ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల ఇద్దరు లెజెండ్స్‌ను కలిసింది. దేశం గర్వించే అగ్ర కథనాయకులైన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో ఆమె ముచ్చటించింది. వారితో ముచ్చటపడి ఓ ఫొటో తీసుకుంది. ఆ ఫొటోను సంతోషంగా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కానీ ఇక్కడే కాజోల్ 'తప్పు'లో కాలేసింది. 'సెల్ఫీ టైమ్ విత్ టు లెజెండ్స్.. వారితో సెల్ఫీ దిగకుండా ఉండలేకపోయా' అంటూ ఈ ఫొటోకు కాజోల్ కామెంట్ పెట్టింది. ఈ ఫొటో.. ఆమె పెట్టిన కామెంట్ చూసి.. ట్విట్టర్ జనాలు విస్తుపోయారు.
ఇదేంటి ఇది సెల్ఫీ కాదు కదా? ఇదెలా సెల్ఫీ అవుతుంది? ఎవరూ సెల్ఫీ స్టిక్ పట్టుకోలేదు కదా? సెల్ఫీ ఇలా ఉంటుందా? రెండు చేతులు లెజెండ్స్ వెనుక వేశారు కదా మేడం.. మరి సెల్ఫీ ఎలా తీశారు? సెల్ఫీకి ఫొటోకి తేడా తెలుసుకోండి? అంటూ నెటిజన్లు బోలెడు కామెంట్లు పెడుతున్నారు. కాజోల్‌కు కనీసం సెల్ఫీ గురించి కూడా తెలియదా? అని ఆశ్చర్యపోతూ.. జోకులు, సెటైర్లు వేస్తున్నారు.
Selfie time with two legends ..... couldn’t resist 😜 pic.twitter.com/DaNmcckHe8
— Kajol (@KajolAtUN) November 10, 2017
Selfie ?
— N I S H A N T. (@NishantADHolic) November 10, 2017
That is photo not selfie!
— तांबडे बाबा (@CrazyThakare) November 11, 2017
How is this a selfie?
— Od (@odshek) November 10, 2017
Selfie ? But I don't see anyone holding the camera of the selfie stick !
— ANU MOHAN (@AnumohanG) November 10, 2017
Comments
Please login to add a commentAdd a comment