అమితాబ్‌తో పింక్! | Amitabh Bachchan, Taapsee Pannu & Kirti Kulhari go crazy clicking selfies on the sets of Pink! | Sakshi
Sakshi News home page

అమితాబ్‌తో పింక్!

Published Sun, Mar 13 2016 11:22 PM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

అమితాబ్‌తో పింక్! - Sakshi

అమితాబ్‌తో పింక్!

‘‘అమితాబ్ బచ్చన్ పేరు తర్వాత వెండి తెరపై నా పేరు రాబోతుందనే విషయం తల్చుకుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. ఆందోళనగా, ఆనందంగా.. ఇలా రకరకాల ఫీలింగ్స్ కలుగుతున్నాయి’’ అని తాప్సీ అన్నారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా రూపొందుతున్న ‘పింక్’ చిత్రం గురించే ఆమె ఇలా అంటున్నారు. జాతీయ అవార్డు సాధించిన బెంగాలీ దర్శకుడు అనిరుద్ధా రాయ్ చౌదరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘ఈవ్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే వార్త వచ్చింది. ఆదివారం ‘పింక్’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇటీవల విహార యాత్ర నిమిత్తం యూఎస్ వెళ్లి, ఎంజాయ్ చేసొచ్చిన తాప్సీ రావడం రావడమే ఈ షూటింగ్‌తో బిజీ అయిపోయారు. మహిళలకు సంబంధించిన అంశంతో ఈ చిత్రం ఉంటుందని ఆమె అన్నారు. విరామం సమయంలో అమితాబ్‌తో కలిసి లొకేషన్లో సెల్ఫీ దిగారామె. బిగ్ బి చాలా కూల్ అని అమితాబ్ గురించి తెలిపారు. సెప్టెంబర్ 16న ‘పింక్’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
 
నో కెమెరాస్.. నో సెక్యూర్టీ!
ఇక.. అమితాబ్ అయితే ఏకంగా రోడ్డు మీద సాదా సీదా వ్యక్తిలా వాక్ చేశారు. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పిన తర్వాత ‘పింక్’ చిత్రానికి సంబంధించిన గెటప్‌లోనే అమితాబ్ ఈ నడక సాగించారు. మొహానికి మాస్క్ ఉండటంవల్ల ఆయన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. సెక్యూర్టీ గార్డులు లేకుండా రోడ్డు మీద వాక్ చేసిన వైనం గురించి అమితాబ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘‘ఢిల్లీలో చాలా బిజీ రోడ్డులో హాయిగా నడవడం థ్రిల్ అనిపించింది. కెమెరాలు ఫాలో కాలేదు. ఎలాంటి హంగామా లేదు. ఎవరూ గుర్తుపట్టలేనంతగా నన్ను మార్చేసిన మేకప్ ఆర్టిస్ట్‌కే ఈ ఘనత దక్కుతుంది’’ అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement