్నడూ ప్రోత్సహించబోమని చెప్పారు. అమితాబ్‌తో రూపొందిన హిందీ యాడ్‌ను కూడా సోమవారమే తొలగించిన సంగతి తెలిసిందే. ప్రభూతో రూపొందిన తమిళ యాడ్, మంజు వారియర్‌తో షూట్ చేసిన మలయాళ యాడ్‌ను కూడా కల్యాణ్ జువెలర్స్ తొలగించినట్టు తెలిసింది. కాగ, కల్యాణ్ జువెలర్స్ రూపొందించిన ఈ యాడ్, బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకం కలిగించేలా ఉందంటూ.. బ్యాంకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యాడ్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ యాడ్‌ను తొలగించకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. కల్యాణ్ జువెలర్స్ యాడ్‌లో ఏముంది.. అక్కినేని నాగార్జున ఓ రిటైర్డు ఉద్యోగి వేషంలో.. తన మనవరాలితో పాటు బ్యాంకుకు వస్తారు. నా పెన్షన్ అని ఓ బ్యాంక్ ఉద్యోగికి పాస్‌పుస్తకం చూపిస్తే, నాలుగు కౌంటర్ వద్దకు వెళ్లడంటూ ఆ బ్యాంక్ ఉద్యోగి విసుక్కోవడం, మరో కౌంటర్ వద్ద ఇది తలనొప్పి కేసు అంటూ మేనేజర్ వద్దకు వెళ్లమనడం బ్యాంక్ ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని చూపించారు. బ్యాంక్ మేనేజర్ వద్ద తన ఖాతాలోకి రెండు సార్లు పెన్షన్ డబ్బు క్రెడిట్ అయిందని చెబితే, అదృష్టం అంటే ఇదే పండుగ చేసుకోండని సూచిస్తారు. తిరిగి ఇవ్వడానికి వచ్చానంటే, ఇది పెద్ద తతంగమండి, గమ్మున వదిలేయండి, ఎవరికి తెలుస్తుందని అని నిర్లక్ష్య పూర్వక సమాధానం చెబుతారు. నాకు తెలుసు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా.. తప్పు తప్పే అని నాగార్జున అనడం.. నిజాయితీ ఎక్కడో నమ్మకమో అక్కడే.. అదే కల్యాణ్ జువెలర్స్ అనడంతో ఈ యాడ్ ముగుస్తుంది. ఈ యాడ్ లో బ్యాంకు అధికారులు కస్టమర్లను పట్టించుకునే విధానంతో పాటు.. అనుకోకుండా ఒకరి ఖాతాలోకి రెండు పర్యాయాలు వచ్చిన పెన్షన్ డబ్బును కట్ చేయడానికి చూసిన నిర్లక్ష్యం ధోరణి కనబడుతుంది. దీంతో కల్యాణ్ జువెల్లర్స్ యాడ్ పై బ్యాంకింగ్ అధికారులు కన్నెర చేశారు. అటు బ్యాంకు ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా ఈ యాడ్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. -
ఆ యాడ్‌ను తొలగిస్తున్నాం..!!
కొచ్చి : ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫడరేషన్(ఏఐబీవోసీ) డిమాండ్ మేరకు తాము రూపొందించిన యాడ్‌ను అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్ తెలిపింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కూతురు శ్వేతా బచ్చన్ నందాలతో రూపొందించిన యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకాన్ని కలిగించే విధంగా ఉందంటూ బ్యాంకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యాడ్‌ను తొలగించనున్నట్లు కళ్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. ‘కేవలం ప్రచారం కోసం రూపొందించిన మా కంపెనీ యాడ్ వల్ల కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా మా వ్యాపారంలో కీలక పాత్ర పోషించే బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తున్నాం. అందుకే అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే ఈ యాడ్‌ను తొలగిస్తున్నామంటూ’ ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలను ప్రోత్సహించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. కాగా అమితాబ్ బచ్చన్, ఆయన కూతురు శ్వేతా నందా తొలిసారి కళ్యాణ్ జువెల్లర్స్ కోసం ఓ యాడ్‌లో నటించారు. కేవలం వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు తలెత్తడంతో కళ్యాణ్ జువెల్లర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. -
యూట్యూబ్ వీడియోలతో రూ. 500 కోట్ల నష్టం...!
తిరువనంతపురం : సోషల్ మీడియాలో తమ బ్రాండ్ గురించి నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రసిద్ధ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. నకిలీ ఆభరణాలు అమ్ముతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారం వల్ల సుమారు 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కళ్యాణ్ జువెల్లర్స్ కేరళ బ్రాంచ్ పేర్కొంది. ఈ మేరకు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. వివరాలు... నకిలీ బంగారు ఆభరణాలు అమ్ముతున్న కారణంగా కళ్యాణ్ జువెల్లర్స్‌ను సీజ్ చేశారంటూ యూట్యూబ్‌లో వీడియోలు ప్రసారం కావడంతో కంపెనీ యాజమాన్యం కంగుతింది. కళ్యాణ్ జువెల్లర్స్ కువైట్ బ్రాంచ్‌లో జరిగిన సాధారణ తనిఖీలకు సంబంధించిన వీడియోలను ఎడిట్ చేసి ఈవిధంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నట్లు గుర్తించింది. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాధారణ తనిఖీలను అవినీతి నిరోధక దాడులుగా చిత్రీకరించి ప్రత్యర్థి కంపెనీలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని కళ్యాణ్ జువెల్లర్స్ ఆరోపించింది. తమ బ్రాండ్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా కళ్యాణ్ జువెల్లర్స్ లోగోతో యూట్యూబ్ చానల్లో నకిలీ వీడియోలను అప్లోడ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. సోషల్ మీడియాపై సరైన నిఘా లేనందు వల్లే ఇలాంటి నకిలీ వార్తలు, వీడియోలు ప్రసారం అవుతున్నాయని ఆరోపించింది. కళ్యాణ్ జ్యువెల్లర్స్ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. సోషల్ మీడియా నకిలీ వార్తలు అదుపు చేసేందుకు క్రమబద్దీకరణలు ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా గతంలో కూడా కళ్యాణ్ జ్యువెల్లర్స్‌పై సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం జరిగింది. కళ్యాణ్ జువెల్లర్స్‌లో అమ్ముతున్న బంగారు ఆభరణాలు నకిలీవని ఐదుగురు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో గతేడాది నవంబర్‌లో కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబాయ్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టయిన ఐదుగురు వ్యక్తులకు భారత మూలాలున్నాయని దుబాయ్ పోలీసులు అన్నారు. వీరిపై సైబర్ క్రైమ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
కళ్యాణ్ జ్యువెల్లర్స్‌పై నకిలీ వార్తలు
దుబాయ్ : ప్రసిద్ధ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెల్లర్స్‌పై అసత్య కథనాలను వ్యాప్తి చెందిస్తున్న ఐదుగురు వ్యక్తులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ఐదుగురు వ్యక్తులకు భారత మూలాలున్నాయని దుబాయ్ పోలీసులు అన్నారు. వీరిపై సైబర్ క్రైమ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గతేడాది నవంబర్ ఈ మేరకు జ్యువెల్లరీ ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కళ్యాణ్ జ్యువెల్లర్స్లో అమ్ముతున్న బంగారు ఆభరణాలు ఐదుగురు వ్యక్తులు నకిలీవని సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వాట్సాప్‌లో ఈ పోస్టులను ఎక్కువగా స్ప్రెడ్ చేసినట్లు గుర్తించామని వెల్లడించారు. -
ఒక్క సెల్ఫీతో ఇండియన్ సినిమా!
సాక్షి, సినిమా : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటుడిగానే కాదు.. బిజినెస్ మాన్‌గా కూడా సక్సెస్ అయ్యాడన్నది తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ, ఐపీఎల్ జట్టుతోపాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన సౌత్ స్టార్లతో కలిసి ఓ ఈవెంట్లో చేసిన సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థ తమ కొత్త బ్రాంచ్‌లను మస్కట్(ఒమన్)లో ప్రారంభించింది. ఈ లాంఛింగ్ కార్యక్రమానికి తారా లోకం కదిలి వచ్చింది. సౌత్‌లో ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని(టాలీవుడ్), శివరాజ్‌కుమార్(శాండల్‌వుడ్), ప్రభు(కోలీవుడ్), మంజువారియర్(మాలీవుడ్)కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలీవుడ్లో ఈ సంస్థకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అంబాసిడర్ అన్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యకారణాలతో ఆయన ఈ కార్యక్రమానికి గైర్హాజరు కాగా, ఆ లోటును షారూఖ్ తీర్చినట్లయ్యింది. దీంతో సౌత్ స్టార్లు, కింగ్ ఖాన్‌తో దిగిన ఓ సెల్ఫీ వైరల్ అవుతోంది. ఒక్క ఫ్రేమ్‌లో టోటల్ ఇండియన్ సినిమాను చూపించారంటూ ఆ ఫోటో చూసిన వారంతా కామెంట్లు చేస్తున్నారు. -
సెల్ఫీలపై మెగాస్టార్ హెచ్చరిక..
సాక్షి, భోపాల్(మధ్యప్రదేశ్): సెల్ఫీ తీసుకోవాలని ప్రత ఒక్కరు ఆరాటపడుతారు. కానీ సెల్ఫీ తీసుకునే సమయాల్లో ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ సెల్ఫీలపై బాలివుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. సెల్పీలపై మక్కువ ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలని అమితాబ్ కోరారు. భోపాల్‌లో కల్యాణ్ జువెలర్స్ షాప్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బిగ్‌బీ కల్యాణ్ జువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. బిగ్‌బీ, తన సతీమణి ఎంపీ జయాబచ్చన్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై నుంచి సెల్ఫీ తీసుకోవాలని నిర్వాహకులు కోరినప్పడు ఆయన పై విధంగా స్పందించారు. మనం ఎక్కడి కెళ్లినా పది, పన్నెండు ఫోటోలు తీసుకుంటుంటాం. అయితే, అందులో ఒక్కటి మాత్రం చాలు. ప్రస్తుతం కూడా ఒక్కటే తీసుకుంటానని తన సెల్లో సెల్పీ దిగారు. అనంతరం ఆయన మరో షోరూంను ప్రారంభించటానికి కాన్పూర్ బయలుదేరి వెళ్లారు. కాగా, జయాబచ్చన్ సొంతూరు భోపాల్ కావటంతో అమితాబ్‌ను భోపాల్ అల్లుడు అని కూడా సంబోధిస్తుంటారు. -
చెన్నైలో కల్యాణ్ జ్యువెలర్స్ నూతన షోరూంలు
టీనగర్: ప్రముఖ జ్యువెలరీ సంస్థ కల్యాణ్ జ్యువెలర్స్ నగరంలోని అన్నానగర్, వేళచ్చేరిలలో కొత్తగా తమ నాలుగు, ఐదో షోరూంలను ఆదివారం ప్రారంభించింది. ప్రముఖ సినీతారలు నటుడు ప్రభు గణేశన్, నటి సోనమ్ కపూర్ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో కల్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టీఎస్.కల్యాణరామన్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్స్ రాజేష్ కల్యాణరామన్, రమేష్ కల్యాణరామన్, కల్యాణ్ డెవలపర్స్, మేనేజింగ్ డెరైక్టర్ ఆర్ కార్తిక్‌లు వేళచ్చేరిలో ఏర్పాటైన షోరూం వద్దకు ముందుగా చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున హాజరైన ప్రజలతో ముచ్చటించారు. అక్కడ నుంచి సినీతారలు, కల్యాణ్ సీనియర్ మేనేజ్మెంట్ అన్నానగర్ షోరూం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రజల నుంచి వీరికి అనూహ్య స్పందన లభించింది. దీంతో ప్రజలకు కృతజ్ఞతగా తమ అభివాదాలను తెలిపారు. అన్నానగర్‌లో ప్రజల నుద్దేశించి నటుడు ప్రభు మాట్లాడుతూ ప్రస్తుతం కల్యాణ్ జ్యువెలర్స్ అన్నానగర్, వేలచ్చేరిలలో కొత్తగా షోరూంలను ఏర్పాటుచేయడం ద్వారా భారత్, మధ్య ఆసియాలో ఈ షోరూంల సంఖ్య 102కు చేరుకుందన్నారు. కల్యాణ్ జ్యువెలర్స్ తమ ఆరో షోరూం ప్రారంభించినప్పటి నుంచి ఆ సంస్థతో తనకు అనుబంధం ఉందన్నారు. నటి సోనం కపూర్‌ను చిన్న వయసులో చూశానని, ఆమె ప్రస్తుతం కల్యాణ్ జ్యువెలర్స్ ఫ్యామిలీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కల్యాణ్ జ్యువెలర్స్ మరింతగా అభివృద్ధి సాధించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నటి సోనం కపూర్ మాట్లాడుతూ కల్యాణ్ జ్యువెలర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకో ప్రత్యేకతని తెలిపారు. -
కల్యాణ్ జ్యువెలర్స్ ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ ‘కల్యాణ్ జ్యువెలర్స్’ తాజాగా వినియోగదారుల కోసం ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’ను ఏర్పాటు చేసింది. ఇందులోని ఆభరణాలను సాంప్రదాయ పద్ధతుల్లో రూపొందించామని, వాటిల్లో నాణ్యమైన డైమండ్స్‌ను పొందుపరిచామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కలెక్షన్ ధర రూ.5 లక్షలు- రూ.10 లక్షల ధరల శ్రేణిలో ఉంటుందని తెలియజేసింది. మహిళలకు డైమండ్ ఆభరణాలపై మక్కువ ఎక్కువని, వాటిని వివిధ కార్యక్రమాల్లో ధరించాలని భావిస్తారని, అలాంటి వారికి ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’ సరిగ్గా సరిపోతుందని కల్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్) రమేశ్ కల్యాణరామన్ తెలిపారు. -
కల్యాణ్ జ్యువెలర్స్ మిని వజ్రాల దుకాణాలు
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ కల్యాణ్ జ్యువెలర్స్ తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన 14 ‘మై కల్యాణ్’ ఔట్‌లెట్స్‌ను మిని వజ్రాల దుకాణాలుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులకు వజ్రాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కల్యాణ్ జ్యువెలర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మిని వజ్రాల దుకాణాల్లో రూ.8,000-రూ.25,000 ధరల శ్రేణిలో అత్యంత ఆదరణ పొందిన పలు రకాల వజ్రాభరణాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం వజ్రాల విక్రయాలు వేగంగా పెరుగుతోందని తెలిపింది. వజ్రాలు ఖరీదైనవి, ప్రత్యేకమైనవి అనే అపోహలను తొలగిస్తూ సామాన్యులకు కూడా వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి మిని వజ్రాల దుకాణాలు దోహదపడతాయని కల్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టి.ఎస్.కల్యాణ రామన్ తెలిపారు.