
సాక్షి, భోపాల్(మధ్యప్రదేశ్): సెల్ఫీ తీసుకోవాలని ప్రత ఒక్కరు ఆరాటపడుతారు. కానీ సెల్ఫీ తీసుకునే సమయాల్లో ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ సెల్ఫీలపై బాలివుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. సెల్పీలపై మక్కువ ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలని అమితాబ్ కోరారు. భోపాల్‌లో కల్యాణ్ జువెలర్స్ షాప్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బిగ్‌బీ కల్యాణ్ జువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
బిగ్‌బీ, తన సతీమణి ఎంపీ జయాబచ్చన్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై నుంచి సెల్ఫీ తీసుకోవాలని నిర్వాహకులు కోరినప్పడు ఆయన పై విధంగా స్పందించారు. మనం ఎక్కడి కెళ్లినా పది, పన్నెండు ఫోటోలు తీసుకుంటుంటాం. అయితే, అందులో ఒక్కటి మాత్రం చాలు. ప్రస్తుతం కూడా ఒక్కటే తీసుకుంటానని తన సెల్‌లో సెల్పీ దిగారు. అనంతరం ఆయన మరో షోరూంను ప్రారంభించటానికి కాన్పూర్ బయలుదేరి వెళ్లారు. కాగా, జయాబచ్చన్ సొంతూరు భోపాల్ కావటంతో అమితాబ్‌ను భోపాల్ అల్లుడు అని కూడా సంబోధిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment